Shuru
Apke Nagar Ki App…
మర్రిగూడలో ఘనంగా నాగులమ్మ జాతర మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మర్రిగూడ గ్రామంలో నాగులమ్మ జాతర ఘనంగా నిర్వహించారు. స్థానికుల కథనాల ప్రకారం, సమ్మక్క సోదరిగా భావించే నాగులమ్మ పగిడిద్దరాజును వివాహం చేసుకున్నారని ప్రచారం ఉంది. వీరి కుమారులు జంపన్న, మువ్వన్న కాకతీయులతో జరిగిన యుద్ధంలో వీరోచితంగా పోరాడారని చెబుతారు. జంపన్న వాగు వద్ద నాగులమ్మ వీరమరణం పొందినట్లు పురాణ కథనం. అమ్మవారి ఆశీస్సులతో సంతానం, విద్య, ఉద్యోగం, వ్యవసాయం అభివృద్ధి చెందుతాయని భక్తుల నమ్మకం. జాతరకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు
M D Azizuddin
మర్రిగూడలో ఘనంగా నాగులమ్మ జాతర మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మర్రిగూడ గ్రామంలో నాగులమ్మ జాతర ఘనంగా నిర్వహించారు. స్థానికుల కథనాల ప్రకారం, సమ్మక్క సోదరిగా భావించే నాగులమ్మ పగిడిద్దరాజును వివాహం చేసుకున్నారని ప్రచారం ఉంది. వీరి కుమారులు జంపన్న, మువ్వన్న కాకతీయులతో జరిగిన యుద్ధంలో వీరోచితంగా పోరాడారని చెబుతారు. జంపన్న వాగు వద్ద నాగులమ్మ వీరమరణం పొందినట్లు పురాణ కథనం. అమ్మవారి ఆశీస్సులతో సంతానం, విద్య, ఉద్యోగం, వ్యవసాయం అభివృద్ధి చెందుతాయని భక్తుల నమ్మకం. జాతరకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు
More news from తెలంగాణ and nearby areas
- కలెక్టరేట్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్) మ్యాపింగ్‌పై జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సమీక్ష సమావేశం నిర్వహించారు. 2025 ఓటర్ జాబితాను 2002 ఎస్.ఐ.ఆర్‌తో మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రోజుకు కనీసం 50 మ్యాపింగ్‌లు పూర్తి చేసి, వారం రోజుల్లో ప్రక్రియ పూర్తిచేయాలని సూచించారు.1
- మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల అనంతారం, పెద్ద తండా, సిరోలు మండలంలోని తాళ్ల సంకీసా వసరం తండా మన్నెగూడెం మరియు కొత్త తండాలలో మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్, వరంగల్ ఎన్ఫోర్స్మెంట్, DTF- మహబూబాబాద్ & STF- హైదరాబాద్ టీంలు సంయుక్తంగా సారాయి స్థావరాలపై దాడులు నిర్వహించారు ఇట్టి దాడుల్లో (05) మంది ముద్దాయిలను అదుపులో కి తీసుకుని వారి పై కేసులు నమోదు చేసి, తదుపరి వారిని సంబంధిత తాహసిల్దార్ గారి ముందు బైండోవర్ చేసారు,ఈ దాడుల్లో (19) లీటర్ల సారాయి, (50) కిలోల బెల్లం,(30) కిలోల పటిక స్వాధీనం చేసుకుని (600)లీటర్ల సారాయి తయారీకి ఉపయోగించే బెల్లం పానకం ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.1
- రైతులు ఎరువుల కోసం పడే ఇబ్బందులను దూరం చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించిన ఫర్టిలైజర్ యాప్ సేవలను రైతులు వినియోగించుకోవాలని సిరిసిల్ల ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. తంగళ్ళపల్లిలోని గ్రోమోర్ ఎరువుల షాప్ ను ఇంచార్జి కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. యాప్ ద్వారా ఎందరు రైతులు ఎరువులు బుకింగ్ చేసుకున్నారు? ఎందరు తీసుకువెళ్లారో ఆరా తీసి.. రిజిస్టర్లు పరిశీలించారు. యాప్ ద్వారా ఎరువులు కొనుగోలు చేసిన రైతుల వివరాలను రిజిస్టర్లలో తనిఖీ చేశారు. షాప్ లో నిన్న రాత్రి స్టాక్ వివరాలు, ఈ రోజు ఉదయం స్టాక్ వివరాలు పరిశీలించారు. అలాగే గోడౌన్ లో ప్రస్తుతం ఉన్న ఎరువుల నిలువలను అక్కడ ఉన్న సిబ్బందితో లెక్కింపజేసి సరి చూసారు. అనంతరం ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లా డుతూ.. రాష్ట్ర వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఫర్టిలైజర్ యాప్ రైతులు డౌన్ లోడ్ చేసుకోవాలని, దాని ద్వారానే ఎరువులు బుకింగ్ చేసుకోవాలని స్పష్టం చేశారు. అన్ని ఫెర్టిలైజర్ షాప్ లు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద వద్ద రైతులకు సహాయం అందించేందుకు హెల్ప్ డెస్క్, ఒక సహాయకుడు ఉంటారని పేర్కొన్నారు. జిల్లాలోని రైతులందరూ యాప్ లో యూరియా బుక్ చేసుకుని తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు నిత్యం తమ పరిధిలోని అన్ని ఎరువుల షాపుల్లో తనిఖీ చేయాలని సూచించారు. యాప్ డౌన్ లోడ్, బుకింగ్ విషయంలో రైతులకు అందుబాటులో ఉండి.. సేవలు అందించాలని ఆదేశించారు. జిల్లాలో ఈనెల 1 వ తేదీ నుంచి ఈరోజు వరకు 92 వేల 735 సంచుల యూరియా వచ్చిందని, యాప్ ద్వారా జిల్లాలోని 84 వేల 68 మంది రైతులు ఎరువుల కోసం బుకింగ్ చేసుకున్నారని తెలిపారు. 79 వేల 948 మంది కొనుగోలు చేయగా, ఇంకా 11వేల 694 నిలువ ఉందని, 740 మంది రైతులు యూరియా కోసం బుకింగ్ చేసుకుని ఇంకా తీసుకువెళ్ల లేదని వివరించారు. జిల్లాలో ఎరువులకు కొరత లేదని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ స్పష్టం చేశారు.3
- ఈరోజు నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని,అనుముల గ్రామమును సోలార్ మోడల్ విలేజ్ ఎంపికైన సందర్భంగా సోలార్ విద్యుత్ పై అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన TGSPDCL-CMD గౌరవ శ్రీ ముషరఫ్ అలీ ఫరూక్ IAS మరియు నల్గొండ జిల్లా సబ్-కలెక్టర్ శ్రీ అమిత్ నారాయన్ IAS గారితో పాటు హాజరై అనుముల గ్రామానికి 41.63 కోట్ల రూపాయలతో సోలార్ మోడల్ విలేజ్ గా ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉందని తెలుపుతూ,సౌర విద్యుత్ వలన ఉన్న లాభాలను,కరెంటు వినియోగించుకునే పద్ధతులను రైతులకు మరియు ప్రజలకు సవివరంగా తెలియజేసిన స్థానిక శాసనసభ్యులు గౌరవ శ్రీ కుందూరు జయవీర్ రెడ్డి గారు1
- కరీంనగర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు మండలం దేవంపల్లి గ్రామానికి చెందిన వివాహిత పోలవేణి అనుష (25) కాకతీయ కెనాల్‌లో పడి మృతి చెందింది. ఇంటి వద్ద నుంచి బయటకు వెళ్లిన ఆమె కోసం గాలింపు చేపట్టగా రంగపేట శివారులో మృతదేహం లభ్యమైంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టారు.1
- Post by Sk Noori4
- మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మర్రిగూడ గ్రామంలో నాగులమ్మ జాతర ఘనంగా నిర్వహించారు. స్థానికుల కథనాల ప్రకారం, సమ్మక్క సోదరిగా భావించే నాగులమ్మ పగిడిద్దరాజును వివాహం చేసుకున్నారని ప్రచారం ఉంది. వీరి కుమారులు జంపన్న, మువ్వన్న కాకతీయులతో జరిగిన యుద్ధంలో వీరోచితంగా పోరాడారని చెబుతారు. జంపన్న వాగు వద్ద నాగులమ్మ వీరమరణం పొందినట్లు పురాణ కథనం. అమ్మవారి ఆశీస్సులతో సంతానం, విద్య, ఉద్యోగం, వ్యవసాయం అభివృద్ధి చెందుతాయని భక్తుల నమ్మకం. జాతరకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు1
- అధికారుల పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వెరసి ఒక భారీ నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. ఓటాయి - పొగుళ్ళపల్లి గ్రామాల మధ్య ప్రజల రవాణా సౌకర్యం కోసం ఎంతో ప్రతిష్టాత్మకముగా, లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన బ్రిడ్జి ప్రారంభానికి ముందే కుంగిపోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో మొదటి నుంచీ నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిబంధనల ప్రకారం వాడాల్సిన సిమెంట్, ఇనుము వినియోగించకపోవడం వల్లే స్వల్ప కాలంలోనే వంతెనపై భారీ బీటలు వచ్చాయని విమర్శలు వినిపిస్తున్నాయి. వర్షాకాలం రాకముందే పరిస్థితి ఇలా ఉంటే, భారీ వాహనాలు వెళ్తే వంతెన మనుగడ సాధ్యమేనా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాలకు ఈ బ్రిడ్జి ప్రధాన కూడలిగా ఉంది. వంతెనపై ఏర్పడిన పగుళ్లు రానురాను పెద్దవి కావడంతో ప్రయాణికులు ప్రాణభయంతో ప్రయాణం సాగిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి, నాణ్యతపై విచారణ జరిపించాలని, పగుళ్లు వారిన ప్రాంతాల్లో మరమ్మతులు చేపట్టి వంతెన పటిష్టతను నిర్ధారించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.1
- అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్న చందంగా మారింది టమాటా రైతుల పరిస్థితి. కిలో టమాట ధర రూపాయికి పడిపోవడంతో కరీంనగర్ జిల్లాలో రైతన్నలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. కూలీ కూడా గిట్టుబాటు కాక పంట చేల్లోనే టమాటను వదిలేస్తున్నారు. గంగాధర మండలం వెంకటాయపల్లి గ్రామంలో దాదాపు 25 ఎకరాలలో రైతులు టమాట పంటను సాగు చేశారు. ఓవైపు కోతుల బెడద, మరోవైపు పకృతి వైపరీత్యాలను తట్టుకుని పంటను పండిస్తే చివరకు చేతికందిన పంటను అమ్ముకుందామంటే మార్కెట్లో ధరలేని పరిస్థితి ఏర్పడింది. కిలో టమాట ధర రూపాయి నుంచి రెండు రూపాయలు మాత్రమే పలుకుంది. ధర పడిపోవడంతో రైతులకు కూలీ కూడా గిట్టుబాటు కాకపోవడంతో టమాటాను తెంపకుండా చేల్లోనే వదిలేస్తున్నారు. టమాటా పంట వేసి తీవ్ర నష్టాలను కొని తెచ్చుకున్నామని టమాటా రైతులు ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గిట్టుబాటు ధర లేకపోవడంతో పండించిన పంటను చేనులోనే వదిలేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి సుమారు 50 వేల వరకు పెట్టుబడి పెట్టినప్పటికీ, మార్కెట్లో కిలోకు రూపాయి నుంచి 2 రూపాయల వరకు మాత్రమే ధర లభిస్తుందని, దీంతో ఖర్చులు కూడా రాక పంటను చేల్లోనే వదిలేస్తున్నామని రైతులు చెబుతున్నారు. ఇంత నష్టం ఎప్పుడూ జరగలేదంటున్నారు రైతు గుండు అంజయ్య. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలని లేదంటే తగిన నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు.2