logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రుద్రూర్: 8 ఏళ్ల బాలున్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.అక్బర్ నగర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. రుద్రూర్ మండలం అక్బర్ నగర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. బోధన్ నుంచి బాన్సువాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు 8 ఏళ్ల బాలుడు సిద్ధార్థను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పటికీ డ్రైవర్ బస్సును ఆపకపోవడంతో అక్బర్ నగర్ యువకులు మాట్రిక్స్ స్కూల్ వద్ద బస్సును నిలిపి ఆందోళన చేశారు.

9 hrs ago
user_Mirza Hassan Baig
Mirza Hassan Baig
Photographer బోధన్, నిజామాబాద్, తెలంగాణ•
9 hrs ago

రుద్రూర్: 8 ఏళ్ల బాలున్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.అక్బర్ నగర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. రుద్రూర్ మండలం అక్బర్ నగర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. బోధన్ నుంచి బాన్సువాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు 8 ఏళ్ల బాలుడు సిద్ధార్థను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పటికీ డ్రైవర్ బస్సును ఆపకపోవడంతో అక్బర్ నగర్ యువకులు మాట్రిక్స్ స్కూల్ వద్ద బస్సును నిలిపి ఆందోళన చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • వాహనదారుల ఇక్కట్లు తీరుస్తున్న యువకుడు సుకరి చందు.. శభాష్ అంటున్న ఇరు గ్రామాల ప్రజలు ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, అని ఎదురు చూడకుండా తన సొంత ఖర్చుతో రోడ్డును బాగు చేస్తున్నాడు వైకుంఠ పూర్ గ్రామవాసి సుకరి చందు.వంజర్ నుండి వానల్పాడు వెళ్లే రహదారి మొత్తం పాడైపోయి అధ్వాన్నంగా తయారయ్యింది. ఈ సమస్యను ప్రభుత్వం,ప్రజా ప్రతినిధులు దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోలేదని చందు వాపోయాడు.దీంతో తన సొంత ఖర్చులతో మొరం తెప్పించుకొని గుంతలు ఏర్పడ్డ చోట మొరం పోసి బాగు చేస్తున్నాడు. ఈ విషయాన్ని విన్న పలువురు వాహనదారులు, ఇరు గ్రామాల ప్రజలు సుంకర చెందును శభాష్ అంటున్నారు.
    1
    వాహనదారుల ఇక్కట్లు తీరుస్తున్న యువకుడు సుకరి చందు.. శభాష్ అంటున్న ఇరు గ్రామాల ప్రజలు
ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, అని ఎదురు చూడకుండా తన సొంత ఖర్చుతో రోడ్డును బాగు చేస్తున్నాడు వైకుంఠ పూర్ గ్రామవాసి సుకరి చందు.వంజర్ నుండి వానల్పాడు వెళ్లే రహదారి మొత్తం పాడైపోయి అధ్వాన్నంగా తయారయ్యింది. ఈ సమస్యను ప్రభుత్వం,ప్రజా ప్రతినిధులు దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోలేదని చందు వాపోయాడు.దీంతో తన సొంత ఖర్చులతో మొరం తెప్పించుకొని గుంతలు ఏర్పడ్డ చోట మొరం పోసి బాగు చేస్తున్నాడు. ఈ విషయాన్ని విన్న పలువురు వాహనదారులు, ఇరు గ్రామాల ప్రజలు సుంకర చెందును శభాష్ అంటున్నారు.
    user_SIDDU.ASRC
    SIDDU.ASRC
    నిర్మల్, తెలంగాణ•
    9 hrs ago
  • సదర్మార్ట్ ఆయకట్టుకు నీరు అందించండి నారుమల్లు సిద్ధం చేసుకుంటున్న ఆయకట్టు రైతంగం నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మండలంలోని సదర్ మార్ట్ రైతాంగానికి నీటిని విడుదల చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. వర్షాలు బ్రోకపోవడంతో పంట సాగుకు ఆలస్యం అవుతుందని ప్రస్తుతం ఆయకట్టుకు సరిపోయి నీరు ప్రాజెక్టులో నిల్వ ఉందని అన్నారు నీటిని విడుదల చేస్తే సాగు పనులు చేసుకుంటామని రైతులు కోరారు ఇటీవల కురిసిన వర్షంతో ఆయకట్టు యువ ప్రాంతంలో రైతులు నారుమడులను సిద్ధం చేసి నాట్లు పోసుకుంటున్నారు
    1
    సదర్మార్ట్ ఆయకట్టుకు నీరు అందించండి
నారుమల్లు సిద్ధం చేసుకుంటున్న ఆయకట్టు రైతంగం
నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మండలంలోని సదర్ మార్ట్ రైతాంగానికి నీటిని విడుదల చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. వర్షాలు బ్రోకపోవడంతో పంట సాగుకు ఆలస్యం అవుతుందని ప్రస్తుతం ఆయకట్టుకు సరిపోయి నీరు ప్రాజెక్టులో నిల్వ ఉందని అన్నారు నీటిని విడుదల చేస్తే సాగు పనులు చేసుకుంటామని రైతులు కోరారు ఇటీవల కురిసిన వర్షంతో ఆయకట్టు యువ ప్రాంతంలో రైతులు నారుమడులను సిద్ధం చేసి నాట్లు పోసుకుంటున్నారు
    user_Dasari krishna murthy
    Dasari krishna murthy
    ఖానాపూర్, నిర్మల్, తెలంగాణ•
    16 hrs ago
  • షోషల్ మీడియా లో వైరలావుతున్న మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్
    1
    షోషల్ మీడియా లో వైరలావుతున్న మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్
    user_MD. YOUSUF ALI KHAN
    MD. YOUSUF ALI KHAN
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    3 hrs ago
  • ఫలంబరి దేవిగా శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాత దివ్యదర్శనం తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం స్వయంభుగా వెలసి కోరుకున్న భక్తుల కోరికలు తీరుస్తున్న వన దుర్గ భవాని మాత ఆలయంలో శనివారం తెల్లవారుజామున ఆలయ పూజారులు మంజీర గరుడ గంగా నది జనాలతో అభిషేకం పంచామృతాభిషేకం నిర్వహించారు అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలతో అలంకరించారు పసుపు కుంకుమచేసుందరంగా అలంకరించారు. వివిధ రకాలపండ్లహిరాలచే అందంగా అలంకరించారు కుంకుమార్చన సహస్రనామార్చన ప్రత్యేక పూజలు a అనంతరం మంగళ హారతి ఇచ్చారు. అనంతరం భక్తులకు దివ్యదర్శనం భయం కలిగించారు
    1
    ఫలంబరి దేవిగా శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాత దివ్యదర్శనం
తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం స్వయంభుగా వెలసి కోరుకున్న భక్తుల కోరికలు తీరుస్తున్న వన దుర్గ భవాని మాత ఆలయంలో శనివారం తెల్లవారుజామున ఆలయ పూజారులు మంజీర గరుడ గంగా నది జనాలతో అభిషేకం పంచామృతాభిషేకం నిర్వహించారు అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలతో  అలంకరించారు  పసుపు కుంకుమచేసుందరంగా అలంకరించారు. వివిధ రకాలపండ్లహిరాలచే అందంగా అలంకరించారు కుంకుమార్చన సహస్రనామార్చన ప్రత్యేక పూజలు
a అనంతరం మంగళ హారతి ఇచ్చారు. అనంతరం భక్తులకు దివ్యదర్శనం భయం కలిగించారు
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    18 hrs ago
  • వేములవాడలో ముదిరాజ్ మత్స్యకారుల భవన నిర్మాణానికి భూమిపూజ రూ. 6 లక్షలతో నూతన భవనం. శంకుస్థాపన చేసిన చైర్మన్ పుల్కం రాజు ఆత్మగౌరవ ప్రతీకలుగా కుల సంఘ భవనాలు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నాయకత్వంలో వేములవాడ శరవేగంగా అభివృద్ధి సోషల్ మీడియా చిల్లర రాజకీయాలకు ప్రజలే బుద్ధి చెబుతారు : పుల్కం రాజు వేములవాడ పట్టణంలో స్థానిక ముదిరాజ్ మత్స్యకారుల నూతన భవన నిర్మాణానికి సుమారు ఆరు లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఆదివారం ఘనంగా భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేములవాడ పట్టణ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు ముఖ్యఅతిథిగా హాజరై, కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ​ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు మాట్లాడుతూ... స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నిరంతర సహకారంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పట్టణంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజల ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఇందులో భాగంగానే పట్టణ పరిధిలోని 54 కుల సంఘాల భవన నిర్మాణాల అభివృద్ధికి ప్రతి సంఘానికి రూ. 6 లక్షల చొప్పున నిధులు కేటాయించి, పనులను వేగవంతం చేయడానికి ప్రత్యేక కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు.గతంలో అభివృద్ధి నోచుకోని కుల సంఘాలను. కానీ తమ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే చేతల ప్రభుత్వమని నిరూపిస్తోందన్నారు. ఇటువంటి భవనాలు నిర్మించడం వల్ల ఆయా సంఘాల ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు. సంఘ సభ్యులందరూ ఒకే చోట చేరి క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించు కోవడానికి, తమ సమాజ పురోగతికి సంబంధించిన విషయాలపై విస్తృతంగా చర్చా కార్యక్రమాలు జరుపుకోవడానికి ఈ భవనాలు వేదికగా నిలుస్తాయని తెలిపారు. అంతేకాకుండా సంఘానికి సంబంధించిన విలువైన వస్తువులు, శుభకార్యక్రమాలు మరియు పండుగల సామాగ్రిని సురక్షితంగా భద్రపరుచుకోవడానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని స్పష్టం చేశారు. సమాజంలో ఐక్యతను పెంపొందించడానికి ఇవి కేంద్ర బిందువులుగా మారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ​అలాగే పట్టణాభివృద్ధిపై కొందరు చోటామోటా నేతలు సోషల్ మీడియా వేదికగా నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, అలాంటి వారికి స్థానిక ప్రజలే తగిన సమయంలో బుద్ధి చెబుతారని చైర్మన్ హెచ్చరించారు. వేములవాడ సమగ్ర పురోగతే లక్ష్యంగా పాలన సాగుతోందని స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమర్థవంతమైన నాయకత్వంలో వేములవాడ పట్టణం అన్ని రంగాల్లోనూ వేగంగా అభివృద్ధి దిశగా ముందుకు వెళుతోందని ఆకాంక్షించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నిరంతర శ్రమ, దృఢ సంకల్పంతో పట్టణ ముఖచిత్రం పూర్తిగా మారబోతోందని తెలిపారు. పట్టణ ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించడంతో పాటు, రూపురేఖలు మార్చేలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం వేగవంతం చేసిందన్నారు. రాజకీయ లబ్ధి కోసం సోషల్ మీడియాలో ఆరోపణలు చేసే చిల్లర నాయకుల మాటలను ప్రజలు ఎవరూ నమ్మరని, క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ధే వారికి చెంపపెట్టు అని ఆయన పేర్కొన్నారు.​ఈ భూమిపూజ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నరాల శేఖర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుం మధు, పట్టణ కౌన్సిలర్లు తోట రాజు, కొండ రాజశేఖర్, ముదిరాజ్ మత్స్యకార సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
    1
    వేములవాడలో ముదిరాజ్ మత్స్యకారుల భవన నిర్మాణానికి భూమిపూజ
రూ. 6 లక్షలతో నూతన భవనం. శంకుస్థాపన చేసిన చైర్మన్ పుల్కం రాజు
ఆత్మగౌరవ ప్రతీకలుగా కుల సంఘ భవనాలు
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నాయకత్వంలో వేములవాడ శరవేగంగా అభివృద్ధి
సోషల్ మీడియా చిల్లర రాజకీయాలకు ప్రజలే బుద్ధి చెబుతారు : పుల్కం రాజు
వేములవాడ పట్టణంలో స్థానిక ముదిరాజ్ మత్స్యకారుల నూతన భవన నిర్మాణానికి సుమారు ఆరు లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఆదివారం ఘనంగా భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేములవాడ పట్టణ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు ముఖ్యఅతిథిగా హాజరై, కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ​ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు మాట్లాడుతూ... స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నిరంతర సహకారంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పట్టణంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజల ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఇందులో భాగంగానే పట్టణ పరిధిలోని 54 కుల సంఘాల భవన నిర్మాణాల అభివృద్ధికి ప్రతి సంఘానికి రూ. 6 లక్షల చొప్పున నిధులు కేటాయించి, పనులను వేగవంతం చేయడానికి ప్రత్యేక కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు.గతంలో అభివృద్ధి నోచుకోని కుల సంఘాలను. కానీ తమ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే చేతల ప్రభుత్వమని నిరూపిస్తోందన్నారు. ఇటువంటి భవనాలు నిర్మించడం వల్ల ఆయా సంఘాల ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు. సంఘ సభ్యులందరూ ఒకే చోట చేరి క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించు కోవడానికి, తమ సమాజ పురోగతికి సంబంధించిన విషయాలపై విస్తృతంగా చర్చా కార్యక్రమాలు జరుపుకోవడానికి ఈ భవనాలు వేదికగా నిలుస్తాయని తెలిపారు. అంతేకాకుండా సంఘానికి సంబంధించిన విలువైన వస్తువులు, శుభకార్యక్రమాలు మరియు పండుగల సామాగ్రిని సురక్షితంగా భద్రపరుచుకోవడానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని స్పష్టం చేశారు. సమాజంలో ఐక్యతను పెంపొందించడానికి ఇవి కేంద్ర బిందువులుగా మారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ​అలాగే పట్టణాభివృద్ధిపై కొందరు చోటామోటా నేతలు సోషల్ మీడియా వేదికగా నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, అలాంటి వారికి స్థానిక ప్రజలే తగిన సమయంలో బుద్ధి చెబుతారని చైర్మన్ హెచ్చరించారు. వేములవాడ సమగ్ర పురోగతే లక్ష్యంగా పాలన సాగుతోందని స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమర్థవంతమైన నాయకత్వంలో వేములవాడ పట్టణం అన్ని రంగాల్లోనూ వేగంగా అభివృద్ధి దిశగా ముందుకు వెళుతోందని ఆకాంక్షించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నిరంతర శ్రమ, దృఢ సంకల్పంతో పట్టణ ముఖచిత్రం పూర్తిగా మారబోతోందని తెలిపారు. పట్టణ ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించడంతో పాటు, రూపురేఖలు మార్చేలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం వేగవంతం చేసిందన్నారు. రాజకీయ లబ్ధి కోసం సోషల్ మీడియాలో ఆరోపణలు చేసే చిల్లర నాయకుల మాటలను ప్రజలు ఎవరూ నమ్మరని, క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ధే వారికి చెంపపెట్టు అని ఆయన పేర్కొన్నారు.​ఈ భూమిపూజ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నరాల శేఖర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుం మధు, పట్టణ కౌన్సిలర్లు తోట రాజు, కొండ రాజశేఖర్, ముదిరాజ్ మత్స్యకార సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    4 hrs ago
  • కౌడిపల్లి మండలం బూరుగడ్డ గ్రామంలో ఆషాఢ మాసం సందర్భంగా గ్రామదేవతలకు బోనాల వేడుకలు కౌడిపల్లి మండలం బూరుగడ్డ గ్రామంలో ఆషాఢ మాసం సందర్భంగా గ్రామదేవతలకు బోనాల వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలు మోసుకుని ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. డప్పుల మోతలు, పోతురాజుల ఉత్సాహభరిత విన్యాసాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యువత, చిన్నారులు సంప్రదాయ నృత్యాలతో సందడి చేయగా, గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గొల్ల షేకులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, అధిక సంఖ్యలో గ్రామస్థులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
    1
    కౌడిపల్లి మండలం బూరుగడ్డ గ్రామంలో ఆషాఢ మాసం సందర్భంగా గ్రామదేవతలకు బోనాల వేడుకలు
కౌడిపల్లి మండలం బూరుగడ్డ గ్రామంలో ఆషాఢ మాసం సందర్భంగా గ్రామదేవతలకు బోనాల వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలు మోసుకుని ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
డప్పుల మోతలు, పోతురాజుల ఉత్సాహభరిత విన్యాసాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యువత, చిన్నారులు సంప్రదాయ నృత్యాలతో సందడి చేయగా, గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గొల్ల షేకులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, అధిక సంఖ్యలో గ్రామస్థులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
    user_Priya
    Priya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    4 hrs ago
  • మాయాపూర్ గ్రామంలో ఘనంగా గంగ నీళ్ల జాతర పెద్ద సంఖ్యలో తరలివచ్చిన గ్రామస్తులు దిలావర్పూర్ మండలం మాయాపూర్ గ్రామంలో గంగ నీళ్ల జాతర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భాజా భజంత్రీల మధ్య గోదావరి నది నుండి జలాలను తీసుకువచ్చి గ్రామంలోని అమ్మవారి విగ్రహాలను అభిషేకించారు. ఈ సందర్భంగా వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని,ప్రజలందరూ సుఖ,సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    మాయాపూర్ గ్రామంలో ఘనంగా గంగ నీళ్ల జాతర పెద్ద సంఖ్యలో తరలివచ్చిన గ్రామస్తులు
దిలావర్పూర్ మండలం మాయాపూర్ గ్రామంలో గంగ నీళ్ల జాతర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భాజా భజంత్రీల మధ్య గోదావరి నది నుండి జలాలను తీసుకువచ్చి గ్రామంలోని అమ్మవారి విగ్రహాలను అభిషేకించారు. ఈ సందర్భంగా వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని,ప్రజలందరూ సుఖ,సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_SIDDU.ASRC
    SIDDU.ASRC
    నిర్మల్, తెలంగాణ•
    9 hrs ago
  • జగిత్యాల జిల్లాలో సంచలనం రేపిన ధాన్యం అక్రమాల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. విజిలెన్స్, సివిల్ సప్లై అధికారులు నిర్వహించిన తనిఖీల్లో సుమారు 87 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ సిఎంఆర్ ధాన్యం పక్కదారి మళ్లించినట్లు గుర్తించారు
    1
    జగిత్యాల జిల్లాలో సంచలనం రేపిన ధాన్యం అక్రమాల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. విజిలెన్స్, సివిల్ సప్లై అధికారులు నిర్వహించిన తనిఖీల్లో సుమారు 87 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ సిఎంఆర్ ధాన్యం పక్కదారి మళ్లించినట్లు గుర్తించారు
    user_MD. YOUSUF ALI KHAN
    MD. YOUSUF ALI KHAN
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    18 hrs ago
  • వేములవాడలో రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న భక్తులు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న భక్తులు
    1
    వేములవాడలో రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న భక్తులు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న భక్తులు
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.