Shuru
Apke Nagar Ki App…
మాచారెడ్డి: ప్రత్యేక వైద్య శిబిరం విజయవంతం( వీడియో).... మాచారెడ్డి మండల కేంద్రంలో గురువారం పట్టణ ప్రజల సౌకర్యార్థం జిల్లా కేంద్రంలోని గాంధీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రం నుండే కాకుండా వివిధ గ్రామాల నుండి వచ్చిన రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరం ఉన్నవారికి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు పలు ఆరోగ్య సూచనలు సలహాలు చేశారు. వైద్య శిబిరాన్ని స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు
Mahesh Nakka
మాచారెడ్డి: ప్రత్యేక వైద్య శిబిరం విజయవంతం( వీడియో).... మాచారెడ్డి మండల కేంద్రంలో గురువారం పట్టణ ప్రజల సౌకర్యార్థం జిల్లా కేంద్రంలోని గాంధీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రం నుండే కాకుండా వివిధ గ్రామాల నుండి వచ్చిన రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరం ఉన్నవారికి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు పలు ఆరోగ్య సూచనలు సలహాలు చేశారు. వైద్య శిబిరాన్ని స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు
More news from తెలంగాణ and nearby areas
- వయోవృద్ధులు చాలా అదృష్టవంతులు( వీడియో)................. కామారెడ్డి వయోవృద్ధులు చాలా అదృష్టవంతులని, జిల్లా వయోవృద్ధుల సంఘ అధ్యక్షుడు పున్న రాజేశ్వర్ చెప్పారు. గురువారం అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని, నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ టీవీలు, రేడియోలు లేని రోజుల నుండి నేటి తరం కంప్యూటర్ల వరకు చూసే అదృష్టం వయోవృద్ధులకు వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్ గిరి, మున్సిపల్ వైస్ చైర్మన్ గోదావరి స్వామి, సంఘ సభ్యులు ఉన్నారు1
- క్షయ వ్యాధి నిర్మూలనకు సమష్టిగా కృషి చేయాలి 2030 నాటికి టీబీ రహిత భారత్ సాధనే లక్ష్యం-జిల్లా రెవెన్యూ అధికారి అంబదాస్ రాజేశ్వర్ క్షయ వ్యాధి నిర్మూలనకు సమష్టిగా కృషి చేయాలి 2030 నాటికి టీబీ రహిత భారత్ సాధనే లక్ష్యం-జిల్లా రెవెన్యూ అధికారి అంబదాస్ రాజేశ్వర్ క్షయ వ్యాధి నిర్మూలనకు అందరం సమిష్టిగా కృషి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి అన్నారు. గురువారo సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో టి.బి. ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి అంబదాస్ రాజేశ్వర్ మాట్లాడుతూ ..2030 నాటికి దేశంలో టి.బి. (క్షయవ్యాధి)ని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన టి.బి. ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా జోష్ టీమ్‌లను ఏర్పాటు చేసి, క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. క్షయ వ్యాధి నిర్మూలనలో భాగంగా వార్డు, మండల స్థాయిలో జాయింట్ స్క్వాడ్ ఫర్ హెల్త్ బృందాలను ఏర్పాటు చేసి, ప్రజలకు వ్యాధిపై అవగాహన కల్పించడంతో పాటు అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, జిల్లాలో ఇప్పటికే 13 టి.బి. ముక్త్ గ్రామ పంచాయతీలను గుర్తించడం జరిగిందని తెలిపారు. టి.బి. వ్యాధి బ్యాక్టీరియా ద్వారా వ్యాప్తి చెందే అంటువ్యాధి అని, దగ్గు, తుమ్ముల ద్వారా ఇతరులకు సోకే అవకాశం ఉంటుందని తెలిపారు. సాయంత్రం వేళల్లో జ్వరం రావడం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ముఖ్యంగా షుగర్, బి.పి. ఉన్నవారు, పొగతాగే అలవాటు ఉన్నవారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, గ్రామాలలో నిర్వహించే వైద్య శిబిరాల వివరాలను ప్రజలకు ముందుగానే తెలియజేసి, అనుమానితులు పరీక్షలు చేయించుకునేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 215 యాక్టివ్ టి.బి. కేసులు ఉన్నాయని, టి బి. రోగులకు ప్రతి నెలా వైద్య సిబ్బంది వారి ఇళ్లకు వెళ్లి మందులు అందించడంతో పాటు అవసరమైన వైద్య సేవలను అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం ద్వారా క్షయ వ్యాధి రోగులకు పోషకాహారం కోసం నిక్షయ్ పోషణ యోజన క్రింద నెలకు 1 వేయి రూపాయలు పోషణ భత్యం పూర్తి చికిత్స కాలం అందించడం జరుగుతుందని తెలిపారు. నిక్షయ్ మిత్ర కార్యక్రమం ద్వారా క్షయ రోగులను దత్తత తీసుకుని వారికి అవసరమైన పోషకాహారాన్ని అందించాలని, క్రమం తప్పకుండా మందులు తీసుకోవడం ద్వారా వ్యాధిని పూర్తిగా నయం చేసుకోవచ్చని తెలిపారు. సాధారణంగా వైద్యుల సూచన మేరకు నిర్దేశిత కాలం పాటు మందులను క్రమం తప్పకుండా వినియోగించాలని సూచించారు. టి.బి. రోగులను దూరం పెట్టకుండా వారికి మానసిక ధైర్యం కల్పించాలని, వ్యాధి నియంత్రణకు పాటించవలసిన జాగ్రత్తలు, నియమాలపై అవగాహన కల్పించాలని సూచించారు. మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతర సిబ్బంది ఒక్కొక్కరు ఒక టి.బి. రోగిని దత్తత తీసుకుని వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. దేశ వ్యాప్తంగా టి.బి. ముక్త్ భారత్ అభియాన్ ద్వారా జోష్ టీమ్‌లను ఏర్పాటు చేసి వ్యాధి నిర్మూలనకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. గ్రామస్థాయిలో సర్పంచులు, పంచాయతీ అధికారులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఎఎన్‌ఎంలు సమన్వయంతో పని చేసి టి.బి. నిర్మూలనకు కృషి చేయాలని, రోగులను దూరంగా ఉంచకుండా వారికి అవసరమైన సహకారం, మానసిక ధైర్యం అందించాలని సూచించారు. టి.బి. నిర్మూలనపై విస్తృత ప్రచారం నిర్వహించేందుకు మీడియా సహకారం తీసుకోవాలని తెలిపారు. టిబి నివారణ సంబంధించిన సమాచారం టోల్ ఫ్రీ నెంబర్ 1800-11-6666 ద్వారా అందించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం టి.బి. ముక్త్ భారత్ అభియాన్‌ను విజయవంతం చేసి, టి.బి. నిర్మూలనకు తమ వంతు కృషి చేస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, ఎఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, ఎన్.సి.సి., మై భారత్ క్యాడెట్లు, వైద్య సిబ్బంది, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.1
- మాకు ఏది చెపకుoడా మహా ఇoటి చుటూ పోలీస్ లు తిరుగు చున్నా రు మహా శక్తీ నగర్ రొడూ నoబరు 2సిద్దిపేట1
- సిరిసిల్ల: ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలి చాడ వెంకటరెడ్డి. ఎన్నికల కమిషన్ ప్రధాని మోదీ కనుసన్నల్లో పనిచేస్తోందని సిపిఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కీలకమని, ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా, న్యాయబద్ధంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా తయారీలోనే అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, పశ్చిమ బెంగాల్‌లో ఓట్ల తొలగింపుపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఈవీఎంలు, ఓటర్ల జాబితా అంశాల్లో పారదర్శకత అవసరమన్నారు. ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని, స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేసినప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందని పేర్కొన్నారు.1
- ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టని, ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని సీపీఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి అన్నారు. ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టని, ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని సీపీఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి అన్నారు. బుధవారం సిరిసిల్లలోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు సంబంధించిన 425 ఎకరాల భూముల వివరాలపై ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా భూ రికార్డుల్లో అవకతవకలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో సర్వే నంబర్ల వారీగా సమగ్ర సర్వే నిర్వహించి, గ్రామసభల ద్వారా భూముల హద్దులను గుర్తించాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కమిటీలు భూ సమస్యలను పరిష్కరించడంలో ఎందుకు విఫలమవుతున్నాయని ప్రశ్నించారు. ముస్తాబాద్ మండలంలో భూ సమస్యపై వచ్చిన వినతిని ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో బాధితుడికి న్యాయం జరిగే వరకు పోరాడతామని హెచ్చరించారు. ఎన్నికల కమిషన్ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కనుసన్నల్లో పనిచేస్తోందని చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించడం ప్రజాస్వామ్యంపై ప్రభావం చూపిందని విమర్శించారు. ఓటర్ల నమోదు ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడం ప్రభుత్వ బాధ్యతని పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధ సంస్థలు స్వతంత్రంగా పనిచేసినప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతమవుతుందని అన్నారు. భూ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి, మంత్రులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. సమావేశంలో సిపిఐ నాయకులు పంతం రవి, గుంటి వేణు, కడారి రాములు, మంద అనిల్ తదితరులు పాల్గొన్నారు.3
- కామారెడ్డిలో మోదీ 25 ఏళ్ల ప్రజా సేవకు గుర్తుగా సేవా జ్యోతి యాత్ర కామారెడ్డి: ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా కామారెడ్డి పట్టణంలో సేవా జ్యోతి కలశ యాత్ర నిర్వహించారు. జేపీఎన్ రోడ్‌లో మోదీ ప్రసంగాన్ని వీక్షించిన అనంతరం పట్టణ పురవీధుల మీదుగా నిజాంసాగర్ చౌరస్తా వరకు యాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ.. మోదీ 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం గుజరాత్, దేశ అభివృద్ధిలో కీలక అధ్యాయమని పేర్కొన్నారు. వికసిత్ భారత్ దిశగా సాగుతున్న ప్రయాణానికి ప్రజలు అండగా ఉండాలని అన్నారు.1
- वरकरी संप्रदाय के प्रतिनिधि *सद्गुरु श्रीचंद्रशेखरमहाराज देगलुरकर* को महाराष्ट्र सरकार का बहुत प्रतिष्ठित *"प्राचीन संस्कृत पंडित अवॉर्ड"* देने की घोषणा के लिए। श्रीक्षेत्र पंढरपुर में सद्गुरु का सम्मान और पूजा की गई।1
- మాచారెడ్డి: ప్రత్యేక వైద్య శిబిరం విజయవంతం( వీడియో).... మాచారెడ్డి మండల కేంద్రంలో గురువారం పట్టణ ప్రజల సౌకర్యార్థం జిల్లా కేంద్రంలోని గాంధీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రం నుండే కాకుండా వివిధ గ్రామాల నుండి వచ్చిన రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరం ఉన్నవారికి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు పలు ఆరోగ్య సూచనలు సలహాలు చేశారు. వైద్య శిబిరాన్ని స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు1