అక్రమాలకు పాల్పడుతున్న అమృత సాయి విద్యానికేతన్ పై చర్యలు తీసుకోవాలి. - ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర అధ్యక్షులు సగిలి రాజేంద్ర ప్రసాద్. బద్వేలు :నియోజకవర్గం లోని అట్లూరు మండల పరిధిలోని అమృత సాయి విద్యానికేతన్ స్కూల్ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి అక్రమాలకు పాల్పడుతుందని అఖిల భారత విద్యార్థి బ్లాక్ (ఏ.ఐ.ఎస్.బి) రాష్ట్ర అధ్యక్షులు సగిలి రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. అమృత సాయి విద్యానికేతన్ స్కూల్ అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సోమవారం కలెక్టరేట్ నందు గ్రీవెన్స్ లో డి.ఆర్.ఓ కు పిర్యాదు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అట్లూరు మండలంలోని అమృత సాయి విద్యానికేతన్ స్కూల్ లో పదవ తరగతి విద్యార్థి జయంత్ శ్రావణ్ కు అడ్మిషన్ పెట్టుకొని తరగతులకు మాత్రం బద్వేలు లోని శ్రీ లక్ష్మీ విద్యారణ్య స్కూల్ లో హాజరవ్వడం జరిగిందని వారు తెలిపారు. అక్కడ వచ్చిన మార్కులను తమ పాఠశాలలో వచ్చినట్లు ప్రచారం చేసుకుంటూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్న అమృత స్కూల్ పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పాఠశాల రెన్యువల్ గడువు ముగిసిన యధావిధిగా తరగతులు నిర్వహిస్తున్నారని వారు తెలిపారు. క్వాలిఫై లేని అధ్యాపకులను నియమించుకుని వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారని వారు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమాలకు పాల్పడుతున్న అమృత సాయి విద్యానికేతన్ స్కూల్ పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు.

- వైభవంగా ప్రారంభమైన హనుమాన్ జయంతి వేడుకలు. మారుతి రాయుడి ఆశీస్సులు అందరిపై ఉండాలి. బద్వేలు: పట్టణంలోని సిద్ధవటం రోడ్డు సుమిత్ర నగర్ లో గల శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు అభయ ఆంజనేయ స్వామి దేవాలయం శ్రీ హనుమాన్ జయంతి మహోత్సవం సందర్భంగా ఆలయంలో అభయ ఆంజనేయ స్వామి వారికి సోమవారం సాయంత్రం అత్యంత వైభవంగా విశేష అభిషేకం నిర్వహించారు. స్వామి వారి కృపా కటాక్షాల కోసం భక్తులందరూ తమ శక్తి కొలది కాయ, కర్పూరం, పూలు మరియు పండ్లతో సకాలంలో విచ్చేసి, ఈ దివ్య అభిషేక సేవలో పాల్గొనవలసిందిగా ఆలయ కమిటీ నిర్వాహకులు వి వి రమణ కోరారు. ఆ మారుతి రాయుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా ఆశిస్తూ...అందరికీ ఆహ్వానం! పలికారు, జై శ్రీరామ్! జై శ్రీమన్నారాయణ!!,2
- ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయపు శుభాభివందనాలు తెలిపారు. మీ చేతి పనులకు ఎదురయ్యే ఆటంకాలు తొలగి, క్షేమకరమైన దీవెనలు పొందుకోవాలని ఆశీర్వదించారు. మీరు అనేకులకు వెలుగుగా, దీవెనగా ఉండాలని ప్రార్థన చేశారు.1
- Post by Bondhu Suresh1
- కాకినాడలోని గాంధీనగర్ ప్రాంతంలో అర్ధరాత్రి ఏపీఎస్పీ కానిస్టేబుల్ జి. నాగేశ్వరరావును గుర్తుతెలియని దుండగులు కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురవ్వగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.3
- కడపలో బీజేపీ నేతలపై పోలీసులు అమానుషంగా వ్యవహరించడంపై ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప బీజేపీ జిల్లా అధ్యక్షుడిపై చేయి చేసుకున్న డీఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేస్తూ, పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు.1
- చంద్రగిరి తహశీల్దార్ కార్యాలయం పార్కింగ్ స్థలంగా మారడంతో పాటు, గ్రీవెన్స్ కార్యక్రమాలు ఆలస్యంగా ప్రారంభమవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల రద్దీ మధ్య నడవలేక, గంటల తరబడి వేచి చూడలేక వృద్ధులు, మహిళలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు, ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.1
- అమరావతిలో మొదటి ఫేజ్ లో భూములు ఇచ్చిన రైతులకే దిక్కులేదు. ఇప్పుడు రెండో ఫేజ్ ల్యాండ్ పూలింగ్ అంటున్నారు. భూములు ఇవ్వము అన్న రైతుల భూములను నిషేధిత జాబితాలో పెడతాం అని బెదిరిస్తున్నారు. సెకండ్ ఫేజ్ పేరుతో రైతులకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం చేస్తున్న బలవంతపు ల్యాండ్ పూలింగ్ ను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. -పేర్ని నాని గారు, కృష్ణా జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు1
- రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధినేత మేడా శ్రీనివాస్ 2027 రాజమండ్రి పుష్కరాల ముహూర్తాన్ని పంచాంగం బదులు ఆగమ శాస్త్రం ప్రకారం మార్చాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. పవిత్ర గోదావరి జల ప్రయోజనాలు అందరికీ అందేలా చూడాలని, ఏర్పాట్లను సీతానగరం నుండి అంతర్వేది వరకు విస్తరించాలని ఆయన సూచించారు.1