Shuru
Apke Nagar Ki App…
పెట్రోల్, డీజల్ కొరత ఉండడంతో నిరసన చేపట్టిన ఆటో యూనియన్ నాయకులు.. కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలో సిఐటియు ఆటో యూనియన్ నాయకులు సోమవారం బళ్లారి రోడ్డులో ఉన్న పెట్రోల్ బంక్ ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా ఉండటంతో ఆటో యూనియన్ నాయకులు, డ్రైవర్లు కలిసి బంక్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కేపీ నారాయణస్వామి, కృష్ణ, మాట్లాడుతూ, ఇంధన కొరత వల్ల తమ జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. రోజువారీ ఆదాయం తగ్గిపోవడంతో కుటుంబాలను పోషించడం కష్టమవుతోందని తెలిపారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ సరఫరాను నిరంతరం అందుబాటులో ఉంచాలని, లేదంటే మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
పెట్రోల్, డీజల్ కొరత ఉండడంతో నిరసన చేపట్టిన ఆటో యూనియన్ నాయకులు.. కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలో సిఐటియు ఆటో యూనియన్ నాయకులు సోమవారం బళ్లారి రోడ్డులో ఉన్న పెట్రోల్ బంక్ ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా ఉండటంతో ఆటో యూనియన్ నాయకులు, డ్రైవర్లు కలిసి బంక్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కేపీ నారాయణస్వామి, కృష్ణ, మాట్లాడుతూ, ఇంధన కొరత వల్ల తమ జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. రోజువారీ ఆదాయం తగ్గిపోవడంతో కుటుంబాలను పోషించడం కష్టమవుతోందని తెలిపారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ సరఫరాను నిరంతరం అందుబాటులో ఉంచాలని, లేదంటే మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ఈనెల 30వ తేదీ వరకు స్వీయ గణనను నమోదు చేయడానికి అవకాశం కల్పిస్తున్నట్లు రాయదుర్గం తాసిల్దార్ తెలిపారు. రాయదుర్గం పట్టణంలో మీడియాకి ఆయన వీడియో సందేశం విడుదల చేశారు. 30 తర్వాత మే ఒకటవ తేదీ నుండి అధికారులు ఇండ్ల వద్దకు విచ్చేసి సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్వీయ గణన చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లు ఆయన తెలిపారు.1
- నంద్యాల పట్టణంలోని రైతు నగరంలో నిర్మిస్తున్న "హరిహర పారడైజ్"లో ప్లాట్ బుక్ చేసుకుంటే 10 తులాల బంగారం ఉచితంగా ఇస్తామని న్యాయవాది ఇమ్మడి అనిల్ రామయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సదవకాశం మే 15వ తేదీ వరకు మాత్రమే ఉంటుందని తెలిపారు. ఇప్పటికే 70 శాతం పైగా ఫ్లాట్లు బుక్ అయ్యాయని, ఈ సదవకాశం మరికొద్ది రోజులు మాత్రమే ఉంటుందని తెలిపారు.1
- నంద్యాల- గిద్దలూరు రహదారి నల్లమల ఘాట్ రోడ్ లో బొలెరో వాహనం బోల్తా పడి పలువురికి గాయాలయ్యాయి. సోమవారం మహానంది మండలం గాజులపల్లె గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన కూలీలు గిద్దలూరు పనులను నిమిత్తం వెళ్తున్నారు. చింతమాను సమీపంలోని ఎస్ క్రాస్ టర్నింగ్ వద్ద ప్రమాదవశాత్తు బొలెరో వాహనం బోల్తా పడి కూలీలకి గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 వాహనాల్లో చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.1
- నంద్యాల జిల్లా కేంద్రంలోని పెట్రోల్, డీజిల్ బంకులను కలెక్టర్ రాజకుమారి తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. నంద్యాల జిల్లాలో 223 పెట్రోల్ బంకులు ఉన్నాయని, పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉందని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. కొన్నిచోట్ల లేనిచోట నంద్యాల జిల్లాలో సాయంత్రం ఐదు గంటలలోపు అన్ని పెట్రోల్, డీజల్ బంకులలో పెట్రోల్, డీజిల్ అందుబాటులో కి వస్తుందనీ జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అవసరం మేరకే డీజిల్, పెట్రోల్ తీసుకోవాలన్నారు.1
- బిజినేపల్లి మండల పరిధిలోని మంగనూర్ గ్రామంలో టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొని జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు వంక వెంకటయ్య, డిప్యూటీ సర్పంచ్బోట్క చంద్రశేఖర్, జగదీశ్వర్ రెడ్డి, తిరుపతయ్య, గడ్డపార శివ, వేముల సత్యం, తిమ్మ గళ్ళ బాలస్వామి, సాంబశివ, గ్రామ సీనియర్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.1
- కదిరి పట్టణములోని పలు పెట్రోల్ బంకులలో ఎలాంటి కొరత లేదని తహసిల్దార్ రాజశేఖర్ చెప్పినప్పటికీ వాహనదారులు మాత్రం పెట్రోల్ బంకుల వద్ద హడావిడిగా క్యూ లైన్ లో వేచి ఉన్నారు. సోమవారం పట్టణంలోని పలు పెట్రోల్ బంకులలో ద్విచక్ర వాహనదారులు ముందస్తు జాగ్రత్తగా ఎక్కువ స్థాయిలో పెట్రోల్ పట్టించుకుంటున్నారు. పెట్రోల్ బంకుల వద్ద రద్దీ పెరుగుతుందని నిర్వాహకులు చెప్పుకొస్తున్నారు.1
- రేపు శంకుస్థాపన చేసుకోబోతున్న గూగుల్ రాకుండా ఇన్ని కుట్రలు అవసరమా1
- రాయదుర్గం పట్టణంలో అంబేద్కర్ నగర్ 19 వ వార్డులో గత పది రోజులుగా నీరు వదలకపోవడంతో సోమవారం ఉదయం మహిళలు,ప్రజలు బిందెలతో రోడ్డుకు అడ్డంగా కూర్చొని మున్సిపల్ అధికారులపై నిరసన వ్యక్తం చేసారు.గత పది రోజుల తరువాత నీరు వదిలిన అది ఇరవై నిమిషాల వరకే నీరు వదిలిన లో ఓల్టేజీ కారణంగా సరిపడా నీరు అందుకోవడం లేదన్నారు.మున్సిపల్ అధికారులు వచ్చి సర్ది చొప్పే ప్రయత్నం చేసిన మహిళలు మాకు నీరు వదిలే వరకు రోడ్డు పైనే కూర్చుంటామని రోడ్డుకు అడ్డంగా కూర్చున్నారు.మున్సిపల్ అధికారులు వేసవి కాలం లో పది రోజులైనా నీరు వదలకపోవడంతో ఇలాంటి సమస్యలు రావడంతో,అధికారులు నీటి సమస్యను త్వరగా పరిష్కరించాలని 19 వ వార్డు మహిళలు మున్సిపల్ అధికారులను కోరుతున్నారు.1
- రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్ మరియు డీజిల్ కొరతపై ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని పలు పెట్రోల్ బంకులను ఆయన వ్యక్తిగతంగా సందర్శించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారు. ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడటానికి కూటమి ప్రభుత్వ అసమర్థతే కారణమని ఎమ్మెల్యే విమర్శించారు. సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. పెట్రోల్ బంకుల వద్ద గంటల తరబడి వేచి ఉన్న వాహనదారులతో ఎమ్మెల్యే నేరుగా మాట్లాడారు. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఎర్రగొండపాలెం లాంటి ప్రాంతాల్లో రైతులు, రోజువారీ కూలీలు తమ వాహనాలకు ఇంధనం లేక పనులు ఆగిపోతున్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. త్రాగడానికి మందు ఫుల్.. పెట్రోల్ నిల్ అనే చందనంగా మారిందన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో అత్యవసర వస్తువులైన పెట్రోల్, డీజిల్ దొరకని పరిస్థితి రావడం దురదృష్టకరం. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రభుత్వం ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి అని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారు డిమాండ్ చేశారు.2