logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అభివృద్ధిలో వెనకడుగు లేదు.. చేసింది చెప్పుకోవడంలోనే వెనుకంజ* *రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ఎంపీ పార్థసారథి వ్యాఖ్య* *ముత్తవకుంట్లలో పండుగ వాతావరణంలో 33/11 కేవీ సబ్ స్టేషన్ ప్రారంభం* *మొత్తం 4.10కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం* *సీసీ రోడ్ల నిర్మాణంలో రాష్ట్రంలోనే రాప్తాడు టాప్ అన్న ఎంపీ పార్థసారథి* *చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఎమ్మెల్యే పరిటాల సునీత గత 20నెలల్లో అభివృద్ధి చేయడంలో ఎక్కడా వెనుకడుగు వేయలేదని.. కానీ చేసింది చెప్పడంలో పార్టీ శ్రేణులు వెనుకబడ్డారని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, హిందూపురం ఎంపీ పార్థసారథి అన్నారు. కనగానపల్లి మండలం ముత్తవకుంట్ల గ్రామంలో 3.30కోట్లతో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్, 80లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు ప్రారంభోత్సవ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే, ఎంపీకి గ్రామస్థులు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ముత్తవకుంట్ల, తల్లిమడుగుల, బాలేపాళ్యం, నెమలివరం గ్రామాలకు సంబంధించి 3.30 కోట్లతో నిర్మించిన 33/11కే.వి. విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రారంభించారు. అనంతరం 5080లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించారు. స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ పార్టీ నాయకులు ఎంపీ పార్థసారథిని కలిసి పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలకు కోటి రూపాయలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ పార్థసారథి మాట్లాడుతూ సబ్ స్టేషన్ రావడంతో ఈ ప్రాంతంలో విద్యుత్ సమస్యలకు పరిష్కారం చూపినట్టైందన్నారు. తిరుపతిలో పని చేస్తున్న విద్యుత్ శాఖ అధికారి సంపత్ కుమార్ సహకారంతో మన ప్రాంతానికి కావాల్సిన ట్రాన్స్ ఫార్మర్లు, సబ్ స్టేషన్లు తీసుకొస్తున్నామన్నారు. గత వైసీపీ పాలనలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని.. ఒక అవగాహన రాహిత్యం ఉన్న వ్యక్తి పాలన సాగిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలు చూశారన్నారు. రాష్ట్రం ఆర్థికంగా 20ఏళ్లు వెనక్కు వెళ్లిపోయిందన్నారు. పోలవరం పూర్తికాక సాగునీటి సమస్యలు ఏర్పడ్డాయన్నారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రాన్ని గాడిలో పెట్టారన్నారు. ఓ వైపు పోలవరం పూర్తి చేస్తూ ఇంకోవైపు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేస్తున్నారన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేసి ఇటు మడకశిర, కుప్పం వరకు నీరు తీసుకెళ్లడం, హిందూపురంకు వెళ్లే కాలువ వెడల్పు, పేరూరు ప్రాజెక్టుకు నీరందించే కాల్వల నిర్మాణం వేగంగా సాగుతున్నాయన్నారు. పేరూరు ప్రాజెక్టుకు భూములిచ్చిన రైతులకు 100కోట్లు విడుదల చేస్తున్నారన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సీసీ రోడ్ల నిర్మాణం జరుగిందన్నారు. ఎంపీ నిధులు కూడా రాప్తాడుకు ఎక్కువగా ఇస్తున్నట్టు చెప్పారు. ఆరోజు అనేక కష్టాలు, పోరాటాలు చేసి అధికారంలోకి వచ్చి ఇంత అభివృద్ధి చేస్తుంటే.. దీనిని చెప్పుకోవడంలో మాత్రం వెనుకపడ్డారన్నారు. స్త్రీ శక్తి, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవా, ఉద్యోగాల కల్పన వంటివి ఇన్ని జరుగుతున్నా.. చెప్పుకోవడంలో విఫలమవుతున్నామన్నారు. నాయకులు కూడా దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదన్నారు. తాను అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి కరుడుగట్టిన తీవ్రవాదిలా ఉంటానని స్పష్టం చేశారు. మరోవైపు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ ఈ విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు ద్వారా ప్రజలకు, రైతులకు నాణ్యమైన నిరంతర విద్యుత్ అందిస్తున్నామన్నారు. నా గెలుపులో కీలకంగా ఉన్న ముత్తవకుంట్ల పంచాయతీ అంటే ఎంతో ఇష్టమని.. ఇక్కడ ఒకే రోజు సుమారు నాలుగు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ మండలంలో ఈ విద్యుత్ సబ్ స్టేషన్ తో పాటు సుమారు 20కోట్లతో సి.సి. మరియు బి.టి. రోడ్లు నిర్మించామన్నారు. సోమరవాండ్లపల్లి రిజర్వాయర్ నిర్మాణంతో ఈ ప్రాంతంలో శాశ్వతంగా సాగు, తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించబోతున్నట్టు చెప్పారు. భానుకోట, వేపకుంట, మద్దలచెరువు, కేఎన్ పాళ్యం, శివపురం, శివపురం కొట్టాల గ్రామాలకు ఒక విద్యుత్ సబ్ స్టేషన్, చంద్రాచర్ల, దాదులూరు, కుర్లపల్లి, ఎగువతండా, దిగువ తండా లకు ఒక విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు చేయాలని రైతులు కోరారన్నారు. పై రెండు ప్రాంతాలతోపాటు న్యామద్దల, మన్నీల, ఆలమూరు, సోమలదొడ్డి, బండమీదపల్లి గ్రామాలలో సబ్ స్టేషన్స్ నిర్మించాలని ప్రతిపాదనలు పంపామని.. వాటితో పాటు ట్రాన్స్ ఫార్మర్లు కూడా మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఇటు శ్రీ సత్యసాయి జిల్లాలోని మూడు మండలాలు, అనంతపురం జిల్లాలోని మూడు మండలాల్లో ఎప్పుడూ లేని విధంగా సీసీ రోడ్ల నిర్మాణం, విద్యుత్ సబ్ స్టేషన్ లు నిర్మాణం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. 20నెలల్లో అభివృద్దితో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. తాజాగా ఉగాది సందర్భంగా మంత్రి నారా లోకేష్ 10వేల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేశారన్నారు. త్వరలోనే 10లక్షల వరకు రాష్ట్రంలో కొత్త పింఛన్లు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇంత చేస్తుంటే వీటి గురించి ప్రజలకు చెప్పడంలో కొంత నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. కొన్ని చోట్ల దీనిపై బలంగా ప్రచారం చేస్తున్నా.. కొందరు నాయకులు వెనుకబడ్డారన్నారు. అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదని.. చేసింది చెప్పడంలోనే మీరు వెనుకబడుతున్నారని ఈ విషయంలో మార్పు రావాలని ఎమ్మెల్యే సునీత సూచించారు...

on 22 March
user_Thiruveedhula Rameshnaidu
Thiruveedhula Rameshnaidu
Farmer ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
on 22 March
93776af3-22c8-4fce-905e-82f62b0b0dba

అభివృద్ధిలో వెనకడుగు లేదు.. చేసింది చెప్పుకోవడంలోనే వెనుకంజ* *రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ఎంపీ పార్థసారథి వ్యాఖ్య* *ముత్తవకుంట్లలో పండుగ వాతావరణంలో 33/11 కేవీ సబ్ స్టేషన్ ప్రారంభం* *మొత్తం 4.10కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం* *సీసీ రోడ్ల నిర్మాణంలో రాష్ట్రంలోనే రాప్తాడు టాప్ అన్న ఎంపీ పార్థసారథి* *చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఎమ్మెల్యే పరిటాల సునీత గత 20నెలల్లో అభివృద్ధి చేయడంలో ఎక్కడా వెనుకడుగు వేయలేదని.. కానీ చేసింది చెప్పడంలో పార్టీ శ్రేణులు వెనుకబడ్డారని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, హిందూపురం ఎంపీ పార్థసారథి అన్నారు. కనగానపల్లి మండలం ముత్తవకుంట్ల గ్రామంలో 3.30కోట్లతో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్, 80లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు ప్రారంభోత్సవ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే, ఎంపీకి గ్రామస్థులు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ముత్తవకుంట్ల, తల్లిమడుగుల, బాలేపాళ్యం, నెమలివరం గ్రామాలకు సంబంధించి 3.30 కోట్లతో నిర్మించిన 33/11కే.వి. విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రారంభించారు. అనంతరం 5080లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించారు. స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ పార్టీ నాయకులు ఎంపీ పార్థసారథిని కలిసి పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలకు కోటి రూపాయలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ పార్థసారథి మాట్లాడుతూ సబ్ స్టేషన్ రావడంతో ఈ ప్రాంతంలో విద్యుత్ సమస్యలకు పరిష్కారం చూపినట్టైందన్నారు. తిరుపతిలో పని చేస్తున్న విద్యుత్ శాఖ అధికారి సంపత్ కుమార్ సహకారంతో మన ప్రాంతానికి కావాల్సిన ట్రాన్స్ ఫార్మర్లు, సబ్ స్టేషన్లు తీసుకొస్తున్నామన్నారు. గత వైసీపీ పాలనలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని.. ఒక అవగాహన రాహిత్యం ఉన్న వ్యక్తి పాలన సాగిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలు చూశారన్నారు. రాష్ట్రం ఆర్థికంగా 20ఏళ్లు వెనక్కు వెళ్లిపోయిందన్నారు. పోలవరం పూర్తికాక సాగునీటి సమస్యలు ఏర్పడ్డాయన్నారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రాన్ని గాడిలో పెట్టారన్నారు. ఓ వైపు పోలవరం పూర్తి చేస్తూ ఇంకోవైపు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేస్తున్నారన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేసి ఇటు మడకశిర, కుప్పం వరకు నీరు తీసుకెళ్లడం, హిందూపురంకు వెళ్లే కాలువ వెడల్పు, పేరూరు ప్రాజెక్టుకు నీరందించే కాల్వల నిర్మాణం వేగంగా సాగుతున్నాయన్నారు. పేరూరు ప్రాజెక్టుకు భూములిచ్చిన రైతులకు 100కోట్లు విడుదల చేస్తున్నారన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సీసీ రోడ్ల నిర్మాణం జరుగిందన్నారు. ఎంపీ నిధులు కూడా రాప్తాడుకు ఎక్కువగా ఇస్తున్నట్టు చెప్పారు.

954191bf-8299-41d9-8b79-625ca8464b56

ఆరోజు అనేక కష్టాలు, పోరాటాలు చేసి అధికారంలోకి వచ్చి ఇంత అభివృద్ధి చేస్తుంటే.. దీనిని చెప్పుకోవడంలో మాత్రం వెనుకపడ్డారన్నారు. స్త్రీ శక్తి, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవా, ఉద్యోగాల కల్పన వంటివి ఇన్ని జరుగుతున్నా.. చెప్పుకోవడంలో విఫలమవుతున్నామన్నారు. నాయకులు కూడా దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదన్నారు. తాను అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి కరుడుగట్టిన తీవ్రవాదిలా ఉంటానని స్పష్టం చేశారు. మరోవైపు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ ఈ విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు ద్వారా ప్రజలకు, రైతులకు నాణ్యమైన నిరంతర విద్యుత్ అందిస్తున్నామన్నారు. నా గెలుపులో కీలకంగా ఉన్న ముత్తవకుంట్ల పంచాయతీ అంటే ఎంతో ఇష్టమని.. ఇక్కడ ఒకే రోజు సుమారు నాలుగు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ మండలంలో ఈ విద్యుత్ సబ్ స్టేషన్ తో పాటు సుమారు 20కోట్లతో సి.సి. మరియు బి.టి. రోడ్లు నిర్మించామన్నారు. సోమరవాండ్లపల్లి రిజర్వాయర్ నిర్మాణంతో ఈ ప్రాంతంలో శాశ్వతంగా సాగు, తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించబోతున్నట్టు చెప్పారు. భానుకోట, వేపకుంట, మద్దలచెరువు, కేఎన్ పాళ్యం, శివపురం, శివపురం కొట్టాల గ్రామాలకు ఒక విద్యుత్ సబ్ స్టేషన్, చంద్రాచర్ల, దాదులూరు, కుర్లపల్లి, ఎగువతండా, దిగువ తండా లకు ఒక విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు చేయాలని రైతులు కోరారన్నారు. పై రెండు ప్రాంతాలతోపాటు న్యామద్దల, మన్నీల, ఆలమూరు, సోమలదొడ్డి, బండమీదపల్లి గ్రామాలలో సబ్ స్టేషన్స్ నిర్మించాలని ప్రతిపాదనలు పంపామని.. వాటితో పాటు ట్రాన్స్ ఫార్మర్లు కూడా మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఇటు శ్రీ సత్యసాయి జిల్లాలోని మూడు మండలాలు, అనంతపురం జిల్లాలోని మూడు మండలాల్లో ఎప్పుడూ లేని విధంగా సీసీ రోడ్ల నిర్మాణం, విద్యుత్ సబ్ స్టేషన్ లు నిర్మాణం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. 20నెలల్లో అభివృద్దితో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. తాజాగా ఉగాది సందర్భంగా మంత్రి నారా లోకేష్ 10వేల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేశారన్నారు. త్వరలోనే 10లక్షల వరకు రాష్ట్రంలో కొత్త పింఛన్లు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇంత చేస్తుంటే వీటి గురించి ప్రజలకు చెప్పడంలో కొంత నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. కొన్ని చోట్ల దీనిపై బలంగా ప్రచారం చేస్తున్నా.. కొందరు నాయకులు వెనుకబడ్డారన్నారు. అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదని.. చేసింది చెప్పడంలోనే మీరు వెనుకబడుతున్నారని ఈ విషయంలో మార్పు రావాలని ఎమ్మెల్యే సునీత సూచించారు...

More news from Sri Sathya Sai and nearby areas
  • కదిరి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు. క స్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం లో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ కార్యక్రమం విద్యార్థుల లో ఉన్న ప్రతిభను కనపరిచారు. ముఖ్య అతిథులుగా ప్రధానోపాధ్యాయులు ఎస్.ఓ లక్ష్మీ , అన్నపూర్ణ , పి.ఇ.టి కోమల హాజరైయారు. కరాటే శిక్షణ పొందితే ఆత్మరక్షణతో పాటు మంచి ఆరోగ్యం లభిస్తుందన్నారు.
    1
    కదిరి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో  కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు. క స్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం లో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ కార్యక్రమం విద్యార్థుల లో ఉన్న ప్రతిభను కనపరిచారు. ముఖ్య అతిథులుగా ప్రధానోపాధ్యాయులు ఎస్.ఓ  లక్ష్మీ , అన్నపూర్ణ , పి.ఇ.టి కోమల  హాజరైయారు. కరాటే శిక్షణ పొందితే ఆత్మరక్షణతో పాటు మంచి ఆరోగ్యం లభిస్తుందన్నారు.
    user_Srivartha news
    Srivartha news
    Kadiri, Sri Sathya Sai•
    15 hrs ago
  • యామవరం గ్రామం ముద్దనూరు మండలం కడప జిల్లా వాస్తవ్యులైన సాయికుమార్ మరియు లక్ష్మీదేవి గారి కుమారుడైన శ్రీ విష్ణు పుట్టుకతోనే LAD TYPE1 వ్యాధి తో పోరాడుతున్నాడు బాబు కి ఒక సంవత్సరం లోపు operation చేయకపోతే బాబు ప్రాణానికే ప్రమాదం. ఆపరేషన్ కి 30 లక్షలు అవుతుంది. పెద్ద మనసు చేసుకొని ఆ పిల్లాడికి కనీసం 100/- సహాయం చేసిన ఒక బాలుడి ప్రాణం నిలబడుతుంది. సహాయం చేయాలనుకునేవారు వీడియో లో స్కానర్ కి డబ్బులు వేయగలరు లేదా phone pay number:- 7207217664 Name :- Sai kumar
    1
    యామవరం గ్రామం ముద్దనూరు మండలం కడప జిల్లా వాస్తవ్యులైన సాయికుమార్ మరియు లక్ష్మీదేవి గారి కుమారుడైన శ్రీ విష్ణు పుట్టుకతోనే LAD TYPE1 వ్యాధి తో పోరాడుతున్నాడు బాబు కి ఒక సంవత్సరం లోపు operation చేయకపోతే బాబు ప్రాణానికే ప్రమాదం. ఆపరేషన్ కి 30 లక్షలు అవుతుంది. పెద్ద మనసు చేసుకొని ఆ పిల్లాడికి కనీసం 100/- సహాయం చేసిన ఒక బాలుడి ప్రాణం నిలబడుతుంది. సహాయం చేయాలనుకునేవారు వీడియో లో స్కానర్ కి డబ్బులు వేయగలరు లేదా
phone pay number:- 7207217664
Name :- Sai kumar
    user_Veera
    Veera
    జమ్మలమడుగు, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని రద్దు చేస్తూ వి బి జి రాంజీ పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టడాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి తీవ్రంగా తప్పుపట్టారు.రాయదుర్గం పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.గతంలో కేంద్రం 90 శాతం నిధులు కేటాయిస్తుండగా 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరించేదన్నారు. నేడు రాష్ట్ర ప్రభుత్వం 40% ఖర్చు భరించాల్సి ఉన్నందున అనేక రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేసే ప్రమాదం ఉందన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 10 నుండి 12వ తేదీ వరకు అనంతపురం నుండి బండపల్లి వరకు చేపట్టనున్న పాదయాత్రలో ఉపాధి హామీ కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సంజీవప్ప, తాలూకా కార్యదర్శి నాగార్జున,విద్యార్థి సంఘం నేతలు కొట్రేస్,ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
    1
    మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని రద్దు చేస్తూ వి బి జి రాంజీ పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టడాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి తీవ్రంగా తప్పుపట్టారు.రాయదుర్గం పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.గతంలో కేంద్రం 90 శాతం నిధులు కేటాయిస్తుండగా 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరించేదన్నారు. నేడు రాష్ట్ర ప్రభుత్వం 40% ఖర్చు భరించాల్సి ఉన్నందున అనేక రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేసే ప్రమాదం ఉందన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 10 నుండి 12వ తేదీ వరకు అనంతపురం నుండి బండపల్లి వరకు చేపట్టనున్న పాదయాత్రలో ఉపాధి హామీ కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సంజీవప్ప, తాలూకా కార్యదర్శి నాగార్జున,విద్యార్థి సంఘం నేతలు కొట్రేస్,ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • బద్వేలు : శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి టీటీడీ చైర్మన్ బొల్లినేని రాజగోపాల నాయుడు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా రాజీనామా చేయాలని ,చంద్రబాబు నాయుడు సరైన నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్సీ డి.సీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో రాజగోపాల్ రెడ్డి ఆఫీస్ నుంచి దేవాలయం వరకు ర్యాలీ చేయడం జరిగింది. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న, ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి ,ఎమ్మెల్యే డాక్టర్ సుధా, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, వైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు మరియు అగ్రసేనీ వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎస్ వి బి సి ఛానల్ అధిపతి పృథ్వీరాజ్ మహిళల పట్ల చేసిన పాపానికి తక్షణమే తొలగించాలని గుర్తు చేశారు. నైతిక బాధిత వహించి బి ఆర్ నాయుడు తక్షణమే పదవి నుంచి దిగిపోవాలని ముక్తకంఠంగా అందరూ నినాదాలు చేశారు.
    2
    బద్వేలు : శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి టీటీడీ చైర్మన్ బొల్లినేని రాజగోపాల నాయుడు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా రాజీనామా చేయాలని ,చంద్రబాబు నాయుడు సరైన నిర్ణయం తీసుకోవాలని  ఎమ్మెల్సీ డి.సీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో  రాజగోపాల్ రెడ్డి ఆఫీస్ నుంచి దేవాలయం వరకు ర్యాలీ చేయడం జరిగింది.
వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న,
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి ,ఎమ్మెల్యే డాక్టర్ సుధా, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, వైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు మరియు అగ్రసేనీ  వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎస్ వి బి సి ఛానల్ అధిపతి పృథ్వీరాజ్ మహిళల పట్ల చేసిన పాపానికి తక్షణమే తొలగించాలని గుర్తు చేశారు.
నైతిక బాధిత వహించి బి ఆర్ నాయుడు తక్షణమే పదవి నుంచి దిగిపోవాలని ముక్తకంఠంగా అందరూ నినాదాలు చేశారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • ఎమ్మిగనూరులో 101 టెంకాయలు… ఏం సందేశం ఇచ్చారు?
    1
    ఎమ్మిగనూరులో 101 టెంకాయలు… ఏం సందేశం ఇచ్చారు?
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • పలమనేరు పట్టణంలోని విటిఎస్ కళ్యాణమండపం నందు పలమనేరు మాజీ శాసనసభ్యులు వెంకటే గౌడ గారి నాయకత్వంలో "నియోజకవర్గ స్థాయి బూత్ కమిటీ విస్తృత స్థాయి" సమావేశం నిర్వహించడం జరిగింది. వెంకటే గౌడ మాట్లాడుతూ పలమనేరు నియోజకవర్గంలో బూత్ కమిటీల ఏర్పాటుపై పార్టీ నాయకులతో సమావేశమై, భవిష్యత్ కార్యచరణపై దిశానిర్దేశం చేసారు.ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి, పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటానని.. మీ కష్టాన్ని నేనే గుర్తిస్తాని భరోసానిచ్చారు.. పలమనేరు నియోజకవర్గంలో పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని, ప్రతి కార్యకర్తను నా కుటుంబ సభ్యుడిగా భావిస్తానని..మీ కష్టంలో, సుఖంలో నేను ఎప్పుడూ మీ వెంటే ఉంటానని తెలిపారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మనమందరం కలిసి పలమనేరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండాను రెపరెపలాడిద్దామని, పార్టీని అంకితభావంతో నడిపించే సైనికులందరికీ నేనున్నానంటూ వెంకటే గౌడ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలమనేరు నియోజకవర్గ పరశీలకలు వెంకటరెడ్డి యాదవ్ మరియు పలమనేరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
    1
    పలమనేరు పట్టణంలోని విటిఎస్ కళ్యాణమండపం నందు పలమనేరు మాజీ శాసనసభ్యులు వెంకటే గౌడ గారి నాయకత్వంలో "నియోజకవర్గ స్థాయి బూత్ కమిటీ  విస్తృత స్థాయి" సమావేశం నిర్వహించడం జరిగింది.
వెంకటే గౌడ  మాట్లాడుతూ పలమనేరు నియోజకవర్గంలో బూత్ కమిటీల ఏర్పాటుపై పార్టీ నాయకులతో సమావేశమై, భవిష్యత్ కార్యచరణపై దిశానిర్దేశం చేసారు.ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి, పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. 
పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటానని.. మీ కష్టాన్ని నేనే గుర్తిస్తాని భరోసానిచ్చారు.. పలమనేరు నియోజకవర్గంలో పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని, ప్రతి కార్యకర్తను నా కుటుంబ సభ్యుడిగా భావిస్తానని..మీ కష్టంలో, సుఖంలో నేను ఎప్పుడూ మీ వెంటే ఉంటానని తెలిపారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మనమందరం కలిసి పలమనేరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండాను రెపరెపలాడిద్దామని, పార్టీని అంకితభావంతో నడిపించే సైనికులందరికీ నేనున్నానంటూ వెంకటే గౌడ  భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పలమనేరు నియోజకవర్గ పరశీలకలు వెంకటరెడ్డి యాదవ్  మరియు పలమనేరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
    user_S Abdul suban
    S Abdul suban
    పలమనేరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • Post by Doddagalla Munirathinam
    1
    Post by Doddagalla Munirathinam
    user_Doddagalla Munirathinam
    Doddagalla Munirathinam
    Gangavaram, Chittoor•
    14 hrs ago
  • కదిరి మనసున తలచినంతనే మోక్షం ప్రసాదించే దేవదేవుడు శ్రీ ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు భక్తులు విశ్వాసాన్ని తెలుపుతున్నారు. ప్రహ్లాద సమేతంగా స్వయంభువుగా వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారు కాటమ రాయుడుగా కొండల లక్ష్మీ నరసింహ స్వామి వద్ద గిరి ప్రదక్షిణ చేస్తే కోరికలు తీరుతాయంటున్నారు. స్వాతి నక్షత్రం రోజున భారీ ఎత్తున భక్తులు గిరి ప్రదక్షిణ చేపట్టారు.
    1
    కదిరి మనసున తలచినంతనే మోక్షం ప్రసాదించే దేవదేవుడు శ్రీ ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు భక్తులు విశ్వాసాన్ని తెలుపుతున్నారు. ప్రహ్లాద సమేతంగా స్వయంభువుగా వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారు కాటమ రాయుడుగా కొండల లక్ష్మీ నరసింహ స్వామి వద్ద గిరి ప్రదక్షిణ చేస్తే కోరికలు తీరుతాయంటున్నారు. స్వాతి నక్షత్రం రోజున భారీ ఎత్తున భక్తులు గిరి ప్రదక్షిణ చేపట్టారు.
    user_Srivartha news
    Srivartha news
    Kadiri, Sri Sathya Sai•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.