Shuru
Apke Nagar Ki App…
◼️ఆగస్టు 26న సంభవించిన వరదలకు సంబంధించిన CCTV దృశ్యాలను చూడండి. ఎంత అకస్మాత్తుగా, ఎంత ఉగ్రంగా భారీ వరద ప్రవాహం ఆ ప్రాంతాన్ని ముంచెత్తిందో ఈ దృశ్యాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
Seelam Ashok Reddy Flex Print
◼️ఆగస్టు 26న సంభవించిన వరదలకు సంబంధించిన CCTV దృశ్యాలను చూడండి. ఎంత అకస్మాత్తుగా, ఎంత ఉగ్రంగా భారీ వరద ప్రవాహం ఆ ప్రాంతాన్ని ముంచెత్తిందో ఈ దృశ్యాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- వైయస్సార్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న జోగి, అప్పిడి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం. దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతిని మైలవరంలో బుధవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మైలవరం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి మైలవరం నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జోగి రమేష్, వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి అప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి లు పాల్గొన్నారు. మైలవరం లోని లక్కిరెడ్డి హనీమిరెడ్డి కాంప్లెక్స్ వద్ద, మూడు బొమ్మల సెంటర్ వద్ద ఉన్న వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం లక్కిరెడ్డి హనీమిరెడ్డి కాంప్లెక్స్ వద్ద ఏర్పాటుచేసిన అన్నదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.💐💐 జోహార్ వైస్సార్1
- ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఘనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు మైలవరం జనసేన పార్టీ ర్యాలీ రంగ రంగ వైభవంగా నిర్వహించారు మైలవరం జనసేన పార్టీ కార్యాలయం నుండి ఘనంగామైలవరం పుర వీధుల గుండా లాకిరెడ్డి బాలిరెడ్డి కాలేజీ నుండి మైలవరం బైపాస్ రోడ్డు నుండి నూజివీడు రోడ్డు మీదుగా ర్యాలీ నిర్వహించి జనసేన కార్యకర్త తన షాపు వద్ద ఏర్పాటు కేకును కట్ చేసిన అనంతరం మైలవరం గ్రామపంచాయితీ వద్ద ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసిన అనంతరం మైలవరం గ్రామ శివారులో ఉన్న మారుతి కళ్యాణమండపం నందు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మైలవరం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ అక్కల రామ్మోహన్ రావు (గాంధీ) మరియు మైలవరం మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు శీలం బ్రహ్మయ్య అధ్యక్షతన బైకులతో ర్యాలీ నిర్వహించారు . ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గం ఇంచార్జ్ అక్కల రామ్మోహనరావు మరియు జనసైనికులు జనసేన వీర మహిళలు పాల్గొన్నారు4
- నల్లమోతువారిపాలెంలో ఘనంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను బాపట్ల నియోజకవర్గంలోని నల్లమోతువారిపాలెంలో అభిమానులు, జనసేన నాయకులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు విన్నకోట సురేష్ ముఖ్యఅతిథిగా హాజరై కేక్ కట్ చేసి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా జై జనసేన.. జై జై జనసేన, విన్నకోట సురేష్ నాయకత్వం వర్ధిల్లాలి’ అంటూ నినాదాలు చేశారు. పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.1
- సెయింట్ ఆన్స్ గర్ల్స్ షెల్టర్ హోమ్‌ను సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి గుంటూరు (సెప్టెంబర్ 2): గౌరవ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ శ్రీ బి. సాయి కళ్యాణ్ చక్రవర్తి ఆదేశాల మేరకు గుంటూరు స్తంభాలగరువులోని 'సెయింట్ ఆన్స్ ఓపెన్ షెల్టర్ హోమ్ ఫర్ గర్ల్స్'ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీ సయ్యద్ జియాఉద్దీన్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా హోమ్‌లోని బాలికలతో మాట్లాడిన ఆయన, వారికి అందుతున్న ఆహారం, వైద్యం, విద్యా సదుపాయాల వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలియనితనంతో తప్పటడుగులు వేసి భవిష్యత్తును పాడుచేసుకోవద్దని, క్రమశిక్షణతో బాగా చదువుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని బాలికలకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ విజయ్ కుమార్, హోమ్ ఇన్‌ఛార్జ్ వరలక్ష్మి, ప్యానెల్ అడ్వకేట్ కట్టా కాళిదాసు, పారా లీగల్ వాలంటీర్ గీతాంజలి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.1
- కరీంనగర్ జిల్లాలో బస్సుకు తప్పిన ఘోర ప్రమాదం.......... చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామ శివారులో వ్యవసాయ బావిపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు కరీంనగర్ నుంచి హుస్నాబాద్‌కు ప్రయాణికులతో వెళ్తుండగా ఘటన త్రుటిలో తప్పిన భారీ ప్రమాదం.. స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు1
- పాత ఫోన్లు అమ్మితే జాగ్రత్త.. సైబర్ నేరాల ముప్పు తప్పదు ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో పాత మొబైల్ ఫోన్ల కొనుగోలు పేరుతో కొందరు వ్యక్తులు గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతున్నట్లు సమాచారం. పాత ఫోన్ రూ.500కు.. పనికిరాని ఫోన్‌కు రూ.వెయ్యి ఇస్తామంటూ ప్రజలను ఆకర్షిస్తున్నారు. అయితే పాత ఫోన్లలోని డేటాను పూర్తిగా తొలగించకుండా ఇతరులకు విక్రయిస్తే.. వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, ఫోన్ నంబర్లు, ఇతర వివరాలు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల సైబర్ నేరాలకు గురయ్యే ప్రమాదం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తెలియని వ్యక్తులకు పాత మొబైల్ ఫోన్లు విక్రయించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. పాత ఫోన్ అమ్మే ముందు డేటాను పూర్తిగా తొలగించి, ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేయడం మంచిది.2
- స్కూల్ బస్సును వెనకనుంచి ఢీ కొట్టిన లారీ... పలువురు విద్యార్థులకు గాయాలు. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం విప్పర్ల, మర్రిచెట్టుపాలెం మార్గంలో ప్రమాదం జరిగింది. మర్రిచెట్టుపాలెం నుంచి విప్పర్ల వైపు వెళ్తున్న సిబిఐటి స్కూల్ బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కొంతమంది విద్యార్థులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన విద్యార్థులను తక్షణమే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.2
- ◼️ఆగస్టు 26న సంభవించిన వరదలకు సంబంధించిన CCTV దృశ్యాలను చూడండి. ఎంత అకస్మాత్తుగా, ఎంత ఉగ్రంగా భారీ వరద ప్రవాహం ఆ ప్రాంతాన్ని ముంచెత్తిందో ఈ దృశ్యాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.1