logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బెయిల్‌పై విడుదలై మాచర్ల చేరుకున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్‌పై విడుదలై మాచర్లకు చేరుకున్నారు. నెల్లూరు నుంచి విడుదలైన ఆయనకు దాచేపల్లి, గురజాల మండలాల వైసీపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్య కేసులో నిందితుడిగా ఉన్న పిన్నెల్లికి నిన్న గురజాల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు దాచేపల్లి, గురజాల పట్టణాలలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు చేరుకుని మాచర్ల మాజీ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డికి ఆత్మీయ స్వాగతం పలికారు.పార్టీ నినాదాలతో, హర్షధ్వానాలతో ప్రాంతం మారుమోగింది.

1 hr ago
user_Syyed taher
Syyed taher
Repalle, Bapatla•
1 hr ago

బెయిల్‌పై విడుదలై మాచర్ల చేరుకున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్‌పై విడుదలై మాచర్లకు చేరుకున్నారు. నెల్లూరు నుంచి విడుదలైన ఆయనకు దాచేపల్లి, గురజాల మండలాల వైసీపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్య కేసులో నిందితుడిగా ఉన్న పిన్నెల్లికి నిన్న గురజాల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు దాచేపల్లి, గురజాల పట్టణాలలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు చేరుకుని మాచర్ల మాజీ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డికి ఆత్మీయ స్వాగతం పలికారు.పార్టీ నినాదాలతో, హర్షధ్వానాలతో ప్రాంతం మారుమోగింది.

More news from Bapatla and nearby areas
  • Post by Syyed taher
    1
    Post by Syyed taher
    user_Syyed taher
    Syyed taher
    Repalle, Bapatla•
    1 hr ago
  • గుంటూరులో గత రెండు మూడు రోజుల నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఒక్క పూతతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అదే తరుణంలో గురువారం ఉదయం నుంచి మబ్బులు కనబడంతో మధ్యాహ్నం నుంచి వర్షం మొదలవడంతో మోస్తారు నుంచి ఒక మోస్తరు వర్షం కురవడంతో వాతావరణం చల్లబడి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు
    1
    గుంటూరులో గత రెండు మూడు రోజుల నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఒక్క పూతతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అదే తరుణంలో గురువారం ఉదయం నుంచి మబ్బులు కనబడంతో మధ్యాహ్నం నుంచి వర్షం మొదలవడంతో మోస్తారు నుంచి ఒక మోస్తరు వర్షం కురవడంతో వాతావరణం చల్లబడి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు
    user_Sunil Mennem
    Sunil Mennem
    గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • Post by వేముల నాగరాజు
    1
    Post by వేముల నాగరాజు
    user_వేముల నాగరాజు
    వేముల నాగరాజు
    ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • Post by SS NEWS
    1
    Post by SS NEWS
    user_SS NEWS
    SS NEWS
    Media company రాజోలు, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • https://youtu.be/sizMjtLq0mQ?si=huA0IdxxyZ7w4h57
    1
    https://youtu.be/sizMjtLq0mQ?si=huA0IdxxyZ7w4h57
    user_Paramesh Ratnagiri
    Paramesh Ratnagiri
    జర్నలిస్ట్ Rolla, Sri Sathya Sai•
    8 hrs ago
  • పండుగల అన్నిటికీ ఆది "ఉగాది" పండుగ. చైత్ర శుద్ధ పాడ్యమినాడు బ్రహ్మదేవుడు సృష్టిని ఆరంభించడని ధర్మ గ్రంధాలు చెబుతున్నాయి. ఆ చైత్ర శుద్ధ పాడ్యమి నుంచే వసంత రుతువు ప్రారంభమవుతుంది. అంతా కొత్త పకృతి.. కొత్త కాలం.. సరికొత్త భవిష్యత్తు. అప్పుడే చిగురించిన ఆకులు, పూల సంపదలతో అలరారే చెట్లు రాబోయే కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతాయి. సంవత్సరం అంతా ఎక్కడ నివసిస్తాయో ఆచూకీ తెలియక మూగగా జీవించే కోయిల లు వసంత రుతువు ఆరంభమవుతుందన గానే తన తీయని గొంతు విప్పి కమ్మని రాగాలు ఆలపిస్తాయి. పచ్చని చెట్లు పూలతో... కోయిలల కుహూ కుహూ రాగాలతో వసంత రుతువులోని వాతావరణం మనసును ఆహ్లాద పరుస్తుంది. *తెలుగు సంవత్సరాలు అరవై* ఉగాదిని సంవత్సరాది,యుగాది అని కూడా పిలుస్తారు. తెలుగువారి సాంప్రదాయం ప్రకారం ప్రభావనామ సంవత్సరం నుండి క్షయ నామ సంవత్సర వరకు మొత్తం 60 సంవత్సరాలు. ప్రస్తుతం ఉన్న శ్రీ విశ్వావసు నామ సంవత్సరం బుధవారంతో ముగిసింది. గురువారం నుండి శ్రీ పరాభావ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఉగాది నాడు సంతోషంగా ఉంటే ఆ సంవత్సరం అంతా సంతోషంగా ఉంటామని తెలుగువారి నమ్మకం. కొత్త పనులకు ఈరోజు శ్రీకారం చుడితే అవి నిర్విఘ్నంగా పూర్తవుతాయన్నది ప్రతి ఒక్కరి విశ్వాసం. ఉగాది పండుగ రోజు ఇంటి గుమ్మాలకు మావిడాకులు కట్టి, కొత్త బట్టలు ధరించి, విఘ్నేశ్వరుని, శారదా దేవిని, గురుదేవుని, సంవత్సరాధిపతిని పూజిస్తారు. ఉగాది పచ్చడి తయారు చేసి దేవునికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత తింటారు. *షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి* తీపి, కారం, పులుపు, చేదు, ఒగరు, ఉప్పు ఈ ఆరు రుచుల కలయికతో ఘన, ద్రవపదార్థంగా తయారుచేసి ఉగాది పచ్చడిని తింటారు. దీనిని తింటే పూర్ణాయుష్ణు, దేహదారుడ్యం కలుగుతుందని విశ్వాసం. ప్రాచీన సాంప్రదాయాల వెనక గొప్ప ఆరోగ్య సూత్రాలే కాదు వైద్య, ఔషధ విలువ దాగివున్నాయని చెప్పడానికి ఆంధ్రుల ఉగాది పచ్చడిని ఒక చక్కటి నిదర్శనంగా చూపవచ్చు.వేప పువ్వు, కొత్త బెల్లం, మామిడి కాయలు మొక్కలు,చింతపండు, ఉప్పు,మిరప వంటి వాటితో పచ్చడి తయారు చేస్తారు. షడ్రుచుల సమ్మిళితమైన ఈ పచ్చడితో సుఖదుఃఖాలను ఆనాడే రుచి చూడడం ఆరంభిస్తారని దీని భావం. ఈ పచ్చడిని ఉదయం పూట తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.అందుకే వైద్యం అందుబాటులో లేని రోజుల్లో ఈ ఉగాది పచ్చడి ద్వారా ఆరోగ్యం కాపాడుకోవడానికి పూర్వీకులు నియమం చేసారు.నాటి నుండి నేటి వరకూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ఉగాది పచ్చడి తినడం ఆనవాయితీగా వస్తోంది.
    1
    పండుగల అన్నిటికీ ఆది "ఉగాది" పండుగ. చైత్ర శుద్ధ పాడ్యమినాడు బ్రహ్మదేవుడు సృష్టిని ఆరంభించడని ధర్మ గ్రంధాలు చెబుతున్నాయి. ఆ చైత్ర శుద్ధ పాడ్యమి నుంచే వసంత రుతువు ప్రారంభమవుతుంది. అంతా కొత్త పకృతి.. కొత్త కాలం.. సరికొత్త భవిష్యత్తు. అప్పుడే చిగురించిన ఆకులు, పూల సంపదలతో అలరారే చెట్లు రాబోయే కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతాయి. సంవత్సరం అంతా ఎక్కడ నివసిస్తాయో ఆచూకీ తెలియక మూగగా జీవించే కోయిల లు వసంత రుతువు ఆరంభమవుతుందన గానే తన తీయని గొంతు విప్పి కమ్మని రాగాలు ఆలపిస్తాయి. పచ్చని చెట్లు పూలతో... కోయిలల కుహూ కుహూ రాగాలతో వసంత రుతువులోని వాతావరణం మనసును ఆహ్లాద పరుస్తుంది.
*తెలుగు సంవత్సరాలు అరవై*
ఉగాదిని సంవత్సరాది,యుగాది అని కూడా పిలుస్తారు. తెలుగువారి సాంప్రదాయం ప్రకారం ప్రభావనామ సంవత్సరం నుండి క్షయ నామ సంవత్సర వరకు మొత్తం 60 సంవత్సరాలు. ప్రస్తుతం ఉన్న శ్రీ విశ్వావసు నామ సంవత్సరం బుధవారంతో ముగిసింది. గురువారం నుండి శ్రీ పరాభావ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఉగాది నాడు సంతోషంగా ఉంటే ఆ సంవత్సరం అంతా సంతోషంగా ఉంటామని తెలుగువారి నమ్మకం. కొత్త పనులకు ఈరోజు శ్రీకారం చుడితే అవి నిర్విఘ్నంగా  పూర్తవుతాయన్నది ప్రతి ఒక్కరి విశ్వాసం. ఉగాది పండుగ రోజు ఇంటి గుమ్మాలకు మావిడాకులు కట్టి, కొత్త బట్టలు ధరించి, విఘ్నేశ్వరుని, శారదా దేవిని, గురుదేవుని, సంవత్సరాధిపతిని పూజిస్తారు. ఉగాది పచ్చడి తయారు చేసి దేవునికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత తింటారు.
*షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి*
తీపి, కారం, పులుపు, చేదు, ఒగరు, ఉప్పు ఈ ఆరు రుచుల కలయికతో ఘన, ద్రవపదార్థంగా తయారుచేసి ఉగాది పచ్చడిని తింటారు. దీనిని తింటే పూర్ణాయుష్ణు, దేహదారుడ్యం కలుగుతుందని విశ్వాసం. ప్రాచీన సాంప్రదాయాల వెనక గొప్ప ఆరోగ్య సూత్రాలే కాదు వైద్య, ఔషధ విలువ దాగివున్నాయని చెప్పడానికి ఆంధ్రుల ఉగాది పచ్చడిని ఒక చక్కటి నిదర్శనంగా చూపవచ్చు.వేప పువ్వు, కొత్త బెల్లం, మామిడి కాయలు మొక్కలు,చింతపండు, ఉప్పు,మిరప వంటి వాటితో పచ్చడి తయారు చేస్తారు. షడ్రుచుల సమ్మిళితమైన ఈ పచ్చడితో సుఖదుఃఖాలను ఆనాడే రుచి చూడడం ఆరంభిస్తారని దీని భావం. ఈ పచ్చడిని ఉదయం పూట తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.అందుకే వైద్యం అందుబాటులో లేని రోజుల్లో ఈ ఉగాది పచ్చడి ద్వారా ఆరోగ్యం కాపాడుకోవడానికి పూర్వీకులు నియమం చేసారు.నాటి నుండి నేటి వరకూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ఉగాది పచ్చడి తినడం ఆనవాయితీగా వస్తోంది.
    user_Raju Nandikolla
    Raju Nandikolla
    Local Politician మండపేట, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • అనపర్తి గ్రామ దేవత బాపనమ్మ తల్లి అమ్మవారి హరిద్రాభిషేకం గురువారం వైభవంగా నిర్వహించారు. అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా ఉగాది పురస్కరించుకుని గ్రామంలో మహిళలు కలశాలతో నదీ జలాలు సేకరించి స్వయంగా అమ్మవారి మూల విరాట్ కు అభిషేకం చేశారు. టిడిపి నేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి దంపతులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఏప్రిల్ 1నుంచి మూడు రోజులపాటు అమ్మవారి జాతర తీర్థ మహోత్సవాలు నిర్వహించనున్నారు.
    1
    అనపర్తి గ్రామ దేవత బాపనమ్మ తల్లి అమ్మవారి హరిద్రాభిషేకం గురువారం వైభవంగా నిర్వహించారు. అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా ఉగాది పురస్కరించుకుని గ్రామంలో మహిళలు కలశాలతో నదీ జలాలు సేకరించి స్వయంగా అమ్మవారి మూల విరాట్ కు అభిషేకం చేశారు. టిడిపి నేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి దంపతులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఏప్రిల్ 1నుంచి మూడు రోజులపాటు అమ్మవారి జాతర తీర్థ మహోత్సవాలు నిర్వహించనున్నారు.
    user_Tri
    Tri
    Journalist అనపర్తి, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • Post by Syyed taher
    1
    Post by Syyed taher
    user_Syyed taher
    Syyed taher
    Repalle, Bapatla•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.