గుంటూరు జిల్లా తెనాలి ఉగాది వేడుకలను తెనాలిలో ఘనంగా నిర్వహించడం, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఉగాది పురస్కారాలు ప్రధానం చేయడం పట్ల బుల్లి ముంత ఫౌండేషన్ వ్యవస్థాపకులను అభినందించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెనాలికి చెందిన బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరాభవ నామ సంవత్సర ఉగాది సంబరాలు గురువారం ఎంతో ఘనంగా నిర్వహించారు. తెనాలి కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఉగాది వేడుకలు కొలహలంగా జరిగాయి. ముందుగా చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలు, కూచిపూడి నృత్య ప్రదర్శనలు నిర్వహించగా ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా తిలకించారు. అనంతరం శ్రీ ములుకుట్ల బ్రహ్మానంద శాస్త్రి గారిచే ఉగాది పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఫౌండేషన్ అధ్యక్షులు చందూ సుబ్బారావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరు కాగా విశిష్ట అతిథులుగా అంతరిక్ష శాస్త్రవేత్త చందు సాంబశివరావు, డాక్టర్ ఆలపాటి కృష్ణ సందీప్, తుమ్మల కిషోర్ బాబు, గాజుల విజయ సారథి ఆత్మీయ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెనాలి డిఎస్పి జనార్ధనరావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ తోట రాఘవరావు, డబల్ హార్స్ గ్రూప్ డైరెక్టర్ పోతూరి లలిత కుమారి పేరుమీద TDH చైర్మన్ మునగాల మోహన్ ప్రసాద్, డాక్టర్ కొమ్మినేని జగదీశ్వరి, యర్రు బాపారావు, చల్లగాలి శ్రీదేవి, అంబటి మురళీకృష్ణ, పాకనాటి రమాదేవి, జాస్తి వినోద లక్ష్మి, రంగిశెట్టి రమేష్, రంగం రాజేష్, యర్రు స్వాతి, బట్టు లక్ష్మీ జ్యోతి, గేరా జయ ప్రకాష్ తదితరులకు ఉగాది పురస్కారాలను అతిథులు చేతుల మీదుగా ప్రధానం చేశారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఇతర ప్రముఖులు మాట్లాడుతూ ఉగాది వేడుకలను తెనాలిలో ఘనంగా నిర్వహించడం, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఉగాది పురస్కారాలు ప్రధానం చేయడం పట్ల బుల్లి ముంత ఫౌండేషన్ వ్యవస్థాపకులు చందు సుబ్బారావును అభినందించారు. చందు సూర్య, కనపర్తి బెనహర్, చెరుకూరి రమేష్ బాబు, బెల్లంకొండ వెంకట్, కొండముది రమేష్, తన్నీరు కళ్యాణ్ కుమార్ పర్యవేక్షించారు.

- Post by Syyed taher1
- గుంటూరులో గత రెండు మూడు రోజుల నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఒక్క పూతతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అదే తరుణంలో గురువారం ఉదయం నుంచి మబ్బులు కనబడంతో మధ్యాహ్నం నుంచి వర్షం మొదలవడంతో మోస్తారు నుంచి ఒక మోస్తరు వర్షం కురవడంతో వాతావరణం చల్లబడి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు1
- Post by వేముల నాగరాజు1
- Post by SS NEWS1
- https://youtu.be/sizMjtLq0mQ?si=huA0IdxxyZ7w4h571
- పండుగల అన్నిటికీ ఆది "ఉగాది" పండుగ. చైత్ర శుద్ధ పాడ్యమినాడు బ్రహ్మదేవుడు సృష్టిని ఆరంభించడని ధర్మ గ్రంధాలు చెబుతున్నాయి. ఆ చైత్ర శుద్ధ పాడ్యమి నుంచే వసంత రుతువు ప్రారంభమవుతుంది. అంతా కొత్త పకృతి.. కొత్త కాలం.. సరికొత్త భవిష్యత్తు. అప్పుడే చిగురించిన ఆకులు, పూల సంపదలతో అలరారే చెట్లు రాబోయే కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతాయి. సంవత్సరం అంతా ఎక్కడ నివసిస్తాయో ఆచూకీ తెలియక మూగగా జీవించే కోయిల లు వసంత రుతువు ఆరంభమవుతుందన గానే తన తీయని గొంతు విప్పి కమ్మని రాగాలు ఆలపిస్తాయి. పచ్చని చెట్లు పూలతో... కోయిలల కుహూ కుహూ రాగాలతో వసంత రుతువులోని వాతావరణం మనసును ఆహ్లాద పరుస్తుంది. *తెలుగు సంవత్సరాలు అరవై* ఉగాదిని సంవత్సరాది,యుగాది అని కూడా పిలుస్తారు. తెలుగువారి సాంప్రదాయం ప్రకారం ప్రభావనామ సంవత్సరం నుండి క్షయ నామ సంవత్సర వరకు మొత్తం 60 సంవత్సరాలు. ప్రస్తుతం ఉన్న శ్రీ విశ్వావసు నామ సంవత్సరం బుధవారంతో ముగిసింది. గురువారం నుండి శ్రీ పరాభావ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఉగాది నాడు సంతోషంగా ఉంటే ఆ సంవత్సరం అంతా సంతోషంగా ఉంటామని తెలుగువారి నమ్మకం. కొత్త పనులకు ఈరోజు శ్రీకారం చుడితే అవి నిర్విఘ్నంగా పూర్తవుతాయన్నది ప్రతి ఒక్కరి విశ్వాసం. ఉగాది పండుగ రోజు ఇంటి గుమ్మాలకు మావిడాకులు కట్టి, కొత్త బట్టలు ధరించి, విఘ్నేశ్వరుని, శారదా దేవిని, గురుదేవుని, సంవత్సరాధిపతిని పూజిస్తారు. ఉగాది పచ్చడి తయారు చేసి దేవునికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత తింటారు. *షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి* తీపి, కారం, పులుపు, చేదు, ఒగరు, ఉప్పు ఈ ఆరు రుచుల కలయికతో ఘన, ద్రవపదార్థంగా తయారుచేసి ఉగాది పచ్చడిని తింటారు. దీనిని తింటే పూర్ణాయుష్ణు, దేహదారుడ్యం కలుగుతుందని విశ్వాసం. ప్రాచీన సాంప్రదాయాల వెనక గొప్ప ఆరోగ్య సూత్రాలే కాదు వైద్య, ఔషధ విలువ దాగివున్నాయని చెప్పడానికి ఆంధ్రుల ఉగాది పచ్చడిని ఒక చక్కటి నిదర్శనంగా చూపవచ్చు.వేప పువ్వు, కొత్త బెల్లం, మామిడి కాయలు మొక్కలు,చింతపండు, ఉప్పు,మిరప వంటి వాటితో పచ్చడి తయారు చేస్తారు. షడ్రుచుల సమ్మిళితమైన ఈ పచ్చడితో సుఖదుఃఖాలను ఆనాడే రుచి చూడడం ఆరంభిస్తారని దీని భావం. ఈ పచ్చడిని ఉదయం పూట తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.అందుకే వైద్యం అందుబాటులో లేని రోజుల్లో ఈ ఉగాది పచ్చడి ద్వారా ఆరోగ్యం కాపాడుకోవడానికి పూర్వీకులు నియమం చేసారు.నాటి నుండి నేటి వరకూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ఉగాది పచ్చడి తినడం ఆనవాయితీగా వస్తోంది.1
- అనపర్తి గ్రామ దేవత బాపనమ్మ తల్లి అమ్మవారి హరిద్రాభిషేకం గురువారం వైభవంగా నిర్వహించారు. అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా ఉగాది పురస్కరించుకుని గ్రామంలో మహిళలు కలశాలతో నదీ జలాలు సేకరించి స్వయంగా అమ్మవారి మూల విరాట్ కు అభిషేకం చేశారు. టిడిపి నేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి దంపతులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఏప్రిల్ 1నుంచి మూడు రోజులపాటు అమ్మవారి జాతర తీర్థ మహోత్సవాలు నిర్వహించనున్నారు.1
- Post by Syyed taher1