Shuru
Apke Nagar Ki App…
దాతల సహకారంతో ప్రభుత్వ మోడల్ ప్రైమరీ స్కూల్ అభివృద్ధి గాండ్లపెంట మండల పరిధిలోని కటారుపల్లి గ్రామంలో ప్రభుత్వ మోడల్ ప్రైమరీ పాఠశాలకు కదిరి పట్టణానికి చెందిన మస్తాన్ 10 కుర్చీలు వితరణ చేసినట్లు ప్రధాన ఉపాధ్యాయులు సురేష్ తెలిపారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు ఉచితంగా నవోదయ,సైనిక్ శిక్షణ తరగతులు ఇప్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. పాఠశాల తరఫున దాత మస్తాన్ కు సత్కరించారు. దాతల సహకారంతో విద్యార్థులకు మజ్జిగ అందిస్తున్నట్లు ప్రధాన ఉపాధ్యాయులు సురేష్ తెలిపారు.
Srivartha news
దాతల సహకారంతో ప్రభుత్వ మోడల్ ప్రైమరీ స్కూల్ అభివృద్ధి గాండ్లపెంట మండల పరిధిలోని కటారుపల్లి గ్రామంలో ప్రభుత్వ మోడల్ ప్రైమరీ పాఠశాలకు కదిరి పట్టణానికి చెందిన మస్తాన్ 10 కుర్చీలు వితరణ చేసినట్లు ప్రధాన ఉపాధ్యాయులు సురేష్ తెలిపారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు ఉచితంగా నవోదయ,సైనిక్ శిక్షణ తరగతులు ఇప్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. పాఠశాల తరఫున దాత మస్తాన్ కు సత్కరించారు. దాతల సహకారంతో విద్యార్థులకు మజ్జిగ అందిస్తున్నట్లు ప్రధాన ఉపాధ్యాయులు సురేష్ తెలిపారు.
More news from Sri Sathya Sai and nearby areas
- కదిరి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు. క స్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం లో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ కార్యక్రమం విద్యార్థుల లో ఉన్న ప్రతిభను కనపరిచారు. ముఖ్య అతిథులుగా ప్రధానోపాధ్యాయులు ఎస్.ఓ లక్ష్మీ , అన్నపూర్ణ , పి.ఇ.టి కోమల హాజరైయారు. కరాటే శిక్షణ పొందితే ఆత్మరక్షణతో పాటు మంచి ఆరోగ్యం లభిస్తుందన్నారు.1
- బద్వేలు : శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి టీటీడీ చైర్మన్ బొల్లినేని రాజగోపాల నాయుడు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా రాజీనామా చేయాలని ,చంద్రబాబు నాయుడు సరైన నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్సీ డి.సీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో రాజగోపాల్ రెడ్డి ఆఫీస్ నుంచి దేవాలయం వరకు ర్యాలీ చేయడం జరిగింది. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న, ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి ,ఎమ్మెల్యే డాక్టర్ సుధా, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, వైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు మరియు అగ్రసేనీ వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎస్ వి బి సి ఛానల్ అధిపతి పృథ్వీరాజ్ మహిళల పట్ల చేసిన పాపానికి తక్షణమే తొలగించాలని గుర్తు చేశారు. నైతిక బాధిత వహించి బి ఆర్ నాయుడు తక్షణమే పదవి నుంచి దిగిపోవాలని ముక్తకంఠంగా అందరూ నినాదాలు చేశారు.2
- Post by Doddagalla Munirathinam1
- పలమనేరు పట్టణంలోని విటిఎస్ కళ్యాణమండపం నందు పలమనేరు మాజీ శాసనసభ్యులు వెంకటే గౌడ గారి నాయకత్వంలో "నియోజకవర్గ స్థాయి బూత్ కమిటీ విస్తృత స్థాయి" సమావేశం నిర్వహించడం జరిగింది. వెంకటే గౌడ మాట్లాడుతూ పలమనేరు నియోజకవర్గంలో బూత్ కమిటీల ఏర్పాటుపై పార్టీ నాయకులతో సమావేశమై, భవిష్యత్ కార్యచరణపై దిశానిర్దేశం చేసారు.ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి, పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటానని.. మీ కష్టాన్ని నేనే గుర్తిస్తాని భరోసానిచ్చారు.. పలమనేరు నియోజకవర్గంలో పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని, ప్రతి కార్యకర్తను నా కుటుంబ సభ్యుడిగా భావిస్తానని..మీ కష్టంలో, సుఖంలో నేను ఎప్పుడూ మీ వెంటే ఉంటానని తెలిపారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మనమందరం కలిసి పలమనేరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండాను రెపరెపలాడిద్దామని, పార్టీని అంకితభావంతో నడిపించే సైనికులందరికీ నేనున్నానంటూ వెంకటే గౌడ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలమనేరు నియోజకవర్గ పరశీలకలు వెంకటరెడ్డి యాదవ్ మరియు పలమనేరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.1
- Post by RAVI KUMAR1
- మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని రద్దు చేస్తూ వి బి జి రాంజీ పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టడాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి తీవ్రంగా తప్పుపట్టారు.రాయదుర్గం పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.గతంలో కేంద్రం 90 శాతం నిధులు కేటాయిస్తుండగా 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరించేదన్నారు. నేడు రాష్ట్ర ప్రభుత్వం 40% ఖర్చు భరించాల్సి ఉన్నందున అనేక రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేసే ప్రమాదం ఉందన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 10 నుండి 12వ తేదీ వరకు అనంతపురం నుండి బండపల్లి వరకు చేపట్టనున్న పాదయాత్రలో ఉపాధి హామీ కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సంజీవప్ప, తాలూకా కార్యదర్శి నాగార్జున,విద్యార్థి సంఘం నేతలు కొట్రేస్,ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.1
- అన్నమయ్య జిల్లా పీలేరు నియోజవర్గం: గుర్రంకొండ ఎదురెదురుగా రెండు కార్లు డి పలువురికి గాయాలు రెండు కార్లు ఎదురుగా ఢీకొని నలుగురికి గాయాలయ్యాయి. కడప బెంగళూరు జాతీయ రహదారి లో నైఎన్ఆర్ పెట్రోల్ బంక్ వద్దా కడప నుంచి వస్తున్న కారు ఎదురుగా వచ్చి మరో కారు అతివేగంగా ఢీకొన్నాయి. కారు అతివేగంగా తగలడం వలన కార్ లో ఉన్న ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవ్వడం వలన ప్రాణ నష్టం జరగలేదు. స్థానికులు అక్కడికి చేరుకొని గాయాలైన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని ట్రాఫిక్ ని పునరుద్దించి ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.1
- బద్వేలు , ఏప్రిల్ 04: బద్వేలు పట్టణంలో పాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 'రన్ ఫర్ జీసస్' కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా (CSI), డయాసిస్ ఆఫ్ నంద్యాల - బద్వేల్ టౌన్ చర్చి నుండి ఈ ర్యాలీ ఉత్సాహంగా ప్రారంభమైంది. లోకరక్షకుడైన యేసుక్రీస్తు పునరుత్థాన సందేశాన్ని, ఆయన ప్రేమను చాటిచెప్పే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రన్ పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా సాగుతూ, నాలుగు రోడ్ల కూడలి మీదుగా RCM చర్చి వరకు చేరుకుంది. అక్కడ నుండి తిరిగి ర్యాలీగా బయలుదేరి ప్రారంభ స్థానమైన CSI చర్చికి చేరుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న పాస్టర్లు మరియు క్రైస్తవ పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ఈ కార్యక్రమాన్ని ముగించారు. పట్టణంలోని వివిధ సంఘాల క్రైస్తవులు, యువకులు ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొని క్రీస్తు సందేశాన్ని చాటారు.3