మారేడుమిల్లి: పాత రోడ్డుపైనే కొత్త రోడ్డు నిర్మాణం? స్థానికుల ఆందోళన మారేడుమిల్లి: అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలంలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మారేడుమిల్లి నుంచి చింతలపూడి వరకు సుమారు 15 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులు ఇటీవలే ప్రారంభమయ్యాయి. నిబంధనల ప్రకారం, పూర్తిగా శిథిలమైన పాత రోడ్డును తొలగించి, దాని స్థానంలో కొత్తగా బీటీ (BT) రోడ్డును నిర్మించాల్సి ఉంది. అయితే, సంబంధిత కాంట్రాక్టర్ పాత రోడ్డును తొలగించకుండానే, దానిపైనే కొత్త రోడ్డు వేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలా అశాస్త్రీయంగా నిర్మాణం చేపడితే, రోడ్డు వేసిన కొద్ది రోజులకే మళ్లీ గుంతలమయంగా మారుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత లేకుండా జరుగుతున్న ఈ పనులపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, తగు చర్యలు తీసుకోవాలని, రోడ్డును నాణ్యతా ప్రమాణాలతో నిర్మించేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

- అడ్డతీగల: దుచ్చర్తి వై.జంక్షన్ వద్ద పోలీసులు బుధవారం వాహన తనిఖీలు చేపట్టి, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. పోలవరం జిల్లాలో ప్రమాదాలు ఆందోళనకరంగా ఉన్నాయని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. మంచు కురుస్తున్నందున వాహనదారులు తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు.1
- డుంబ్రిగూడ మండలంలోని కించుమండ సంతలో ఎస్సై సురేష్ ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన వివరించారు. హెల్మెట్ ధరించకుండా వాహనం నడపడం ప్రమాదకరమని, చిన్న నిర్లక్ష్యం ప్రాణాలకు ముప్పుగా మారుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.1
- చాలా మంది రోగులు దంత చికిత్సలను ధరల ఆధారంగా మాత్రమే పోల్చుతారు. కానీ దంతవైద్యంలో, సత్వరమార్గాలు తరచుగా పునరావృత విధానాలు, చిగుళ్ల సమస్యలు లేదా నెలల తర్వాత విఫలమైన పనిగా మారుతాయి. నైతిక దంతవైద్యం నైతిక దంతవైద్యం ఖరీదైనది కాదు. ఇది మీ దీర్ఘకాలిక నోటి ఆరోగ్యానికి సురక్షితమైనది మరియు శాశ్వతమైనది చేయడం గురించి. ఎందుకంటే ఒకే పంటిని రెండుసార్లు సరిచేయడం దీర్ఘకాలంలో ఎప్పుడూ చౌకగా ఉండదు.1
- 'రాష్ట్రీయ సేవా సమ్మాన్' పురస్కారంతో మరింత బాధ్యత పెరిగింది విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, విజయనగరం మండలం గుంకలాం జెడ్.పి.హైస్కూలులో హెడ్ మాస్టరుగా పని చేస్తున్న వెలమల శ్రీనివాస రావు 'రాష్ట్రీయ సేవా సమ్మాన్ 2026' అవార్డు అందుకోవడంపట్ల జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ హర్షం వ్యక్తం చేసి, జిల్లా పోలీసు కార్యాలయంలో వెలమల శ్రీనివాసరావును ప్రత్యేకంగా అభిందించి, మిఠాయి తినిపించి, సాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ జిల్లాకు చెందిన శ్రీనివాసరావు మాస్టరు జాతీయ పురస్కారం లభించడం అభినందనీయమన్నారు. శ్రీనివాసరావు మాస్టరు ఒక వైపు హెడ్ మాస్టరుగా విధులు నిర్వహిస్తూ, మరోవైపు వలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ, వ్యాఖ్యానం అందిస్తూ, ప్రజలందరికీ చేరువయ్యారన్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమీషను ఆధ్వర్యంలో ఎంపికైన ఉద్యోగులకు భారతీయ వారసత్వం సంస్కృతి గొప్పదనాన్ని వివిరిస్తూ తరగతులు నిర్వహించడం, విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడం, పలు సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావడంతో నీతి అయోగ్ ఆధ్వర్యంలోని బృందం వెలమల శ్రీనివాసరావు సేవలను జాతీయ స్థాయిలో గుర్తించి 'రాష్ట్రీయ సేవా సమ్మాన్ 2026' అవార్డును జనవరి 25న న్యూఢిల్లీలో ప్రదానం చేసిందన్నారు. ఈ అవార్డు అందుకోవడంతో శ్రీనివాసరావు మాస్టరు పై మరింత బాధ్యత పెరిగిందని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పురస్కారాలు అందుకోవాలని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ అకాంక్షించారు. జాతీయ పురస్కారం పొందిన వెలమల శ్రీనివాసరావు ఫిబ్రవరి 3న జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ జిల్లా పోలీసు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలవగా, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అభినందించి, మిఠాయిలు తినిపించి, సాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సిఐ ఎ.వి.లీలారావు, రిజర్వు ఇన్స్పెక్టరు ఎన్.గోపాల నాయుడు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని, శ్రీనివాసరావు మాస్టరును అభినందించారు.1
- Post by APPARAO KONCHADA1
- 🙏🙏1
- ఆమదాలవలస: స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో ఫిబ్రవరి 6వ తేదీన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ‘వ్యవసాయాధారిత వ్యాపారాభివృద్ధి’ అంశంపై కిసాన్ మేళా నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ కె. భాగ్యలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ శారదా జయలక్ష్మి దేవి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. మేళాలో భాగంగా ఏర్పాటు చేసే వ్యవసాయ ప్రదర్శన, రైతు సదస్సు, క్షేత్ర సందర్శన వంటి కార్యక్రమాల్లో జిల్లాకు చెందిన ముఖ్య ప్రజా ప్రతినిధులు, విస్తరణ సంచాలకులు డాక్టర్ జి.శివనారాయణ, పరిశోధనా సంచాలకులు డాక్టర్ పి.వి.సత్యనారాయణ, ఐసీఏఆర్-అటారి డైరెక్టర్ డాక్టర్ షేక్ ఎన్.మీరా తదితరులు పాల్గొంటారని ఆమె పేర్కొన్నారు. జిల్లాలోని రైతులు, మహిళా రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, ఔత్సాహిక యువత ఈ మేళాకు పెద్ద ఎత్తున హాజరై సాగులో వ్యాపార మెళకువలను తెలుసుకోవాలని కోరారు.3
- వై.రామవరంలో జరిగిన ‘సంపూర్ణ అభియాన్’ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి పాల్గొన్నారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు అందని ద్రాక్షలా మారాయని, పాఠశాలల నిర్వహణ సక్రమంగా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జల్ జీవన్ మిషన్ కింద నిధులు మంజూరైనా తాగునీటి పనులు ఇంకా పూర్తి కాలేదన్నారు. గిరిజన గ్రామాలకు అన్యాయం జరిగితే సహించేది లేదని ఆయన అధికారులను హెచ్చరించారు.1