logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నిర్మల్ జిల్లా ముధోల్ విటోలి గ్రామంలో లో విషాదం ఇద్దరు బాలురు మృతి నిర్మల్ జిల్లా ముధోల్ మండలం విటోలి గ్రామంలో సోమవారం విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. నిఖిల్(15), స్వరాజ్ (14) అనే ఇద్దరు బాలురు స్నేహితులతో కలిసి సరదాగా గ్రామం శివారులోని రంగారికుంట చెరువులో ఈతకు వెళ్లారు. ఈత కొడుతున్ న క్రమంలో నిఖిల్, స్వరాజ్ నీట మునిగి మృతిచెందారు. విషయం తెలుసుకున్ న ఎస్ఐ పెర్సీస్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

1 hr ago
user_LALASHRAFI VIJAY
LALASHRAFI VIJAY
భైంసా, నిర్మల్, తెలంగాణ•
1 hr ago

నిర్మల్ జిల్లా ముధోల్ విటోలి గ్రామంలో లో విషాదం ఇద్దరు బాలురు మృతి నిర్మల్ జిల్లా ముధోల్ మండలం విటోలి గ్రామంలో సోమవారం విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. నిఖిల్(15), స్వరాజ్ (14) అనే ఇద్దరు బాలురు స్నేహితులతో కలిసి సరదాగా గ్రామం శివారులోని రంగారికుంట చెరువులో ఈతకు వెళ్లారు. ఈత కొడుతున్ న క్రమంలో నిఖిల్, స్వరాజ్ నీట మునిగి మృతిచెందారు. విషయం తెలుసుకున్ న ఎస్ఐ పెర్సీస్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • బాసర రైల్వేస్టేషన్ వద్ద కారు బైక్ ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు.. బాసర శివాజీ చౌక్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై కారు - బైక్ సోమవారం మధ్యాహ్నం ఢీకొన్నాయి. ఈ ప్రమాదం లో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను అంబులెన్సు లో భైన్సా ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. బాసర మండలం కిర్గుల్ (బి) గ్రామానికి చెందిన ట్రైనింగ్ డీఎస్పీ మహేందర్ కు చెందిన కారుగా పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
    1
    బాసర రైల్వేస్టేషన్ వద్ద కారు బైక్ ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు.. 
బాసర శివాజీ చౌక్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై కారు - బైక్ సోమవారం మధ్యాహ్నం ఢీకొన్నాయి. ఈ ప్రమాదం లో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను అంబులెన్సు లో భైన్సా ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.  బాసర మండలం కిర్గుల్ (బి) గ్రామానికి చెందిన ట్రైనింగ్ డీఎస్పీ మహేందర్ కు చెందిన కారుగా పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
    user_RP
    RP
    Academy బాసర, నిర్మల్, తెలంగాణ•
    5 hrs ago
  • ఆదిలాబాద్‌లో ఓ నేత తమ పార్టీ పట్ల అచంచలమైన నిబద్ధతను ప్రకటించారు, జెండాను పడనివ్వనని శపథం చేశారు. కష్టాలెదురైనా తలెత్తుకునే పనిచేస్తానని, తలవంచే పని చేయనని ధీమా వ్యక్తం చేస్తూ, ఈ ధర్మయుద్ధంలో తమ వెన్నంటి నిలిచిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.
    1
    ఆదిలాబాద్‌లో ఓ నేత తమ పార్టీ పట్ల అచంచలమైన నిబద్ధతను ప్రకటించారు, జెండాను పడనివ్వనని శపథం చేశారు. కష్టాలెదురైనా తలెత్తుకునే పనిచేస్తానని, తలవంచే పని చేయనని ధీమా వ్యక్తం చేస్తూ, ఈ ధర్మయుద్ధంలో తమ వెన్నంటి నిలిచిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Rural, Telangana•
    22 hrs ago
  • కామారెడ్డి జిల్లాలో మే 4 నుంచి 9 వరకు నిర్వహించిన రైతు వారం కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో రైతులకు నేల ఆరోగ్యం, ఆధునిక సాగు పద్ధతులు, మార్కెటింగ్ వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. వ్యవసాయ ప్రదర్శనల్లో కొత్త విధానాలు, ప్రభుత్వ పథకాల గురించి రైతులు సమాచారం తెలుసుకున్నారు.
    1
    కామారెడ్డి జిల్లాలో మే 4 నుంచి 9 వరకు నిర్వహించిన రైతు వారం కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో రైతులకు నేల ఆరోగ్యం, ఆధునిక సాగు పద్ధతులు, మార్కెటింగ్ వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. వ్యవసాయ ప్రదర్శనల్లో కొత్త విధానాలు, ప్రభుత్వ పథకాల గురించి రైతులు సమాచారం తెలుసుకున్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    21 hrs ago
  • కవ్వాల్ గ్రామంలో ధాన్యం కొనుగోళ్లు జరగక, రైతుల పంట కళ్లాల్లోనే నెల రోజులుగా ఉండిపోయింది. కొనుగోళ్లు ఆలస్యం కావడంతో పశువులు ధాన్యాన్ని మేసేస్తున్నాయి; అకాల వర్షాలు, వడ్డీల భారం రైతులను కలవరపెడుతున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
    2
    కవ్వాల్ గ్రామంలో ధాన్యం కొనుగోళ్లు జరగక, రైతుల పంట కళ్లాల్లోనే నెల రోజులుగా ఉండిపోయింది. కొనుగోళ్లు ఆలస్యం కావడంతో పశువులు ధాన్యాన్ని మేసేస్తున్నాయి; అకాల వర్షాలు, వడ్డీల భారం రైతులను కలవరపెడుతున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    23 hrs ago
  • వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ హనుమాన్ జయంతి, వేసవి సెలవుల నేపథ్యంలో భారీగా తరలివచ్చిన భక్తులు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. వేసవి సెలవులు, హనుమాన్ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వేములవాడకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. వేములవాడకు వచ్చి స్వామివారిని దర్శించుకున్న అనంతరం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లడం భక్తులలో ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆనవాయితీ. అలాగే తెలంగాణలో ఏ శుభకార్యం, పండుగ జరిగినా ముందుగా వేములవాడ కు వచ్చి స్వామి వారిని దర్శించుకోవడం భక్తుల విశ్వాసంగా కొనసాగుతోంది.సోమవారం ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు సుమారు 58,867 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయానికి చేరుకున్న భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించడం, కోడె మొక్కులు చెల్లించడం, రుద్రాభిషేకం, అన్నపూజ, చండీ హోమం, నిత్య కళ్యాణం, సత్యనారాయణ స్వామి వ్రతం, లింగార్చనలు తదితర ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో రమాదేవి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీరు, క్యూ లైన్లు, విశ్రాంతి ఏర్పాట్లు, ఫ్యాన్లు తదితర సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆలయ సిబ్బంది, భద్రతా సిబ్బంది సమన్వయంతో భక్తుల దర్శనాలు సాఫీగా కొనసాగుతున్నాయి.
    1
    వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ
హనుమాన్ జయంతి, వేసవి సెలవుల నేపథ్యంలో భారీగా తరలివచ్చిన భక్తులు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. వేసవి సెలవులు, హనుమాన్ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వేములవాడకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు.
వేములవాడకు వచ్చి స్వామివారిని దర్శించుకున్న అనంతరం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లడం భక్తులలో ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆనవాయితీ. అలాగే తెలంగాణలో ఏ శుభకార్యం, పండుగ జరిగినా ముందుగా వేములవాడ కు వచ్చి స్వామి వారిని  దర్శించుకోవడం భక్తుల విశ్వాసంగా కొనసాగుతోంది.సోమవారం ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు సుమారు 58,867 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయానికి చేరుకున్న భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించడం, కోడె మొక్కులు చెల్లించడం, రుద్రాభిషేకం, అన్నపూజ, చండీ హోమం, నిత్య కళ్యాణం, సత్యనారాయణ స్వామి వ్రతం, లింగార్చనలు తదితర ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో రమాదేవి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీరు, క్యూ లైన్లు, విశ్రాంతి ఏర్పాట్లు, ఫ్యాన్లు తదితర సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆలయ సిబ్బంది, భద్రతా సిబ్బంది సమన్వయంతో భక్తుల దర్శనాలు సాఫీగా కొనసాగుతున్నాయి.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    58 min ago
  • మన *యాడారం* గ్రామ *ముదిరాజుల* కులదేవత *శ్రీ శ్రీ శ్రీ వనదుర్గ పెద్దమ్మ తల్లి* దేవాలయ పునర్నిర్మాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. తరతరాలుగా ముదిరాజుల ఆరాధ్య దైవంగా వెలసిన పెద్దమ్మ తల్లికి ప్రతి ఇంటి నుండి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పిస్తూ, లగ్గంలా గ్రామమంతా ఒక్కటై జాతరను ఘనంగా నిర్వహించడం మా సంప్రదాయం, మా గౌరవం. *ముదిరాజ్ సదర్ సంఘం* ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహోత్సవాలకు గ్రామ ప్రజలతో పాటు ఇతర గ్రామాల దాతలు, అభిమానులు కూడా సహకారం అందించడం అభినందనీయం. వారి సేవలను గుర్తిస్తూ పెద్దమ్మ తల్లి విగ్రహ చిత్రపటాలను బహుమతిగా అందించి, శాలువాలతో ఘనంగా సన్మానించడం ఎంతో ఆనందకరం. అమ్మవారి కటాక్షంతో గ్రామంలో సుఖశాంతులు, ఐకమత్యం, ఆయురారోగ్యాలు ఎల్లప్పుడూ వెల్లివిరియాలని కోరుకుంటూ… *జై వనదుర్గ పెద్దమ్మ తల్లి మన *యాడారం* గ్రామ *ముదిరాజుల* కులదేవత *శ్రీ శ్రీ శ్రీ వనదుర్గ పెద్దమ్మ తల్లి* దేవాలయ పునర్నిర్మాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. తరతరాలుగా ముదిరాజుల ఆరాధ్య దైవంగా వెలసిన పెద్దమ్మ తల్లికి ప్రతి ఇంటి నుండి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పిస్తూ, లగ్గంలా గ్రామమంతా ఒక్కటై జాతరను ఘనంగా నిర్వహించడం మా సంప్రదాయం, మా గౌరవం. *ముదిరాజ్ సదర్ సంఘం* ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహోత్సవాలకు గ్రామ ప్రజలతో పాటు ఇతర గ్రామాల దాతలు, అభిమానులు కూడా సహకారం అందించడం అభినందనీయం. వారి సేవలను గుర్తిస్తూ పెద్దమ్మ తల్లి విగ్రహ చిత్రపటాలను బహుమతిగా అందించి, శాలువాలతో ఘనంగా సన్మానించడం ఎంతో ఆనందకరం. అమ్మవారి కటాక్షంతో గ్రామంలో సుఖశాంతులు, ఐకమత్యం, ఆయురారోగ్యాలు ఎల్లప్పుడూ వెల్లివిరియాలని కోరుకుంటూ… *జై వనదుర్గ పెద్దమ్మ తల్లి*
    1
    మన *యాడారం* గ్రామ *ముదిరాజుల* కులదేవత *శ్రీ శ్రీ శ్రీ వనదుర్గ పెద్దమ్మ తల్లి* దేవాలయ పునర్నిర్మాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి.
తరతరాలుగా ముదిరాజుల ఆరాధ్య దైవంగా వెలసిన పెద్దమ్మ తల్లికి ప్రతి ఇంటి నుండి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పిస్తూ, లగ్గంలా గ్రామమంతా ఒక్కటై జాతరను ఘనంగా నిర్వహించడం మా సంప్రదాయం, మా గౌరవం.
*ముదిరాజ్ సదర్ సంఘం* ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహోత్సవాలకు గ్రామ ప్రజలతో పాటు ఇతర గ్రామాల దాతలు, అభిమానులు కూడా సహకారం అందించడం అభినందనీయం.
వారి సేవలను గుర్తిస్తూ పెద్దమ్మ తల్లి విగ్రహ చిత్రపటాలను బహుమతిగా అందించి, శాలువాలతో ఘనంగా సన్మానించడం ఎంతో ఆనందకరం.
అమ్మవారి కటాక్షంతో గ్రామంలో సుఖశాంతులు, ఐకమత్యం, ఆయురారోగ్యాలు ఎల్లప్పుడూ వెల్లివిరియాలని కోరుకుంటూ…
*జై వనదుర్గ పెద్దమ్మ తల్లి
మన *యాడారం* గ్రామ *ముదిరాజుల* కులదేవత *శ్రీ శ్రీ శ్రీ వనదుర్గ పెద్దమ్మ తల్లి* దేవాలయ పునర్నిర్మాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి.
తరతరాలుగా ముదిరాజుల ఆరాధ్య దైవంగా వెలసిన పెద్దమ్మ తల్లికి ప్రతి ఇంటి నుండి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పిస్తూ, లగ్గంలా గ్రామమంతా ఒక్కటై జాతరను ఘనంగా నిర్వహించడం మా సంప్రదాయం, మా గౌరవం.
*ముదిరాజ్ సదర్ సంఘం* ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహోత్సవాలకు గ్రామ ప్రజలతో పాటు ఇతర గ్రామాల దాతలు, అభిమానులు కూడా సహకారం అందించడం అభినందనీయం.
వారి సేవలను గుర్తిస్తూ పెద్దమ్మ తల్లి విగ్రహ చిత్రపటాలను బహుమతిగా అందించి, శాలువాలతో ఘనంగా సన్మానించడం ఎంతో ఆనందకరం.
అమ్మవారి కటాక్షంతో గ్రామంలో సుఖశాంతులు, ఐకమత్యం, ఆయురారోగ్యాలు ఎల్లప్పుడూ వెల్లివిరియాలని కోరుకుంటూ…
*జై వనదుర్గ పెద్దమ్మ తల్లి*
    user_Korivi Narsimlu
    Korivi Narsimlu
    బీబీపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    4 hrs ago
  • తెలంగాణలోని పుణ్యక్షేత్రం బాసరలోని జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. సోమవారం శుభదినం కావడంతో పాటు, వేసవి సెలవులు ఉండటంతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
    1
    తెలంగాణలోని పుణ్యక్షేత్రం బాసరలోని జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. సోమవారం శుభదినం కావడంతో పాటు, వేసవి సెలవులు ఉండటంతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
    user_RP
    RP
    Academy బాసర, నిర్మల్, తెలంగాణ•
    9 hrs ago
  • కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఆర్టీసీ బస్సుల సమస్యలపై ఎమ్మెల్యే మదన్ మోహన్ అధికారులతో సమీక్షించారు. బస్సుల లేమితో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై తక్షణ చర్యలకు ఆదేశించడంతో పాటు మంత్రిని కలిసి మరిన్ని బస్సులు కోరారు. త్వరలోనే అన్ని గ్రామాలకు ఆర్టీసీ సౌకర్యం కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
    1
    కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఆర్టీసీ బస్సుల సమస్యలపై ఎమ్మెల్యే మదన్ మోహన్ అధికారులతో సమీక్షించారు. బస్సుల లేమితో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై తక్షణ చర్యలకు ఆదేశించడంతో పాటు మంత్రిని కలిసి మరిన్ని బస్సులు కోరారు. త్వరలోనే అన్ని గ్రామాలకు ఆర్టీసీ సౌకర్యం కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    21 hrs ago
  • సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ . . . దేశం కోసం,, ధర్మం కోసం అని ప్రగల్భాలు పలికే బిజెపి నాయకులు ఒక్కరు కూడా మాట్లాడంలేదు. నోర్లు మూతపడ్డాయెందుకు ప్రశ్నించారు. హిందూ మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేంద్ర మంత్రి కుమారునిపై ఎందుకు మాట్లాడటం లేదన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి నుండి బండిని బర్తరఫ్ చేయాలి, ఎంపీ పదవికి రాజీనామా చేయించాలని కేంద్ర ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. హిందూ బాలికకు న్యాయం చేయడంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శించారు. ఇప్పటికే బాధితులను బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తున్నారని, నిష్పక్షపాతంగా విచారణ జరిపి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. నిజనిర్ధారణ కమిటీ ద్వారా నిజాలు బయటపడాలంటే బండి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
    2
    సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ 
సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ . . . దేశం కోసం,, ధర్మం కోసం అని ప్రగల్భాలు పలికే బిజెపి నాయకులు ఒక్కరు కూడా మాట్లాడంలేదు. నోర్లు మూతపడ్డాయెందుకు ప్రశ్నించారు. హిందూ మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేంద్ర మంత్రి కుమారునిపై ఎందుకు మాట్లాడటం లేదన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి నుండి బండిని బర్తరఫ్ చేయాలి, ఎంపీ పదవికి రాజీనామా చేయించాలని కేంద్ర ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. హిందూ బాలికకు న్యాయం చేయడంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శించారు. ఇప్పటికే బాధితులను బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తున్నారని, నిష్పక్షపాతంగా విచారణ జరిపి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు.  నిజనిర్ధారణ కమిటీ ద్వారా నిజాలు బయటపడాలంటే  బండి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.