Shuru
Apke Nagar Ki App…
q🙏
Adimlamrambabu Adimlamrambabu
q🙏
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- Post by Srinivas Y1
- రాజమండ్రి కేంద్ర కారాగారాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత నేతృత్వంలోని 'బోర్డ్ ఆఫ్ విజిటర్స్' బృందం గురువారం సందర్శించింది. కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ నరసింహ కిషోర్, న్యాయసేవాధికారి సంస్థ కార్యదర్శి శ్రీలక్ష్మితో కలిసి జైలులోని వసతులను తనిఖీ చేశారు. ఖైదీలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. జైలులో నిబంధనల అమలు, సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.1
- Post by Shyam1
- దేవీపట్నం మండలంలో ఆశ్రమ పాఠశాలను రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బొజ్జి రెడ్డి పరిశీలించారు. గురువారం దామనపల్లి ఆశ్రమ స్కూల్, శరభవరం గిరిజన సంక్షేమ పాఠశాలను ఆయన పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న బోధన పద్ధుతులు, మధ్యాహ్న భోజన పథకం వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అవసరమైన వసతులు కల్పించాలని ఆయన సూచించారు. పాఠశాల రిజిస్టర్‌లు పరిశీలించారు.1
- దేవుడి నైవేద్యంతో ‘ధన’ రాజకీయం చంద్రబాబుపై బొత్స సత్యనారాయణ నిప్పులు, ఉదయ అక్షరం, పిబ్రవరి -19:తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘోరమైన అపచారానికి పాల్పడుతున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన, కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, బడ్జెట్‌లోని డొల్లతనాన్ని ఆధారాలతో సహా ఎండగట్టారు.గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు చేసిన ఆరోపణలు కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని బొత్స విమర్శించారు. "సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్ విచారణ జరుగుతున్న వేళ, చంద్రబాబు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని ఇప్పటికే తేలిపోయింది. తన రాజకీయ ఉనికి కోసం దేవుడి నైవేద్యాన్ని కూడా అపవిత్రం చేయడానికి ఆయన వెనుకాడటం లేదు" అని మండిపడ్డారు.చంద్రబాబు తన ‘ధనదాహం’ కోసం ప్రజాధనాన్ని ఏ విధంగా లూటీ చేస్తున్నారో బొత్స సత్యనారాయణ సంచలన గణాంకాలతో వివరించారు. గతంలో కిలో రూ. 320 కే లభించిన నాణ్యమైన నెయ్యిని పక్కన పెట్టి.. ఇప్పుడు చంద్రబాబు తన సొంత సంస్థ అయిన హెరిటేజ్ తో సంబంధాలున్న ‘ఇందాపూర్ డెయిరీ’ ద్వారా కిలో రూ. 700 కు సరఫరా చేయిస్తున్నారని ఆరోపించారు. ధరను అకస్మాత్తుగా రెట్టింపు చేయడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటో, ఆ కమిషన్లు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. "భక్తి ముసుగులో అవినీతి వ్యాపారం చేస్తున్నారు. రూ. 320 నుంచి రూ. 700 కు ధర పెరగడం వెనుక ఉన్న ‘సీక్రెట్’పై బహిరంగ చర్చకు సిద్ధమా?" అని కూటమి నేతలకు బొత్స సవాల్ విసిరారు.కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీ తప్ప మరేమీ లేదని ఆయన కొట్టిపారేశారు. సభలో వాస్తవాలు మాట్లాడితే ప్రభుత్వం బట్టబయలవుతుందనే భయంతోనే చర్చ నుంచి తప్పించుకుంటున్నారని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, ఇప్పుడు బడ్జెట్‌లో కోతలు విధిస్తూ మోసం చేస్తున్నారని, దమ్ముంటే పూర్తిస్థాయి చర్చకు రావాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.1
- *ఉపవాస దీక్షల సమయంలో హలీం శక్తినిస్తుంది* *అఫ్సర్ భాయ్ హలీం స్టాల్ ను ప్రారంభించిన జంపాల సీతారామయ్య* ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 19, పవిత్ర రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్షలు చేస్తున్నవారికి హలీం శక్తినిస్తుందని తెలిపారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య. గురువారం నాడు కొండపల్లిలో రంజాన్ స్పెషల్ అప్సర్ భాయ్ హలీమ్ సెంటర్ ను కొండపల్లి మున్సిపల్ చైర్మన్ మరియు టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నుబోయిన చిట్టిబాబు ప్రారంభించారు. సలీం సెంటర్ ప్రజాదరణ పొందాలని, అప్సర్ వ్యాపారం మంచిగా జరగాలని మిఠాయి తినిపించి ఆకాంక్షించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి హలీం రుచి చూశారు. అప్సర్ జంపాల సీతారామయ్య గారిని, చిట్టిబాబును శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.1
- 🙏🙏1
- Post by Srinivas Y1
- రాజమండ్రి నుంచి గుంటూరు బయలుదేరిన మాజీ మంత్రి అంబటి రాంబాబును గురువారం పోలీసులు అడ్డుకున్నారు. కేవలం మూడు వాహనాలకే అనుమతి ఉందని ఆంక్షలు విధించడంతో ఆయన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్లకు అనుమతి నిరాకరిస్తే పాదయాత్ర చేస్తానని స్పష్టం చేశారు. నగరంలో 30 యాక్ట్ అమల్లో ఉందని పోలీసులు చెప్పగా.. గతంలో తన ఇల్లు ధ్వంసం చేసినప్పుడు ఈ చట్టం ఏమైందని అంబటి నిలదీశారు.1