Shuru
Apke Nagar Ki App…
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్నంలో BRS పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సత్తుపల్లి 16 వ వార్డులో BRS జెండా ఎగరేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్ గారు ఈ కార్యక్రమంలో 16 వార్డు BRS నాయకులు కార్య కర్తలు పాల్గొన్నారు..
V Ramarao
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్నంలో BRS పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సత్తుపల్లి 16 వ వార్డులో BRS జెండా ఎగరేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్ గారు ఈ కార్యక్రమంలో 16 వార్డు BRS నాయకులు కార్య కర్తలు పాల్గొన్నారు..
More news from తెలంగాణ and nearby areas
- Post by V Ramarao1
- కమిషన్ పెంచాలని, రవాణా ఛార్జీలను కంపెనీలే భరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం దేశవ్యాప్త బంద్లో భాగంగా కాకినాడ (D) వ్యాప్తంగా ఎరువుల దుకాణాలు మూతపడ్డాయి. కరప, కాకినాడ రూరల్లో డీలర్లు నిరసన చేపట్టారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన మరింత తీవ్రం చేస్తామని డీలర్ల సంఘం ప్రతినిధి పాట్నీడి అప్పారావు హెచ్చరించారు. ఈ బంద్ ఎరువుల విక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి.1
- Post by Syambabu6
- చిన్న కూతురు, తల్లి పరిస్థితి విషమం, ఆసుపత్రిలో చికిత్స ఖమ్మం జిల్లా ఖమ్మం అర్బన్ మండలం బుర్హాన్‌పురం ప్రాంతంలో భార్య రమ్య, కూతుళ్లు దివ్య నైనీ(5), దీక్షలతో నివాసం ఉంటూ, ఓ దినపత్రికలో జర్నలిస్టుగా పని చేస్తున్న అనంతనగర్ ప్రాంతానికి చెందిన కొణతల రాము(29) అనే వ్యక్తి నాలుగు రోజులుగా భర్తకు ఎవరు ఫోన్ చేసినా అనారోగ్యంతో ఉన్నాడని అందుకే తాను మాట్లాడుతున్నానని చెబుతున్న రమ్య ఆదివారం ఉదయం పక్కింటి మహిళ వచ్చి పిలవగా దుప్పటి కప్పుకుని వచ్చి తలుపు తీసిన రమ్య, దుర్వాసన ఏంటని అడగగా ఇంట్లో ఎవరికీ ఆరోగ్యం బాగాలేదని అందుకే శుభ్రం చేయలేదని సమాధానం ఆదివారం సాయంత్రం ఇంటికి వచ్చి తలుపు కొట్టగా ఎంతకూ స్పందించకపోవడం, ఇంట్లో నుండి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన రమ్య సోదరుడు తలుపులు పగలగొట్టి చూడగా మంచం కింద రాము, దివ్యనైనీ మృతదేహాలు, పక్కనే రమ్య, దీక్ష అపస్మారక స్థితిలో ఉండడం చూసి ఆశ్చర్యపోయిన పోలీసులు పరిస్థితి విషమంగా ఉండడంతో రమ్య, దీక్షలను ఆసుపత్రికి తరలింపు రమ్య తన భర్త, కూతురిని హతమార్చి మూడురోజులుగా మృతదేహాలతో ఉంటూ, చిన్నకూతురిని సైతం హత్య చేసేందుకు ప్రయత్నించిందని, విషయం బయట పడుతుందని భయంతో తాను కూడా ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసుల అనుమానం కారణాలు చెప్పడానికి రమ్య నిరాకరించిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపిన పోలీసులు1
- అమరావతి: ధరణికోట మండల పరిసర ప్రాంతాలలో సోమవారం మధ్యాహ్నం కి ఎండ బంగారపు వన్నెలో భగభగమంటూ కాస్తుంది. 12 గంటల నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం విశేషం. మధ్యాహ్నం రెండు గంటల లోపు 41 డిగ్రీలు నమోదు అవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. సుమారు 43 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న విధంగా ఎండ తీవ్రత కనిపిస్తుంది. రోజురోజుకు విపరీతంగా ఎండ పెరిగిపోవడంతో ప్రజలు బయటికి వచ్చేందుకు భయభ్రాంతులకు గురవుతున్నారు.1
- Post by CHIYAAN1
- మహబూబాబాద్ జిల్లా, కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో సుమారు 15 ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. గ్రామానికి చెందిన రైతులు కొమురయ్య (3 ఎకరాలు), సురేష్ (2 ఎకరాలు), ఐలయ్య (3 ఎకరాలు), జక్కుల కట్టమల్లు (3 ఎకరాలు), పుణ్యపుర్తి ఐలయ్య (4 ఎకరాలు)లకు చెందిన పంటలు మంటల్లో కాలిపోయాయి. ఒక్కసారిగా పొలాల్లో మంటలు వ్యాపించడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖకు తెలియజేయగా, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే పెద్ద మొత్తంలో పంట నష్టం జరిగిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో బాధిత రైతులు తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన పరిహారం అందించాలని కోరుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు ఘటన పై విచారణ ప్రారంభించారు.1
- Post by V Ramarao2