Shuru
Apke Nagar Ki App…
విజయనగరం: ఘోష ప్రభుత్వ హాస్పిటల్లో అరకోర సదుపాయాలతో పేషెంట్లు ఇబ్బందులు విజయనగరం పట్టణం ప్రభుత్వ ఘోష ఆసుపత్రిలో సరైన సదుపాయాలు లేక పేషెంట్లు ఇబ్బందులకు గురవుతున్నారని బుధవారం తెలిపారు. పేషెంట్లతో వచ్చిన వారికి కూర్చోడానికి టేబుల్స్ లేక, సరైన షెల్టర్ లేక ఎండలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధ్యాహ్న భోజన సమయంలో పేషెంట్లు గంటల తరబడి గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చి నిల్చోని భోజనం తీసుకోవడం కష్టమవుతుందని వారు అన్నారు. ఈ విషయమై అధికారులు స్పందించి తగు సదుపాయాలు కల్పించాలని కోరారు.
Vijay Bhaskar
విజయనగరం: ఘోష ప్రభుత్వ హాస్పిటల్లో అరకోర సదుపాయాలతో పేషెంట్లు ఇబ్బందులు విజయనగరం పట్టణం ప్రభుత్వ ఘోష ఆసుపత్రిలో సరైన సదుపాయాలు లేక పేషెంట్లు ఇబ్బందులకు గురవుతున్నారని బుధవారం తెలిపారు. పేషెంట్లతో వచ్చిన వారికి కూర్చోడానికి టేబుల్స్ లేక, సరైన షెల్టర్ లేక ఎండలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధ్యాహ్న భోజన సమయంలో పేషెంట్లు గంటల తరబడి గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చి నిల్చోని భోజనం తీసుకోవడం కష్టమవుతుందని వారు అన్నారు. ఈ విషయమై అధికారులు స్పందించి తగు సదుపాయాలు కల్పించాలని కోరారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- విజయనగరం: కలెక్టర్ ఆఫీస్ లో డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ క్షన్ కౌన్సిల్ సమావేశం. జేసీ విజయనగరం కలెక్టర్ ఆఫీసులో బుధవారం డిసిపిసి సమావేశం జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ సమావేశంలో జెసి చర్చించారు. డిసిపిసి నెంబర్ గా ఎమ్ ఎస్ శ్రీనివాసరావును నియమించినట్లు జేఎస్ఓ తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్ఓ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.1
- విజయనగరం జిల్లా గజపతినగరంలో జనసేన సభ్యత్వ నమోదులో కలిగి పండు అగ్రస్థానం.. గజపతినగరం నియోజకవర్గ స్థాయిలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదులో గజపతినగరానికి చెందిన కలిగి పండు 353 సభ్యులను చేర్పించి ప్రథమ స్థానంలో నిలిచారు. పైల మహేష్ ద్వితీయ, తాళ్లపూడి సౌమిత్రి త్రివేది తృతీయ, ఎర్రి నాయుడు నాలుగో స్థానంలో నిలిచారు. బుధవారం గజపతినగరంలో జరిగిన కార్యక్రమంలో జనసేన పార్టీ గజపతినగరం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ మర్రాపు సురేష్, మాజీ మంత్రి పడాల అరుణలు పలువురు జనసేన సాధకులను శాలువాలతో సత్కరించారు.1
- రాజాం లో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు... బైక్ పై భారీ ర్యాలీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రాజాం నియోజకవర్గంలో జనసేన పార్టీ సమన్వయకర్త పొగిరి సురేష్ బాబు ఆధ్వర్యంలో బుధవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.1
- రాజాం రోడ్లపై గోవులు... సింహాచలం గోశా లకు తరలింపు..... రాజాం పురపాలక సంఘ పరిధిలో రోడ్లపై సంచరిస్తున్న గోవులను కమిషనర్ రామచందర్రావు, సీఐ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం గోశాల తరలించారు. యజమానులు పాలు పితికిన అనంతరం గోవులను రోడ్లపై వదిలేయడంతో వాహదారులకు, గోవులకు ప్రమాదాల జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. యజమానులకు పలుమార్లు అవగాహన కల్పించిన మార్పు రాకపోవడంతో 35 గోవులను 3 లారీలో సింహాచలం గోశాలకు తరలించినట్లు వెల్లడించారు.1
- ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా పెందుర్తిలో పెందుర్తి శాసనసభ్యులు రమేష్ బాబు ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఆయన ఆధ్వర్యంలో మెగా బ్లడ్ బ్యాంక్ సబ్బవరం నుంచి పెద్ధర్తి మీనాక్షి ఫంక్షన్ హాల్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో నుంచి తరలివచ్చిన పవన్ కళ్యాణ్ అభిమానులు పార్టీ శ్రేణులు1
- శ్రీకాకుళం రెడ్ క్రాస్ భవన్ లో కలెక్టరుకు ఆత్మీయ సత్కారం శ్రీకాకుళం : జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా విశిష్ట సేవలు అందించినందుకు గుర్తింపుగా గవర్నర్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక గవర్నర్ గోల్డ్‌మెడల్ అందుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం స్థానిక రెడ్ క్రాస్ భవనంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కరికి ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవా కార్యక్రమాలకు విశ్వసనీయత పెంచడమే అసలైన విజయం అనీ అన్నారు. కలెక్టర్లు అందించిన నిరంతర ప్రోత్సాహం, స్వచ్ఛంద సంస్థల ఉదారత, రెడ్‌క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు నేతృత్వంలో సాగుతున్న నిస్వార్థ సేవలే రాష్ట్రస్థాయిలో ఈ గుర్తింపుకు కారణమని కొనియాడారు. జిల్లా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు, చైతన్య సదస్సులు, ముసలివారికి శరణాలయాలు, అనాథ పిల్లల సంరక్షణ, ఉచిత అంబులెన్స్ సేవలు, ఉచిత రక్త మార్పిడి లాంటి అనేక సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సేవా విభాగాల్లో ముఖ్య భూమిక పోషిస్తున్న రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ హరి ఓం పాండియా, వైస్ చైర్మన్ డాక్టర్ సుధీర్, ట్రెజరర్ దుర్గా శ్రీనివాస్, వైద్యులు, వాలంటీర్లు చిన్మయరావు, సన్యాసిరావు, డాక్టర్ సచిత్ర, వైకుంఠరావు, చైతన్య, లక్ష్మణరావు, శ్రీకాంత్, నర్సింగరావు, సత్యనారాయణ, రమణ, సతీష్‌లను కలెక్టర్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, రెడ్‌క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.2
- అనకాపల్లిలో శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న బొబ్బిలి ఎమ్మెల్యే - బేబీనాయన... అనకాపల్లి జిల్లా.... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్ర తమ్ముడు కూతురు రజస్వల ఫంక్షన్లో బొబ్బిలి శాసనసభ్యులు ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన) పాల్గొన్నారు. అనంతరం, అనకాపల్లి పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, పాలకమండలి సభ్యులు మరియు ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలుకగా, దర్శనం అనంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించి అమ్మవారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలను బహూకరించారు.4
- విజయనగరం: ఘోష ప్రభుత్వ హాస్పిటల్లో అరకోర సదుపాయాలతో పేషెంట్లు ఇబ్బందులు విజయనగరం పట్టణం ప్రభుత్వ ఘోష ఆసుపత్రిలో సరైన సదుపాయాలు లేక పేషెంట్లు ఇబ్బందులకు గురవుతున్నారని బుధవారం తెలిపారు. పేషెంట్లతో వచ్చిన వారికి కూర్చోడానికి టేబుల్స్ లేక, సరైన షెల్టర్ లేక ఎండలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధ్యాహ్న భోజన సమయంలో పేషెంట్లు గంటల తరబడి గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చి నిల్చోని భోజనం తీసుకోవడం కష్టమవుతుందని వారు అన్నారు. ఈ విషయమై అధికారులు స్పందించి తగు సదుపాయాలు కల్పించాలని కోరారు.1