బైక్ దొంగలను అదుపులోకి తీసుకున్న మరిపెడ పోలీసులు ఇద్దరి అరెస్ట్ మూడు బైకులు స్వాధీనం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పరిధిలోని గాలివారిగుండెం గ్రామంలోని ఏఎన్ఆర్ గార్డెన్ వద్ద మూడు రోజుల క్రితం దొంగిలించబడిన బైక్ విషయంలో మరిపెడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గత మూడు రోజులుగా వివిధ ప్రాంతాలలో విచారణ జరిపిన పోలీసులు మొత్తం ఐదుగురు నిందితులను గుర్తించారు. ఈ కేసులో నిందితులలో ఇద్దరైన వాంకుడోత్ గోపీచంద్ (తండ్రి: హస్సలా, నివాసం: హస్లా తండా, ఆత్మకూరు (ఎస్) మండలం, సూర్యాపేట జిల్లా) మరియు గుగులోత్ మనోజ్ (తండ్రి: గోరియ, నివాసం: గోల్ తండా గ్రామం, మోతే మండలం, సూర్యాపేట జిల్లా)లను ఈరోజు మరిపెడలోని కార్గిల్ సెంటర్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి మూడు బైకులను స్వాధీనం చేసుకుని, అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మిగిలిన ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో పట్టుకుని రిమాండ్‌కు తరలిస్తామని పోలీసులు తెలిపారు. ఈ విషయాకిన్ని మరిపెడ ఎస్‌ఐ ఈ. వీరభద్రరావు ఒక ప్రకటనలో వెల్లడించారు.
బైక్ దొంగలను అదుపులోకి తీసుకున్న మరిపెడ పోలీసులు ఇద్దరి అరెస్ట్ మూడు బైకులు స్వాధీనం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పరిధిలోని గాలివారిగుండెం గ్రామంలోని ఏఎన్ఆర్ గార్డెన్ వద్ద మూడు రోజుల క్రితం దొంగిలించబడిన బైక్ విషయంలో మరిపెడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గత మూడు రోజులుగా వివిధ ప్రాంతాలలో విచారణ జరిపిన పోలీసులు మొత్తం ఐదుగురు నిందితులను గుర్తించారు. ఈ కేసులో నిందితులలో ఇద్దరైన వాంకుడోత్ గోపీచంద్ (తండ్రి: హస్సలా, నివాసం: హస్లా తండా, ఆత్మకూరు (ఎస్) మండలం, సూర్యాపేట జిల్లా) మరియు గుగులోత్ మనోజ్ (తండ్రి: గోరియ, నివాసం: గోల్ తండా గ్రామం, మోతే మండలం, సూర్యాపేట జిల్లా)లను ఈరోజు మరిపెడలోని కార్గిల్ సెంటర్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి మూడు బైకులను స్వాధీనం చేసుకుని, అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మిగిలిన ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో పట్టుకుని రిమాండ్‌కు తరలిస్తామని పోలీసులు తెలిపారు. ఈ విషయాకిన్ని మరిపెడ ఎస్‌ఐ ఈ. వీరభద్రరావు ఒక ప్రకటనలో వెల్లడించారు.
- నర్సంపేట నియోజకవర్గంలోని జ్యోతిబసు నగర్ కాలనీలో ఆదివారం బహుజన పితామహుడు మన్యవర్ కాన్షిరాం 92వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బహుజన రాజ్యాధికార సమితి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, బీసీ–ఎస్సీ–ఎస్టీ జేఏసీ రాష్ట్ర కో–కన్వీనర్ రామగిరి యాదగిరి స్వామి అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బహుజన రాజ్యాధికార సమితి రాష్ట్ర కన్వీనర్, బీసీ–ఎస్సీ–ఎస్టీ జేఏసీ రాష్ట్ర కో–కన్వీనర్, మహాత్మా జ్యోతిబా ఫూలే నేషనల్ అవార్డు గ్రహీత ముంజాల రాజేందర్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముంజాల రాజేందర్ గౌడ్ మాట్లాడుతూ, బహుజన సమాజానికి రాజకీయ అధికారమే అన్ని సమస్యలకు పరిష్కారమని మన్యవర్ కాన్షిరాం తన జీవితాన్ని బహుజన వర్గాల అభ్యున్నతికి అంకితం చేశారని పేర్కొన్నారు. మండల్ కమిషన్ అమలుకు ఆయన చేసిన పోరాటం ఫలితంగా 1990లో బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు సాధ్యమయ్యాయని తెలిపారు. దేశవ్యాప్తంగా పర్యటిస్తూ బహుజనులకు రాజకీయ అధికారం వచ్చినప్పుడే సమాజంలోని అసమానతలు తొలగుతాయని కాన్షిరాం ప్రజలకు అవగాహన కల్పించారని అన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ బహుజన సమాజ అభివృద్ధికి ఆయన విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ సమాజాలు ఐక్యంగా పనిచేసి బహుజన రాజ్యాధికారాన్ని సాధించాలని పిలుపునిచ్చారు. 2029 ఎన్నికల్లో బహుజన ఐక్యతతో ముందుకు సాగి రాజకీయ అధికారాన్ని సాధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెజ్జం రాజేష్, పిట్టల యాకయ్య, మేడిద కొమురయ్య, ఊర్సు సరోజన, మేడిద ప్రమీల తదితరులు పాల్గొన్నారు.2
- వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి, కుంటపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశం చేశారు. వారు మాట్లాడుతూ పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు.1
- రోడ్డు దాటుతున్న మహిళను ఆటో ఢీకొన్న సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది..స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణ పరిధిలోని రామవరం ప్రాంతంలో ఓ మహిళ రోడ్డు దాటుతుండగా ట్రాలీ ఆటో మహిళను ఢీకొంది.. ఈ ప్రమాదంలో మహిళ ఒక్కసారిగా కింద పడిపోవటం తో గాయాలయ్యాయి.. స్థానికులు హుటాహుటిన కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది1
- మంత్రి తుమ్మల కామెంట్స్.... ......గత ప్రభుత్వంలో ఖమ్మం చుట్టు పక్కల భూకబ్జాలు పెట్రేగి పోయాయి .....నక్సలైట్లు పోరాటాలు చేసి చివరికి ప్రజాస్వామ్య పద్ధతిలో లొంగిపోతున్నారు ..వెలుగుమట్ల భూదాన్ భూముల్లో మాఫియా రాజ్యం చేస్తామంటే ప్రభుత్వం ఉదారంగా ఉండాలా .వెలుగుమట్ల కాలనీ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా డిసెంబర్ 9 న ప్రారంభోత్సవం ....పేదల సంఘం ముసుగులో పేదల వద్ద లక్షలు వసూళ్లు చేసి నకిలీ పట్టాలు ఇచ్చిన అక్రమార్కుల పై ప్రభుత్వం చర్యలు తీసుకోవద్దా ....అరాచకం రాజ్య మేలుతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా .నీళ్లు కరెంట్ రోడ్లు లేకుండా దుర్భర పరిస్థితిలో పేదలు ఎందుకు ఉండాలి ...పేదల కోసం నిలబడే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని భదనం చేయాలని చూశారు ..పేదల ఇళ్ళు కూల్చే దౌర్భాగ్యం నాకెందుకు కోర్టు ఆదేశాలతో అక్రమ నిర్మాణాలు తొలగించారు ...గ్రామ పరిపాలనలో అన్ని శాఖలపై సర్పంచ్ లు బాధ్యత వహించాలి..గ్రామాల్లో పారిశుద్ధ్యం పచ్చదనం పై ప్రజలను భాగస్వామ్యం చేయాలి ...పామాయిల్ సాగు విస్తరణ పై గ్రామాల్లో సర్పంచ్ లు చొరవ తీసుకోవాలి .ఈ నెల 22 న సిద్దిపేట లో పామాయిల్ ఫ్యాక్టరీ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం.వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో రైతులే స్వయంగా కొనుగోలు చేస్తే ప్రభుత్వం రైతుల ఖాతాలో సబ్సిడీ నిధులు జమ చేస్తాంరఘు నాథపాలెం మండలంలో ఆయిల్ ఫామ్ సాగు ప్రోత్సహించాలిరాజకీయాల్లో నిజాయితీ గా ఉండాలంటే వ్యవసాయం పై ఆదాయం ఉండాలి మంచుకొండ ఎత్తి పోతల పథకం..యంగ్ ఇండియా స్కూల్..స్వామి నారాయణ గురుకుల పాఠశాల..ప్రభుత్వ మెడికల్ కళాశాల నేనే తెచ్చా .రఘు నాథపాలెం మండలానికి మహర్దశ పట్టేలా అబివృద్ధి1
- తెలంగాణ రాష్ట్రంలో ఓ వైపు ఎండలు మండిపోతుండగా.. మరోవైపు వర్షాలు పడుతున్నాయి. నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో వడగండ్ల వానలు పడుతున్నాయి. పంటలు దెబ్బతింటుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా మరో రెండు రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.1
- జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో ఓ ప్రైవేట్ స్కూల్లో హనుమాన్ స్వాముల ఆందోళన స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. హనుమాన్ దీక్ష తీసుకున్న ఐదుగురు విద్యార్థులను పాఠశాలలోపలికి అనుమతించడం లేదని హనుమాన్ దీక్ష స్వాములు ఆందోళనకు దిగారు. స్కూల్ ముందు బైఠాయించి యాజమాన్య తీరును నిరసిస్తూ ధర్నా చేశారు. ఆందోళన దిగిన స్వాములతో పాఠశాల యాజమాన్యం సంప్రదింపులు జరిపి దీక్ష తీసుకున్న స్వామి విద్యార్థులను ఇబ్బంది లేకుండా చూస్తామని క్లాసులకు అనుమతించడంతో ఆందోళన సద్దుమణిగింది.1
- మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పరిధిలోని గాలివారిగుండెం గ్రామంలోని ఏఎన్ఆర్ గార్డెన్ వద్ద మూడు రోజుల క్రితం దొంగిలించబడిన బైక్ విషయంలో మరిపెడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గత మూడు రోజులుగా వివిధ ప్రాంతాలలో విచారణ జరిపిన పోలీసులు మొత్తం ఐదుగురు నిందితులను గుర్తించారు. ఈ కేసులో నిందితులలో ఇద్దరైన వాంకుడోత్ గోపీచంద్ (తండ్రి: హస్సలా, నివాసం: హస్లా తండా, ఆత్మకూరు (ఎస్) మండలం, సూర్యాపేట జిల్లా) మరియు గుగులోత్ మనోజ్ (తండ్రి: గోరియ, నివాసం: గోల్ తండా గ్రామం, మోతే మండలం, సూర్యాపేట జిల్లా)లను ఈరోజు మరిపెడలోని కార్గిల్ సెంటర్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి మూడు బైకులను స్వాధీనం చేసుకుని, అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మిగిలిన ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో పట్టుకుని రిమాండ్‌కు తరలిస్తామని పోలీసులు తెలిపారు. ఈ విషయాకిన్ని మరిపెడ ఎస్‌ఐ ఈ. వీరభద్రరావు ఒక ప్రకటనలో వెల్లడించారు.1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయాన్ని రాబోయే రోజుల్లో ఎకోటూరిజం కింద అభివృద్ధి చేస్తామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ప్రకృతి సౌందర్యాన్ని కాపాడుతూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఎకోటూరిజం అభివృద్ధి ద్వారా ఈ ప్రాంతానికి వచ్చే భక్తులు, పర్యాటకులకు మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. దీనివల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని మంత్రి చెప్పారు. సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు తీసుకొని అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన సూచించారు.1
- మహబూబాబాద్ జిల్లా:మహబూబాబాద్ పట్టణ పరిధిలోని మంగళి కాలనీ, పత్తిపాక ప్రాంతాల్లో పోలీసులు జరిపిన తనిఖీల్లో గంజాయి కలకలం రేపింది. గంజాయి తాగుతున్న తాళ్ల అభిషేక్, నాయిని ఈశ్వర్లను అదుపులోకి తీసుకున్నట్లు టౌన్ ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ.50 వేల విలువైన 12 గ్రాముల గంజాయిని, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు వెల్లడించారు.1