*SFI, DYFI ఆధ్వర్యంలో కబడ్డీ ఫ్రెండ్లీ టోర్నమెంట్....* ఆదోని పట్టణంలోని తిక్క స్వామి దర్గా ఏరియా నందుSFI, DYFI ఆధ్వర్యంలో కబడ్డీ ఫ్రెండ్లీ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంటును DYFI మాజీ నాయకులు వెంకటేశులు టాస్ వేసి ప్రారంభించారు. ఫ్రెండ్లీ టోర్నమెంట్ క్రీడాకారులను ఉద్దేశించి DYFI మాజీ జిల్లా నాయకులు లక్ష్మన్న, జిల్లా ఉపాధ్యక్షులు వీరేష్,సతీశ్, SFI రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవి, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు,పట్టణ కార్యదర్శి శశిధర్ తదితరులు యువ క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం టోర్నమెంట్ ఉద్దేశించి వీరు మాట్లాడుతూ నిత్యం విద్యార్థి, యువజన,నిరుద్యోగ సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తూ మరోపక్క యువకులలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు సంక్రాంతి పండుగలు, స్వాతంత్ర పోరాటంలో అసువులు బాసిన విప్లవ వీర యువకిశోరాల వర్ధంతులు, జయంతులు సందర్భంగా ఇలాంటి ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఆదోని పట్టణంలో క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా సరైన ఆట స్థలాలు లేకపోవడంతో చాలామంది యువత క్రీడలకు దూరం అవుతున్నారని వారు అన్నారు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే క్రీడాకారుల పట్ల ప్రేమ చూపుతున్నట్లు రాజకీయ పార్టీల నాయకులు నటిస్తున్నారని వారు గుర్తు చేశారు. క్రీడల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని వారు అన్నారు. ఇలాంటి ఫ్రెండ్లీ టోర్నమెంట్ సందర్భంగా యువకులలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీస్తూ సమాజానికి తెలియజేసే పద్ధతుల్లో SFI, DYFI క్రీడలను ప్రోత్సహించేందుకు ఇలాంటి ఆటలు పోటీ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.

- గాండ్లపెంట మండల పరిధిలోని కటారుపల్లి గ్రామంలో ఉన్న వేమన సమాధికి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రత్యేక పూజలు చేయించారు. ఆలయ పీఠాధిపతులు నంద వేమారెడ్డి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కందికుంట కు స్వాగతం పలికారు. వేమన సమాధికి ఎమ్మెల్యే కందికుంట ప్రదక్షణ చేశారు. అనంతరం మంగళహారతి ఇచ్చారు. అధికారులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.1
- నారాయణఖేడ్ పట్టణంలో గజేంద్ర భారతి మహారాజ్ ఆశ్రమ నిర్మాణానికి కృషి చేస్తాం మీడియాతో ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్1
- మేడ్చల్ జిల్లా.. కీసర పోలీస్ స్టేషన్ పరిధి ORR.సర్వీస్ రోడ్ లో బైకు అదుపుతప్పి గడ్డం కుమార్. 23 సంవత్సరాలు వయసు గల యువకుడు మృతి భోగారం గ్రామానికి చెందిన గడ్డం కుమార్ షామీర్పేట్ నుండి భోగారం తన ఇంటికి చేరుకునే సమయంలో సర్వీస్ రోడ్ లో స్పీడ్ బ్రేకర్ వద్ద బైకు అదుపుతప్పి కింద పడడంతో తలకు బలమైన గాయాలు అవ్వడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కీసర పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహానికి గాంధీ ఆసుపత్రి కు తరలించారు.2
- కుత్బుల్లాపూర్ నియోజక వర్గం హెచ్ఎంటి గ్రౌండ్ లో బీజేవైఎం ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా కైట్ ఫెస్టివల్ ప్రోగ్రాంలో స్టేట్ బిజెపి వైస్ ప్రెసిడెంట్ కొల్లి మాధవి, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి పాల్గొని కైట్ ఎగరవేశారు. కైట్ ఫెస్టివల్ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఈ టైప్ ఫెస్టివల్లు ఏర్పాటు చేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు గాజులరామారం కార్పొరేటర్ రావుల శేషగిరి బక్క శంకర్ రెడ్డి ,పత్తి సతీష్, బిక్షపతి,కళ్యాణ్, సుమన్ తదితరు బిజెపి నాయకులు పాల్గొన్నారు.1
- రామగిరిలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఘనంగా శ్రీ గోద రంగమన్నార్ కళ్యాణోత్సవం.._ రాత్రి వేళ నిర్వహించిన కల్యాణోత్సవం భక్తులను మంత్రముగ్ధులను చేసిన కన్నుల పండుగ... స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి – చైతన్య దంపతులు... సంప్రదాయ వైభవంతో కొనసాగిన కల్యాణోత్సవ కార్యక్రమాలు... స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు... ఆలయ ప్రాంగణమంతా భక్తిశ్రద్ధలతో నిండిన వాతావరణం...1
- బీసీలకు 42% నామినేటెడ్ పదవులు ఇవ్వాలి: జాజుల లింగం గౌడ్ బీసీలకు 42 శాతం నామినేటెడ్ పదవులు ఇవ్వాలని బిసి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన మిర్యాలగూడ పట్టణంలో మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 42 శాతం ఇస్తామంటూనే నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు అన్ని రంగాలలో సముచిత స్థానం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.1
- కర్నూలు జిల్లాలో సంచలనం: ఆదోని కరూర్ వైశ్యా బ్యాంక్‌లో ఖాతాదారుడి సొమ్ము మాయం! పొలం అమ్మిన రూ. 8 లక్షల నగదును బ్యాంకులో డిపాజిట్ చేసిన రైతు.. ఖాతా చూస్తే నిల్!1
- గాండ్లపెంట మండలం పరిధిలోని కటారుపల్లి గ్రామంలో ఉన్న యోగివేమన సమాధి వద్ద జరుగుతున్న జయంతి ఏర్పాట్లను సంబంధిత అధికారులు, మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుమార్ పరిశీలించారు. జనవరి 19వ తేదీన వైభవంగా జరగనున్న వేమన జయంతికి భారీ ఎత్తున జన సమీకరణ హాజరవుతారని విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లను ఆ స్థాయిలో చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జయంతి పనులు అతివేగంగా జరుగుతున్నాయి.1
- భక్తి భావాన్ని పెంపొందించుకోవాలి: నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి తెలిపారు. నారాయణఖేడ్ పట్టణం నుండి మహారాష్ట్రలోని సుప్రసిద్ధ దేవాలయం పండరీపూర్ కు కరణ్ గజేంద్ర భారతి మహారాజ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్ర కార్యక్రమాన్ని పట్టణంలోని పురాతన రామ మందిరం నుండి ఎంపీ సురేష్ కుమార్ షేట్కర్, మాజీ సర్పంచ్ అప్పారావు షెట్కర్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హుక్రాన శివారులో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దైవచింతనతోనే ముక్తి దొరుకుతుందని సద్గురువుల సేవలో ఉంటేనే పరమార్ధం లభిస్తుందని తెలిపారు.1