logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

“మాల–మాదిగల గౌరవంపై రఘురామకృష్ణకు మంద కృష్ణ మాదిగ వార్నింగ్” రఘురామకృష్ణ జోక్యంపై ఆగ్రహం – మాల, మాదిగల గౌరవానికి భంగం కలిగిస్తే వదిలిపెట్టం: మంద కృష్ణ మాదిగ ఆకివీడు/భీమవరం: ఆకివీడు వ్యవహారంలో రఘురామకృష్ణ జోక్యం చేసుకుంటే ఊరుకోమని, మాల, మాదిగల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఏ చర్యలనైనా తీవ్రంగా ప్రతిఘటిస్తామని దళిత నాయకుడు మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. దళితుల గౌరవం, హక్కుల పరిరక్షణలో ఎటువంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. ఆకివీడు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలపై స్పందించిన ఆయన, మాల, మాదిగలపై ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టబోమని తీవ్రంగా వ్యాఖ్యానించారు. సమాజంలో దళితుల గౌరవాన్ని కాపాడేందుకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. దళిత సంఘాలు కూడా ఈ వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతూ, పరిస్థితులు ఉద్రిక్తంగా మారకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరాయి.

13 hrs ago
user_Ashok
Ashok
Local News Reporter జగ్గంపేట, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
13 hrs ago

“మాల–మాదిగల గౌరవంపై రఘురామకృష్ణకు మంద కృష్ణ మాదిగ వార్నింగ్” రఘురామకృష్ణ జోక్యంపై ఆగ్రహం – మాల, మాదిగల గౌరవానికి భంగం కలిగిస్తే వదిలిపెట్టం: మంద కృష్ణ మాదిగ ఆకివీడు/భీమవరం: ఆకివీడు వ్యవహారంలో రఘురామకృష్ణ జోక్యం చేసుకుంటే ఊరుకోమని, మాల, మాదిగల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఏ చర్యలనైనా తీవ్రంగా ప్రతిఘటిస్తామని దళిత నాయకుడు మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. దళితుల గౌరవం, హక్కుల పరిరక్షణలో ఎటువంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. ఆకివీడు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలపై స్పందించిన ఆయన, మాల, మాదిగలపై ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టబోమని తీవ్రంగా వ్యాఖ్యానించారు. సమాజంలో దళితుల గౌరవాన్ని కాపాడేందుకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. దళిత సంఘాలు కూడా ఈ వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతూ, పరిస్థితులు ఉద్రిక్తంగా మారకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరాయి.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • రఘురామకృష్ణ జోక్యంపై ఆగ్రహం – మాల, మాదిగల గౌరవానికి భంగం కలిగిస్తే వదిలిపెట్టం: మంద కృష్ణ మాదిగ ఆకివీడు/భీమవరం: ఆకివీడు వ్యవహారంలో రఘురామకృష్ణ జోక్యం చేసుకుంటే ఊరుకోమని, మాల, మాదిగల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఏ చర్యలనైనా తీవ్రంగా ప్రతిఘటిస్తామని దళిత నాయకుడు మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. దళితుల గౌరవం, హక్కుల పరిరక్షణలో ఎటువంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. ఆకివీడు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలపై స్పందించిన ఆయన, మాల, మాదిగలపై ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టబోమని తీవ్రంగా వ్యాఖ్యానించారు. సమాజంలో దళితుల గౌరవాన్ని కాపాడేందుకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. దళిత సంఘాలు కూడా ఈ వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతూ, పరిస్థితులు ఉద్రిక్తంగా మారకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరాయి.
    1
    రఘురామకృష్ణ జోక్యంపై ఆగ్రహం – మాల, మాదిగల గౌరవానికి భంగం కలిగిస్తే వదిలిపెట్టం: మంద కృష్ణ మాదిగ
ఆకివీడు/భీమవరం: ఆకివీడు వ్యవహారంలో రఘురామకృష్ణ జోక్యం చేసుకుంటే ఊరుకోమని, మాల, మాదిగల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఏ చర్యలనైనా తీవ్రంగా ప్రతిఘటిస్తామని దళిత నాయకుడు మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు.
ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. దళితుల గౌరవం, హక్కుల పరిరక్షణలో ఎటువంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.
ఆకివీడు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలపై స్పందించిన ఆయన, మాల, మాదిగలపై ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టబోమని తీవ్రంగా వ్యాఖ్యానించారు. సమాజంలో దళితుల గౌరవాన్ని కాపాడేందుకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.
దళిత సంఘాలు కూడా ఈ వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతూ, పరిస్థితులు ఉద్రిక్తంగా మారకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరాయి.
    user_Ashok
    Ashok
    Local News Reporter జగ్గంపేట, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • Post by Maheshwaro
    2
    Post by Maheshwaro
    user_Maheshwaro
    Maheshwaro
    అచ్యుతాపురం, అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • పోలవరం జిల్లా గుర్తేడు మండలం పాతకోట గ్రామంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. సుమారు రెండు గంటల పాటు ఏకధాటిగా కురిసిన కుండపోత వర్షానికి గ్రామంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.రోడ్డు పై చెట్లు పడడంతో గోకవరం నుండి పాతకోట వచ్చే బస్సు కూడ వెనక్కి తిరిగి వెళ్ళింది.వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు. అకాల వర్షంతో వేరుశనగ రైతులు ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడినట్లు స్థానికులు తెలిపారు.అలాగే పాతకోట గ్రామంలో గొర్లే దేవిశ్రీ ప్రసాద్ ఇంట్లో భారీ వృక్షం పడడం వలన రేకులు ధ్వంసం అయ్యాయి. వాతావరణ శాఖ అధికారులు మరో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు.
    1
    పోలవరం జిల్లా గుర్తేడు మండలం పాతకోట గ్రామంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. సుమారు రెండు గంటల పాటు ఏకధాటిగా కురిసిన కుండపోత వర్షానికి గ్రామంలోని లోతట్టు ప్రాంతాలు
జలమయమయ్యాయి.రోడ్డు పై చెట్లు పడడంతో గోకవరం నుండి పాతకోట వచ్చే బస్సు కూడ వెనక్కి తిరిగి వెళ్ళింది.వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు. అకాల వర్షంతో వేరుశనగ రైతులు ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడినట్లు స్థానికులు తెలిపారు.అలాగే పాతకోట గ్రామంలో గొర్లే దేవిశ్రీ ప్రసాద్ ఇంట్లో భారీ వృక్షం పడడం వలన రేకులు ధ్వంసం అయ్యాయి. వాతావరణ శాఖ అధికారులు మరో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు.
    user_KONDLA SIVASANKAR REDDY
    KONDLA SIVASANKAR REDDY
    Local News Reporter Pathakota•
    12 hrs ago
  • Post by Shyam
    1
    Post by Shyam
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • Post by Sode Prasad
    1
    Post by Sode Prasad
    user_Sode Prasad
    Sode Prasad
    Insurance Agent చింతూరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • ప్రముఖ పర్యాటక ప్రాంతమైన చాపరాయి పరిసరాల్లో తురాయి వృక్షాలు ఎర్రటి పూలతో కనువిందు చేస్తున్నాయి. పచ్చని ప్రకృతి ఒడిలో, నీలాకాశం కింద కొమ్మ, కొమ్మనా విరబూసిన ఈ ఎర్రటి పూల సోయగం పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. చాపరాయి జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చే పర్యాటకులు ఈ అందమైన పూల చెట్ల వద్ద ఆగి ఛాయాచిత్రాలు దిగుతూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు.
    1
    ప్రముఖ పర్యాటక ప్రాంతమైన చాపరాయి పరిసరాల్లో తురాయి వృక్షాలు ఎర్రటి పూలతో కనువిందు చేస్తున్నాయి. పచ్చని ప్రకృతి ఒడిలో, నీలాకాశం కింద కొమ్మ, కొమ్మనా విరబూసిన ఈ ఎర్రటి పూల సోయగం పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. చాపరాయి జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చే పర్యాటకులు ఈ అందమైన పూల చెట్ల వద్ద ఆగి ఛాయాచిత్రాలు దిగుతూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • సభా ప్రాంగణాన్ని, హెలిప్యాడ్ స్థలాన్ని పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ, జేసీ ఇలికియా.. * రాష్ట్రవ్యాప్తంగా 9వ తేదీనే రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం. * ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఏ. కొండూరు మండలం వెస్ట్ మాధవరంలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రవ్యాప్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు.. * సీఎం చంద్రబాబు చేతుల మీదుగా 702మంది రైతులకు గ్రామసభలో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తారని తెలిపిన జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశా.. * సీఎం పర్యటనను దిగ్విజయం చేసేందుకు అధికార యంత్రాంగం సమిష్టి కృషితో పనిచేయాలని ఆదేశించిన-కలెక్టర్ జి. లక్ష్మి శా,జేసీ ఇలికియా.. * ఈ సమావేశంలో పాల్గొన్న ఆర్డీవో ఏ.కుమార్, సీఐ గిరిబాబు, ఎస్సై. గంధం. మహాలక్ష్మణడు వివిధ శాఖల అధికారులు..
    1
    సభా ప్రాంగణాన్ని, హెలిప్యాడ్ స్థలాన్ని పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ, జేసీ ఇలికియా..
* రాష్ట్రవ్యాప్తంగా 9వ తేదీనే రాజముద్రతో ముద్రించిన  పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం.
* ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఏ. కొండూరు మండలం వెస్ట్ మాధవరంలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని  రాష్ట్రవ్యాప్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్న  సీఎం చంద్రబాబు..
* సీఎం చంద్రబాబు చేతుల మీదుగా 702మంది రైతులకు గ్రామసభలో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తారని తెలిపిన జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశా..
* సీఎం పర్యటనను దిగ్విజయం చేసేందుకు అధికార యంత్రాంగం సమిష్టి కృషితో పనిచేయాలని ఆదేశించిన-కలెక్టర్ జి. లక్ష్మి శా,జేసీ ఇలికియా..
* ఈ సమావేశంలో పాల్గొన్న ఆర్డీవో ఏ.కుమార్, సీఐ గిరిబాబు, ఎస్సై. గంధం. మహాలక్ష్మణడు వివిధ శాఖల అధికారులు..
    user_చల్లా రవీంద్ర బాబు
    చల్లా రవీంద్ర బాబు
    Engineer ఎన్టీఆర్•
    3 hrs ago
  • కుమారప్రియంలో అంబేద్కర్ 136వ జయంతి వేడుకలు ఘనంగా – జైభీమ్ నినాదాలతో మార్మోగిన గ్రామం కాకినాడ: విశ్వజ్ఞాని, భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ గారి 136వ జయంతి వేడుకలు కాకినాడ సమీపంలోని కుమారప్రియం గ్రామంలో అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఆంధ్రా మాలమహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు సిద్ధాంతుల కొండబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జైభీమ్ రావ్ భారత్ పార్టీ అధినేత, మాజీ న్యాయమూర్తి, హైకోర్టు ప్రముఖ న్యాయవాది శ్రీ జడ శ్రావణ్ కుమార్ గారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అంబేద్కర్ గారి ఆలోచనలు సమాజంలో సమానత్వం, న్యాయం, హక్కుల సాధనకు మార్గదర్శకమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన చూపిన మార్గంలో నడుస్తూ వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు సిద్ధాంతుల కొండబాబు, బహుజన ఆర్మీ అధ్యక్షుడు ఏనుగుపల్లి కృష్ణ, దళిత బహుజన ఫ్రంట్ నేషనల్ కోఆర్డినేటర్ తోటి చంగల్ రావు, దళిత ప్రజా చైతన్యం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బుంగ సతీష్ కుమార్, ఆంధ్రా మాల మహానాడు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు లింగం శివ ప్రసాద్, జై భీమ్రావు భారత్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరసా సురేష్, కాకినాడ జిల్లా అధ్యక్షులు తంతటి కిరణ్ కుమార్, IFTU రాష్ట్ర ఉపాధ్యక్షులు రాగుల రఘువులు, సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకుడు గుబ్బల ఆదినారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలు అంబేద్కర్ గారి సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. గ్రామస్థులు, యువత పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా గ్రామం మొత్తం జైభీమ్ నినాదాలతో మార్మోగింది. అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం సమాజం ఏకమై ముందుకు సాగాలని నాయకులు ఆకాంక్షించారు.
    4
    కుమారప్రియంలో అంబేద్కర్ 136వ జయంతి వేడుకలు ఘనంగా – జైభీమ్ నినాదాలతో మార్మోగిన గ్రామం
కాకినాడ:
విశ్వజ్ఞాని, భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ గారి 136వ జయంతి వేడుకలు కాకినాడ సమీపంలోని కుమారప్రియం గ్రామంలో అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఆంధ్రా మాలమహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు సిద్ధాంతుల కొండబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జైభీమ్ రావ్ భారత్ పార్టీ అధినేత, మాజీ న్యాయమూర్తి, హైకోర్టు ప్రముఖ న్యాయవాది శ్రీ జడ శ్రావణ్ కుమార్ గారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అంబేద్కర్ గారి ఆలోచనలు సమాజంలో సమానత్వం, న్యాయం, హక్కుల సాధనకు మార్గదర్శకమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన చూపిన మార్గంలో నడుస్తూ వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు సిద్ధాంతుల కొండబాబు, బహుజన ఆర్మీ అధ్యక్షుడు ఏనుగుపల్లి కృష్ణ, దళిత బహుజన ఫ్రంట్ నేషనల్ కోఆర్డినేటర్ తోటి చంగల్ రావు, దళిత ప్రజా చైతన్యం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బుంగ సతీష్ కుమార్, ఆంధ్రా మాల మహానాడు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు లింగం శివ ప్రసాద్, జై భీమ్రావు భారత్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరసా సురేష్, కాకినాడ జిల్లా అధ్యక్షులు తంతటి కిరణ్ కుమార్, IFTU రాష్ట్ర ఉపాధ్యక్షులు రాగుల రఘువులు, సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకుడు గుబ్బల ఆదినారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
నాయకులు, కార్యకర్తలు అంబేద్కర్ గారి సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. గ్రామస్థులు, యువత పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా గ్రామం మొత్తం జైభీమ్ నినాదాలతో మార్మోగింది. అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం సమాజం ఏకమై ముందుకు సాగాలని నాయకులు ఆకాంక్షించారు.
    user_Ashok
    Ashok
    Local News Reporter జగ్గంపేట, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.