గుర్తేడు మండలం పరిధిలో శనివారం భారీ వర్షం: జనజీవనానికి అంతరాయం పోలవరం జిల్లా గుర్తేడు మండలం పాతకోట గ్రామంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. సుమారు రెండు గంటల పాటు ఏకధాటిగా కురిసిన కుండపోత వర్షానికి గ్రామంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.రోడ్డు పై చెట్లు పడడంతో గోకవరం నుండి పాతకోట వచ్చే బస్సు కూడ వెనక్కి తిరిగి వెళ్ళింది.వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు. అకాల వర్షంతో వేరుశనగ రైతులు ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడినట్లు స్థానికులు తెలిపారు.అలాగే పాతకోట గ్రామంలో గొర్లే దేవిశ్రీ ప్రసాద్ ఇంట్లో భారీ వృక్షం పడడం వలన రేకులు ధ్వంసం అయ్యాయి. వాతావరణ శాఖ అధికారులు మరో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు.
గుర్తేడు మండలం పరిధిలో శనివారం భారీ వర్షం: జనజీవనానికి అంతరాయం పోలవరం జిల్లా గుర్తేడు మండలం పాతకోట గ్రామంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. సుమారు రెండు గంటల పాటు ఏకధాటిగా కురిసిన కుండపోత వర్షానికి గ్రామంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.రోడ్డు పై చెట్లు పడడంతో గోకవరం నుండి పాతకోట వచ్చే బస్సు కూడ వెనక్కి తిరిగి వెళ్ళింది.వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు. అకాల వర్షంతో వేరుశనగ రైతులు ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడినట్లు స్థానికులు తెలిపారు.అలాగే పాతకోట గ్రామంలో గొర్లే దేవిశ్రీ ప్రసాద్ ఇంట్లో భారీ వృక్షం పడడం వలన రేకులు ధ్వంసం అయ్యాయి. వాతావరణ శాఖ అధికారులు మరో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు.
- పోలవరం జిల్లా గుర్తేడు మండలం పాతకోట గ్రామంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. సుమారు రెండు గంటల పాటు ఏకధాటిగా కురిసిన కుండపోత వర్షానికి గ్రామంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.రోడ్డు పై చెట్లు పడడంతో గోకవరం నుండి పాతకోట వచ్చే బస్సు కూడ వెనక్కి తిరిగి వెళ్ళింది.వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు. అకాల వర్షంతో వేరుశనగ రైతులు ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడినట్లు స్థానికులు తెలిపారు.అలాగే పాతకోట గ్రామంలో గొర్లే దేవిశ్రీ ప్రసాద్ ఇంట్లో భారీ వృక్షం పడడం వలన రేకులు ధ్వంసం అయ్యాయి. వాతావరణ శాఖ అధికారులు మరో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు.1
- Post by Shyam1
- ప్రముఖ పర్యాటక ప్రాంతమైన చాపరాయి పరిసరాల్లో తురాయి వృక్షాలు ఎర్రటి పూలతో కనువిందు చేస్తున్నాయి. పచ్చని ప్రకృతి ఒడిలో, నీలాకాశం కింద కొమ్మ, కొమ్మనా విరబూసిన ఈ ఎర్రటి పూల సోయగం పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. చాపరాయి జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చే పర్యాటకులు ఈ అందమైన పూల చెట్ల వద్ద ఆగి ఛాయాచిత్రాలు దిగుతూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు.1
- Post by Maheshwaro2
- Post by Sode Prasad1
- రఘురామకృష్ణ జోక్యంపై ఆగ్రహం – మాల, మాదిగల గౌరవానికి భంగం కలిగిస్తే వదిలిపెట్టం: మంద కృష్ణ మాదిగ ఆకివీడు/భీమవరం: ఆకివీడు వ్యవహారంలో రఘురామకృష్ణ జోక్యం చేసుకుంటే ఊరుకోమని, మాల, మాదిగల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఏ చర్యలనైనా తీవ్రంగా ప్రతిఘటిస్తామని దళిత నాయకుడు మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. దళితుల గౌరవం, హక్కుల పరిరక్షణలో ఎటువంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. ఆకివీడు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలపై స్పందించిన ఆయన, మాల, మాదిగలపై ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టబోమని తీవ్రంగా వ్యాఖ్యానించారు. సమాజంలో దళితుల గౌరవాన్ని కాపాడేందుకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. దళిత సంఘాలు కూడా ఈ వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతూ, పరిస్థితులు ఉద్రిక్తంగా మారకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరాయి.1
- Choose comfort that flies above the rest — MGM Vests. #MGMVests #Cheepurupalli #PremiumVest #CottonComfort #EverydayComfort #MensInnerwear #AndhraBusiness #LocalStyle #ComfortFirst #QualityWear1
- కుమారప్రియంలో అంబేద్కర్ 136వ జయంతి వేడుకలు ఘనంగా – జైభీమ్ నినాదాలతో మార్మోగిన గ్రామం కాకినాడ: విశ్వజ్ఞాని, భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ గారి 136వ జయంతి వేడుకలు కాకినాడ సమీపంలోని కుమారప్రియం గ్రామంలో అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఆంధ్రా మాలమహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు సిద్ధాంతుల కొండబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జైభీమ్ రావ్ భారత్ పార్టీ అధినేత, మాజీ న్యాయమూర్తి, హైకోర్టు ప్రముఖ న్యాయవాది శ్రీ జడ శ్రావణ్ కుమార్ గారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అంబేద్కర్ గారి ఆలోచనలు సమాజంలో సమానత్వం, న్యాయం, హక్కుల సాధనకు మార్గదర్శకమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన చూపిన మార్గంలో నడుస్తూ వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు సిద్ధాంతుల కొండబాబు, బహుజన ఆర్మీ అధ్యక్షుడు ఏనుగుపల్లి కృష్ణ, దళిత బహుజన ఫ్రంట్ నేషనల్ కోఆర్డినేటర్ తోటి చంగల్ రావు, దళిత ప్రజా చైతన్యం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బుంగ సతీష్ కుమార్, ఆంధ్రా మాల మహానాడు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు లింగం శివ ప్రసాద్, జై భీమ్రావు భారత్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరసా సురేష్, కాకినాడ జిల్లా అధ్యక్షులు తంతటి కిరణ్ కుమార్, IFTU రాష్ట్ర ఉపాధ్యక్షులు రాగుల రఘువులు, సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకుడు గుబ్బల ఆదినారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలు అంబేద్కర్ గారి సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. గ్రామస్థులు, యువత పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా గ్రామం మొత్తం జైభీమ్ నినాదాలతో మార్మోగింది. అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం సమాజం ఏకమై ముందుకు సాగాలని నాయకులు ఆకాంక్షించారు.4