Shuru
Apke Nagar Ki App…
కర్ర గణపతి వద్ద ఘనంగా నవరాత్రి ఉత్సవాలు అన్నదానం చేసిన నిర్వాహకులు గణేష్ గణేష్ నవరాత్రుల్లో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని బైల్ బజార్ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో నెలకొల్పిన కర్ర వినాయకుని వద్ద సోమవారం 8వ పురస్కరించుకొని యజ్ఞ కార్యక్రమం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు, ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది, మధ్యాహ్న హారతి అనంతరం భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు చిలమంతుల రాజలింగం అధ్యక్షులు కొమ్మోజి నారాయణ ప్రధాన కార్యదర్శి కాసర్ల చంద్రశేఖర్ కోశాధికారి పాంచాల్ గంగా ప్రసాద్ ఆలయ పూజారి కర్రపారి శ్రామిక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు
Venu
కర్ర గణపతి వద్ద ఘనంగా నవరాత్రి ఉత్సవాలు అన్నదానం చేసిన నిర్వాహకులు గణేష్ గణేష్ నవరాత్రుల్లో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని బైల్ బజార్ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో నెలకొల్పిన కర్ర వినాయకుని వద్ద సోమవారం 8వ పురస్కరించుకొని యజ్ఞ కార్యక్రమం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు, ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది, మధ్యాహ్న హారతి అనంతరం భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు చిలమంతుల రాజలింగం అధ్యక్షులు కొమ్మోజి నారాయణ ప్రధాన కార్యదర్శి కాసర్ల చంద్రశేఖర్ కోశాధికారి పాంచాల్ గంగా ప్రసాద్ ఆలయ పూజారి కర్రపారి శ్రామిక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు
More news from Telangana and nearby areas
- కర్ర గణపతి వద్ద ఘనంగా నవరాత్రి ఉత్సవాలు అన్నదానం చేసిన నిర్వాహకులు గణేష్ గణేష్ నవరాత్రుల్లో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని బైల్ బజార్ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో నెలకొల్పిన కర్ర వినాయకుని వద్ద సోమవారం 8వ పురస్కరించుకొని యజ్ఞ కార్యక్రమం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు, ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది, మధ్యాహ్న హారతి అనంతరం భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు చిలమంతుల రాజలింగం అధ్యక్షులు కొమ్మోజి నారాయణ ప్రధాన కార్యదర్శి కాసర్ల చంద్రశేఖర్ కోశాధికారి పాంచాల్ గంగా ప్రసాద్ ఆలయ పూజారి కర్రపారి శ్రామిక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు1
- బాసర IIIIT విద్యార్థుల్లో ఆందోళన..సప్లమెంటరీ పరీక్ష రాసే విద్యార్థుల పై IIIT కళాశాల అధికారుల ఆంక్షలు.. మండిపడుతున్న TSAS... బాసర ఐఐఐటి లో రెమిడియల్ పరీక్షలు రాసే విద్యార్థులపై కళాశాల అధికారులు ఆంక్షలు విధించారు. గతం లో ఎన్నడూ లేని విధంగా కొత్తగా రెమిడియల్ పరీక్షలు రాసే విద్యార్థులు పరీక్ష రోజే హాజరు కావాలని, ఒక్క రోజు ముందు రావద్దని, పరీక్ష కాగానే హాస్టల్ రూమ్ ఖాళీ చేయాలని పలు సూచనలతో కూడిన ఆంక్షలు జారీ చేశారు. దీంతో TSAS, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తపరచాయి. వెంటనే అధికారుల ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసారు...1
- కోరుట్లలో వీధి కుక్కల బెడద సెంట్రింగ్ కార్మికుడిపై కుక్కల గుంపు దాడి జగిత్యాల జిల్లా కోరుట్ల: పట్టణంలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. సోమవారం రామ్‌నగర్‌లో సెంట్రింగ్ పని చేస్తున్న ఆరిఫ్ అనే కార్మికుడిపై కుక్కల గుంపు దాడి చేయడంతో రెండు చేతులకు గాయాలయ్యాయి. స్థానికులు కుక్కలను తరిమి ఆయనను కాపాడారు. కల్లూరు రోడ్డు, ఝాన్సీ రోడ్డు, రహీంపూర్, బాబ్రీ చౌక్, హైదర్‌గూడ, హాజీపూర్, మోమిన్‌పూర్, గంగంపేట్, పాత బస్‌స్టాండ్ తదితర ప్రాంతాల్లో కుక్కలు గుంపులుగా సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిన్నారులు, వృద్ధులు బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారని స్థానికులు తెలిపారు. గతంలో కూడా పలువురిపై కుక్కలు దాడి చేసిన ఘటనలు చోటుచేసుకున్నాయని, ఫిర్యాదులు చేసినప్పటికీ మున్సిపల్ అధికారులు తాత్కాలిక చర్యలకే పరిమితమవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజులకే సమస్య మళ్లీ తలెత్తుతోందని పేర్కొంటూ, వీధి కుక్కల బెడదకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టి ప్రజలకు భద్రత కల్పించాలని కోరుట్ల ప్రజలు కోరుతున్నారు.1
- శ్రీ వినాయక ఆదర్శ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అన్నప్రసాద వితరణ శ్రీ వినాయక ఆదర్శ సంఘం ఆధ్వర్యంలో నాలుగో వార్డ్ మోత చెరువు కట్ట కింద ఏర్పాటు చేసిన శ్రీ వినాయక మండపం వద్ద ఈరోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించారు. మండప నిర్వాహకులు, సంఘ సభ్యులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసి అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. స్థానిక ప్రజలు, భక్తుల కోలాహలంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభతో విలసిల్లింది.1
- మంచిర్యాల:పెద్దపల్లి అభివృద్ధికి ఎంపీ వంశీకృష్ణ ప్రత్యేక చొరవ తొమ్మిది RUBల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రైల్వే అధికారులకు విజ్ఞప్తి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజల భద్రత, మెరుగైన రవాణా సౌకర్యాలు, మౌలిక వసతుల అభివృద్ధికి ఎంపీ వంశీకృష్ణ ప్రత్యేక దృష్టి సారించారు. నియోజకవర్గ పరిధిలోని తొమ్మిది RUBల (రోడ్ అండర్ బ్రిడ్జిలు) నిర్మాణ పనులపై రైల్వే అధికారులతో ప్రత్యేకంగా చర్చించారు.ముఖ్యంగా LC-30, LC-35, LC-37 ప్రాంతాల్లో సహజ నీటి ప్రవాహానికి డ్రైనేజీ సౌకర్యం లేక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే మంజూరైన RUBలు, అప్రోచ్ రోడ్ల పనులను వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.దీనిపై రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్పందిస్తూ తక్షణ చర్యలు చేపట్టి, వచ్చే ఏడాదిలోగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.1
- టైగర్ జోన్ తో లాభం లేదు, దాన్ని వెంటనే ఎత్తివేయాలి...... టైగర్ జోన్ వల్ల ప్రజలకు లాభం లేదని దాన్ని వెంటనే ఎత్తివేయాలని జన్నారం మండలంలోని కవ్వాల్ గ్రామానికి పోడేటి సత్య గౌడ్ డిమాండ్ చేశారు. టైగర్ జోన్ ఎత్తివేయాలని కోరుతూ జన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహ వద్ద నెల రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న భూమాచారికి ఆయన మద్దతు తెలియజేశారు. కవ్వాల్ ఏజెన్సీ పరిధిలో ఉండడంతో ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ఇసుక రాక నిర్మాణ పనులు కొనసాగడం లేదని వాపోయారు.1
- మంచిర్యాల: సింగపూర్ గ్రామం ఇప్పలవాడకు చెందిన ఓపెన్‌కాస్ట్ బాధితురాలి గోడు.. విన్న కలెక్టర్ మంచిర్యాల: సింగపూర్ గ్రామం ఇప్పలవాడకు చెందిన ఓపెన్‌కాస్ట్ నిర్వాసితురాలు వేల్పుల శారద సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ కుమార్ దీపక్‌కు వినతిపత్రం అందజేశారు. 2013లో ఇల్లు, స్థలం కోల్పోయినా పూర్తిస్థాయి పరిహారం, నివాస ప్లాటు అందలేదని వాపోయారు. సమస్య విన్న కలెక్టర్ ఇన్నేళ్లైనా పరిహారం అందకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రెవెన్యూ, సింగరేణి రికార్డులు పరిశీలించి తక్షణమే విచారణ జరిపి అర్హత మేరకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.1
- జన్నారంలో భారీ నుండి అతి భారీ వర్షం నమోదు, చల్లబడిన వాతావరణం జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో అరగంట పాటు అతి భారీ వర్షం నమోదయింది. సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో జన్నారం మండల కేంద్రంతో పాటు పరీక్షల గ్రామాలలో ఆకాశం పూర్తిగా మేఘావృతమైంది. అనంతరం అరగంట పాటు భారీ నుండి అతి భారీ వర్షం పడింది. మండలంలో మూడు రోజులుగా తేలికపాటి నుండి భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో వాతావరణం చల్లబడింది. అయితే వినాయక మండపాలలో కార్యక్రమాల నిర్వహణకు అన్నదానానికి ఆటంకం ఏర్పడింది.1