Shuru
Apke Nagar Ki App…
🕉️ ఓం నమః శివాయ హర హర మహాదేవ్ 🔱
Shyam sunder Yadav Pulapally
🕉️ ఓం నమః శివాయ హర హర మహాదేవ్ 🔱
More news from Telangana and nearby areas
- ఈనెల 4వ తేదీన హైదరాబాద్లోని ఎల్ బి ఇండోర్ స్టేడియంలో విక్టరీ షోటోఖాన్ ఆర్గనైజేషన్ డు ఇండియా వారి ఆధ్వర్యంలో 30వ ఓపెన్ టు ఆల్ స్టైల్ ఛాంపియన్షిప్ నిర్వహించడం జరిగింది. ఈ పోటీలకు నల్గొండ పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్ లోని షావోలిన్ షోటోఖాన్ స్పోర్ట్స్ కరాటే ఇండియాకు చెందిన విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలు నిర్వాహకులు ఎన్ బాబురావు మరియు విక్టరీ షోటోకాన్ ఫౌండర్ ఇంటర్నేషనల్ రెఫ్రి రంగు మల్లికార్జున్ గౌడ్ చేతుల మీదుగా జాతీయస్థాయిలో గెలుపొందిన విద్యార్థులకు మెడల్స్ మరియు సర్టిఫికెట్స్ అందజేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులను అభినందించారు. జాతీయస్థాయిలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థుల పేర్లు : బాలికల సి గ్రూప్ కటాస్ విభాగంలో 1. రెముడాల హాసిని గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నారు. బాలుర ఈ గ్రూప్ కటాస్ విభాగంలో 2. సిలువేరు యోగేందర్ సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నారు. శ్రీ చైతన్య స్కూల్ డైరెక్టర్స్ చిలువేరు యాదయ్య, యాస శ్రీనివాస్ రెడ్డి, గడ్డం త్రిమూర్తి, కుక్క పల్లి నాగేశ్వరరావు జాతీయస్థాయిలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులను అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఏకాగ్రతతో సాధన చేస్తూ మునుముందు మరిన్ని విజయాలు సాధిస్తూ కీర్తిదాయకంగా ఎదగాలని కోరారు. సిలువేరు నరసింహ, సిలివేరు అనిత, రెముడాల శ్రీనివాస్, రెముడాల శైలజ మరియు శ్రీ చైతన్య స్కూల్ స్టాఫ్ జాతీయస్థాయిలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులను అభినందించారు. షావలిన్ షోటోఖాన్ స్పోర్ట్స్ కరాటే ఇండియా ఫౌండర్ & డైరెక్టర్ బ్లాక్ బెల్ట్ 7th ఇండియా చీఫ్ ఇన్స్ట్రక్టర్ ఇండియా సీనియర్ ఎగ్జామినర్ నాంపల్లి కనకారావు మాట్లాడుతూ ఏకాగ్రతతో సాధన చేస్తూ, శక్తి సామర్థ్యాలను మెరుగుపరచుకొని, మరెన్నో విజయాలు సాధించాలని అన్నారు. అలాగే జాతీయస్థాయిలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులను అభినందించారు.1
- ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరావు, సీతక్క ఆదివారం పర్యటించి మహా జాతర ఏర్పాట్లను పరిశీలించారు. రోడ్ల నిర్మాణం, క్యూ లైన్లు, భక్తుల కోసం తాత్కాలిక వసతుల ఏర్పాట్లను తనిఖీ చేసి, లక్షలాది భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారం మహా జాతర జరగనుంది.1
- సెల్యూట్ చేయడం సర్వీస్ నిబంధనలకు విరుద్ధం వరంగల్ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళికి మిల్స్ కాలనీ సీఐ రమేష్ యూనిఫాంలో సెల్యూట్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అధికారిక పదవిలో లేని వ్యక్తికి సెల్యూట్ చేయడం సర్వీస్ నిబంధనలకు విరుద్ధమని నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. సెల్యూట్ అనేది కేవలం అధికారిక హోదా ఉన్న రాజ్యాంగ పదవులకు మాత్రమే పరిమితమై ఉండాలని, మాజీ హోదా ఆధారంగా ఇవ్వడం నిబంధనల ఉల్లంఘనేనని స్పష్టం చేస్తున్నారు.1
- మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురం- కంటాయపాలెం గ్రామాల మధ్య గత ప్రభుత్వంలో బీటీ రోడ్డు వేశారు. కానీ బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడంతో అవసరాల నిమిత్తం వెళ్లే రైతులు, కూలీలు, వాహనదారులు వాగు దాటే క్రమంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు తక్షణమే స్పందించి వాగుపై బ్రిడ్జిని నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.1
- రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ల ప్రత్యేక కృషి చొరవతో కొండగట్టు గిరిప్రదక్షిణ అభివృద్ధి కార్యక్రమానికి పరిష్కారం దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం రోజున జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గిరిప్రదక్షిణ రహదారిని ప్రత్యక్షంగా పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొండగట్టు ఆలయం చుట్టూ భక్తులు గిరి ప్రదర్శన చేయడానికి కావలసిన ఏర్పాట్ల గురించి రెవెన్యూ ఫారెస్ట్ ఆర్ అండ్ బి పంచాయతీరాజ్ శాఖ సంబంధిత అధికారులతో పరిశీలించడం జరిగిందని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ముఖ్యంగా రోడ్డు విస్తారంగా ఉండాలని మార్గమధ్యలో భక్తులకు త్రాగునీరు,మూత్రశాల లు,విశ్రాంత కేంద్రాలు తదితర అంశాల గురించి సంబంధిత అధికారులకు సూచించడం జరిగింది అని తెలిపారు. అలాగే గిరి ప్రదక్షణ కొరకు అంచనా ప్రణాలికలు రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అరుణాచలం,సింహాచలం తరహాలో గిరిప్రదక్షిణ ఏర్పాట్లకు ప్రణాళికలు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆదిరెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి రాజా గౌడ్, అటవీ శాఖ అధికారి రవిప్రసాద్, ఆర్డిఓ మధుసూదన్,ఈవో శ్రీకాంత్ రావు,మల్యాల, కొడిమ్యాల మండల అధికారులు పాల్గొన్నారు.1
- ముందుకు సాగని వంతెనల పనులు జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో ఏళ్లు గడుస్తున్నా వంతెన పనులు ముందుకు సాగడం లేదు. మండలంలోని రోటిగూడా గ్రామ శివారులో ఉన్న వాగుపై 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వంతెన నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. ఆ వంతెన నిర్మాణం 20 సంవత్సరాలుగా పెండింగ్ లోనే ఉంది. అదే గ్రామ శివారులోని మరో వాగుపై లో లెవెల్ వంతెన ఉంది. ఆ వాగుపై హై లెవెల్ వంతెన మంజూరైన ఇంతవరకు నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. ఆయా వంతెనల పనులను వెంటనే ప్రారంభించి వేసవిలోపు పూర్తయ్యలా చూడాలని స్థానిక ప్రజలు కోరారు.1
- రోడ్డు భద్రత నియమాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య1
- సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాసవిభవన్లో వాసవి మాత డైరీలను వాసవి క్లబ్ సభ్యులు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి మాత కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు.1
- హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచెర్ల శివారులో మహారాష్ట్రకు చెందిన ముఠా, పూజలు చేస్తే డబ్బులు రెట్టింపు అవుతాయని నమ్మించి తండ్రి–కొడుకులను మోసం చేసి 50 లక్షల రూపాయలతో పరారైంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా ధర్మసాగర్ సీఐ శ్రీధర్ రావు మాట్లాడుతూ, ప్రజలు మూఢనమ్మకాలు మరియు మోసపూరిత మాటలు నమ్మి మోసపోవద్దని, సైబర్ మోసాలు మరియు అనుమానితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100కు డయల్ చేయాలని తెలిపారు.2