logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

తెలంగాణ గల్ఫ్ కార్మికులు క్షేమంగా ఉన్నారు: అధ్యక్షులు భూమయ్య గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్న తెలంగాణ కార్మికులు క్షేమంగా ఉన్నారని గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి అధ్యక్షులు కల్లెడ భూమయ్య తెలిపారు. అమెరికా-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో దుబాయ్ నుండి ఆయన మాట్లాడారు. దుబాయ్ లో యుద్ధ శబ్దాలు వినబడుతున్నాయని, అమెరికా సంబంధిత ఆస్తులపై ఇరాన్ దాడులు చేస్తుందన్నారు. అక్కడ పనిచేస్తున్న తెలంగాణ భారత కార్మికుల క్షేమంగా ఉన్నారని, హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దేశంతో పాటు తెలంగాణలో ఉన్న గల్ఫ్ కార్మికుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందవద్దని ఆయన కోరారు. దుబాయ్ అధికారులు కూడా తమకు సహకరించి హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేశారని తెలిపారు.

1 day ago
user_Gourinatha p.g
Gourinatha p.g
జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
1 day ago

తెలంగాణ గల్ఫ్ కార్మికులు క్షేమంగా ఉన్నారు: అధ్యక్షులు భూమయ్య గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్న తెలంగాణ కార్మికులు క్షేమంగా ఉన్నారని గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి అధ్యక్షులు కల్లెడ భూమయ్య తెలిపారు. అమెరికా-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో దుబాయ్ నుండి ఆయన మాట్లాడారు. దుబాయ్ లో యుద్ధ శబ్దాలు వినబడుతున్నాయని, అమెరికా సంబంధిత ఆస్తులపై ఇరాన్ దాడులు చేస్తుందన్నారు. అక్కడ పనిచేస్తున్న తెలంగాణ భారత కార్మికుల క్షేమంగా ఉన్నారని, హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దేశంతో పాటు తెలంగాణలో ఉన్న గల్ఫ్ కార్మికుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందవద్దని ఆయన కోరారు. దుబాయ్ అధికారులు కూడా తమకు సహకరించి హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేశారని తెలిపారు.

More news from Kumuram Bheem Asifabad and nearby areas
  • *విశాఖపట్నం రుషికొండ దరి బీచ్ రోడ్డులో ట్రావెల్స్ బస్సు దగ్ధం* రుషికొండ సమీపంలోని బీచ్ రోడ్డులో వెళ్తున్న ఓ ట్రావెల్స్ బస్సు అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటల్లో చిక్కుకుంది. క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తం వ్యాపించడంతో అక్కడ భయాందోళన వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రయాణికులు సురక్షితంగా బయటపడినట్లు ప్రాథమిక సమాచారం. ఆస్తి నష్టం ఎంత? బస్సులో ఎంతమంది ఉన్నారు? షార్ట్ సర్క్యూట్‌నే అసలు కారణమా? అనే అంశాలపై అధికారులు విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ....
    1
    *విశాఖపట్నం రుషికొండ దరి బీచ్ రోడ్డులో ట్రావెల్స్ బస్సు దగ్ధం*
రుషికొండ సమీపంలోని బీచ్ రోడ్డులో వెళ్తున్న ఓ ట్రావెల్స్ బస్సు అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటల్లో చిక్కుకుంది. క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తం వ్యాపించడంతో అక్కడ భయాందోళన వాతావరణం నెలకొంది.
సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రయాణికులు సురక్షితంగా బయటపడినట్లు ప్రాథమిక సమాచారం.
ఆస్తి నష్టం ఎంత? బస్సులో ఎంతమంది ఉన్నారు? షార్ట్ సర్క్యూట్‌నే అసలు కారణమా? అనే అంశాలపై అధికారులు విచారణ చేపడుతున్నారు.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
....
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    5 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో హోలీ సంబరాలు ఉత్సాహంగా కొనసాగాయి. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన హోలీ వేడుకల్లో జిల్లా ఎస్పీ మహేష్ గీతే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పోలీస్ సిబ్బందితో కలిసి రంగులు చల్లుకుంటూ, డాన్స్ చేస్తూ ఎస్పీ మహేష్ గీతే సందడి చేశారు. అధికారులతో కలిసి స్టెప్పులు వేస్తూ హోలీ ఆనందాన్ని పంచుకున్నారు. క్రమశిక్షణకు ప్రతీకగా నిలిచే పోలీస్ శాఖలోనూ ఇలాంటి వేడుకలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తం పోలీస్ కార్యాలయం రంగుల మయంగా మారి హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో హోలీ సంబరాలు ఉత్సాహంగా కొనసాగాయి. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన హోలీ వేడుకల్లో జిల్లా ఎస్పీ మహేష్ గీతే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
పోలీస్ సిబ్బందితో కలిసి రంగులు చల్లుకుంటూ, డాన్స్ చేస్తూ ఎస్పీ మహేష్ గీతే సందడి చేశారు. అధికారులతో కలిసి స్టెప్పులు వేస్తూ హోలీ ఆనందాన్ని పంచుకున్నారు. క్రమశిక్షణకు ప్రతీకగా నిలిచే పోలీస్ శాఖలోనూ ఇలాంటి వేడుకలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని ఎస్పీ తెలిపారు.
ఈ సందర్భంగా పోలీసులు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తం పోలీస్ కార్యాలయం రంగుల మయంగా మారి హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    44 min ago
  • ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని ఫకీర్ నాయక్ తండలో Holi సందర్భంగా కామదహనం వేడుకలు బ్రహ్మాండంగా నిర్వహించారు. సాయంత్రం గ్రామస్తులు ఒకేచోట చేరి సంప్రదాయ పద్ధతిలో కట్టెలతో చుట్టం ఏర్పాటు చేశారు. గ్రామ పెద్దల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి అగ్ని ప్రతిష్ఠ చేశారు. అనంతరం కామదహనం నిర్వహించగా, గ్రామస్తులు అగ్నికి ప్రదక్షిణలు చేస్తూ కుటుంబ సుఖశాంతులు, పంటలాభాలు కోరుకున్నారు. యువత డోలు వాయిద్యాలు, డీజే సౌండ్స్‌తో నృత్యాలు చేస్తూ సందడి చేశారు. మహిళలు ప్రత్యేక వంటకాలు తయారు చేసి పరస్పరం పంచుకున్నారు. శాంతిభద్రతల నడుమ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వేడుకలు విజయవంతంగా ముగిశాయి. గ్రామంలో హోలీ సంబరాలు ఆనందోత్సాహాల మధ్య కొనసాగుతున్నాయి.
    1
    ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని ఫకీర్ నాయక్ తండలో Holi సందర్భంగా కామదహనం వేడుకలు బ్రహ్మాండంగా నిర్వహించారు. సాయంత్రం గ్రామస్తులు ఒకేచోట చేరి సంప్రదాయ పద్ధతిలో కట్టెలతో చుట్టం ఏర్పాటు చేశారు.
గ్రామ పెద్దల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి అగ్ని ప్రతిష్ఠ చేశారు. అనంతరం కామదహనం నిర్వహించగా, గ్రామస్తులు అగ్నికి ప్రదక్షిణలు చేస్తూ కుటుంబ సుఖశాంతులు, పంటలాభాలు కోరుకున్నారు.
యువత డోలు వాయిద్యాలు, డీజే సౌండ్స్‌తో నృత్యాలు చేస్తూ సందడి చేశారు. మహిళలు ప్రత్యేక వంటకాలు తయారు చేసి పరస్పరం పంచుకున్నారు.
శాంతిభద్రతల నడుమ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వేడుకలు విజయవంతంగా ముగిశాయి. గ్రామంలో హోలీ సంబరాలు ఆనందోత్సాహాల మధ్య కొనసాగుతున్నాయి.
    user_Upendra
    Upendra
    Police Officer ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    19 hrs ago
  • శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం నెహ్రు నగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళాచక్రపాణి విశిష్ట అతిధులుగా మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్ సభ్యులు దూడం రజిని శ్రీనివాస్, ఎర్ర వెంకటరాజం, మెరుగు మంజుల శ్రీనివాస్, బొద్దుల శ్రీనివాస్, సిరిసిల్ల పద్మశాలి సంఘం అధ్యక్షులు దూరం శంకర్ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ శ్రీ సీతారామాంజనేయ దేవస్థానం వారు నూతనంగా ఎన్నికైన సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ గా మమ్మల్ని మరియు కౌన్సిలర్లను, పద్మశాలి సంఘం అధ్యక్షులు వారిని దేవస్థానం ఆధ్వర్యంలో సన్మానిస్తున్నందుకు ముందుగా వారందరికీ మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్నారు.ఆపద మొక్కులవాడిగా ప్రజల యొక్క ఆరాధ్య దైవంగా కొలువబడుతున్న ఈ సీతారామాంజనేయుల సాక్షిగా మమ్మల్ని సన్మానించడం తో మా పై మరింత బాధ్యత పెరిగింది అన్నారు.ఈ సన్మాన కార్యక్రమంలో బిఆర్ఎస్, బిజెపి కాంగ్రెస్ పార్టీల తరఫున పోటీ చేసి గెలుపొందిన ప్రజా ప్రతినిధులు అందరూ ఉన్నారు కాబట్టి పార్టీలకతీతంగా ఆ సీతారామ భక్తాంజనేయ స్వామి వారి ఆశీస్సులతో సిరిసిల్లాను అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకు వెళ్లేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. అంతే కాకుండా గత మూడు సంవత్సరాల క్రితం అప్పటి మంత్రివర్యులు కేటీఆర్ సహకారంతో ఈ అభయాంజనేయ స్వామి దేవాలయంలో కమ్యూనిటీ హాల్ పై అంతస్తు నిర్మించడం జరిగింది.కమ్యూనిటీ హాల్ అభివృద్ధికి పురపాలక సంఘం నుండి ఇంక కూడ సాధ్యమైనంత వరకు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. అదేవిధంగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి దేవాలయం అధ్యక్ష పాలకవర్గ సభ్యులకు మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
    1
    శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం నెహ్రు నగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళాచక్రపాణి విశిష్ట అతిధులుగా మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్ సభ్యులు దూడం రజిని శ్రీనివాస్, ఎర్ర వెంకటరాజం, మెరుగు మంజుల శ్రీనివాస్, బొద్దుల  శ్రీనివాస్, సిరిసిల్ల పద్మశాలి సంఘం అధ్యక్షులు దూరం శంకర్ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ శ్రీ సీతారామాంజనేయ దేవస్థానం వారు నూతనంగా ఎన్నికైన సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ గా మమ్మల్ని మరియు కౌన్సిలర్లను, పద్మశాలి సంఘం అధ్యక్షులు వారిని దేవస్థానం ఆధ్వర్యంలో సన్మానిస్తున్నందుకు ముందుగా వారందరికీ  మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్నారు.ఆపద మొక్కులవాడిగా ప్రజల యొక్క ఆరాధ్య దైవంగా కొలువబడుతున్న ఈ సీతారామాంజనేయుల సాక్షిగా మమ్మల్ని సన్మానించడం తో మా  పై మరింత బాధ్యత పెరిగింది అన్నారు.ఈ సన్మాన కార్యక్రమంలో బిఆర్ఎస్, బిజెపి కాంగ్రెస్ పార్టీల తరఫున పోటీ చేసి గెలుపొందిన ప్రజా ప్రతినిధులు అందరూ ఉన్నారు కాబట్టి పార్టీలకతీతంగా ఆ సీతారామ భక్తాంజనేయ స్వామి వారి ఆశీస్సులతో సిరిసిల్లాను అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకు వెళ్లేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు.
అంతే కాకుండా గత మూడు సంవత్సరాల క్రితం అప్పటి మంత్రివర్యులు కేటీఆర్ సహకారంతో ఈ అభయాంజనేయ స్వామి దేవాలయంలో కమ్యూనిటీ హాల్ పై అంతస్తు  నిర్మించడం జరిగింది.కమ్యూనిటీ హాల్ అభివృద్ధికి పురపాలక సంఘం నుండి ఇంక కూడ సాధ్యమైనంత వరకు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. అదేవిధంగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి దేవాలయం అధ్యక్ష పాలకవర్గ సభ్యులకు మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    21 hrs ago
  • హోలీ పండుగ పూట జగిత్యాల పోచమ్మవాడ లో విషాదం అలుముకుంది. బీటెక్ విద్యార్థిని ప్రణవి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బీటెక్ విద్యార్థిని ప్రణవి ఆత్మహత్య కలకలం సృష్టిస్తుంది. తల్లిదండ్రులు ఉదయం గోదావరి పుణ్యస్నానాలకు వెళ్ళి వచ్చే సరికి ప్రణవి ఇంట్లో ఉరి వేసుకుంది. కొన ఊపిరితో ఉన్న కూతురును స్థానికుల సహాయంతో పేరెంట్స్ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. సమాచారం ఇచ్చిన సకాలంలో 108 రాకపోవడంతో ప్రైవేటు వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి సిబ్బంది స్పందించకపోవడంతో చేతులపైనే పేషెంట్ ను డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. డాక్టర్ పరీక్షించి ప్రాణాలు కోల్పోయిందని తెలుపడంతో పేరెంట్స్ బోరున విలపించారు. ఆసుపత్రి సిబ్బంది సకాలంలో స్పందించలేదని, కనీసం స్ట్రెచ్చర్ కూడా తీసుకొచ్చి పేషంటును ఆసుపత్రిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదని మృతురాలి కుటుంబ సభ్యులు ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రణవి ఆత్మహత్యకు స్పష్టమైన కారణాలు తెలియక పోయినప్పటికీ పెళ్ళి సంబంధాలు చూసినట్లు పేరెంట్స్ తెలిపారు. ఎలాంటి గొడవలు లేవని పెళ్లి ఇష్టం లేకనే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భావిస్తున్నారు.
    1
    హోలీ పండుగ పూట జగిత్యాల పోచమ్మవాడ లో విషాదం అలుముకుంది. బీటెక్ విద్యార్థిని ప్రణవి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బీటెక్ విద్యార్థిని ప్రణవి ఆత్మహత్య కలకలం సృష్టిస్తుంది. తల్లిదండ్రులు ఉదయం గోదావరి పుణ్యస్నానాలకు వెళ్ళి వచ్చే సరికి ప్రణవి ఇంట్లో ఉరి వేసుకుంది. కొన ఊపిరితో ఉన్న కూతురును స్థానికుల సహాయంతో పేరెంట్స్ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. సమాచారం ఇచ్చిన సకాలంలో 108 రాకపోవడంతో ప్రైవేటు వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి సిబ్బంది స్పందించకపోవడంతో చేతులపైనే పేషెంట్ ను డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. డాక్టర్ పరీక్షించి ప్రాణాలు కోల్పోయిందని తెలుపడంతో పేరెంట్స్ బోరున విలపించారు. ఆసుపత్రి సిబ్బంది సకాలంలో స్పందించలేదని, కనీసం స్ట్రెచ్చర్ కూడా తీసుకొచ్చి పేషంటును ఆసుపత్రిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదని మృతురాలి కుటుంబ సభ్యులు ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రణవి ఆత్మహత్యకు స్పష్టమైన కారణాలు తెలియక పోయినప్పటికీ పెళ్ళి సంబంధాలు చూసినట్లు పేరెంట్స్ తెలిపారు. ఎలాంటి గొడవలు లేవని పెళ్లి ఇష్టం లేకనే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భావిస్తున్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • నిజామాబాద్ జిల్లా కేంద్రంలో హోలీ పండుగను పురస్కరించుకుని కామ దహన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. నగరంలోని ప్రధాన కోడల వద్ద అర్చకులు ప్రత్యేక పూజలు చేసి కామ దహనం జరిపారు. కామ దహన వేడుకల్లో చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొని, పూజలు నిర్వహించారు.
    1
    నిజామాబాద్ జిల్లా కేంద్రంలో హోలీ పండుగను పురస్కరించుకుని కామ దహన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. నగరంలోని ప్రధాన కోడల వద్ద అర్చకులు ప్రత్యేక పూజలు చేసి కామ దహనం జరిపారు. కామ దహన వేడుకల్లో చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొని, పూజలు నిర్వహించారు.
    user_Sri
    Sri
    Carpenter నిజామాబాద్ నార్త్, నిజామాబాద్, తెలంగాణ•
    17 hrs ago
  • కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గం పరిధిలో పెంచికల్పేట్, చింతలమానెపల్లి, బెజ్జూర్, కౌటాల మండలాల్లో కాముడు హోలీ పండుగను ఘనంగా నిర్వహించారు. హోలీకి ఒక రోజు ముందే కోలాటాలు, నృత్యాలతో సంబరాలు జరిపి, సాయంత్రం చేనులో సంప్రదాయంగా కాముడు దహనం చేశారు. మరుసటి రోజు బూడిదను ఇంటి ముందు చల్లడం ఆనవాయితీ. సహజ రంగులతో రెండు రోజుల పాటు పండుగను ఆనందంగా జరుపుకున్నారు
    1
    కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గం పరిధిలో పెంచికల్పేట్, చింతలమానెపల్లి, బెజ్జూర్, కౌటాల మండలాల్లో కాముడు హోలీ పండుగను ఘనంగా నిర్వహించారు.
హోలీకి ఒక రోజు ముందే కోలాటాలు, నృత్యాలతో సంబరాలు జరిపి, సాయంత్రం చేనులో సంప్రదాయంగా కాముడు దహనం చేశారు. మరుసటి రోజు బూడిదను ఇంటి ముందు చల్లడం ఆనవాయితీ. సహజ రంగులతో రెండు రోజుల పాటు పండుగను ఆనందంగా జరుపుకున్నారు
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    2 hrs ago
  • ట్రంప్, నెతన్యాహును చంపేస్తా.. ఇరాన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వండి: మహిళ భారత్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి మద్దతుగా ఆందోళన చేస్తున్న షియా ముస్లింల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఢిల్లీలో నిరసన చేస్తున్న ఓ మహిళ తనను ఇరాన్కు పంపించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. 'మోదీజీ నన్ను ఇరాన్ పంపేందుకు పర్మిషన్ ఇవ్వండి. నేను ఇరాన్ తరఫున పోరాటం చేస్తా. భయపడేది లేదు. తప్పు జరిగితే చూస్తూ ఊరుకోలేను. ట్రంప్, నెతన్యాహును చంపేస్తా' అని స్పష్టం చేశారు••£
    1
    ట్రంప్, నెతన్యాహును చంపేస్తా.. ఇరాన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వండి: మహిళ
భారత్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి మద్దతుగా ఆందోళన చేస్తున్న షియా ముస్లింల వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఢిల్లీలో నిరసన చేస్తున్న ఓ మహిళ తనను ఇరాన్కు పంపించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.
'మోదీజీ నన్ను ఇరాన్ పంపేందుకు పర్మిషన్ ఇవ్వండి. నేను ఇరాన్ తరఫున పోరాటం చేస్తా.
భయపడేది లేదు. తప్పు జరిగితే చూస్తూ ఊరుకోలేను. ట్రంప్, నెతన్యాహును చంపేస్తా' అని స్పష్టం చేశారు••£
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    21 hrs ago
  • సిరిసిల్ల పట్టణంలో స్థానిక 26వ వార్డు కౌన్సిలర్ నెల్లుట్ల నరేష్ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు.ఇఫ్తార్ విందు కార్యక్రమం లో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చీటీ నరసింగ రావు, జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య , సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి , మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ , కౌన్సిలర్ లు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
    1
    సిరిసిల్ల పట్టణంలో స్థానిక 26వ వార్డు కౌన్సిలర్ నెల్లుట్ల నరేష్  ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు.ఇఫ్తార్ విందు కార్యక్రమం లో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చీటీ నరసింగ రావు, జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య , సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి  , మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ , కౌన్సిలర్ లు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.