డంపింగ్ యార్డ్ సెగ: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉద్రిక్తత.. దీక్షలపై నిఘా! వరంగల్ (GWMC), మార్చి 11: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డంపింగ్ యార్డ్ తరలింపు అంశం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. గత కొద్ది రోజులుగా శాంతియుత నిరసన జరుగుతుండగా, నిన్న (మార్చి 10) మధ్యాహ్నం ఒక యువకుడు ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది. ఈ ఘటనతో అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం నిరసనకారులపై ఉక్కుపాదం మోపే దిశగా అడుగులు వేస్తోంది. నివేదికలోని కీలక అంశాలు: నిఘా నీడలో నిరసనకారులు: దీక్షలో పాల్గొన్న సుమారు 60 మంది వివరాలను సేకరించిన అధికారులు, వారి కాల్ డేటాను నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రజలను, ముఖ్యంగా యువతను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేసిన నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు నివేదిక సిద్ధమైనట్లు సమాచారం. క్షేత్రస్థాయి పరిశీలన: హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి, ఔటర్ రింగ్ రోడ్డు, వాగన్ కోచ్ ఫ్యాక్టరీ వంటి కీలక ప్రాంతాలకు సమీపంలో ఈ ఆందోళనలు జరుగుతున్నాయి. హైటెన్షన్ విద్యుత్ తీగల కింద టెంట్లు వేయడం, రద్దీగా ఉండే బస్ స్టాప్‌లు, ఆసుపత్రులు, పాఠశాలలు మరియు మార్కెట్ ప్రాంతాలకు అతి సమీపంలో నిరసనలు తెలపడం వల్ల ప్రజా భద్రతకు విఘాతం కలుగుతోందని అధికారులు భావిస్తున్నారు. అనుమతి నిరాకరణకు ఆస్కారం: ఫైర్ సర్వీస్, విద్యుత్ శాఖ మరియు మున్సిపల్ అధికారులు భద్రతా పరమైన కారణాల దృష్ట్యా ఇక్కడ దీక్షలకు అనుమతి ఇచ్చేందుకు నిరాకరణ ప్రధానంగా స్మశాన వాటిక మరియు కర్ర కోత మిషన్ల వంటి సున్నిత ప్రాంతాల గుండా ఊరిలోకి వెళ్లే ప్రధాన మార్గంలో ఆందోళనలు ట్రాఫిక్‌కు మరియు అత్యవసర సేవలకు (అంబులెన్స్) అడ్డంకిగా మారాయి. రాజకీయ రంగు: త్వరలో జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో, ప్రధాన పార్టీలు ఒకరిని మించి ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. నిన్నటి ఘటన వెనుక ఎవరి ప్రోద్బలమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. అధికారుల హెచ్చరిక: శాంతియుత నిరసనల పేరుతో ఉద్రిక్తతలు సృష్టించినా, ప్రభుత్వ అధికారులను దూషించినా కఠిన చర్యలు తప్పవని యంత్రాంగం స్పష్టం చేసింది. ప్రజల ఆరోగ్య రక్షణ కోసం చేపట్టిన డంపింగ్ యార్డ్ పోరాటం, శాంతిభద్రతల సమస్యగా మారకుండా ఉండాలని స్థానికులు కోరుతున్నారు.

- జీతం పెంచాలని కోరినందుకు ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ రాంప్రసాద్పై యజమానులు అనిల్రెడ్డి, బాలరాజు దాడికి పాల్పడ్డారు. దీనిని నిరసిస్తూ తోటి డ్రైవర్లు బస్సులు నిలిపివేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. డ్రైవర్పై దాడిని సీపీఐ నేత గడిపే మల్లేశం ఖండించారు. కార్మికులపై ఇలాంటి దాడులు సరికాదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో హుస్నాబాద్ డిపో వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది.1
- వేసవి ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. బానుడి ప్రతాపానికి జనం విలవిల్లాడుతున్నారు. ఎండ వేడి వడగాడ్పులతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు భయాందోళన చెందుతున్నారు. 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. పగటిపూట వాతావరణం నిప్పుల కొలిమిని తలపిస్తుంది. మరో వారం రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతుండడంతో రోహిణి కార్తీ వరకు ఎలా ఉంటుందోనని జనం భయపడుతున్నారు. ఎండ వేడి నుండి ఉపశమనం పొందేందుకు చలువ పందిళ్ళను ఆశ్రయించి చల్లని పానీయాలను సేవిస్తున్నారు జనం. మరి పశువులు పక్షులు మాత్రం నీటి వనరుల వద్ద సేద తీరుతున్నాయి. ఎండ వేడికి వృద్ధులు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే వడదెబ్బకు గురై ఉమ్మడి జిల్లాలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో అత్యవసరం అయితే తప్ప అనవసరంగా ఎవరు బయటికి వెళ్లొద్దని, పగటిపూట బయటికి వెళ్లేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు కోరుతున్నారు. హీటెక్కిన వాతావరణంతో ఉదయం 9 గంటలకే ప్రధాన రహదారులు జనసంచారం లేక బంద్ తలపిస్తున్నాయి. ఎండ తీవ్రతతో కూరగాయల మార్కెట్లు…హోటల్లు…జనం లేక వేలవేల పోతున్నాయి. జనం ఇండ్లలో తల దాచుకుంటున్నారు. పశుపక్షాదులు చెట్ల నీడన…నీటి గుంటలో సేద తీరుతున్నాయి. ఎండాకాలం ఎట్లా గడుస్తుందోనని జనం భయాందోళన చెందుతున్నారు.1
- గన్నేరువరం : ఉపాధి కూలీల లో ఉత్సాహం నింపడానికి మండల ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి ఉపాధి కూలీలతో కలిసి కొంత సమయం పని చేశారు. గుణపంతో మట్టిని తవ్వి కూలీలతో పనులు చేపట్టారు. మండలంలోని గునుకుల కొండాపూర్ లో పటేల్ చెరువులోకి నీరు వచ్చే ఫీడర్ కాలువ పనులు సర్పంచ్ అజయ్ వర్మ తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాబు కార్డు కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఉపాధిని పొందాలని సూచించారు. ఈ ఫీడర్ కాలువ పనికి 7 లక్షల రూపాయల నిధులు మంజూరు ఇప్పించడం జరిగిందని, గ్రామాన్ని జిల్లాస్థాయిలో ముందు వరుసులో నిలపాలని ఫీల్డ్ అసిస్టెంట్ హనుమాన్ల యాదగిరికి సూచించారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ సంపత్, ఫీల్డ్ అసిస్టెంట్ హనుమన్ల యాదగిరి ఉపాధి కూలీలు పాల్గొన్నారు.1
- అగ్నిమాపక వారోత్సవాల్లో బాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నేతన్న చౌక్ వద్ద అగ్నిమాపక శాఖ అధికారులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిమాన్స్టెస్టసన్ కార్యక్రమాన్ని నిర్వహించగా నీటితో పాలు రకాల విన్యాసాలను చేశారు. ఈ సందర్భంగా ఫైర్ స్టేషన్ అధికారి నరేందర్ మాట్లాడుతూ అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకుని ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని అలాగే విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన వారిని స్మరించుకుంటూ అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు.3
- సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అంగడిపేట్ హనుమాన్ దేవాలయం వద్ద మంగళవారం (14-04-2026) ఉదయం 9:30 గంటలకు పులిహోర పంపిణీ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి మంగళవారం నిర్వహించే ఈ సేవా కార్యక్రమానికి ఈ వారం దాతలుగా శ్రీమతి & శ్రీ మురికి శ్వేత విజయ్ దంపతులు, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. శ్రీ రామదూత పూజ జనరల్ స్టోర్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సక్రమంగా జరిగింది.ఈ సందర్భంగా భక్తులకు పులిహోరను పంపిణీ చేసి, సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమంలో కొమరవెల్లి దేవస్థానం డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ, మల్యాల భైరయ్య, నేతి శ్రీనివాస్, దూబకుంట లచ్చల్, కైలాస ప్రశాంత్, గందె సంతోష్, నోముల సంతోష్, పోగుల జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం భక్తి, సేవా భావం కలగలిపిన మంచి ఉదాహరణగా నిలిచింది.4
- నకిరేకల్ నియోజకవర్గం:- ఈ రోజు చందుపట్ల గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన డా. బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో పాల్గొని ప్రజలతో కలిసి అంబేద్కర్ గారి ఆశయాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా దైద రవీందర్ మాట్లాడుతూ, అంబేద్కర్ గారు అన్ని వర్గాల కోట్లాది ప్రజల జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడని, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అంబేద్కర్ గ్రామ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, గ్రామ ప్రజలు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.3
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో హెడ్‌మాస్టర్ అత్యుత్సాహం ప్రదర్శించిన ఘటన చోటుచేసుకుంది. హనుమాన్ మాల ధరించిన 7వ తరగతి విద్యార్థి ఓంకార్‌ను పాఠశాలలోకి రాకుండా హెడ్‌మాస్టర్ ఝాన్సీ రాణి అడ్డుకున్నట్లు సమాచారం. మాల తీసివేసి పాఠశాలకు రావాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు, భజరంగ్ దళ్ కార్యకర్తలు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. తల్లిదండ్రులు ప్రశ్నించగా హెడ్‌మాస్టర్ దుర్భాషలాడినట్లు వారు ఆరోపించారు. హెడ్‌మాస్టర్‌పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.1
- రోడ్డు ప్రమాదాల నివారణకై ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ మండలం దుర్శేడ్ వద్ద రాజీవ్ రహదారిపై మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. కరీంనగర్ రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జీబ్రా క్రాసింగ్ లైన్స్ ని పునరుద్ధరించి, రోడ్డు ను ఎలా క్రాస్ చేయాలో చూపించారు. ఈ కార్యక్రమంలో సిఐ నిరంజన్ రెడ్డి ఎస్ఐ లక్ష్మారెడ్డి, పలువురు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలకు మానవ తప్పిదాలే కారణమని, హెల్మెట్ , సీట్ బెల్ట్ ధరించకపోవడం, డ్రంక్ అండ్ డ్రైవ్ , మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం , అపసవ్య మార్గాల్లో ప్రయాణించడం , ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం ముఖ్య కారణాలుగా తెలిపారు. జిల్లాలో గతేడాది 200 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారని, అందులో ద్విచక్ర వాహనదారులే ఎక్కువని తెలిపారు. ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకపోవడం మరణాలకు ప్రధాన కారణాలన్నారు. పోలీసుల చర్యల వల్ల ప్రమాదాల రేటు 17 శాతం తగ్గిందని, ప్రమాదం జరిగిన ‘గోల్డెన్ అవర్’లో బాధితులను ఆసుపత్రికి చేర్చిన వారికి ప్రభుత్వం 25 వేల బహుమతి ఇస్తుందని తెలిపారు.4
- గన్నేరువరం: ఈనెల 23వ తేదీన గన్నేరువరంలో జరుగు హిందూ సమ్మేళన సభలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని హిందూ సమ్మేళన సమితి సభ్యులు పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలో జై హనుమాన్ హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో తిమ్మాపూర్ ఖండ గన్నేరువరం ఉప మండలంలో జరుగు హిందూ సమ్మేళనానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక, గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సమావేశానికి గన్నేరువరం సర్పంచ్ రంగన్న వేణి లచ్చినరుసు ను గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హిందువులు కులాలకతీతంగా సంఘటితం కావాల్సిన అవసరం ఉందని, ఈనెల 23వ తేదీన గన్నేరువరం లో జరుగు హిందూ సమ్మేళనంలో ప్రతి ఒక్క హిందువు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు ముత్యాల జగన్ రెడ్డి, తిప్పర్తి నికేష్, విలాసాగరం రామచంద్రం, కాంతాల అంజిరెడ్డి సర్పంచ్ రంగన్న వేణి లచ్చినరుసు ఉప సర్పంచ్ రామంచ స్వామి అధిక సంఖ్యలో హిందూ సమ్మేళన సమితి సభ్యులు, వివిధ గ్రామాల సర్పంచులు నాయకులు పాల్గొన్నారు.1