Shuru
Apke Nagar Ki App…
ఈద్గాలో ప్రత్యేక నమాజ్ – ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే నాగరాజు వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాగరాజు పాల్గొని ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతి, సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ పర్వదినం అందరికీ సుభిక్షం తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.
M D Azizuddin
ఈద్గాలో ప్రత్యేక నమాజ్ – ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే నాగరాజు వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాగరాజు పాల్గొని ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతి, సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ పర్వదినం అందరికీ సుభిక్షం తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.
More news from తెలంగాణ and nearby areas
- వాస్తవ పరిస్థితులకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీ ఈ సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టింది.. భట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ చిత్తశుద్ధిలేని పచ్చి అబద్దాల కూర్పుగా భావించవచ్చు.. రాజీవ్ యువవికాసం పేరుతో రాష్ట్ర నిరుద్యోగ యువతను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని బడ్జెట్లో ప్రస్తావిస్తున్నారు తప్ప అమలు చేయడం లేదు వ్యవసాయ కూలీలకు ఒక్క రూపాయి బడ్జెట్ ద్వారా ఇవ్వడం లేదు.. గత రెండు బడ్జెట్లలో ప్రవేశపెట్టిన అంశాలనే మళ్లీ ప్రస్తావించారు తప్ప ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు.. ఉమ్మడి వరంగల్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులైన దేవాదుల కు ఈ బడ్జెట్ లో కేటాయింపులు లేవు వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం లేని బడ్జెట్ ఇది రైతులను, వ్యవసాయ కూలీలను, కార్మికులను ఈ బడ్జెట్లో మోసం చేశారు.. సన్న వడ్లకు బోనస్ ప్రస్తావన లేదు.. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధినీ ఈ బడ్జెట్ నిరాశపరిచింది, ఏ ఒక్క హామీలు కూడా సంపూర్ణంగా నిధులు కేటాయించలేదు ఉమ్మడి జిల్లాలో ప్రాతినిధ్యం వహీస్తున్న ఎమ్మెల్యేలు ,మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ బడ్జెట్ పైన ఆత్మ పరిశీలన చేసుకోవాలి ..1
- మహబూబాబాద్ జిల్లా పురుషోత్తమమ్మాయిగూడెం సమీపంలోని సీతారాం తండా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది పురుషోత్తమ గూడెం గ్రామానికి చెందిన పిట్టల శ్రీనివాస్ కుటుంబం శుభకార్య నిమిత్తం ఆటోలో మహబూబాబాద్ బయలుదేరారు ఈ క్రమంలో సీతారంతాండ స్టేజి సమీపంలో కొరివైపు నుంచి అతివేగంగా వస్తున్న కారు వీరు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న రామసాని వెంకన్న మృతిచెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు1
- కరీంనగర్ టూ టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్య కలకలం సృష్టించింది. అత్తగారి ఊరైన ఇల్లంతకుంట మండలం సీతంపేటలో ఉరి వేసుకుని ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు గమనించి వెంటనే జమ్మికుంట ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఐదు రోజుల క్రితం ఎస్ఐ భార్య దివ్య ఆత్మహత్య చేసుకుంది. ఐదవ రోజు పిట్టకు పెట్టొచ్చి ఇంట్లోకి వెళ్లి ఎస్ఐ చంద్రశేఖర్ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. కడుపు నొప్పితో ఐదు రోజుల క్రితం విషపూరితమైన గన్నేరుపప్పు గ్రైండర్ చేసుకొని తాగి భార్య దివ్య ఆత్మహత్య చేసుకోగా, భార్య ఆత్మహత్యకు భర్తే కారణమని బంధువులు ఆందోళన ఆందోళనకు దిగారు. దివ్య తండ్రి మాత్రం తన కూతురు కడుపునొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుందని స్పష్టం చేశారు. భార్య ఆత్మహత్య బంధువుల ఆందోళనతో తీవ్ర మనస్థాపన చెందిన ఎస్సై చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న ఎస్సై దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అన్యోన్యంగా కలిసి మెలిసి ఉండి ఎస్సై దంపతులు ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడంతో పిల్లలు ఇద్దరు అనాధలుగా మారడం కుటుంబ సభ్యులను బంధుమిత్రులను తీవ్ర ఆవేదన గురిచేస్తుంది. క్షణికావేశంలో తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయంతో 8 ఏళ్ళ లోపు పిల్లలు ఇద్దరు అనాధలుగా మారడం చూపరుల హృదయాలను ద్రవింపజేస్తుంది.4
- *ఉగాది పండుగ సందర్భంగా నాయకుల వాటాలు* కేతపల్లి గ్రామ పంచాయతీ అవినీతి చిట్టా అభివృద్ధి పేరిట కేతేపల్లి పెద్ద నాయకులు నిధుల స్వాహా! కేతపల్లి గ్రామ ప్రజలారా, మన గ్రామానికి వచ్చిన నిధులు ఎటు పోతున్నాయి? అభివృద్ధి అంటే కేవలం ఫోటోలకు ఫోజులివ్వడమేనా? మన పంచాయతీలో జరుగుతున్న అడ్డగోలు ఖర్చులను ఒక్కసారి గమనించండి. వీధి దీపాల (Street Lights) పేరుతో భారీ దోపిడీ: కేవలం రెండు నెలల వ్యవధిలో వీధి దీపాల కోసం రూ. 6,40,000/- ఖర్చు చేసినట్లు లెక్కలు చూపిస్తున్నారు. ఇందులో విచిత్రం ఏమిటంటే: మార్చి 17వ తేదీన: రూ. 2,08,317/- డ్రా చేశారు. మరుసటి రోజే (మార్చి 18న): మళ్ళీ రూ. 4,28,209/- డ్రా చేశారు. ఒక్క రోజు వ్యవధిలో లక్షల రూపాయల విలువ చేసే లైట్లు ఎక్కడ వేశారు? ఇది పచ్చి అవినీతి కాదా? నీటి సరఫరా మరియు పైపులైన్ మరమ్మతుల మాయాజాలం: గ్రామంలో నీటి సౌకర్యం కోసం కేటాయించిన నిధుల్లో కూడా భారీగా గోల్‌మాల్ జరిగింది: పైపులైన్ రిపేర్ల పేరుతో రూ. 1,63,000/- మరియు ఇతర వాటర్ వర్క్స్ కోసం రూ. 1,07,000/- కలిపి మొత్తం రూ. 2,70,000/- ఖర్చు చూపించారు. పనులు జరిగిన దాఖలాలు లేవు కానీ కాగితాల్లో మాత్రం లక్షల రూపాయలు మాయమయ్యాయి. పారిశుధ్యం (Sanitation) - డబుల్ ఖర్చు: గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులకు జీతాలు ఇస్తున్నప్పటికీ, అదనంగా పారిశుధ్య పనుల పేరుతో రూ. 1,40,000/- ఖర్చు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి? ఈ నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి? నిధుల దుర్వినియోగం: మన గ్రామానికి 15వ ఆర్థిక సంఘం ద్వారా 20 లక్షల రూపాయలు, ఉపాధి హామీ (NREGS) కింద 10 లక్షల రూపాయలు వచ్చాయి. నిజమైన నాయకుడు బయట నుండి మరిన్ని నిధులు తెచ్చి అభివృద్ధి చేయాలి కానీ, వచ్చిన నిధుల్లో 10 రూపాయలు ఖర్చు పెట్టి 90 రూపాయలు జేబులో వేసుకోవడం అభివృద్ధి అనిపించుకోదు.కేతపల్లి గ్రామ ప్రజల సొమ్మును అప్పనంగా తింటున్న కేతే పెళ్లికి చెందిన బడా బడా మేము అధికార పార్టీ నాయకులమని గ్రామ పంచాయతీ సొమ్మును వాటాల వారిగా దోచుకుంటూ అప్పనంగా తింటున్న వారందరి అందర్నీ వారిని నిలదీయాల్సిన సమయం వచ్చింది. అభివృద్ధి అంటే ఫోజులు కొట్టడం కాదు, నిజాయితీగా పని చేయడం. అంటే ఎన్ని రోజులు వాట్స్అప్ సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టి గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులతో పని చేసుకుంటూ అభివృద్ధి చేస్తున్నామని ప్రజలను మభ్యపెట్టింది ఇందుకోసమేనా1
- యువత ఆధ్యాత్మిక భావన పెంపొందించుకోవాలని.. క్రైస్తవ మార్గం శాంతిని బోధిస్తుందని wcm ఫౌండర్ ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్, పాస్టర్ కిరణ్ పాల్ అన్నారు. గురువారం నల్గొండలోని టీఎన్జీవో భవన్లో సియాన్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్టియన్ యూత్ రిట్రీట్ కు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. యువత భక్తి భావంతో ప్రేమ సౌబ్రాతృత్వాన్ని పెంపొందించాలని కోరారు. ముఖ్యంగా ప్రపంచ శాంతి కోసం క్రైస్తవులు పాటుపడడమే కాకుండా భారత దేశ అభ్యున్నతి కోసం విద్యను పెంపొందించేందుకు ప్రేమను పంచేందుకు క్రైస్తవులు కృషి చేయాలని చెప్పారు. సమాజంలో సమానత్వం కోసం పాటుపడాలన్నారు. అనంతరం ఆయన ఇచ్చిన దైవ సందేశం ఎంతగానో ఆకట్టుకుంది. సియాన్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరాధన, పాటలు ఉత్సాహాన్ని నింపాయి. అనంతరం కిరణ్ పాల్ ను సియాన్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సియాన్ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్, సభ్యులు వడ్డే జాకబ్ రోషన్, టి. ప్రవీణ్ కుమార్, జర్నలిస్టు ప్రేమ్ కుమార్,సాగర్ జాన్, సుమన్ రమన్, అఖిల్, నోయెల్, శ్రీకాంత్,సల్మాన్ రాజ్, స్టీఫెన్ పాల్, సంపత్, గోపి, జాన్, జయరాజ్, జైసన్, పాస్టర్ జీవన్, మోసెస్, సియాన్ వుమెన్ టీమ్ తదితరులు పాల్గొన్నారు.3
- కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధుర నగర్ లో ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు మసీదులు, ఈద్గాల వద్ద ముస్లింలు చేరి సామూహిక ప్రార్థనలు (నమాజ్) నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే కొత్త దుస్తులు ధరించి అల్లాహ్ నామస్మరణతో ప్రార్థనా స్థలాలకు చేరుకోవడంతో పండుగ వాతావరణం నెలకొంది.1
- వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమంలో ఎమ్మెల్యే నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. వీరి వెంట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి, ఐనవోలు దేవస్థానం చైర్మన్ ప్రభాకర్, మార్కెట్ చైర్మన్ నరకుడు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.1
- పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కార్యకర్తలు ప్రభుత్వ విప్ లేనని నూతనంగా ప్రభుత్వ విప్ గా నియమితులైన ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ప్రభుత్వ విప్ హోదాలో తొలిసారి పెద్దపల్లి కి వచ్చిన విజయ రమణారావుకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. జిల్లా సరిహద్దు సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి నుండి బాణాసంచా పేల్చి భారీ బైకు ర్యాలీతో కాట్నపల్లి, సుల్తానాబాద్ నుండి సుగ్లాంపల్లి, చిన్నకల్వల పెద్దపల్లి జెండా చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అడుగడుగునా అభిమానులు నీరాజనం పలికారు. నిలువెత్తు గజమాలతో సన్మానించారు. తనకు పదవులు ముఖ్యం కాదని ప్రజలు కార్యకర్తలే ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రతీ ఆలోచన ప్రజల శ్రేయస్సు కోసమేనని, ప్రస్తుతం తనకు లభించిన ప్రభుత్వ విప్ పదవి ప్రజలకే అంకితం చేస్తున్నానని నియోజకవర్గ ప్రజలందరూ విప్ లేనని స్పష్టం చేశారు.1
- దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్నను భక్తులు దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కులను చెల్లించుకున్నారు.1