Shuru
Apke Nagar Ki App…
Buchi reddy palem
Surya Kiran
Buchi reddy palem
More news from తెలంగాణ and nearby areas
- నల్లగొండ జిల్లా: నాగార్జునసాగర్ నియోజకవర్గం...... త్రిపురారం మండలం, లోక్యా తండాలో...తండా వాస్తవ్యులు... మాజీ వార్డు మెంబర్.... ఆజ్మీర రంగనాయక్ గారి ఆహ్వానం మేరకు...... వారి నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన.... *_నల్లగొండ జిల్లా శాసనమండలి సభ్యులు యం.సి కోటిరెడ్డి గారు._* నూతన గృహప్రవేశ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్సీ గారిని స్వాగతం పలికి, గజమాలతో సత్కరించడం జరిగింది. తదనంతరం ఎమ్మెల్సీ గారు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ధనావత్ జ్యోతి కాంతారావు,కళ్లేపల్లి సర్పంచ్,హనుమంతు నాయక్,మాజీ సర్పంచ్ హనుమంతు నాయక్,రంగా నాయక్,స్వామి నాయక్,బగ్గు నాయక్, పరమేష్,దత్తాత్రేయ,స్వామి,హనుమంతు,తండా వాసులు తదితరులు పాల్గొన్నారు.1
- ఊట్కూరు గ్రామంలోని కనకదుర్గమ్మ ఆలయంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు. నల్గొండ జిల్లా, నిడమనూరు మండలం, ఊట్కూరు గ్రామంలోని కనకదుర్గమ్మ ఆలయంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం గ్రామ యూత్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ వసుమతి నరసింహ, మే రెడ్డి సత్యనారాయణ రెడ్డి, ఉప సర్పంచ్ నాగార్జున గౌడ్ ప్రారంభించారు. ఈ ముగ్గుల పోటీలలో గ్రామంలోని యువతులు, మహిళలు పెద్ద ఎత్తున పోటీపడి రంగురంగుల ముగ్గుల ముగ్గులు వేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ వేళ గ్రామంలో ఇలాంటి ముగ్గుల పోటీలను నిర్వహించడం సంతోషకరమని గ్రామంలోని పెద్దలు పేర్కొన్నారు.1
- శివకోడు రత్నా రాజు గారి లే అవుట్ లో1
- కర్నూలు జిల్లా.. ఆదోని నియోజకవర్గం... ఆదోనిలో బిజెపి నేతల భూకబ్జా యత్నం.. ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలంలో పార్టీ జెండాలు, రాళ్లను పాతిన నేతలు! నూతన బైపాస్ 167 NH సమీపంలోని మండగిరి పంచాయతీలోని సర్వే నెంబర్ 210లో ఉద్రిక్తత.. బిజెపి నాయకులను అడ్డుకున్న పక్క ప్లాట్ యజమానులు. మా ప్లాట్లకు ఉన్న 60 అడుగుల రోడ్డును కబ్జా చేస్తున్నారంటూ అశోక్ మరియు ఇతర బాధితుల తీవ్ర ఆరోపణ. పేదల పేరుతో ఆక్రమణలకు పాల్పడుతున్నారంటూ నేతలతో స్థానికుల వాగ్వాదం.. రంగంలోకి దిగిన బిజెపి నేత భాషా బృందం. బహిరంగంగా భూ ఆక్రమణ జరుగుతున్నా పట్టించుకోని రెవెన్యూ, పోలీస్ అధికారులు.. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం.2
- #sankranthi 2026 celebrations #sankranthi 2026 celebrations#sankranthi 2026 celebrations#sankranthi 2026 celebrations#sankranthi 2026 celebrations#sankranthi 2026 celebrations#sankranthi 2026 celebrations#sankranthi 2026 celebrations#sankranthi 2026 celebrations#sankranthi 2026 celebrations#sankranthi 2026 celebrations#sankranthi 2026 celebrations1
- తూర్పు గోదావరి జిల్లా.... మండపేట మండలం : మారేడుబాక శాంతి భద్రతల సమస్యతో కోడి పందాలు నిలిపివేయాలని తెలిపిన సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్... పందాల బరి వద్దకు చేరుకున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు..... వైసీపీ వాళ్లు నిర్వహిస్తున్నారని కూటమి ప్రభుత్వం అక్కసుతో అడ్డుకుంటున్నారు.....ఎమ్మెల్సీ తోట. ఎమ్మెల్సీ తోట కు సీఐ మధ్య కొద్ది సమయం వాగ్వాదం.... పండుగ సమయంలో అరెస్ట్ చెయ్యండి జైలుకు పోతాం.....ఎమ్మెల్సీ తోట. అధికార పార్టీ దమనకాండ ఇప్పటికైనా ఆపకపోతే ఎంత వరకు ఐనా వెళ్తాం...ఎమ్మెల్సీ తోట.3
- గాండ్లపెంట మండలం పరిధిలోని కటారుపల్లి గ్రామంలో ఉన్న యోగివేమన సమాధి వద్ద జరుగుతున్న జయంతి ఏర్పాట్లను సంబంధిత అధికారులు, మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుమార్ పరిశీలించారు. జనవరి 19వ తేదీన వైభవంగా జరగనున్న వేమన జయంతికి భారీ ఎత్తున జన సమీకరణ హాజరవుతారని విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లను ఆ స్థాయిలో చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జయంతి పనులు అతివేగంగా జరుగుతున్నాయి.1
- నల్గొండ జిల్లా జర్నలిస్టులను అర్ధరాత్రి పూట ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడాన్ని నల్లగొండ ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. జర్నలిస్టులు లేదా మీడియా సంస్థ ఏదైనా కథనం ప్రసారం చేసినప్పుడు దానిపైన అభ్యంతరాలు ఉంటే ఖండించడం లేదా రిజాయిండర్ కోరడం లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోవడాన్ని ఎవరు తప్పు పట్టడం లేదు. కానీ ఒక తీవ్రవాదిని లేదా తీవ్రమైన నేరం చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లుగా కుటుంబంతో కలిసి వెళుతున్న జర్నలిస్టులను అరెస్ట్ చేయడం, అర్ధరాత్రి పూట అరెస్టు చేయడం జర్నలిస్టు సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేసే ఉద్దేశం తప్ప మరొకటి కాదని అభిప్రాయపడుతున్నము. ప్రభుత్వం వెంటనే స్పందించి నిన్న, ఈరోజు అదుపులోకి తీసుకున్న జర్నలిస్టులను విడుదల చేయాలని, వారిపట్ల చట్ట ప్రకారం నడుచుకోవాలని, అవసరమైతే వారి కథనం పట్ల అభ్యంతరాలు ఉంటే సంబంధిత చట్టబద్ధ సంస్థలకు ఫిర్యాదు చేయాలని నల్గొండ ప్రెస్ క్లబ్ తరఫున కోరుతున్నాం. లేదంటే జర్నలిస్టులందరినీ ఏకం చేసి ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నాం.1
- మిర్యాలగూడ పట్టణంలోని గాంధీ నగర్ లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బిఎల్ఆర్ నల్గొండ జిల్లా, మిర్యాలగూడ పట్టణంలోని గాంధీ నగర్ లో స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి రూ.16.7 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.1