నల్గొండ: కొత్తపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నీటి సమస్య.. విద్యార్థులకు ఇబ్బందులు నల్గొండ:నల్గొండ మండలం కొత్తపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పాఠశాలలో ఉన్న చేతి పంపు చాలా కాలంగా పనిచేయడం లేదు. గ్రామపంచాయతీ నీటి పైప్‌లైన్ నుంచి మినీ ట్యాంక్‌కు నీరు ఎక్కించే మోటర్ ఇటీవల కాలిపోవడంతో ట్యాంక్‌లోకి నీరు చేరడం లేదు. దీంతో మధ్యాహ్న భోజనం ముందు, తర్వాత చేతులు కడుక్కోవడం, మరుగుదొడ్ల వినియోగం వంటి అవసరాలకు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే గతంలో కూలిన చెట్టు దుంగలను తొలగించకపోవడంతో వాటి కింద పాములు, తేళ్లు చేరే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ఆవరణలో బీటలు వేసిన చెట్టు కూడా ఎప్పుడైనా కూలే పరిస్థితిలో ఉందని చెబుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి చేతి పంపును మరమ్మతు చేయడంతో పాటు మోటర్‌ను బాగు చేసి, ప్రమాదకర చెట్లను తొలగించి విద్యార్థులకు సురక్షిత వాతావరణం కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

- నల్గొండ: కొత్తపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నీటి సమస్య.. విద్యార్థులకు ఇబ్బందులు నల్గొండ:నల్గొండ మండలం కొత్తపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పాఠశాలలో ఉన్న చేతి పంపు చాలా కాలంగా పనిచేయడం లేదు. గ్రామపంచాయతీ నీటి పైప్‌లైన్ నుంచి మినీ ట్యాంక్‌కు నీరు ఎక్కించే మోటర్ ఇటీవల కాలిపోవడంతో ట్యాంక్‌లోకి నీరు చేరడం లేదు. దీంతో మధ్యాహ్న భోజనం ముందు, తర్వాత చేతులు కడుక్కోవడం, మరుగుదొడ్ల వినియోగం వంటి అవసరాలకు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే గతంలో కూలిన చెట్టు దుంగలను తొలగించకపోవడంతో వాటి కింద పాములు, తేళ్లు చేరే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ఆవరణలో బీటలు వేసిన చెట్టు కూడా ఎప్పుడైనా కూలే పరిస్థితిలో ఉందని చెబుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి చేతి పంపును మరమ్మతు చేయడంతో పాటు మోటర్‌ను బాగు చేసి, ప్రమాదకర చెట్లను తొలగించి విద్యార్థులకు సురక్షిత వాతావరణం కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.1
- కీసర రామలింగేశ్వరుడిని దర్శించుకున్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సోమవారం కీసర శ్రీ రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆలయాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆయన పేర్కొన్నారు.1
- ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయంలో మరోసారి భద్రతా లోపం సెల్ ఫోన్‌పై నిషేధం ఉన్నా.. దర్జాగా రీల్స్ చేస్తున్న భక్తులు పెద్ద రాజగోపురం వద్ద రీల్స్ చేసి ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన మహిళ దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ఆఫీస్ ఎదురుగా రీల్స్ చేస్తున్నా చోద్యం మహిళ ఇన్ స్టా రీల్ తో మరోసారి బయటపడ్డ ఆలయ భద్రత లోపం1
- వర్షపు నీటిని బావిలోకి మళ్లించిన రైతు................... నడిగూడెం మండలం రామాపురం గ్రామానికి చెందిన రైతు మారిశెట్టి నరసింహారావు వర్షపు నీటిని వృథా కాకుండా పైపుల ద్వారా బావిలోకి మళ్లించి ఆదర్శంగా నిలిచారు. రాత్రి కురిసిన వర్షంతో పొలంలో చేరిన నీటిని భూగర్భ జలాల పెంపునకు వినియోగించారు. వర్షపాతం తగ్గుతున్న నేపథ్యంలో ప్రతి నీటి చుక్కను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.1
- సమాజ సేవకు సిద్ధమవుతున్న స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు సూర్యపేట జిల్లా నడిగూడెం మండలం కరివిరాల తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీలో సోమవారం స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రతిజ్ఞా స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ ఎం. సాయిశ్వరి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి క్రమశిక్షణ, సేవాభావం, నాయకత్వం, దేశభక్తి వంటి విలువలను అలవర్చుకోవాలని సూచించారు. స్కౌట్స్ మాస్టర్ కె. నాగయ్య, గైడ్స్ క్యాప్టెన్ కె. రమణకుమారి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.1
- దామరచర్ల మండలం తాళ్లవీరప్పగూడెం – వీర్లపాలెంలో యాదాద్రి థర్మల్ ప్లాంట్ ముందు ధర్నా.. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ గేట్ ఎదుట భూ బాధితుల ఆందోళన... దామరచర్ల మండలం తాళ్లవీరప్పగూడెం – వీర్లపాలెంలో ధర్నా... వైటీపీఎస్ ఎన్‌క్రోచ్‌మెంట్ భూ బాధితుల నిరసన... భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి... బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్... భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ జోక్యం కోరుతున్న బాధితులు... ఉద్రిక్త పరిస్థితుల నడుమ భారీగా మోహరించిన పోలీసులు...1