Shuru
Apke Nagar Ki App…
అవగాహనతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట: ఆదిలాబాద్ ఎస్పీ... ADB: అప్రమత్తతతోనే సైబర్ మోసాలను అరికట్టవచ్చని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. బుధవారం రిమ్స్ ఆడిటోరియంలో నిర్వహించిన 'సైబర్ జాగృతి దివస్' కార్యక్రమంలో పాల్గొని విద్యార్థినులతో కలిసి సైబర్ అవగాహన పోస్టర్‌ను SP ఆవిష్కరించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేస్తే పోగొట్టుకున్న డబ్బులు తిరిగి పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Mallaiah Potta
అవగాహనతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట: ఆదిలాబాద్ ఎస్పీ... ADB: అప్రమత్తతతోనే సైబర్ మోసాలను అరికట్టవచ్చని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. బుధవారం రిమ్స్ ఆడిటోరియంలో నిర్వహించిన 'సైబర్ జాగృతి దివస్' కార్యక్రమంలో పాల్గొని విద్యార్థినులతో కలిసి సైబర్ అవగాహన పోస్టర్‌ను SP ఆవిష్కరించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేస్తే పోగొట్టుకున్న డబ్బులు తిరిగి పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- అవగాహనతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట: ఆదిలాబాద్ ఎస్పీ... ADB: అప్రమత్తతతోనే సైబర్ మోసాలను అరికట్టవచ్చని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. బుధవారం రిమ్స్ ఆడిటోరియంలో నిర్వహించిన 'సైబర్ జాగృతి దివస్' కార్యక్రమంలో పాల్గొని విద్యార్థినులతో కలిసి సైబర్ అవగాహన పోస్టర్‌ను SP ఆవిష్కరించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేస్తే పోగొట్టుకున్న డబ్బులు తిరిగి పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు.1
- ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలే లక్ష్యం: ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన, సకాలంలో వైద్య సేవలు అందించాలని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సేవల తీరును సమీక్షించారు. ఆసుపత్రిలోని వివిధ వార్డులను పరిశీలించి చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యత, వైద్య సిబ్బంది పనితీరు, ఇతర సౌకర్యాల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై చర్చించారు. రోజురోజుకు రోగుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ సిటీ స్కాన్ యంత్రం పనిచేయకపోవడం, ఎక్స్‌రే ఫిలింల కొరత ఉండడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమస్యలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి సిటీ స్కాన్ మరమ్మతులు చేపట్టడంతో పాటు ఎక్స్‌రే ఫిలింల కొరత లేకుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ నిధులు రూ. 25 కోట్లతో నిర్మించిన క్రిటికల్ కేర్ ఆసుపత్రి భవనం పూర్తయిందని, ప్రారంభోత్సవం అనంతరం ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. దీంతో జిల్లా ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయని పేర్కొన్నారు. ఆసుపత్రి ఆవరణను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్‌ను ఆదేశించారు. ప్రతిరోజూ ఫాగింగ్ నిర్వహించాలని సూచించారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించడంతో పాటు రోగులతో ఆప్యాయంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ స్థానిక కౌన్సిలర్ గంజి రాజు, కౌన్సిలర్లు జింక సూరి, శ్రీరామోజు నరేష్, ఈశ్వర్, అర్జున్, విఠల్, సూరజ్, సాత్విక్, BJYM జిల్లా అధ్యక్షులు నిరంజన్ రెడ్డి, బీజేపీ నాయకులు జుట్టు దినేష్, జాప ప్రసాద్, కందుల హరీష్, అచ్యుత్ రావు, తో పాటు వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.1
- తల్లిపాలు చిన్నారులకు సంపూర్ణ ఆహారం: ఎంపీడీవో మధుసూదన్ తల్లిపాలు శిశువుకు సంపూర్ణ ఆహారం అని లక్షెట్టిపేట మండల ఎంపీడీవో మధుసూదన్ అన్నారు. బుధవారం మధ్యాహ్నం లక్షెట్టిపేట పట్టణంలోని బస్తీ దవాఖానాలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాలలో ఆయన పాల్గొన్నారు. తల్లిపాలు చిన్నారులలో రోగ నిరోధక శక్తిని పెంచి వారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్ వైజర్ మమత, RBSK డాక్టర్ శోభారాణి, ఫార్మసిస్ట్ అజయ్ కుమార్, Anm సుజాత, నాగ ప్రమీల ,అంగన్వాడీ టీచర్స్ లక్ష్మీ, శంకరమ్మ, ఆశా రాజేశ్వరి, లలిత, రాజమణి, ఆయా, తల్లులు, పిల్లలు, కిశోర బాలికలు పాల్గొన్నారు.1
- గ్రామపంచాయతీల సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ)పై అధికారులకు శిక్షణ నిర్మల్ జిల్లా భైంసా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధి ప్రణాళికపై నియోజకవర్గంలోని ఎంపిడిఓ, ఎంపీఓ,ఏపీఓ, ఏంఏఓలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు హాజరయ్యారు. జీపీడీపీలోని పలు అంశాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో డిపిఓ శ్రీనివాస్,పిఎడి నాగవర్ధన్ పాల్గొన్నారు.1
- కోరుట్లలో ఘనంగా T24X7NEWS స్టూడియో ప్రారంభం*నందయ్యా చేతుల మీదుగా ప్రారంభం.. ముఖ్య అతిథిగా జువ్వాడి కృష్ణారావు1
- ఆంధ్రప్రదేశ్ ను శాశ్వత జలసమృధ్ధి రాష్ట్రంగా చేస్తున్న మోదీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం 'జాతీయ అక్విఫర్ మ్యాపింగ్' కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని 1.42 లక్షల చదరపు కిలోమీటర్ల మేర భూగర్భ జలాల అధ్యయనాన్ని విజయవంతంగా పూర్తి చేసి... అవసరం అయిన చోట 'జల్ శక్తి అభియాన్', 'జల్ సంచయ్ జన భాగీదారి' ద్వారా దాదాపు 12.84 లక్షల నీటి సంరక్షణ పనులను చేపట్టి రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మారుస్తోంది.1
- సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే పాయల్ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. బేల తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో మండలానికి చెందిన 12 మంది లబ్ధిదారులకు ఆయన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేద ఆడపిల్లల పెళ్లిళ్లకు ఈ పథకం ఎంతో ఆసరాగా నిలుస్తోందని, లబ్ధిదారులకు ఫలాలు త్వరగా అందేలా చూడాలన్నారు. పథకాల అమలులో మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని ప్రజలను హెచ్చరించారు.1
- సాంప్రదాయ పద్ధతిలో అమ్మవారికి బోనాలు సమర్పించిన భక్తులు.. నిర్మల్ లోని ద్యాగవాడ వారి ఆధ్వర్యంలో బోనాల పండుగ అత్యంత సాంప్రదాయ బద్దంగా నిర్వహించుకున్నారు. పురుషులు, మహిళలు తలపాగా పెట్టుకొని పురవీధులలో నిర్వహించిన బోనాల శోభాయాత్ర స్థానికులను ఆకర్శించింది. ఈ సందర్భంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు. సమృద్ధిగా పాడి పంటలు పండాలని, వర్షాలు కురవాలని,అందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఏడాది తమ పూర్వీకుల కాలం నుంచి ఈ పండుగను నిర్వహించుకుంటమన్నారు.1
- సైబర్ నేరగాళ్ల వలలో పడి ఎవరు మోసపోవద్దు, జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ సైబర్ నేరగాళ్ల వలలో పడి ఎవరు మోసపోవద్దని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో సైబర్ జాగృతిక దివాస్ సందర్భంగా కళాశాలల విద్యార్థులకు సైబర్ నేరాలపై అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ మాట్లాడుతూ... సైబర్ నేరగాళ్లు మాయమాటలతో మోసాలు చేస్తున్నారని, అపరిచిత వ్యక్తులు ఎవరైనా ఫోన్ చేసి వ్యక్తిగత సమాచారం అడిగితే ఇవ్వొద్దని, అంతే కాకుండా ఫోన్ కు వచ్చే మెసేజ్ లకు స్పందించి ఓటీపీలు వంటి సమాచారం చెప్పొద్దని సూచించారు. బ్యాంకు వ్యక్తిగత పిన్ నంబర్లు సైతం గోప్యంగా ఉంచుకోవాలన్నారు. దొంగతనాల నివారణకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ చేతన్ నితిన్, డీఎస్పీ రాములు, కోరుట్ల సీఐ లక్ష్మి నారాయణ, కళాశాలల ప్రిన్సిపల్, విద్యార్థులు పాల్గొన్నారు.1