Shuru
Apke Nagar Ki App…
Venkata laxmi Kothapalli
More news from తెలంగాణ and nearby areas
- Post by Venkata laxmi Kothapalli4
- Post by Sampathkumar neerudu1
- బహుజనుల రాజ్యాధికారం కోసం పోరాడిన వీరశిఖామణి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధనలో గౌడన్నలందరూ ఏకం కావాలని హైకోర్టు న్యాయవాది డాక్టర్ నలమాస కృష్ణ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పేరాల కట్టయ్య ఫంక్షన్ హాల్‌లో గౌడ యువజన సంఘం ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లాలో నూతనంగా ఎన్నికైన గౌడ సామాజిక వర్గ ప్రజాప్రతినిధులకు ఘణ సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి ముందు పట్టణంలో భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించిన గౌడన్నలు.. పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ నలమాస కృష్ణ మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా గౌడన్నలందరూ ఐక్యంగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలని కోరారు. తెలంగాణ అమరవీరుల స్ఫూర్తితో సామాజిక అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఇక ఈ వేడుకలో ప్రముఖ గాయకుడు మానుకోట ప్రసాద్ ఆలపించిన ఉత్తేజిత గీతాలు ఆహుతులను విశేషంగా అలరించాయి. కార్యక్రమంలో గౌడ యువజన సంఘం ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో సామాజిక వర్గీయులు పాల్గొని విజయవంతం చేశారు.1
- వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. శనివారం నియోజకవర్గంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. 67వ డివిజన్‌లో సిద్ధార్థ నగర్ కమ్యూనిటీ హాల్‌లో డైనింగ్ హాల్ నిర్మాణానికి రూ.13 లక్షలు, డాక్టర్స్ కాలనీలో పార్క్ ప్రహరీ గోడ నిర్మాణానికి రూ.65 లక్షలతో పనులు ప్రారంభించారు. అలాగే 57వ డివిజన్‌లో అశోక కాలనీ, గోకుల్ నగర్ ప్రాంతాల్లో అంతర్గత రోడ్లు, ఇంజనీర్స్ కాలనీ–ఎస్‌పీఆర్ పాఠశాల వద్ద బ్రిడ్జి నిర్మాణానికి కలిపి రూ.2.14 కోట్ల వ్యయంతో పనులకు శ్రీకారం చుట్టారు. ప్రారంభించిన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావు ఉండదని, ప్రజల అవసరాలే తమకు ప్రధానమని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు.2
- నర్సంపేట పట్టణంలోని పలు పదో తరగతి పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ సత్య శారద శనివారం సందర్శించారు. పరీక్షలు ప్రశాంతంగా, ఎటువంటి అవాంతరాలు లేకుండా నిర్వహించాలన్న ఉద్దేశంతో కేంద్రాల్లో ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు, తాగునీరు వంటి అంశాలను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం ఉండకూడదని, పారదర్శకంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.1
- baryal ground ఇబ్బంది పడుతున్నాము3
- వరంగల్ ఉమ్మడి జిల్లాలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. వ్యవసాయ బావిలో పూడిక తీస్తుండగా క్రేన్ వైర్ తెగి ముగ్గురు కూలీలు మృతి చెందారు. ఈ ప్రమాదలో మొగుళ్లపల్లి మండలం కొరికిశాల గ్రామానికి చెందిన సుకినే దేవారావు(48), బండారి అభిలాష్(15)తో పాటు.. పిడిసిల్ల గ్రామానికి చెందిన పైడయ్య (53)స్పాట్ లోనే మృతి చెందారు. సుకినే మోహన్ రావు పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు.1
- Post by Sampathkumar neerudu1