*ధాన్యం కొనుగోళ్లలో రైతులకు అన్యాయం చేస్తే సహించం: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య* నల్లగొండ, మే 11: జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లలో రైతులకు జరుగుతున్న అన్యాయాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు నల్లగొండ కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించాయి. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి నేతృత్వంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రైతుల సమస్యల పరిష్కారానికై జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చిరుమర్తి లింగయ్య, గత నెల రోజులుగా కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తున్నామని, క్షేత్రస్థాయిలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో నెలకొన్న ప్రధాన సమస్యలను ఆయన ఈ సందర్భంగా ఎండగట్టారు. రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు సరిపడా లారీలు లేకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కుప్పలు పేరుకుపోతున్నాయి. తేమ, నాణ్యత సాకుతో దళారులు, వ్యాపారులు ధాన్యంలో భారీగా కోతలు విధిస్తూ రైతులను నిలువునా ముంచుతున్నారు. మౌలిక సదుపాయాల లేమి: కేంద్రాల్లో కనీసం తార్పాలిన్లు, తాగునీరు, నీడ వంటి సౌకర్యాలు లేక రైతులు ఎండలో, వానలో నానా అవస్థలు పడుతున్నారు.మార్కెట్ యార్డుల్లో కాంగ్రెస్ నాయకుల పెత్తనం పెరిగిపోయిందని, అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.కొనుగోలు చేసిన ధాన్యానికి సకాలంలో డబ్బులు అందక రైతులు అప్పుల పాలవుతున్నారని ధ్వజమెత్తారు.అన్ని కేంద్రాల్లో పారదర్శకంగా కాంటాలు నిర్వహించాలి. లారీల సంఖ్యను పెంచి ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలి.తరుగు పేరుతో విధిస్తున్న అన్యాయమైన కోతలను తక్షణమే నిలిపివేయాలి. దళారీల దందాపై కఠిన చర్యలు తీసుకోవాలి.ఈ నిరసనపై స్పందించిన జాయింట్ కలెక్టర్, రాబోయే 15 రోజుల్లో జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తిస్థాయిలో ముగించి, రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మరియు రైతులు పాల్గొన్నారు

- బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం: రామన్నపేటలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో భారీ నిరసన మైనర్ బాలికను లైంగిక వేధింపులను గురి చేసిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారి ఆధ్వర్యంలో రామన్నపేట మండల కేంద్రంలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేశారు.1
- బత్తాయి తోటల అభివృద్ధి కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం: సుభాషిని నల్గొండ జిల్లాలో బత్తాయి తోటల అభివృద్ధి కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని జిల్లా ఉద్యానవన & పట్టు పరిశ్రమల శాఖ అధికారి సుభాషిని తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. బత్తాయి తోటలో దిగుబడి తక్కువగా వచ్చి నష్టపోతున్నామని అనేక మంది రైతులు చెబుతున్నారని, భూమి సారం కోల్పోవడం ద్వారా దిగుబడి తగ్గుతుందని అధికారులు చెప్పే సలహాలు సూచనలు పాటిస్తూ దిగుబడిని పెంచుకోవాలని సూచించారు. గతంలో కంటే ఈసారి రికార్డు స్థాయిలో బత్తాయికి రేటు ఉందని తెలిపారు.1
- నల్గొండ జిల్లాలోని కొత్తపల్లి గ్రామం మీదుగా వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న కనిపించని స్పీడ్ బ్రేకర్లు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. రాత్రి వేళల్లో ఇవి అస్సలు కనిపించక అనేక ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అధికారులు వెంటనే మార్కింగ్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.1
- ఖమ్మం లో బండి భగీరథ్ను కఠినంగా శిక్షించాలి : BRS నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు1
- మాజీ మంత్రి హరీష్‌రావు పర్యటనతో ఖానాపూర్‌లో ఉద్రిక్తత.. టెంట్లు తొలగించిన పోలీసులు.. బీఆర్‌ఎస్ నేతల ఆందోళన వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అశోక్‌నగర్ గ్రామంలోని చారిత్రక మట్టి కోట శివాలయం విధ్వంసం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు మాజీ మంత్రి హరీష్‌రావు పర్యటించనున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ నేతలు ఏర్పాట్లు చేపట్టారు. పర్యటన కోసం ఏర్పాటు చేసిన టెంటులను పోలీసులు తొలగించగా, స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. భారీగా పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.1
- యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాలకు చిన్న విన్నపం దీని దీని వెంటనే స్పందించి డిఈ గారు దీనిపై తగు చర్యలు తీసుకోవాలి అట్లనే ఏఈ గారు యాదగిరిగుట్ట గారికి చిన్న విన్నపిస్తున్నాము దయచేసి దీనిపై వెంటనే చర్యలు తీసుకోండి ఎందుకంటే ఇది ఇలా మధ్యలోకి వెళ్లి పాస్ అయితే లైన్ ఇది చాలా అంటే చాలా వైబ్రేట్ అవుతుంది. ఒక్కసారి మీరు వచ్చి అధికారులతో నిధిని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని వినిపిస్తున్నాం 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼1
- వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్ సమీపంలోని పొలానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మంటలు ఎగసిపడటంతో సికింద్రాబాద్-భద్రాచలం కాకతీయ ఎక్స్‌ప్రెస్ 30 నిమిషాలు నిలిచిపోయింది, పలు రైళ్లు ఆలస్యమయ్యాయి. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు; రైల్వే అధికారులు వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు.2
- టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముట్టడి ధాన్యం కొనుగోలలో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ సోమవారం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ను ముట్టడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని ఆరోపించారు. కాంటాలు వేయడంలో నిర్లక్ష్యం చేస్తున్న కారణంగా రోజుల తరబడి రైతులు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.1