logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

వర్ధన్నపేటలో భారీగా గంజాయి పట్టివేత.. 129 కిలోలు స్వాధీనం, ఇద్దరు అరెస్ట్ వరంగల్ జిల్లా: వర్ధన్నపేట పట్టణంలోని వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై ఈగల్ ఫోర్స్ పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఖమ్మం వైపు నుంచి వరంగల్ వస్తున్న మారుతి సుజుకి ఎర్టిగా కారును ఆపి తనిఖీ చేయగా, కారులోని వెనుక భాగంలో 61 ప్యాకెట్లలో దాచిన 129.334 కిలోల గంజాయి బయటపడింది. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న కేరళకు చెందిన సాయుజ్ (33), బెసలెల్ సి. మాథ్యూ (38)లను పోలీసులు అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.64.66 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. గంజాయి తరలింపునకు ఉపయోగించిన కారుతో పాటు రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఒడిశాలోని చిత్రకొండ, దారకొండ ప్రాంతాల నుంచి గంజాయిని కొనుగోలు చేసి బెంగళూరు మీదుగా కేరళకు తరలించేందుకు నిందితులు ప్రయత్నించినట్లు వెల్లడైంది. ఈ వ్యవహారంలో అజిత్, విక్కీ అనే మరో ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు అధికారులు వెల్లడించారు. గంజాయి సరఫరా, రవాణా, విక్రయాల వెనుక ఉన్న ఇతర వ్యక్తుల పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని ఈగల్ ఫోర్స్ డీఎస్పీ పి. రమేష్ కుమార్ తెలిపారు.

1 hr ago
user_M D Azizuddin
M D Azizuddin
జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
1 hr ago

వర్ధన్నపేటలో భారీగా గంజాయి పట్టివేత.. 129 కిలోలు స్వాధీనం, ఇద్దరు అరెస్ట్ వరంగల్ జిల్లా: వర్ధన్నపేట పట్టణంలోని వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై ఈగల్ ఫోర్స్ పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఖమ్మం వైపు నుంచి వరంగల్ వస్తున్న మారుతి సుజుకి ఎర్టిగా కారును ఆపి తనిఖీ చేయగా, కారులోని వెనుక భాగంలో 61 ప్యాకెట్లలో దాచిన 129.334 కిలోల గంజాయి బయటపడింది. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న కేరళకు చెందిన సాయుజ్ (33), బెసలెల్ సి. మాథ్యూ (38)లను పోలీసులు అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.64.66 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. గంజాయి తరలింపునకు ఉపయోగించిన కారుతో పాటు రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఒడిశాలోని చిత్రకొండ, దారకొండ ప్రాంతాల నుంచి గంజాయిని కొనుగోలు చేసి బెంగళూరు మీదుగా కేరళకు తరలించేందుకు నిందితులు ప్రయత్నించినట్లు వెల్లడైంది. ఈ వ్యవహారంలో అజిత్, విక్కీ అనే మరో ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు అధికారులు వెల్లడించారు. గంజాయి సరఫరా, రవాణా, విక్రయాల వెనుక ఉన్న ఇతర వ్యక్తుల పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని ఈగల్ ఫోర్స్ డీఎస్పీ పి. రమేష్ కుమార్ తెలిపారు.

More news from తెలంగాణ and nearby areas
  • ఢిల్లీలో గృహ మరియు పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ సమావేశం న్యూఢిల్లీ: పార్లమెంట్ భవనంలోని మెయిన్ కమిటీ హాల్‌లో గృహ మరియు పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్, ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ​ఈ సమావేశంలో కమిటీకి చెందిన పలువురు పార్లమెంట్ సభ్యులు (ఎంపీలు), సంబంధిత మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు మరియు అధికార ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా గృహ నిర్మాణ పథకాలు, పట్టణాభివృద్ధి ప్రాజెక్టుల పురోగతి మరియు వాటి అమలు తీరుపై ఈ భేటీలో సమగ్రంగా చర్చించారు. ​పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, నివాస వసతుల విస్తరణకు సంబంధించి పలు కీలక అంశాలను సమీక్షించడంతో పాటు, అధికారులకు కమిటీ తరఫున పలు సూచనలు చేశారు. పథకాల సత్వర అమలుకు సమన్వయంతో కృషి చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.
    1
    ఢిల్లీలో గృహ మరియు పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ సమావేశం


న్యూఢిల్లీ:
పార్లమెంట్ భవనంలోని మెయిన్ కమిటీ హాల్‌లో గృహ మరియు పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్, ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది.
​ఈ సమావేశంలో కమిటీకి చెందిన పలువురు పార్లమెంట్ సభ్యులు (ఎంపీలు), సంబంధిత మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు మరియు అధికార ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా గృహ నిర్మాణ పథకాలు, పట్టణాభివృద్ధి ప్రాజెక్టుల పురోగతి మరియు వాటి అమలు తీరుపై ఈ భేటీలో సమగ్రంగా చర్చించారు.
​పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, నివాస వసతుల విస్తరణకు సంబంధించి పలు కీలక అంశాలను సమీక్షించడంతో పాటు, అధికారులకు కమిటీ తరఫున పలు సూచనలు చేశారు. పథకాల సత్వర అమలుకు సమన్వయంతో కృషి చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.
    user_ఆడెపు రాంకిషన్
    ఆడెపు రాంకిషన్
    Content Creator (YouTuber) వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
  • ముత్తోజిపేటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ........... నర్సంపేట: మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సహకారంతో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ కాంపెళ్లి వీణ విజేందర్ రెడ్డి రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డులతో ప్రజలకు మరింత సౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
    2
    ముత్తోజిపేటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ...........
నర్సంపేట: మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సహకారంతో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ కాంపెళ్లి వీణ విజేందర్ రెడ్డి రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డులతో ప్రజలకు మరింత సౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    6 hrs ago
  • నా పేద ప్రజల భవిష్యత్తు కోసం... ఎంతటి త్యాగానికైనా, ఏ పోరాటానికైనా సిద్ధం.! తీన్మార్ మల్లన్న *నా పేద ప్రజల భవిష్యత్తు కోసం... ఎంతటి త్యాగానికైనా, ఏ పోరాటానికైనా సిద్ధం.!* గాడిదలు, పందులను లెక్కపెట్టే ఈ ప్రభుత్వానికి... గంజి లేక చస్తున్న పేదోడి లెక్క అడిగితే ఒంటికి వణుకు పుట్టింది.! ఆ పిరికి సస్పెన్షన్ కాగితాలను కుర్చీలో కూర్చున్న పాలకుల ముందే ముక్కలు ముక్కలుగా చింపి పారేశా.! నా రాజకీయం మీ లగ్జరీ కుర్చీల కోసం కాదురా... గుడిసెల్లో మగ్గుతున్న పేద ప్రజల బతుకుల కోసం.! ఏం పీక్కుంటావో పీక్కో... జనం వైపు నిలబడి చెప్తున్నా..! *దట్ ఈజ్ తీన్మార్ మల్లన్న.!*
    1
    నా పేద ప్రజల భవిష్యత్తు కోసం... ఎంతటి త్యాగానికైనా, ఏ పోరాటానికైనా సిద్ధం.! తీన్మార్ మల్లన్న
*నా పేద ప్రజల భవిష్యత్తు కోసం... ఎంతటి త్యాగానికైనా, ఏ పోరాటానికైనా సిద్ధం.!*
గాడిదలు, పందులను లెక్కపెట్టే ఈ ప్రభుత్వానికి... 
గంజి లేక చస్తున్న పేదోడి లెక్క అడిగితే ఒంటికి వణుకు పుట్టింది.!
ఆ పిరికి సస్పెన్షన్ కాగితాలను కుర్చీలో కూర్చున్న పాలకుల ముందే ముక్కలు ముక్కలుగా చింపి పారేశా.!
నా రాజకీయం మీ లగ్జరీ కుర్చీల కోసం కాదురా... గుడిసెల్లో మగ్గుతున్న పేద ప్రజల బతుకుల కోసం.!
ఏం పీక్కుంటావో పీక్కో... జనం వైపు నిలబడి చెప్తున్నా..!
*దట్ ఈజ్ తీన్మార్ మల్లన్న.!*
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Auditor బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    1 hr ago
  • గౌరవెల్లి ప్రాజెక్టు పనులు పూర్తి చేసి హుస్నాబాద్‌ను సస్యశ్యామలం చేస్తాం- మంత్రి పొన్నం ప్రభాకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడమే తన ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని, అందుకోసం ప్రభుత్వం 250 కోట్ల నిధులు మంజూరు చేసిందని తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ చేపట్టిన పల్లె పల్లెకు పొన్నం అన్న–పల్లె పల్లెలో ప్రజాపాలన’ కార్యక్రమంలో భాగంగా సోమవారం చిగురుమామిడి మండలం కొండాపూర్ నవాబుపేట ఇందుర్తి ఒగులాపూర్ గునుకులపల్లె లో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి పశు వైద్య శిబిరాలు ప్రారంభించారు. వనమహోత్సంలో భాగంగా మొక్కలు నాటారు. గ్రామాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజల సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గౌరవెల్లి ప్రాజెక్టు కాల్వల నిర్మాణానికి సంబంధించి రైతులు సహకరించాలని మంత్రి కోరారు. భూసేకరణ ప్రక్రియ సాఫీగా పూర్తయ్యేలా అందరూ సహకరిస్తే, భూములు సేకరించిన వెంటనే అర్హులైన రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణంపై ప్రత్యేక చొరవ చూపుతున్నారని తెలిపారు. మూడు జిల్లాల కలెక్టర్లు భూసేకరణపై ప్రత్యేక దృష్టి సారించి ప్రక్రియను వేగవంతం చేస్తున్నారని స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు కొనసాగుతూనే ఉంటాయని మంత్రి అన్నారు.
    4
    గౌరవెల్లి ప్రాజెక్టు పనులు పూర్తి చేసి హుస్నాబాద్‌ను సస్యశ్యామలం చేస్తాం- మంత్రి పొన్నం ప్రభాకర్
అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడమే తన ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని, అందుకోసం ప్రభుత్వం 250 కోట్ల నిధులు మంజూరు చేసిందని తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ చేపట్టిన పల్లె పల్లెకు పొన్నం అన్న–పల్లె పల్లెలో ప్రజాపాలన’ కార్యక్రమంలో భాగంగా సోమవారం చిగురుమామిడి మండలం కొండాపూర్ నవాబుపేట ఇందుర్తి ఒగులాపూర్ గునుకులపల్లె లో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి పశు వైద్య శిబిరాలు ప్రారంభించారు. వనమహోత్సంలో భాగంగా మొక్కలు నాటారు. గ్రామాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజల సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గౌరవెల్లి ప్రాజెక్టు కాల్వల నిర్మాణానికి సంబంధించి రైతులు సహకరించాలని మంత్రి కోరారు. భూసేకరణ ప్రక్రియ సాఫీగా పూర్తయ్యేలా అందరూ సహకరిస్తే, భూములు సేకరించిన వెంటనే అర్హులైన రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణంపై ప్రత్యేక చొరవ చూపుతున్నారని తెలిపారు. మూడు జిల్లాల కలెక్టర్లు భూసేకరణపై ప్రత్యేక దృష్టి సారించి ప్రక్రియను వేగవంతం చేస్తున్నారని స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు కొనసాగుతూనే ఉంటాయని మంత్రి అన్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    15 min ago
  • పాలంపేట రామప్ప నల్ల కాలువలో ఎదురెక్కుతున్న చేపలు..! గత రెండురోజులుగా కురుస్తున్న వర్షం..!
    1
    పాలంపేట రామప్ప నల్ల కాలువలో ఎదురెక్కుతున్న చేపలు..! గత రెండురోజులుగా కురుస్తున్న వర్షం..!
    user_Swathi
    Swathi
    గ్రాఫిక్ డిజైనర్ ములుగు, ములుగు, తెలంగాణ•
    2 hrs ago
  • హత్య కేసును చేదించిన పోలీసులు వివరాలను వెల్లడించిన డి.ఎస్.పి మధుసూదన్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలోని శనిగల గుట్ట వద్ద హత్యకు గురైన రావుల దానయ్య కేసును చేదించిన పోలీసులు. వివరాలు వెల్లడించిన చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్ రెడ్డి దానయ్య సొంత అన్న కొడుకు శివతో, భార్య శారద హత్య చేయించినట్టుగా నిర్ధారణ. మృతుడి భార్య తో శివకు గత కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతుంది. శారదకు ఇంకా కొద్ది మందితో అక్రమ సంబంధాలు ఉన్నట్లు వెల్లడి నిందితులు శివ, శారదను అరెస్ట్ చేసి,రిమాండ్ కు తరలింపు..
    1
    హత్య కేసును చేదించిన పోలీసులు వివరాలను వెల్లడించిన డి.ఎస్.పి మధుసూదన్ రెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలోని శనిగల గుట్ట వద్ద  హత్యకు గురైన రావుల దానయ్య కేసును చేదించిన పోలీసులు. వివరాలు వెల్లడించిన చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్ రెడ్డి దానయ్య సొంత అన్న కొడుకు శివతో, భార్య శారద హత్య చేయించినట్టుగా నిర్ధారణ.  మృతుడి భార్య తో శివకు గత కొంత కాలంగా  వివాహేతర సంబంధం కొనసాగుతుంది. శారదకు ఇంకా కొద్ది మందితో అక్రమ సంబంధాలు ఉన్నట్లు వెల్లడి నిందితులు శివ, శారదను అరెస్ట్ చేసి,రిమాండ్ కు తరలింపు..
    user_గడ్డమీది చంద్రయ్య
    గడ్డమీది చంద్రయ్య
    Bhongir, Yadadri Bhuvanagiri•
    2 hrs ago
  • ఎల్కతుర్తి కారు డిక్కీలో మహిళ మృతదేహం కేసులో బిగ్ ట్విస్ట్.. హత్య వెనుక తండ్రి కుట్ర: ఏసీపీ ప్రశాంత్ రెడ్డి హనుమకొండ: ఎల్కతుర్తి మండల హనుమకొండ: ఎల్కతుర్తి మండల కేంద్రంలో సంచలనం సృష్టించిన కారు డిక్కీలో మహిళ మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. కాజీపేట ఏసీపీ పింగళి ప్రశాంత్ రెడ్డి సోమవారం మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు. మృతురాలు గోదావరిఖనికి చెందిన అంకతి మానసగా గుర్తించగా, నిందితుడు వినోద్ కుమార్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఏసీపీ వివరాల ప్రకారం, శుక్రవారం ఉదయం ఎల్కతుర్తి బస్‌స్టాండ్ వెనుక పార్క్ చేసి వదిలివేసిన కారులో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు గ్రామ కార్యదర్శికి సమాచారం ఇచ్చారు. కార్యదర్శి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కారులోని డిక్కీలో మహిళ మృతదేహాన్ని గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో కారును వినోద్ కుమార్ అక్కడ ఉంచినట్లు తేలిందన్నారు. మృతురాలు మానస, నిందితుడు వినోద్ ఇద్దరూ చిన్నప్పటి నుంచి పరిచయస్తులు, సింగరేణి ఉద్యోగుల కుటుంబాలకు చెందిన వారని చెప్పారు. మానస ప్రవర్తన వల్ల కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆమెను ఎలాగైనా హత్య చేయాలని మృతురాలి తండ్రి రాజేశం వినోద్ కుమార్‌ను కోరినట్లు విచారణలో వెల్లడైందన్నారు.
    3
    ఎల్కతుర్తి కారు డిక్కీలో మహిళ మృతదేహం కేసులో బిగ్ ట్విస్ట్.. హత్య వెనుక తండ్రి కుట్ర: ఏసీపీ ప్రశాంత్ రెడ్డి
హనుమకొండ: ఎల్కతుర్తి మండల
హనుమకొండ: ఎల్కతుర్తి మండల కేంద్రంలో సంచలనం సృష్టించిన కారు డిక్కీలో మహిళ మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. కాజీపేట ఏసీపీ పింగళి ప్రశాంత్ రెడ్డి సోమవారం మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు. మృతురాలు గోదావరిఖనికి చెందిన అంకతి మానసగా గుర్తించగా, నిందితుడు వినోద్ కుమార్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
ఏసీపీ వివరాల ప్రకారం, శుక్రవారం ఉదయం ఎల్కతుర్తి బస్‌స్టాండ్ వెనుక పార్క్ చేసి వదిలివేసిన కారులో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు గ్రామ కార్యదర్శికి సమాచారం ఇచ్చారు. కార్యదర్శి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కారులోని డిక్కీలో మహిళ మృతదేహాన్ని గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో కారును వినోద్ కుమార్ అక్కడ ఉంచినట్లు తేలిందన్నారు. మృతురాలు మానస, నిందితుడు వినోద్ ఇద్దరూ చిన్నప్పటి నుంచి పరిచయస్తులు, సింగరేణి ఉద్యోగుల కుటుంబాలకు చెందిన వారని చెప్పారు. మానస ప్రవర్తన వల్ల కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆమెను ఎలాగైనా హత్య చేయాలని మృతురాలి తండ్రి రాజేశం వినోద్ కుమార్‌ను కోరినట్లు విచారణలో వెల్లడైందన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
  • పాఠశాలలో మహిళా ఉపాధ్యాయురాలిపై దారుణ దాడి: బెంగాల్‌లో కలకలం మాల్దా (పశ్చిమ బెంగాల్): పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా ఉపాధ్యాయురాలిపై కొందరు వ్యక్తులు విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. విద్యార్థి బదిలీ ధ్రువీకరణ పత్రం (టీసీ) జారీ చేసే విషయంలో తలెత్తిన వివాదమే ఈ దాడికి కారణమని తెలుస్తోంది.వివాదం: పాఠశాలలో చదువుతున్న ఒక విద్యార్థి టీసీ జారీ వ్యవహారంలో ఉపాధ్యాయురాలితో కొందరు వ్యక్తులు వాగ్వాదానికి దిగారు. ​దాడి: నిబంధనల ప్రకారం వెంటనే టీసీ ఇచ్చేందుకు సదరు టీచర్ నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన వారు ఆమెపై భౌతిక దాడికి దిగారు. ​వైరల్ వీడియో: పాఠశాల ప్రాంగణంలో జరిగిన ఈ దాడి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో స్థానికంగా తీవ్ర దుమారం రేగింది. ​ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వీడియో ఆధారంగా నిందితులను గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. విద్యాబుద్ధులు నేర్పే పాఠశాలలోనే ఉపాధ్యాయురాలిపై దాడి జరగడంపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
    1
    పాఠశాలలో మహిళా ఉపాధ్యాయురాలిపై దారుణ దాడి: బెంగాల్‌లో కలకలం


మాల్దా (పశ్చిమ బెంగాల్):
పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా ఉపాధ్యాయురాలిపై కొందరు వ్యక్తులు విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. విద్యార్థి బదిలీ ధ్రువీకరణ పత్రం (టీసీ) జారీ చేసే విషయంలో తలెత్తిన వివాదమే ఈ దాడికి కారణమని తెలుస్తోంది.వివాదం: పాఠశాలలో చదువుతున్న ఒక విద్యార్థి టీసీ జారీ వ్యవహారంలో ఉపాధ్యాయురాలితో కొందరు వ్యక్తులు వాగ్వాదానికి దిగారు.
​దాడి: నిబంధనల ప్రకారం వెంటనే టీసీ ఇచ్చేందుకు సదరు టీచర్ నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన వారు ఆమెపై భౌతిక దాడికి దిగారు.
​వైరల్ వీడియో: పాఠశాల ప్రాంగణంలో జరిగిన ఈ దాడి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో స్థానికంగా తీవ్ర దుమారం రేగింది.
​ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వీడియో ఆధారంగా నిందితులను గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. విద్యాబుద్ధులు నేర్పే పాఠశాలలోనే ఉపాధ్యాయురాలిపై దాడి జరగడంపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
    user_ఆడెపు రాంకిషన్
    ఆడెపు రాంకిషన్
    Content Creator (YouTuber) వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    5 hrs ago
  • హైదరాబాద్ లోని సింగరేణి కాలనీలో నిర్వహించిన తీజ్ పండుగ హైదరాబాద్ లోని సింగరేణి కాలనీలో నిర్వహించిన తీజ్ పండుగ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు.
    1
    హైదరాబాద్ లోని సింగరేణి కాలనీలో నిర్వహించిన తీజ్ పండుగ
హైదరాబాద్ లోని సింగరేణి కాలనీలో నిర్వహించిన తీజ్ పండుగ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.