Shuru
Apke Nagar Ki App…
ఎమ్మెల్యే ముందే ప్రభుత్వాసుపత్రి వైద్యులను నిలదీసిన బాసర నాయకులు... బాసర లోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులపై మంగళవారం జరిగిన సర్వ సభ్య సమావేశం లో ఆగ్రహం వ్యక్త పరచారు. సమయపాలన పాటించడం లేదని, అవసరమైన మందులను పిహెచ్ సి లో అందుబాటులో ఉంచకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఎమ్మెల్యే రామారావు పటేల్ ముందు వాపోయారు. 26 జనవరి రోజు రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా 11 గంటలకు జాతీయ జెండాను ఎగరవేశారని సాక్షాత్తు ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ముందే నిలదీశారు.. మరోసారి ఇలాంటి ఘటన లు పునరావృతం కాకుండా చూడాలని బిద్దురు రమేష్ కోరారు.
RP
ఎమ్మెల్యే ముందే ప్రభుత్వాసుపత్రి వైద్యులను నిలదీసిన బాసర నాయకులు... బాసర లోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులపై మంగళవారం జరిగిన సర్వ సభ్య సమావేశం లో ఆగ్రహం వ్యక్త పరచారు. సమయపాలన పాటించడం లేదని, అవసరమైన మందులను పిహెచ్ సి లో అందుబాటులో ఉంచకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఎమ్మెల్యే రామారావు పటేల్ ముందు వాపోయారు. 26 జనవరి రోజు రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా 11 గంటలకు జాతీయ జెండాను ఎగరవేశారని సాక్షాత్తు ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ముందే నిలదీశారు.. మరోసారి ఇలాంటి ఘటన లు పునరావృతం కాకుండా చూడాలని బిద్దురు రమేష్ కోరారు.
More news from తెలంగాణ and nearby areas
- ఎమ్మెల్యే ముందే ప్రభుత్వాసుపత్రి వైద్యులను నిలదీసిన బాసర నాయకులు... బాసర లోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులపై మంగళవారం జరిగిన సర్వ సభ్య సమావేశం లో ఆగ్రహం వ్యక్త పరచారు. సమయపాలన పాటించడం లేదని, అవసరమైన మందులను పిహెచ్ సి లో అందుబాటులో ఉంచకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఎమ్మెల్యే రామారావు పటేల్ ముందు వాపోయారు. 26 జనవరి రోజు రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా 11 గంటలకు జాతీయ జెండాను ఎగరవేశారని సాక్షాత్తు ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ముందే నిలదీశారు.. మరోసారి ఇలాంటి ఘటన లు పునరావృతం కాకుండా చూడాలని బిద్దురు రమేష్ కోరారు.1
- గ్రామపంచాయతీల సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ)పై అధికారులకు శిక్షణ నిర్మల్ జిల్లా భైంసా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధి ప్రణాళికపై నియోజకవర్గంలోని ఎంపిడిఓ, ఎంపీఓ,ఏపీఓ, ఏంఏఓలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు హాజరయ్యారు. జీపీడీపీలోని పలు అంశాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో డిపిఓ శ్రీనివాస్,పిఎడి నాగవర్ధన్ పాల్గొన్నారు.1
- బోధన్‌లో కౌన్సిలర్ సమీర్‌కు చెందిన మేకల ఫారం ఘటనపై బోధన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఎంఐఎం నిరసన బోధన్‌లో కౌన్సిలర్ సమీర్‌కు చెందిన మేకల ఫారంపై జరిగినట్లు ఆరోపిస్తున్న విధ్వంసం, మేకల చోరీ ఘటనపై ఎంఐఎం నాయకులు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. బాధ్యులను వెంటనే అరెస్ట్ చేసి నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. అదృశ్యమైన కొన్ని మేకలు కాంగ్రెస్‌కు చెందిన ఓ కో-ఆప్షన్ సభ్యుడి నిర్మాణంలో ఉన్న ఇంటి వద్ద లభించాయని కౌన్సిలర్ సమీర్ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై పోలీసుల నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.1
- సిర్గాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎస్.హెచ్.జీ. (S.H.G.) వి.ఓ. భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దిలావర్ పూర్ మండలం సిర్గాపూర్ గ్రామంలో స్వయం సహాయక సంఘాల (S.H.G.) వి.ఓ. రూ. 10 లక్షలతో నూతనంగా నిర్మించిన భవనాన్ని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మహిళా సంఘాల బలోపేతం, గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇలాంటి మౌలిక సదుపాయాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు.మహిళల సాధికారతకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. అనంతరం మండలంలోని పలు గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, స్థానిక సమస్యలు మరియు ప్రజల అవసరాలపై మండల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేయడంతో పాటు ప్రజలకు నాణ్యమైన సేవలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోండుగారి చైతన్య శంకర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్ , మండల అద్యక్షులు నర్సారెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు ముత్యం రెడ్డి , BJYM జిల్లా అద్యక్షులు నిరంజన్ రెడ్డి తో పాటు మహిళా సమైక్య సంఘాల సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.2
- ఖానాపూర్ దిలావపూర్ రేంకోని వాగు బ్రిడ్జ్ దగ్గర మూలమలుపు భయంకరంమైన ములమలుపు ఖానాపూర్ దిలావపూర్ రేంకోని వాగు బ్రిడ్జి కంప్లీట్ చేయకపోగా భయంకరంగా మూలమలుపు తయారైందని స్థానిక ప్రజలు వాహనదారులు తెలియజేశారు ఇప్పటికైనా అధికారులు రోడ్ల వెడల్పు పనులు చేపట్టి పూర్తిచేయాలని ప్రజలు వాహనదారులు తెలియజేశారు1
- కోరుట్ల పీబీ గార్డెన్స్‌లో "సైబర్ జాగృతిక దివాస్ జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్1
- సైబర్ భద్రత అవగాహన పోస్టర్లు విడుదల.. నేరాల కట్టడికి అవగాహనే ఆయుధం సైబర్ నేరాల కట్టడికి అవగాహనే ఆయుధం అని జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల పేర్కొన్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ జనరల్ ఆదేశాల మేరకు ప్రజల్లో సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై అవగాహన కల్పించేందుకు ప్రతి నెల మొదటి బుధవారం నిర్వహిస్తున్న "సైబర్ జాగృతి దివస్" కార్యక్రమం నిర్వహిస్తున్నట్ల తెలిపారు.ఇందులో భాగంగా స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రూపొందించిన సైబర్ భద్రత అవగాహన పోస్టర్లను భైంసా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో భైంసా ఏఎస్పీ సాయి కిరణ్ తో కలిసి విడుదల చేశారు.సైబర్ నేరగాళ్ళు రోజురోజుకు కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు.సైబర్ మోసానికి గురైతే 1930 హెల్ప్ లైన్ కు కాల్ చేసి సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు.ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు రవీందర్ నాయక్, దీపక్,సాయి కుమార్,ఎస్సైలు,పోలీసు సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.1
- సైబర్ నేరగాళ్ల వలలో పడి ఎవరు మోసపోవద్దు, జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ సైబర్ నేరగాళ్ల వలలో పడి ఎవరు మోసపోవద్దని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో సైబర్ జాగృతిక దివాస్ సందర్భంగా కళాశాలల విద్యార్థులకు సైబర్ నేరాలపై అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ మాట్లాడుతూ... సైబర్ నేరగాళ్లు మాయమాటలతో మోసాలు చేస్తున్నారని, అపరిచిత వ్యక్తులు ఎవరైనా ఫోన్ చేసి వ్యక్తిగత సమాచారం అడిగితే ఇవ్వొద్దని, అంతే కాకుండా ఫోన్ కు వచ్చే మెసేజ్ లకు స్పందించి ఓటీపీలు వంటి సమాచారం చెప్పొద్దని సూచించారు. బ్యాంకు వ్యక్తిగత పిన్ నంబర్లు సైతం గోప్యంగా ఉంచుకోవాలన్నారు. దొంగతనాల నివారణకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ చేతన్ నితిన్, డీఎస్పీ రాములు, కోరుట్ల సీఐ లక్ష్మి నారాయణ, కళాశాలల ప్రిన్సిపల్, విద్యార్థులు పాల్గొన్నారు.1