Shuru
Apke Nagar Ki App…
హైదరాబాద్: శాసనసభ్యుల క్రీడా పోటీల్లో మట్టా రాగమయి దయనంద్ ప్రతిభ హైదరాబాద్‌లో కొనసాగుతున్న శాసనసభ మరియు శాసన మండలి సభ్యుల క్రీడా పోటీలు అత్యంత ఉత్సాహంగా సాగుతున్నాయి. ఈ పోటీల్లో భాగంగా శనివారం నిర్వహించిన 'లెమన్ అండ్ స్పూన్' ఆటలో ప్రజా ప్రతినిధులు తమ చురుకైన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ పోటీలో మంత్రి కొండా సురేఖ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోగా, సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డా.మట్టా రాగమయి దయనంద్ ద్వితీయ స్థానంలో నిలిచి తన ప్రతిభను చాటుకున్నారు. అలాగే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తృతీయ స్థానాన్ని దక్కించుకున్నారు. ప్రజా సేవా కార్యక్రమాల్లో నిత్యం బిజీగా ఉండే ప్రజా ప్రతినిధులు, ఇలా క్రీడల్లో పాల్గొని ఉత్సాహంగా పోటీ పడటం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. విజేతలకు తోటి సభ్యులు మరియు అధికారులు అభినందనలు తెలియజేశారు.
Ramprasad islavath
హైదరాబాద్: శాసనసభ్యుల క్రీడా పోటీల్లో మట్టా రాగమయి దయనంద్ ప్రతిభ హైదరాబాద్‌లో కొనసాగుతున్న శాసనసభ మరియు శాసన మండలి సభ్యుల క్రీడా పోటీలు అత్యంత ఉత్సాహంగా సాగుతున్నాయి. ఈ పోటీల్లో భాగంగా శనివారం నిర్వహించిన 'లెమన్ అండ్ స్పూన్' ఆటలో ప్రజా ప్రతినిధులు తమ చురుకైన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ పోటీలో మంత్రి కొండా సురేఖ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోగా, సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డా.మట్టా రాగమయి దయనంద్ ద్వితీయ స్థానంలో నిలిచి తన ప్రతిభను చాటుకున్నారు. అలాగే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తృతీయ స్థానాన్ని దక్కించుకున్నారు. ప్రజా సేవా కార్యక్రమాల్లో నిత్యం బిజీగా ఉండే ప్రజా ప్రతినిధులు, ఇలా క్రీడల్లో పాల్గొని ఉత్సాహంగా పోటీ పడటం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. విజేతలకు తోటి సభ్యులు మరియు అధికారులు అభినందనలు తెలియజేశారు.
More news from తెలంగాణ and nearby areas
- హైదరాబాద్‌లో కొనసాగుతున్న శాసనసభ మరియు శాసన మండలి సభ్యుల క్రీడా పోటీలు అత్యంత ఉత్సాహంగా సాగుతున్నాయి. ఈ పోటీల్లో భాగంగా శనివారం నిర్వహించిన 'లెమన్ అండ్ స్పూన్' ఆటలో ప్రజా ప్రతినిధులు తమ చురుకైన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ పోటీలో మంత్రి కొండా సురేఖ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోగా, సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డా.మట్టా రాగమయి దయనంద్ ద్వితీయ స్థానంలో నిలిచి తన ప్రతిభను చాటుకున్నారు. అలాగే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తృతీయ స్థానాన్ని దక్కించుకున్నారు. ప్రజా సేవా కార్యక్రమాల్లో నిత్యం బిజీగా ఉండే ప్రజా ప్రతినిధులు, ఇలా క్రీడల్లో పాల్గొని ఉత్సాహంగా పోటీ పడటం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. విజేతలకు తోటి సభ్యులు మరియు అధికారులు అభినందనలు తెలియజేశారు.3
- అక్రమంగా గంజాయి తరలిస్తుండగా ఇద్దరు వ్యక్తులు పట్టుకోవడం జరిగిందని డిఎస్పి ఎల్. ఆదినారాయణ తెలిపారు. ఆదివారం కొత్తగూడెం 1టౌన్ పోలీస్ స్టేషన్ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విశ్వసనియ సమాచారం మేరకు సిఐ కరుణాకర్ పాత కొత్తగూడెం ఏరియాలో ఓక బైక్ ను ఆపి తనిఖీ చేయగా వారి వద్ద నుండి 9.980 కేజీల గంజాయి పట్టుబడిందని, దాని విలువ 4 లక్షల 99వేల రూపాయల ఉంటుందని తెలిపారు. గంజాయి రవాణా చేసిన, సేవించిన కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ హెచ్చరించారు.3
- జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆదివారం టిడిపి 44 ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పలు ప్రాంతాలలో ఉన్న టిడిపి జెండా దిమ్మెల వద్ద జెండాను ఎగరవేసి పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఏలూరు రోడ్డులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి పట్టణ అధ్యక్షుడు కొండేటి కిషోర్ ఆధ్వర్యంలో పలువురు సీనియర్ నేతలు ఘన నివాళులు అర్పించారు. టిడిపి రాష్ట్రానికి చేసిన ,చేస్తున్న అభివృద్ధిని పలువురికి వివరించారు1
- శ్రీ అరుణాచల పార్ బాయిల్డ్ రైస్ మిల్లులో అనుమానస్పద స్థితిలో మహిళ మృతి.! పాలేరు మార్చి 29.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం గ్రామంలో గల అరుణాచల పార్ బాయిల్డ్ రైస్ మిల్లులో విషాదకర సంఘటన జరిగింది. కూసుమంచి మండలం జక్కేపల్లి గ్రామానికి చెందిన పప్పుల కళ్యాణి (28) మిల్లులో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు వరిపొట్టు కూలీ మీదపడి చనిపోవటంతో కుటుంబ సభ్యులు న్యాయం జరగాలంటూ ధర్నాకు దిగటంతో రాకపోకలకు అంతరాయం కలిగించారు. మాకు న్యాయం జరిగేంత వరకు ధర్నా విరిమించే ప్రసక్తి లేదంటూ కుటుంభ సభ్యుల ఆర్థనాధాలు మిన్నంటాయి. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిల్లు యజమాన్యం నిబంధనలు పాటించకపోవటమే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలియపరుస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- భూకబ్జాల వ్యవహారం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. ధరణి పోర్టల్‌ను అడ్డంగా పెట్టుకొని బిఆర్ఎస్ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే మురళి నాయక్ సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తిన ఆయన, వెంటనే హౌస్ కమిటీని ఏర్పాటు చేసి పూర్తి స్థాయి విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. BRS ప్రభుత్వంలో సామాన్యులకు .. ధరణి వ్యవస్థలోని లోపాలను ఉపయోగించుకొని బీఆర్ఎస్ నేతలు భూములను తమ పేర్లకు మార్చుకున్నారని మురళి నాయక్ ఆరోపించారు. దీనివల్ల అసలైన భూ యజమానులు తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరు ప్రజల్లో ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం తగ్గించేలా ఉందని వెంటనే బీఆర్ఎస్ నేతలను అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.1
- హైదరాబాద్, మార్చి 29: దేశంలో శాంతి, సామరస్యాన్ని కాపాడాలని, యుద్ధ వాతావరణాన్ని వ్యతిరేకిస్తూ చార్మినార్ నుంచి భారీ యుద్ధ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో తెలంగాణ జన సమితి నాయకులు, కార్యకర్తలు, ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, యుద్ధాలు ప్రజలకు నష్టం, దేశాలకు వినాశనం మాత్రమే మిగులుస్తాయని అన్నారు. ప్రజల ప్రాణాలు, ఆర్థిక వ్యవస్థ, భవిష్యత్ తరాలపై యుద్ధాల ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో శాంతి చర్చలు జరిపి, వివాదాలను సంభాషణల ద్వారానే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ప్రపంచ శాంతి, మానవతా విలువలను కాపాడటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ జన సమితి నాయకులు, కార్యకర్తలు యుద్ధాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శాంతి సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ర్యాలీ చార్మినార్ పరిసర ప్రాంతాల్లో శాంతియుతంగా కొనసాగింది1
- ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన అమరావతి రైతులు గుంటూరు: ముఖ్యమంత్రి చంద్రబాబును అసెంబ్లీలోని ఛాంబర్లో అమరావతి రైతులు శనివారం కలిశారు. అమరావతి రాజధానికి చట్టబద్దత కోరుతూ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టి కేంద్రానికి పంపినందుకు ముఖ్యమంత్రిని కలిసి రైతులు ధన్యవాదాలు తెలియజేశారు.1
- తోపన గడ్డ తండ ప్రజలు వన బోజనం కార్యక్రమం. జరిగింది. ఇందులోభాగంగా పలువురు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం లో గుగులోత్ జయరాం. భానోత్ సాగర్. రమేష్. ప్రసాద్. మాజీ వార్డు మెంబర్ బాలు. పర్సు. రాములు. వీర స్వామి. మాజీ సర్పంచ్ ఈర్య. హట్టి. బంగరు. హరి చంద్. ఆకు బాయ్. మరియు శారద మాజీ వార్డు మెంబర్. చిట్టి. గమ్మక. ఉమ. దేవులి. సునిత. ఈ దేవులి. సునిత. తదితరులు పా లోనడం జరిగింది.1