కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం కార్మికుల కష్టాలను గుర్తిస్తూ వారి సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడింది కలెక్టర్ పతిమా సింగ్ కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం*కార్మికుల కష్టాలను గుర్తిస్తూ, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందిజిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ శుక్రవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో *99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో* భాగంగా కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల శాఖ ఆధ్వర్యంలో *మేడే వేడుకలు - 2026* ను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ నగేష్,కార్మిక శాఖ సహాయ కమిషనర్శ్రీమతి సాహితి, జడ్పి సీఈఓ ఎల్లయ్య తో కలిసి కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన గావించి ఆరంభించారు కలెక్టర్* మాట్లాడుతూ.. ముందుగా అందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల సంక్షేమమే సమాజ అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. కర్మాగారాల్లో పని చేస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కార్మిక సంఘాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికులకు సరైన సబ్సిడీలు, బీమా సదుపాయాల సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.కార్మికుల హక్కుల పరిరక్షణలో కార్మికసంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, అన్ని సంఘాలు కలిసికట్టుగా పనిచేస్తే సమస్యలకు సమగ్ర పరిష్కారం సాధ్యమవుతుందని తెలిపారు. అలాగే ప్రతి కార్మికుడికి అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్మికుల సంక్షేమం, కర్మాగారాల కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, కార్మిక సంఘాల పాత్రపై ప్రత్యేక శిక్షణ ఇచ్చి, అవగాహన కల్పించారు. అనంతరం కార్మికుల సాధనాలు, కార్యక్రమాల నివేదిక పోస్టర్స్ ను ఆవిష్కరించారు.కార్మిక శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రశంసించారు ఈ కార్యక్రమంలో సంబంధిత పరిశ్రమల శాఖయాజమాన్యంఐ.టీ.సఫ్యాక్టరీస్.సిబ్బంది కార్మిక శాఖ అధికారులు పాల్గొన్నారు

- ప్రెస్ నోట్: 1/5/2026 * *అమరవీరుల త్యాగ స్పూర్తితో - 8 గంటల పని దినాన్ని కాపాడుకుందాం* - * *కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్స్ రద్దుకై పోరాడుదాం* * *కామ్రేడ్ చంద్రశేఖర్ సిఐటియు జిల్లా అధ్యక్షులు* * *మే డే సందర్బంగా సీఐటీయు జెండా ఆవిష్కరణ* సీఐటీయు ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో సీఐటీయు *మేడే* సందర్భంగా జరిగిన జెండావిష్కరణ సందర్బంగా జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.అనంతరం వారు మాట్లాడుతూ...1886 లో చికాగో నగరంలోని హె మార్కెట్ వద్ద కార్మికులు 8 గంటల పని దినం కోసం ప్రదర్శన చేస్తుంటే పోలీసులు చేసిన కాల్పుల్లో 7గురు కార్మికులు అమరులైన త్యాగ ఫలితంగా మే డే వచ్చింది. కానీ నేడు కేంద్రంలో ఉన్న బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికుల హక్కులను 29 చట్టాలను రద్దు చేసి కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు అనుకూలముగా వారికీ లాభాలు కోసం 4 లేబర్ కోడ్స్ తెచ్చింది.ఈ లేబర్ కోడ్స్ అమలు జరిగితే కార్మికులు సంఘాటితంగా పోరాడే హక్కు, సమ్మె చేసే హక్కు, సంఘం పెట్టుకునే హక్కు , బెరసరలు చేసే హక్కు, కార్మికుల తొలగింపులు, ఉద్యోగం భద్రత ఇంకా అనేక కార్మికులు సౌకర్యాలు కోల్పోవడం జరుగుతుంది. బీజేపీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు పోరాటం చేయాలిసిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు సెక్రెటరీ ముధం అరుణ్ జిల్లా నాయకులు రాజనర్సు, మంద శ్రీనివాస్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ రేణుక, సత్యం మున్సిపల్ నాయకులు మహబూబ్ సంతోష్ దీవెన వాటర్ వర్క్స్ నాయకులు ఆయాజ్ ప్రభాకర్ నర్సింగరావు గంగాధర్ ఖలీల్ శ్రీధర్ అమాలి సంఘం నాయకులు రమేష్ నర్సింలు స్వామి లింగం రాజేష్ గంగారాం బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు జగదీశ్వర్ సాయిబాబా ఈశ్వర్ ఎల్ఐసి నాయకులు నర్సింగరావు నర్సింలు నయీమ్ మెడికల్ రిప్రజెంటిటీ నాయకులు రవీంద్ర చారి మహేందర్ రెడ్డి సంతోష్ మరియు ఇతర నాయకులు కార్మికులు పాల్గొనడం జరిగింది.1
- కార్మికులు తమకు ఉన్న చట్టాలు, హక్కులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సంగారెడ్డి అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి సూచించారు. మే డే సందర్భంగా శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. 1886 పోరాట స్ఫూర్తితోనే ఏటా మే 1న ఈ వేడుకలు జరుపుకుంటున్నామని తెలిపారు. కార్మికులకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆమె పేర్కొన్నారు.1
- Post by Vishwamber Rao1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో జరిగే ప్రపంచ మేడే 140 కార్యక్రమాలను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ పిలుపునిచ్చారు.3
- వికారాబాద్ : ప్రజల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి వారికి భరోసా కల్పించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడుతుందని,బాధితులు తమ సమస్యల కోసం ఎప్పుడైనా ఎస్పి కార్యాలయంను సంప్రదించవచ్చని,పోలీస్ శాఖ ఎల్లప్పుడూ బాధితులకు అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ స్నేహమేహ్ర అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ ప్రియా దారులను కలిసి వారి ఇబ్బందులను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. బాధితుల సమస్యలపై స్పందించి ఎస్పి అక్కడికక్కడే సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు ఫోన్ చేసి కేసుల పురోగతిపై ఆరా తీశారు. చట్ట పరిధిలో ఉన్న సమస్యలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా పూర్తి పారదర్శకతతో విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.1
- నారాయణఖేడ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో రాయికోడ్ బస్ స్టాండ్ వద్ద చెకింగ్ అధికారి తనిఖీలు హైదరాబాద్ నుండి రాయికోడ్ మీదుగా నారాయణఖేడ్ వెళుతున్న బస్సు టికెట్ లేకుండా బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడిని గుర్తించిన చెకింగ్ అధికారి ప్రయాణికుడి జరిమానాతో పాటు కండక్టర్ పై చార్జీ మెమో ఇవ్వకుండా ఉండేందుకు డబ్బులు డిమాండ్ చేసిన ఆర్టీసీ చెకింగ్ అధికారి చెకింగ్ అధికారి తీరుపై ప్రయాణికులతో పాటు, కండక్టర్ ఆగ్రహం చెకింగ్ అధికారి వాహనాన్ని రోడ్డుపైనే ఆపి అధికారితో వాగ్వాదం. చెకింగ్ అధికారిపై దాడి చేస్తూ చెప్పుతో కొట్టిన ప్రయాణికులు, కండక్టర్..1
- పత్రిక prakat తేది: 01.05.2026 కామారెడ్డి జిల్లా శుక్రవారం జిల్లా ఆసుపత్రిలో ‘బాల భరోసా’ కార్యక్రమం నిర్వహణ మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ–పోషణ అభియాన్, ఆరోగ్య శాఖ–RBSK సంయుక్తంగా ప్రజాపాలన–ప్రగతి నివేదిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా శుక్రవారం జిల్లా ఆసుపత్రిలో ‘బాల భరోసా’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ, 0-5 సంవత్సరాల లోపు చిన్నారుల్లో పెరుగుదల లోపాలు, అంగవైకల్యాలు, మానసిక సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన వైద్య సేవలు, రిఫరల్, సూచనలు అందించడం ద్వారా వారిని సాధారణ స్థితికి తీసుకురావచ్చని తెలిపారు. జిల్లాలోని 13 RBSK బృందాలు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి, అంగన్వాడీ టీచర్లు 42 ప్రశ్నల ఆధారంగా గుర్తించిన చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించాయి. అవసరమైన వారికి జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేసి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టడడం జరుగుతున్నడని కార్యక్రమం మొదటి రోజున జిల్లా ఆసుపత్రిలో 31 మంది రిఫర్ అయిన చిన్నారులకు అవసరమైన చికిత్స, మందులు అందజేశారు. చిన్నారుల పెరుగుదల లోపాలకు గల కారణాలను కలెక్టర్ అడిగి తెలుసుకొని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి ప్రమీల, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి రవీందర్,ఆర్డీవో NV గిరి, RBSK వైద్యులు, ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్ రావ్, rbsk రోహిత్, CDPOలు, సూపర్వైజర్లు, DCPO, పోషణ అభియాన్ కోఆర్డినేటర్, అంగన్వాడీ టీచర్లు, ఆసుపత్రి సిబ్బంది,చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.1
- కార్మికుల హక్కుల సాధన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పిలుపునిచ్చారు. శుక్రవారం సదాశివపేటలో నిర్వహించిన మే డే వేడుకల్లో ఆయన మాట్లాడారు. చికాగో నగర కార్మికుల వీరోచిత పోరాట ఫలితమే నేటి మే డే అని గుర్తుచేశారు. కార్మికులకు కచ్చితంగా 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రమజీవుల సంక్షేమానికి అందరూ అండగా ఉండాలని కోరారు.1
- ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలకు చర్యలు తీసుకుంటున్నామని, త్వరలోనే ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్ డిపోలో జరిగిన అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి, ఆర్టీసీ కార్మికులతో కలిసి మే డే వేడుకలు జరుపుకున్నారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని, ప్రపంచ కార్మికులకు శ్రమైక జీవులకు అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్టీసీ ఆపరేషన్ లాస్ నుండి లాభాల్లోకి వస్తుందంటే మహాలక్ష్మి పథకం ద్వారానే సాధ్యమైందన్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్తే వారి ఆకాంక్షల కనుగుణంగా ముఖ్యమంత్రి నాయకత్వంలో కార్మిక సంఘాలతో 15 గంటల పాటు చర్చించి సానుకూల నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయడం, కార్మిక సంఘాల ఎన్నికలు, కార్మికులకు 11 శాతం పిఆర్సి ప్రకటించిందన్నారు. త్వరలోనే కార్మిక సంఘాల ఎన్నికలు జరిపి గుర్తింపు పొందిన సంఘం అధికారుల కమిటీ విలీన ప్రక్రియ పూర్తి చేస్తుందన్నారు. సమ్మె జరగక ముందే 32 అంశాల్లో 29 అంశాలకు సానుకూలంగా ఉన్నామని చెప్పామని, మిగిలిన మూడు అంశాలు ప్రభుత్వం పరిధిలో ఉన్నాయని తెలిపిన, అంతలోనే ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని తీవ్ర సానుభూతి వ్యక్తం చేశారు. కార్మిక మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో గిగ్ వర్కర్ చట్టం తెచ్చామని, ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రవాణా శాఖ మంత్రిగా, ప్రభుత్వానికి వారధిగా ఉంటానన్నారు.1