Shuru
Apke Nagar Ki App…
నారాయణఖేడ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో రాయికోడ్ బస్ స్టాండ్ వద్ద చెకింగ్ అధికారి తనిఖీలు హైదరాబాద్ నుండి రాయికోడ్ మీదుగా నారాయణఖేడ్ వెళుతున్న బస్సు టికెట్ లేకుండా బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడిని గుర్తించిన చెకింగ్ అధికారి ప్రయాణికుడి జరిమానాతో పాటు కండక్టర్ పై చార్జీ మెమో ఇవ్వకుండా ఉండేందుకు డబ్బులు డిమాండ్ చేసిన ఆర్టీసీ చెకింగ్ అధికారి చెకింగ్ అధికారి తీరుపై ప్రయాణికులతో పాటు, కండక్టర్ ఆగ్రహం చెకింగ్ అధికారి వాహనాన్ని రోడ్డుపైనే ఆపి అధికారితో వాగ్వాదం. చెకింగ్ అధికారిపై దాడి చేస్తూ చెప్పుతో కొట్టిన ప్రయాణికులు, కండక్టర్..
Sangareddy News
నారాయణఖేడ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో రాయికోడ్ బస్ స్టాండ్ వద్ద చెకింగ్ అధికారి తనిఖీలు హైదరాబాద్ నుండి రాయికోడ్ మీదుగా నారాయణఖేడ్ వెళుతున్న బస్సు టికెట్ లేకుండా బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడిని గుర్తించిన చెకింగ్ అధికారి ప్రయాణికుడి జరిమానాతో పాటు కండక్టర్ పై చార్జీ మెమో ఇవ్వకుండా ఉండేందుకు డబ్బులు డిమాండ్ చేసిన ఆర్టీసీ చెకింగ్ అధికారి చెకింగ్ అధికారి తీరుపై ప్రయాణికులతో పాటు, కండక్టర్ ఆగ్రహం చెకింగ్ అధికారి వాహనాన్ని రోడ్డుపైనే ఆపి అధికారితో వాగ్వాదం. చెకింగ్ అధికారిపై దాడి చేస్తూ చెప్పుతో కొట్టిన ప్రయాణికులు, కండక్టర్..
More news from తెలంగాణ and nearby areas
- కార్మికులు తమకు ఉన్న చట్టాలు, హక్కులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సంగారెడ్డి అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి సూచించారు. మే డే సందర్భంగా శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. 1886 పోరాట స్ఫూర్తితోనే ఏటా మే 1న ఈ వేడుకలు జరుపుకుంటున్నామని తెలిపారు. కార్మికులకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆమె పేర్కొన్నారు.1
- *140వ మేడే స్ఫూర్తితో నాలుగు లేబర్ కోడ్స్ రద్దుకై* *సమాన పనికి సమాన* *వేతనంకై ఉద్యమీద్దాం* *మేడే వారోత్సవాలు జయప్రదం చేయండి* ఈరోజు మెదక్ పట్టణ కేంద్రంలో మేడే సందర్భంగా 140వ మేడే సిఐటియు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. CITU కార్యలయం కేవల్ కిషన్ భవన్ దగ్గర, మున్సిపల్ కార్యాలయం, MCH హస్సిటల్ , రైల్వే స్టేషన్, భవన నిర్మాణ కార్మికుల అడ్డ, PACS గోదాం వద్ద సిఐటియు జండాలు ఆవిష్కరణ జరిగాయి. అనంతరం *పోస్టపీసు దగ్గర మేడే సభ నిర్వహించడం జరిగింది.* *ఈ సందర్భంగా సిఐటీయు జిల్లా కార్యదర్శి ఏ.మల్లేశం* ప్రసంగిస్తూ కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం అధికారానికి వచ్చిన గత 13 సంవత్సరాల నుండి కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నది. బడా కార్పొరేట్ల ప్రయోజనాల కోసం 100 సంవత్సరాల క్రితం నుండి బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న అనేక కార్మిక చట్టాలను కలిపి వేసి 4 లేబర్ కోడ్స్ ను తీసుకొచ్చింది. ఈ నాలుగు లేబర్ కోడ్స్ అమల్లోకి తెస్తూ కార్మిక వర్గానికి సంఘం పెట్టుకునే హక్కు, సంఘటితమై హక్కు కనీస వేతనం అడిగే హక్కు పిఎఫ్, ఈఎస్ఐ వంటి చట్టబద్ధ సౌకర్యాలకు నోచుకోకుండా కార్మిక వర్గానికి తీవ్ర నష్టం కలిగిస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వం నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక కర్షక కార్మిక వర్గం ఐక్యతగా పోరాడాలని పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని దేశంలో సంఘటిత అసంఘటిత కార్మికులకు కనీస వేతనాలు లేక ఉద్యోగ భద్రత లేక చాలా ఇబ్బంది గురవుతున్నారు. అమెరికా చికాగో నగరంలో 8 గంటల పని దినానికై ఉవ్వెత్తున కార్మిక వర్గం పోరాటం చేసి రక్త తర్పణంలో రక్తంలో తడిసిన గుడ్డని ఎర్రజండగా మేడే జెండా ఎగరడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సరళీకరణ నూతన విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారుఈ కార్యక్రమంలో సీఐటీయు జిల్లా సహాయ కార్యదర్శి జే.సంతోష్, వికలాంగుల సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గ నాయకులు షౌకత్ మున్సిపల్ యూనియన్ కార్మికులు రాజా శేఖర్ ఏసు మల్లేశం శోభ ఎల్లవ్వ ఉషవ్వ పోచమ్మ శేఖర్ అంజి హమాలీ కార్మికులు బాల్ నర్సు మల్లేశం గట్టయ్య బాలు ఆంజనేయులు హనుమంత్ తదితరులు పాల్గొన్నారుజే సంతోష్. మెదక్ జిల్లా సహాయ కార్యదర్శి1
- కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ఆరోపించారు. శుక్రవారం ప్రపంచ కార్మికుల దినోత్సవం మే డే ను పురస్కరించుకొని నల్గొండ జిల్లా సిపిఎం కార్యాలయంలో ఎర్రజెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 8 గంటల పని విధానాన్ని రద్దుచేసి 12 గంటల పని విధానాన్ని తెచ్చేందుకు ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. వామపక్ష భావజాలాన్ని రూపుమాపేందుకు పూనుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక హక్కుల కోసం సిపిఎం నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, పుచ్చకాయల నర్సిరెడ్డి, ఎండి సలీం, పాలడుగు నాగార్జున, దండంపల్లి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.1
- తిమ్మాజీపేట: బాలికలకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే భయపడాల్సిన అవసరం లేదని, సీ-టీంను సంప్రదిస్తే తక్షణ రక్షణతో పాటు న్యాయం చేకూరుస్తామని జిల్లా సీ-టీం ఎస్సై విజయలక్ష్మి భరోసా ఇచ్చారు. శుక్రవారం స్థానిక శ్రీ శక్తి భవనంలో మండల స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జాతరలు, రద్దీ ప్రాంతాల్లో మహిళలను వేధించినా, అసభ్యంగా ప్రవర్తించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అపరిచిత వ్యక్తులతో సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయాలు పెంచుకోవద్దని, బాలికలు లక్ష్యంపై దృష్టి సారించాలని సూచించారు. ఏదైనా అత్యవసర సాయం కోసం 8712657676 నంబర్‌కు కాల్ చేయాలని కోరారు.ఏపీఎం బి. నిరంజన్ మాట్లాడుతూ, మే 2 నుంచి జూన్ 10 వరకు గ్రామ పంచాయతీల పరిధిలో స్నేహ (SNEHA- సేఫ్టీ, న్యూట్రిషన్, ఎంపవర్మెంట్, హెల్త్, అడోలెసెంట్స్) అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మ మాట్లాడుతూ.. బాలికలకు పౌష్టికాహారం ఎంతో అవసరమని, రక్తహీనతను నివారించేందుకు మంచి ఆహారం తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మండల కన్వీనర్, ఏపీఎం నిరంజన్, మహిళా సమాఖ్య కార్యదర్శి అనిత, హెల్త్ సూపర్వైజర్ నరేందర్, ఏఎన్ఎం చంద్రకళ, వీవోఏలు, సీసీలు పాల్గొన్నారు.1
- ఇటుక బ ట్టి నిర్వాహకులు కొత్త మాఫియాకు శ్రీకారం చుట్టారు మట్టి తరలించేందుకు ఏకంగా చెరువులో ఉన్న నీటిని ట్యాంకర్ల ద్వారా బయటకి వదిలేస్తూ చెరువును ఎండబెట్టి మట్టిని ఎత్తుకెళ్లి ఎందుకు సిద్ధమైనారు చెరువులో నుండి నీటిని పూర్తిగా తొలగించడంతో చాపలన్నీ మరణించి మత్స్యకారులకు నష్టాన్ని చేకూర్చాయి. మత్స్యకారులకు నయాను బయాను ముట్టజెప్పి రాత్రికి రాత్రే మట్టిని తరలించేందుకు చర్యలు చేపట్టారు. మండలంలోని హనుమంతుని పేట రాంపల్లి గౌరెడ్డిపేట రాఘవాపూర్ రంగాపూర్ ఇటుక బట్టీలకు ఇక్కడ నుండి మట్టిని తరలించేందుకు ఇటుక బట్టీల నిర్వహకులు పన్నాగం పన్నారు గ్రామీణ ప్రాంతాల అవడం చేత రాత్రి సమయంలో మట్టిని తీసుకెళ్లినను అధికారుల దృష్టి పడకుండా ఉంటుందంటూ ఈ చెరువు నుండి మట్టిని ఎత్తుకెళ్లేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు అధికారులు దృష్టికి ఇంతవరకు రాలేదంటూ అధికారులు తెలుపుతున్నారు.1
- కామారెడ్డి జిల్లా : నేడు చైర్మన్ తో పాటు కౌన్సిలర్ లు శ్మశాన వాటిక ను సందర్శించడం జరిగింది. శ్మశాన వాటిక అభివృద్ధి కోసం చేయాల్సిన పనుల విషయంలో DPR తయారీకి ప్రతిపాదనల కోసం పట్టణంలోని రెండు స్మశానాల లో సందర్శనను బీజేపీ కౌన్సిలర్ లు వాకౌట్ చేయటం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్ లు 16 మంది మాట్లాడుతూ స్మశాన వాటిక అభివృద్ధి కోసం గత రెండు రోజుల క్రితం స్వచ్ఛంద సంస్థ ద్వారా అభివృద్ధి చేయటానికి సుభాష్ రెడ్డి ముందుకు వచ్చిన నేపథ్యంలో ఇన్ని రోజులు లేనిది నేడు కొత్తగా స్మశాన వాటికలకు కోటి 30 లక్షల రూపాయలకు DPR తయారు చేయటానికి ఈ రోజు ఛైర్మెన్ సమక్షంలో కౌన్సిలర్ లు సందర్శన పెట్టడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుంది. స్వచ్ఛంద సంస్థ ద్వారా అభివృద్ధి చేస్తాం అంటుంటే ప్రభుత్వం తరుపున ఖర్చు చేయటం ఎందుకు అని, ఆ డబ్బులు పట్టణంలో వార్డుల అభివృద్ధికి కేటాయిస్తే బాగుంటుందని అన్నారు. స్మశాన అభివృద్ధికి బీజేపీ అడ్డంకి కాదు అని కానీ స్వచ్ఛంద సంస్థ ద్వారా అభివృద్ధి చేస్తాం అనగా DPR తయారు చేయడం ఎందుకు అని ప్రశ్నించారు.1
- కార్మికుల హక్కుల సాధన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పిలుపునిచ్చారు. శుక్రవారం సదాశివపేటలో నిర్వహించిన మే డే వేడుకల్లో ఆయన మాట్లాడారు. చికాగో నగర కార్మికుల వీరోచిత పోరాట ఫలితమే నేటి మే డే అని గుర్తుచేశారు. కార్మికులకు కచ్చితంగా 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రమజీవుల సంక్షేమానికి అందరూ అండగా ఉండాలని కోరారు.1
- బిజినపల్లి మండలం పాలెం గ్రామంలో కార్మిక దినోత్సవం సందర్భంగా సీఐటీయూ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల ప్రతినిధులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, కార్మికుల హక్కుల పరిరక్షణకు సీఐటీయూ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం కార్మికుల సమస్యలపై సానుకూలంగా స్పందించాలని ఆయన కోరారు.1
- ప్రెస్ నోట్: 1/5/2026 * *అమరవీరుల త్యాగ స్పూర్తితో - 8 గంటల పని దినాన్ని కాపాడుకుందాం* - * *కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్స్ రద్దుకై పోరాడుదాం* * *కామ్రేడ్ చంద్రశేఖర్ సిఐటియు జిల్లా అధ్యక్షులు* * *మే డే సందర్బంగా సీఐటీయు జెండా ఆవిష్కరణ* సీఐటీయు ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో సీఐటీయు *మేడే* సందర్భంగా జరిగిన జెండావిష్కరణ సందర్బంగా జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.అనంతరం వారు మాట్లాడుతూ...1886 లో చికాగో నగరంలోని హె మార్కెట్ వద్ద కార్మికులు 8 గంటల పని దినం కోసం ప్రదర్శన చేస్తుంటే పోలీసులు చేసిన కాల్పుల్లో 7గురు కార్మికులు అమరులైన త్యాగ ఫలితంగా మే డే వచ్చింది. కానీ నేడు కేంద్రంలో ఉన్న బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికుల హక్కులను 29 చట్టాలను రద్దు చేసి కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు అనుకూలముగా వారికీ లాభాలు కోసం 4 లేబర్ కోడ్స్ తెచ్చింది.ఈ లేబర్ కోడ్స్ అమలు జరిగితే కార్మికులు సంఘాటితంగా పోరాడే హక్కు, సమ్మె చేసే హక్కు, సంఘం పెట్టుకునే హక్కు , బెరసరలు చేసే హక్కు, కార్మికుల తొలగింపులు, ఉద్యోగం భద్రత ఇంకా అనేక కార్మికులు సౌకర్యాలు కోల్పోవడం జరుగుతుంది. బీజేపీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు పోరాటం చేయాలిసిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు సెక్రెటరీ ముధం అరుణ్ జిల్లా నాయకులు రాజనర్సు, మంద శ్రీనివాస్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ రేణుక, సత్యం మున్సిపల్ నాయకులు మహబూబ్ సంతోష్ దీవెన వాటర్ వర్క్స్ నాయకులు ఆయాజ్ ప్రభాకర్ నర్సింగరావు గంగాధర్ ఖలీల్ శ్రీధర్ అమాలి సంఘం నాయకులు రమేష్ నర్సింలు స్వామి లింగం రాజేష్ గంగారాం బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు జగదీశ్వర్ సాయిబాబా ఈశ్వర్ ఎల్ఐసి నాయకులు నర్సింగరావు నర్సింలు నయీమ్ మెడికల్ రిప్రజెంటిటీ నాయకులు రవీంద్ర చారి మహేందర్ రెడ్డి సంతోష్ మరియు ఇతర నాయకులు కార్మికులు పాల్గొనడం జరిగింది.1