👉 గజ్వేల్ సిద్దిపేట జిల్లా ప్రజా తెలంగాణ న్యూస్ / చదువుల తల్లీ సావిత్రి బాయ్ పూలె 195వ, జయంతి వేడుకలు... - మహాత్మ జ్యోతి బాపూలే - సావిత్రిబాయి పూలె దంపతులకు భారతరత్న ప్రకటించాలి... - సామాజిక కార్యకర్త, కంటస్టెడ్ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు సిద్దిపేట జిల్లా: జనవరి 04,(హుస్నాబాద్ నియోజకవర్గం/ కోహెడ మండలం) విద్య ద్వారానే శ్రీ విముక్తి సాధ్యమని నమ్మి బాలిక విద్య ఉద్యమానికి పునాదివేసిన గొప్ప సంఘసంస్కర్త శ్రీ అభ్యుదయవాది అణగారిన వర్గాలకు అండగా నిలబడిన సావిత్రి పూలే 195వ, జయంతి వేడుకలు సామాజిక కార్యకర్త, కంటస్టెడ్ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు ఆధ్వర్యంలో నిర్వహించగా ఇట్టి కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ బందెల సుజాత - బాలకిషన్ లు ముఖ్య అతిధిగా హాజరై సావిత్రి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ....కుల మత బేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిని అని సర్పంచ్ కొనియాడారు. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన గొప్ప మహానుభావురాలు సావిత్రి బాయి పూలే అన్నారు. కులవ్యవస్థ కు వ్యతిరేకంగా, మహిళల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం స్లాఘనీయమన్నారు. సమాజం లో అన్నో అవమానాలు ఎదురైనా మడమ తిప్పని ధీశాలి సావిత్రి బాయి పూలే అని కీర్తించారు. ఆధిపత్య కులాల వారి దాడులకు ఎదురొడ్డి నిలబడిన ధీర వనిత అని తెలిపారు. తమ పాఠశాలల్లోచదివే విద్యార్థులకు ఆ రోజుల్లోనే మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టిందని సర్పంచ్ సుజాత గుర్తు చేశారు. ఉపాధ్యాయురాలిగా, రచయిత్రి గా,సంఘసంస్కర్తగా ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఈకార్యక్రమంలో సామాజిక వేత్తలు వలుస సుభాష్, మాజీ సర్పంచ్ లు గోరీత్యాల లక్ష్మణ్, మంద రాజయ్య, ఉప సర్పంచ్ కందాల వెంకటేష్ గౌడ్,తెలంగాణ రాష్ట్ర జాక్ కన్వీనర్ మంద మల్లేశం, వార్డు సభ్యులు, మాజీ వార్డు సభ్యులు వేల్పుల వెంకట స్వామి,సామాజిక కార్యకర్త డాక్టర్ వేల్పుల జయ శంకర్,గవ్వ కలమ్మ ట్రస్ట్ అధ్యక్షులు గవ్వ వంశీదర్ రెడ్డి,పండ్ల సదానందం,వేల్పుల జాన్, తంగళ్లపల్లి మల్లేశం,అరె జగదీష్, మైనారిటీ నాయకులు మహమ్మద్ జాకీర్ హుస్సేన్,గుజ్జ సంజీవ్ రెడ్డి, వేముల శ్రీనివాస్ నేత,సూరు యాదగిరి,వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు.
👉 గజ్వేల్ సిద్దిపేట జిల్లా ప్రజా తెలంగాణ న్యూస్ / చదువుల తల్లీ సావిత్రి బాయ్ పూలె 195వ, జయంతి వేడుకలు... - మహాత్మ జ్యోతి బాపూలే - సావిత్రిబాయి పూలె దంపతులకు భారతరత్న ప్రకటించాలి... - సామాజిక కార్యకర్త, కంటస్టెడ్ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు సిద్దిపేట జిల్లా: జనవరి 04,(హుస్నాబాద్ నియోజకవర్గం/ కోహెడ మండలం) విద్య ద్వారానే శ్రీ విముక్తి సాధ్యమని నమ్మి బాలిక విద్య ఉద్యమానికి పునాదివేసిన గొప్ప సంఘసంస్కర్త శ్రీ అభ్యుదయవాది అణగారిన వర్గాలకు అండగా నిలబడిన సావిత్రి పూలే 195వ,
జయంతి వేడుకలు సామాజిక కార్యకర్త, కంటస్టెడ్ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు ఆధ్వర్యంలో నిర్వహించగా ఇట్టి కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ బందెల సుజాత - బాలకిషన్ లు ముఖ్య అతిధిగా హాజరై సావిత్రి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ....కుల మత బేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిని అని సర్పంచ్ కొనియాడారు. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన గొప్ప మహానుభావురాలు సావిత్రి బాయి పూలే అన్నారు. కులవ్యవస్థ కు వ్యతిరేకంగా, మహిళల
హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం స్లాఘనీయమన్నారు. సమాజం లో అన్నో అవమానాలు ఎదురైనా మడమ తిప్పని ధీశాలి సావిత్రి బాయి పూలే అని కీర్తించారు. ఆధిపత్య కులాల వారి దాడులకు ఎదురొడ్డి నిలబడిన ధీర వనిత అని తెలిపారు. తమ పాఠశాలల్లోచదివే విద్యార్థులకు ఆ రోజుల్లోనే మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టిందని సర్పంచ్ సుజాత గుర్తు చేశారు. ఉపాధ్యాయురాలిగా, రచయిత్రి గా,సంఘసంస్కర్తగా ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఈకార్యక్రమంలో సామాజిక వేత్తలు వలుస సుభాష్, మాజీ సర్పంచ్ లు
గోరీత్యాల లక్ష్మణ్, మంద రాజయ్య, ఉప సర్పంచ్ కందాల వెంకటేష్ గౌడ్,తెలంగాణ రాష్ట్ర జాక్ కన్వీనర్ మంద మల్లేశం, వార్డు సభ్యులు, మాజీ వార్డు సభ్యులు వేల్పుల వెంకట స్వామి,సామాజిక కార్యకర్త డాక్టర్ వేల్పుల జయ శంకర్,గవ్వ కలమ్మ ట్రస్ట్ అధ్యక్షులు గవ్వ వంశీదర్ రెడ్డి,పండ్ల సదానందం,వేల్పుల జాన్, తంగళ్లపల్లి మల్లేశం,అరె జగదీష్, మైనారిటీ నాయకులు మహమ్మద్ జాకీర్ హుస్సేన్,గుజ్జ సంజీవ్ రెడ్డి, వేముల శ్రీనివాస్ నేత,సూరు యాదగిరి,వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు.
- ఈనెల 4వ తేదీన హైదరాబాద్లోని ఎల్ బి ఇండోర్ స్టేడియంలో విక్టరీ షోటోఖాన్ ఆర్గనైజేషన్ డు ఇండియా వారి ఆధ్వర్యంలో 30వ ఓపెన్ టు ఆల్ స్టైల్ ఛాంపియన్షిప్ నిర్వహించడం జరిగింది. ఈ పోటీలకు నల్గొండ పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్ లోని షావోలిన్ షోటోఖాన్ స్పోర్ట్స్ కరాటే ఇండియాకు చెందిన విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలు నిర్వాహకులు ఎన్ బాబురావు మరియు విక్టరీ షోటోకాన్ ఫౌండర్ ఇంటర్నేషనల్ రెఫ్రి రంగు మల్లికార్జున్ గౌడ్ చేతుల మీదుగా జాతీయస్థాయిలో గెలుపొందిన విద్యార్థులకు మెడల్స్ మరియు సర్టిఫికెట్స్ అందజేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులను అభినందించారు. జాతీయస్థాయిలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థుల పేర్లు : బాలికల సి గ్రూప్ కటాస్ విభాగంలో 1. రెముడాల హాసిని గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నారు. బాలుర ఈ గ్రూప్ కటాస్ విభాగంలో 2. సిలువేరు యోగేందర్ సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నారు. శ్రీ చైతన్య స్కూల్ డైరెక్టర్స్ చిలువేరు యాదయ్య, యాస శ్రీనివాస్ రెడ్డి, గడ్డం త్రిమూర్తి, కుక్క పల్లి నాగేశ్వరరావు జాతీయస్థాయిలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులను అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఏకాగ్రతతో సాధన చేస్తూ మునుముందు మరిన్ని విజయాలు సాధిస్తూ కీర్తిదాయకంగా ఎదగాలని కోరారు. సిలువేరు నరసింహ, సిలివేరు అనిత, రెముడాల శ్రీనివాస్, రెముడాల శైలజ మరియు శ్రీ చైతన్య స్కూల్ స్టాఫ్ జాతీయస్థాయిలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులను అభినందించారు. షావలిన్ షోటోఖాన్ స్పోర్ట్స్ కరాటే ఇండియా ఫౌండర్ & డైరెక్టర్ బ్లాక్ బెల్ట్ 7th ఇండియా చీఫ్ ఇన్స్ట్రక్టర్ ఇండియా సీనియర్ ఎగ్జామినర్ నాంపల్లి కనకారావు మాట్లాడుతూ ఏకాగ్రతతో సాధన చేస్తూ, శక్తి సామర్థ్యాలను మెరుగుపరచుకొని, మరెన్నో విజయాలు సాధించాలని అన్నారు. అలాగే జాతీయస్థాయిలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులను అభినందించారు.1
- ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరావు, సీతక్క ఆదివారం పర్యటించి మహా జాతర ఏర్పాట్లను పరిశీలించారు. రోడ్ల నిర్మాణం, క్యూ లైన్లు, భక్తుల కోసం తాత్కాలిక వసతుల ఏర్పాట్లను తనిఖీ చేసి, లక్షలాది భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారం మహా జాతర జరగనుంది.1
- సెల్యూట్ చేయడం సర్వీస్ నిబంధనలకు విరుద్ధం వరంగల్ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళికి మిల్స్ కాలనీ సీఐ రమేష్ యూనిఫాంలో సెల్యూట్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అధికారిక పదవిలో లేని వ్యక్తికి సెల్యూట్ చేయడం సర్వీస్ నిబంధనలకు విరుద్ధమని నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. సెల్యూట్ అనేది కేవలం అధికారిక హోదా ఉన్న రాజ్యాంగ పదవులకు మాత్రమే పరిమితమై ఉండాలని, మాజీ హోదా ఆధారంగా ఇవ్వడం నిబంధనల ఉల్లంఘనేనని స్పష్టం చేస్తున్నారు.1
- మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురం- కంటాయపాలెం గ్రామాల మధ్య గత ప్రభుత్వంలో బీటీ రోడ్డు వేశారు. కానీ బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడంతో అవసరాల నిమిత్తం వెళ్లే రైతులు, కూలీలు, వాహనదారులు వాగు దాటే క్రమంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు తక్షణమే స్పందించి వాగుపై బ్రిడ్జిని నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.1
- జగిత్యాల పట్టణంలోని స్థానిక ఇందిరా భవన్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలు అభిమానుల మధ్య ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలామంది అంటున్నారు మన పార్టీ అధికారంలో ఉన్న మనకేంటి కష్టాలు అని? కానీ కష్టాల్లోనే గుర్తింపు ఉంటుంది... పాండవుల వనవాసం 14 సంవత్సరాల ముగిసింది ... అలాగే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో విజయంతో మన అజ్ఞాతవాసం కూడా ముగియనుంది.. అభిమానం అనేది పదవులతో రాదు నాకు ఈ అభిమానం పూర్వజన్మ సుకృతం దేవుడిచ్చిన వరం.. నా 75 సంవత్సరాల జీవితంలో ప్రజా జీవితం 50 సంవత్సరాలు అని అభిమానుల మధ్య ఉద్వేగపూరితంగా ప్రసంగించారు1
- ముందుకు సాగని వంతెనల పనులు జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో ఏళ్లు గడుస్తున్నా వంతెన పనులు ముందుకు సాగడం లేదు. మండలంలోని రోటిగూడా గ్రామ శివారులో ఉన్న వాగుపై 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వంతెన నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. ఆ వంతెన నిర్మాణం 20 సంవత్సరాలుగా పెండింగ్ లోనే ఉంది. అదే గ్రామ శివారులోని మరో వాగుపై లో లెవెల్ వంతెన ఉంది. ఆ వాగుపై హై లెవెల్ వంతెన మంజూరైన ఇంతవరకు నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. ఆయా వంతెనల పనులను వెంటనే ప్రారంభించి వేసవిలోపు పూర్తయ్యలా చూడాలని స్థానిక ప్రజలు కోరారు.1
- రోడ్డు భద్రత నియమాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య1
- సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాసవిభవన్లో వాసవి మాత డైరీలను వాసవి క్లబ్ సభ్యులు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి మాత కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు.1
- హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచెర్ల శివారులో మహారాష్ట్రకు చెందిన ముఠా, పూజలు చేస్తే డబ్బులు రెట్టింపు అవుతాయని నమ్మించి తండ్రి–కొడుకులను మోసం చేసి 50 లక్షల రూపాయలతో పరారైంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా ధర్మసాగర్ సీఐ శ్రీధర్ రావు మాట్లాడుతూ, ప్రజలు మూఢనమ్మకాలు మరియు మోసపూరిత మాటలు నమ్మి మోసపోవద్దని, సైబర్ మోసాలు మరియు అనుమానితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100కు డయల్ చేయాలని తెలిపారు.2