logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ప్రతి శుక్రవారం నియోజకవర్గ స్థాయిలో ప్రజా ప్రతినిధులతో కలిసి పీజీఆర్ఎస్ కార్యక్రమాలు ప్రజా సమస్యలను మండల స్థాయిలోనే పరిష్కరించే లక్ష్యంతో ప్రతి నెలలోని శుక్రవారాల్లో నియోజకవర్గాల వారీగా ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజకుమారి తెలిపారు. ఒకే వారంలో అన్ని సమస్యలు పరిష్కరించడం సాధ్యం కాకపోవడంతో, నెలలోని అన్ని శుక్రవారాల్లో ఒకే నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా సమస్యలను సమగ్రంగా పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. ఇందులో భాగంగా 134-ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మే నుంచి జూన్ వరకు, 135-శ్రీశైలం నియోజకవర్గంలో జూన్ నుంచి జూలై వరకు, 136-నందికొట్కూరు నియోజకవర్గంలో జూలై నుంచి ఆగస్టు వరకు, 138-పాణ్యం నియోజకవర్గంలో ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు, 139-నంద్యాల నియోజకవర్గంలో సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు, 140-బనగానపల్లె నియోజకవర్గంలో అక్టోబర్ నుంచి నవంబర్ వరకు, 141-డోన్ నియోజకవర్గంలో నవంబర్ నుంచి డిసెంబర్ వరకు ప్రతి శుక్రవారం పీజీఆర్ఎస్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సదరు కార్యక్రమాల రోజుల్లో ప్రజా ప్రతినిధులు ఆయా నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రభుత్వ సెలవులు వచ్చిన సందర్భంలో గురువారం లేదా శనివారం నిర్వహించే అవకాశం ఉంటుందని, అవసరమైతే సెలవు రోజుల్లో కూడా కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు. ఇందుకు సంబంధించి మండల, మున్సిపల్, కలెక్టరేట్ అధికారులు సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించి ఆర్థిక, ఆర్థికేతర అంశాల్లో నంద్యాల జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందని కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే స్థూల దేశీయోత్పత్తి సూచికల్లో 18వ స్థానం, కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లలో మెరుగైన ప్రగతి నమోదు చేసినట్లు తెలిపారు. మండలాల్లో తాగునీటి, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా పంచాయతీ మరియు మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి, అవసరమైన చర్యలపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని సూచించారు

1 hr ago
user_Naga kanth
Naga kanth
బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
1 hr ago
7df0d322-635d-4af2-a0e3-b25e39c9d266

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయపు శుభాభివందనాలు తెలిపారు. మీ చేతి పనులకు ఎదురయ్యే ఆటంకాలు తొలగి, క్షేమకరమైన దీవెనలు పొందుకోవాలని ఆశీర్వదించారు. మీరు అనేకులకు వెలుగుగా, దీవెనగా ఉండాలని ప్రార్థన చేశారు.
    1
    ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయపు శుభాభివందనాలు తెలిపారు. మీ చేతి పనులకు ఎదురయ్యే ఆటంకాలు తొలగి, క్షేమకరమైన దీవెనలు పొందుకోవాలని ఆశీర్వదించారు. మీరు అనేకులకు వెలుగుగా, దీవెనగా ఉండాలని ప్రార్థన చేశారు.
    user_T. Raja simha
    T. Raja simha
    బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడమే లక్ష్యమని ఎమ్మిగనూరు సీఐ కంభగిరి రాముడు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు.
    1
    ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడమే లక్ష్యమని ఎమ్మిగనూరు సీఐ కంభగిరి రాముడు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు.
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • ఆదోని కొత్త బైపాస్ సమీపంలో చెట్టుకు ఉరివేసుకుని నాగరాజు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు, భార్య ఉన్న ఆయన మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
    1
    ఆదోని కొత్త బైపాస్ సమీపంలో చెట్టుకు ఉరివేసుకుని నాగరాజు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు, భార్య ఉన్న ఆయన మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
    user_K Thasleema  MA JOURNALISM
    K Thasleema MA JOURNALISM
    ఆదోని, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం తుమ్మలవందలో ఉపాధి హామీ పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులతో స్థానికుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది, వారి జీవనోపాధికి భరోసా లభించింది.
    1
    అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం తుమ్మలవందలో ఉపాధి హామీ పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులతో స్థానికుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది, వారి జీవనోపాధికి భరోసా లభించింది.
    user_User6531
    User6531
    Librarian Koyyuru, Alluri Sitharama Raju•
    12 hrs ago
  • Post by N Nagaraju
    2
    Post by N Nagaraju
    user_N Nagaraju
    N Nagaraju
    Parigi, Sri Sathya Sai•
    23 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    21 hrs ago
  • కర్నూలు జిల్లాలోని హాలహర్వి గ్రామంలో శిఖర కలశ ప్రతిష్ట మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో గ్రామం కిక్కిరిసిపోయింది. ఆధ్యాత్మిక శోభతో ఆలయ ప్రాంగణం నిండిపోయింది.
    1
    కర్నూలు జిల్లాలోని హాలహర్వి గ్రామంలో శిఖర కలశ ప్రతిష్ట మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో గ్రామం కిక్కిరిసిపోయింది. ఆధ్యాత్మిక శోభతో ఆలయ ప్రాంగణం నిండిపోయింది.
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • ry the okay okay okay no problem at good time to time hi gh er white colour and colour
    1
    ry the okay okay okay no problem at good time to time hi 
gh er white colour and colour
    user_Shaik Ismail
    Shaik Ismail
    శాంతమగులూరు, బాపట్ల, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • బత్తాయి తోటల అభివృద్ధి కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం: సుభాషిని నల్గొండ జిల్లాలో బత్తాయి తోటల అభివృద్ధి కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని జిల్లా ఉద్యానవన & పట్టు పరిశ్రమల శాఖ అధికారి సుభాషిని తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. బత్తాయి తోటలో దిగుబడి తక్కువగా వచ్చి నష్టపోతున్నామని అనేక మంది రైతులు చెబుతున్నారని, భూమి సారం కోల్పోవడం ద్వారా దిగుబడి తగ్గుతుందని అధికారులు చెప్పే సలహాలు సూచనలు పాటిస్తూ దిగుబడిని పెంచుకోవాలని సూచించారు. గతంలో కంటే ఈసారి రికార్డు స్థాయిలో బత్తాయికి రేటు ఉందని తెలిపారు.
    1
    బత్తాయి తోటల అభివృద్ధి కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం: సుభాషిని
నల్గొండ జిల్లాలో బత్తాయి తోటల అభివృద్ధి కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని జిల్లా ఉద్యానవన & పట్టు పరిశ్రమల శాఖ అధికారి సుభాషిని తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. బత్తాయి తోటలో దిగుబడి తక్కువగా వచ్చి నష్టపోతున్నామని అనేక మంది రైతులు చెబుతున్నారని, భూమి సారం కోల్పోవడం ద్వారా దిగుబడి తగ్గుతుందని అధికారులు చెప్పే సలహాలు సూచనలు పాటిస్తూ దిగుబడిని పెంచుకోవాలని సూచించారు. గతంలో కంటే ఈసారి రికార్డు స్థాయిలో బత్తాయికి రేటు ఉందని తెలిపారు.
    user_T Shankar Public News Reporter Nalgonda
    T Shankar Public News Reporter Nalgonda
    రిపోర్టర్ Nalgonda, Telangana•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.