logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

తెలంగాణ రక్షణ సేన జులై 2న ఉప్పల్ బాగయాత్‌లో 'భూ పోరాటం' నిర్వహించనున్నట్లు ప్రకటించింది. జిల్లా కార్యాలయంలో దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా, కేకే కమిటీని కేవలం కాలయాపన కోసమే ఏర్పాటు చేశారని, తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని తీవ్రంగా విమర్శించారు. 1969 నుండి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ఎంతో మంది తెలంగాణ ఉద్యమకారులు పాల్గొని అనేక కేసుల పాలై, లాఠీ దెబ్బలు తిని, సర్వం కోల్పోయారని, చివరకు చాలా మంది తమ జీవితాలనే కోల్పోయి రాష్ట్రాన్ని సాధించుకున్నారని వక్తలు గుర్తుచేశారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వం ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చడంలో మరియు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో, జులై 2వ తేదీన ఉప్పల్ బాగయాత్‌లో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో భూ పోరాటం చేపట్టి, కవితమ్మ నాయకత్వంలో భూ పంపిణీ చేస్తామని ప్రకటించారు. జులై 2న ఉప్పల్ బాగయాత్‌లో జరగనున్న ఈ భూ పోరాటాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

2 hrs ago
user_OM NAMSHIVAYA
OM NAMSHIVAYA
Karimnagar, Telangana•
2 hrs ago

తెలంగాణ రక్షణ సేన జులై 2న ఉప్పల్ బాగయాత్‌లో 'భూ పోరాటం' నిర్వహించనున్నట్లు ప్రకటించింది. జిల్లా కార్యాలయంలో దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా, కేకే కమిటీని కేవలం కాలయాపన కోసమే ఏర్పాటు చేశారని, తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని తీవ్రంగా విమర్శించారు. 1969 నుండి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ఎంతో మంది తెలంగాణ ఉద్యమకారులు పాల్గొని అనేక కేసుల పాలై, లాఠీ దెబ్బలు తిని, సర్వం కోల్పోయారని, చివరకు చాలా మంది తమ జీవితాలనే కోల్పోయి రాష్ట్రాన్ని సాధించుకున్నారని వక్తలు గుర్తుచేశారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వం ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చడంలో మరియు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో, జులై 2వ తేదీన ఉప్పల్ బాగయాత్‌లో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో భూ పోరాటం చేపట్టి, కవితమ్మ నాయకత్వంలో భూ పంపిణీ చేస్తామని ప్రకటించారు. జులై 2న ఉప్పల్ బాగయాత్‌లో జరగనున్న ఈ భూ పోరాటాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

More news from Telangana and nearby areas
  • తెలంగాణ రక్షణ సేన జులై 2న ఉప్పల్ బాగయాత్‌లో 'భూ పోరాటం' నిర్వహించనున్నట్లు ప్రకటించింది. జిల్లా కార్యాలయంలో దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా, కేకే కమిటీని కేవలం కాలయాపన కోసమే ఏర్పాటు చేశారని, తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని తీవ్రంగా విమర్శించారు. 1969 నుండి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ఎంతో మంది తెలంగాణ ఉద్యమకారులు పాల్గొని అనేక కేసుల పాలై, లాఠీ దెబ్బలు తిని, సర్వం కోల్పోయారని, చివరకు చాలా మంది తమ జీవితాలనే కోల్పోయి రాష్ట్రాన్ని సాధించుకున్నారని వక్తలు గుర్తుచేశారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వం ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చడంలో మరియు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో, జులై 2వ తేదీన ఉప్పల్ బాగయాత్‌లో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో భూ పోరాటం చేపట్టి, కవితమ్మ నాయకత్వంలో భూ పంపిణీ చేస్తామని ప్రకటించారు. జులై 2న ఉప్పల్ బాగయాత్‌లో జరగనున్న ఈ భూ పోరాటాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
    1
    తెలంగాణ రక్షణ సేన జులై 2న ఉప్పల్ బాగయాత్‌లో 'భూ పోరాటం' నిర్వహించనున్నట్లు ప్రకటించింది. జిల్లా కార్యాలయంలో దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా, కేకే కమిటీని కేవలం కాలయాపన కోసమే ఏర్పాటు చేశారని, తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని తీవ్రంగా విమర్శించారు.

1969 నుండి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ఎంతో మంది తెలంగాణ ఉద్యమకారులు పాల్గొని అనేక కేసుల పాలై, లాఠీ దెబ్బలు తిని, సర్వం కోల్పోయారని, చివరకు చాలా మంది తమ జీవితాలనే కోల్పోయి రాష్ట్రాన్ని సాధించుకున్నారని వక్తలు గుర్తుచేశారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వం ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చడంలో మరియు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.

ఈ నేపథ్యంలో, జులై 2వ తేదీన ఉప్పల్ బాగయాత్‌లో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో భూ పోరాటం చేపట్టి, కవితమ్మ నాయకత్వంలో భూ పంపిణీ చేస్తామని ప్రకటించారు. జులై 2న ఉప్పల్ బాగయాత్‌లో జరగనున్న ఈ భూ పోరాటాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    2 hrs ago
  • భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) కరీంనగర్ జిల్లా కమిటీ బుధవారం కరీంనగర్ పట్టణంలోని ప్రభుత్వ సైన్స్ వింగ్ జూనియర్ కళాశాలను సర్వే చేసింది. ఈ సందర్భంగా నాయకులు విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ, ఎంతోమంది మేధావులను అందించిన సైన్స్ వింగ్ కళాశాల ప్రస్తుతం కనీస వసతులు లేక అల్లాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలలో విద్యార్థులకు సరిపడా బెంచీలు, క్లాస్ రూములు, ల్యాబ్‌లు లేని పరిస్థితి ఉందని, మొత్తం 26 తరగతి గదులు అవసరం ఉండగా, కేవలం 12 రూములతోనే నెట్టుకొస్తున్నారని విమర్శించారు. పక్కనే ఉన్న పాడుబడిన తరగతి గదుల్లో సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. అంతేకాకుండా, ఏఈటీ (AET) సబ్జెక్టుకు కనీసం ఫ్యాకల్టీని కూడా రిక్రూట్ చేయలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, ఈ విద్యాసంవత్సరంలో నూతన సిలబస్ ప్రవేశపెట్టి, ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ల్యాబ్‌లు నిర్వహించాలని చెప్తున్నప్పటికీ, కళాశాలలో మాత్రం ఎలాంటి ల్యాబ్ పరికరాలు లేవని ఆయన మండిపడ్డారు. కరీంనగర్ నడిబొడ్డున ఉన్న ఈ కళాశాల సమస్యలు అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పినప్పటికీ, ఇప్పటికీ విద్యార్థులను, విద్యారంగ సమస్యలను పట్టించుకున్న దాఖలాలు రాష్ట్రవ్యాప్తంగా లేవని శ్రీకాంత్ ఆరోపించారు. రోజురోజుకూ విద్యార్థులకు సమస్యలు పుట్టగొడుగుల్లా పెరిగిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చలనం లేదని ఆయన అన్నారు. ప్రతి ఏటా విద్యారంగానికి కేటాయించే బడ్జెట్‌లో కోతలు వేస్తూ పేద, మధ్యతరగతి విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు లేని పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తోందని విమర్శించారు. కావున ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి సైన్స్ వింగ్ కళాశాలకు ల్యాబ్ పరికరాలను సమకూర్చాలని, మౌలిక వసతులు కల్పించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. అంతేకాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరింది. లేనిపక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వినయ్, గట్టు ఆకాష్, జిల్లా కమిటీ సభ్యులు సన్నీ, నరేష్ తో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.
    3
    భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) కరీంనగర్ జిల్లా కమిటీ బుధవారం కరీంనగర్ పట్టణంలోని ప్రభుత్వ సైన్స్ వింగ్ జూనియర్ కళాశాలను సర్వే చేసింది. ఈ సందర్భంగా నాయకులు విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ, ఎంతోమంది మేధావులను అందించిన సైన్స్ వింగ్ కళాశాల ప్రస్తుతం కనీస వసతులు లేక అల్లాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలలో విద్యార్థులకు సరిపడా బెంచీలు, క్లాస్ రూములు, ల్యాబ్‌లు లేని పరిస్థితి ఉందని, మొత్తం 26 తరగతి గదులు అవసరం ఉండగా, కేవలం 12 రూములతోనే నెట్టుకొస్తున్నారని విమర్శించారు. పక్కనే ఉన్న పాడుబడిన తరగతి గదుల్లో సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. అంతేకాకుండా, ఏఈటీ (AET) సబ్జెక్టుకు కనీసం ఫ్యాకల్టీని కూడా రిక్రూట్ చేయలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, ఈ విద్యాసంవత్సరంలో నూతన సిలబస్ ప్రవేశపెట్టి, ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ల్యాబ్‌లు నిర్వహించాలని చెప్తున్నప్పటికీ, కళాశాలలో మాత్రం ఎలాంటి ల్యాబ్ పరికరాలు లేవని ఆయన మండిపడ్డారు. కరీంనగర్ నడిబొడ్డున ఉన్న ఈ కళాశాల సమస్యలు అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పినప్పటికీ, ఇప్పటికీ విద్యార్థులను, విద్యారంగ సమస్యలను పట్టించుకున్న దాఖలాలు రాష్ట్రవ్యాప్తంగా లేవని శ్రీకాంత్ ఆరోపించారు. రోజురోజుకూ విద్యార్థులకు సమస్యలు పుట్టగొడుగుల్లా పెరిగిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చలనం లేదని ఆయన అన్నారు. ప్రతి ఏటా విద్యారంగానికి కేటాయించే బడ్జెట్‌లో కోతలు వేస్తూ పేద, మధ్యతరగతి విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు లేని పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తోందని విమర్శించారు.

కావున ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి సైన్స్ వింగ్ కళాశాలకు ల్యాబ్ పరికరాలను సమకూర్చాలని, మౌలిక వసతులు కల్పించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. అంతేకాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరింది. లేనిపక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వినయ్, గట్టు ఆకాష్, జిల్లా కమిటీ సభ్యులు సన్నీ, నరేష్ తో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    10 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని బాలమిత్ర ప్రైవేట్ పాఠశాలలో నాలుగేళ్ల చిన్నారి అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. తరగతి గదిలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. చిన్నారి మృతితో తీవ్ర ఆవేదనకు గురైన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ, చిన్నారి మృతదేహంతో పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చిన్నారి మృతిపై ఆరా తీశారు. గత కొంత కాలంగా ఆ చిన్నారి అనారోగ్యంతో బాధపడుతోందని, అనారోగ్య సమస్యతోనే మృతి చెందినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. అనంతరం ఆందోళన చేస్తున్న తల్లిదండ్రులను విరమింపజేశారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయని, తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి తగిన చర్యలు చేపడతామని పోలీసులు వివరించారు.
    4
    రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని బాలమిత్ర ప్రైవేట్ పాఠశాలలో నాలుగేళ్ల చిన్నారి అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. తరగతి గదిలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. చిన్నారి మృతితో తీవ్ర ఆవేదనకు గురైన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ, చిన్నారి మృతదేహంతో పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చిన్నారి మృతిపై ఆరా తీశారు. గత కొంత కాలంగా ఆ చిన్నారి అనారోగ్యంతో బాధపడుతోందని, అనారోగ్య సమస్యతోనే మృతి చెందినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. అనంతరం ఆందోళన చేస్తున్న తల్లిదండ్రులను విరమింపజేశారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయని, తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి తగిన చర్యలు చేపడతామని పోలీసులు వివరించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం నిర్వహించనున్న గిరిప్రదక్షిణ కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 5:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మండలంలోని భక్తులతో పాటు కరీంనగర్, సిద్ధిపేట జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారని ఆలయ ప్రధాన పూజారి శేషం మధుసూదనాచార్యులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బెజ్జంకి సర్పంచ్ బొల్లం శ్రీధర్ వెల్లడించారు. గిరిప్రదక్షిణలో పాల్గొని శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆశీస్సులు పొందాలని ఆయన భక్తులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ప్రత్యేక చర్యలు చేపట్టింది.
    1
    బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం నిర్వహించనున్న గిరిప్రదక్షిణ కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 5:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మండలంలోని భక్తులతో పాటు కరీంనగర్, సిద్ధిపేట జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారని ఆలయ ప్రధాన పూజారి శేషం మధుసూదనాచార్యులు తెలిపారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బెజ్జంకి సర్పంచ్ బొల్లం శ్రీధర్ వెల్లడించారు. గిరిప్రదక్షిణలో పాల్గొని శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆశీస్సులు పొందాలని ఆయన భక్తులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ప్రత్యేక చర్యలు చేపట్టింది.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    17 hrs ago
  • అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, దేశం ఎదుర్కొంటున్న విద్యార్థుల జటిలమైన సమస్యపై దృష్టి సారించారు. కోటాలో వరుస ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడి విద్యార్థులతో సమావేశమై పరిస్థితులను సమీక్షించారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న నిరుద్యోగం, విద్యార్థుల ఆత్మహత్యలు, వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విద్యావ్యవస్థ తీరు విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆయన ప్రస్తావించారు. విద్యా వ్యవస్థలో మార్పులు, సంస్కరణలు చేయడం ద్వారా లోపాలను సరిదిద్దవచ్చని రాహుల్ గాంధీ సూచించారు. యువత భవిష్యత్తు రక్షణ కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టేలా ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన నొక్కి చెప్పారు. ఇటీవల జరిగిన నీట్ పరీక్ష దేశ విద్యా వ్యవస్థలోని లోపాలను స్పష్టంగా చూపించిందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. సుమారు 22 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాయడానికి సిద్ధమైతే, ఒక విద్యార్థిపై ఒక కుటుంబం పది నుంచి పదిహేను లక్షల వరకు ఖర్చు చేస్తోందని తెలిపారు. గణాంకాల ప్రకారం, కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖకు కేటాయించే బడ్జెట్ (1.4 లక్షల కోట్లు) కంటే, Gen Z కుటుంబాలు SSC, UPSC, RRB, JEE, నీట్ పరీక్షల కోసం పెట్టే ఖర్చు (3.5 లక్షల కోట్లు) మూడు రెట్లు ఎక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా మూడు వేల మంది పరీక్షలు రాస్తే ఒకరు మాత్రమే ఐఏఎస్‌కు సెలెక్ట్ అయ్యే పరిస్థితి నెలకొందని, మిగతావారు అసంఘటిత రంగ వ్యవస్థలలో పనిచేసే దుస్థితి దాపురించిందని ఆందోళన వ్యక్తం చేశారు. నీట్ పరీక్షకు ముందే పేపర్ లీక్ అయి దేశవ్యాప్తంగా పరీక్ష వాయిదా వేయాల్సి వచ్చిందని, దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయని, కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని ముక్తకంఠంతో నినదించాల్సి వచ్చిందని గుర్తుచేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీల వల్ల దేశవ్యాప్తంగా 1000కి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని, శ్రేయ అనే విద్యార్థిని మళ్లీ నీట్ పరీక్ష రాయడం కోసం కుటుంబానికి భారంగా మారకూడదని ఆత్మహత్య చేసుకున్న సంఘటన దేశ ప్రజలందరికీ తెలిసిందేనని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ విద్యార్థుల తరఫున గళమెత్తి, యువతకు కావలసిన విద్య, ఉపాధి అవకాశాలను కల్పించాలని డిమాండ్ చేశారు. పోటీ పరీక్షలకు సిద్ధమవడానికి కోచింగ్ సెంటర్లు, హాస్టల్లు, ఫీజుల వసూలు వంటి అంశాలలో దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. విద్యార్థులకు న్యాయం చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఈ అంశంలో విద్యార్థులకు తీరని అన్యాయం చేసిన కేంద్ర విద్యా శాఖ మంత్రిపై చర్యలు తీసుకుంటూ, జరిగిన లీకేజీలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యపై పోరాడటానికి, జూన్ 25 నుండి ఆగస్టు 9 వరకు నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా, యూత్ కాంగ్రెస్, అన్ని విభాగాల కార్యవర్గాలు, మండల కాంగ్రెస్, బ్లాక్ కాంగ్రెస్, జిల్లా కాంగ్రెస్ కార్యవర్గాలు అన్నీ కలిసి కార్యాచరణతో సిద్ధమవుతున్నాయి. ఆగస్టు 9న చలో ఢిల్లీ కార్యక్రమంతో దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు విద్యా వ్యవస్థపై జరుగుతున్న దోపిడీ, అన్యాయాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా కేంద్ర విద్యా శాఖ మంత్రిపై చర్యలు తీసుకుంటూ, అతడిని కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మీడియా సమావేశంలో డీసీసీ ఉపాధ్యక్షులు కూరగాయల కొమరయ్య, దత్తాత్రేయ గౌడ్, పిల్లి కనకయ్య, పులి రాంబాబు, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి చిలుక రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శులు వకులాభరణం శ్రీనివాస్, గొట్టే రుక్మిణి, రాగుల జగన్, మంగకిరణ్, గిరిధర్ రెడ్డి, బాల్ లక్ష్మి, సోమల రోజా, వనిత, నాగుల విష్ణు, మిరియాల కార్ శ్రీనివాస్, ఫిరోజ్ పాషా, అరుణ్ చారి, వెంకట్ రెడ్డి, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు రియాజ్ తదితరులు పాల్గొన్నారు.
    2
    అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, దేశం ఎదుర్కొంటున్న విద్యార్థుల జటిలమైన సమస్యపై దృష్టి సారించారు. కోటాలో వరుస ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడి విద్యార్థులతో సమావేశమై పరిస్థితులను సమీక్షించారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న నిరుద్యోగం, విద్యార్థుల ఆత్మహత్యలు, వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విద్యావ్యవస్థ తీరు విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆయన ప్రస్తావించారు. విద్యా వ్యవస్థలో మార్పులు, సంస్కరణలు చేయడం ద్వారా లోపాలను సరిదిద్దవచ్చని రాహుల్ గాంధీ సూచించారు. యువత భవిష్యత్తు రక్షణ కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టేలా ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన నొక్కి చెప్పారు.

ఇటీవల జరిగిన నీట్ పరీక్ష దేశ విద్యా వ్యవస్థలోని లోపాలను స్పష్టంగా చూపించిందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. సుమారు 22 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాయడానికి సిద్ధమైతే, ఒక విద్యార్థిపై ఒక కుటుంబం పది నుంచి పదిహేను లక్షల వరకు ఖర్చు చేస్తోందని తెలిపారు. గణాంకాల ప్రకారం, కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖకు కేటాయించే బడ్జెట్ (1.4 లక్షల కోట్లు) కంటే, Gen Z కుటుంబాలు SSC, UPSC, RRB, JEE, నీట్ పరీక్షల కోసం పెట్టే ఖర్చు (3.5 లక్షల కోట్లు) మూడు రెట్లు ఎక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా మూడు వేల మంది పరీక్షలు రాస్తే ఒకరు మాత్రమే ఐఏఎస్‌కు సెలెక్ట్ అయ్యే పరిస్థితి నెలకొందని, మిగతావారు అసంఘటిత రంగ వ్యవస్థలలో పనిచేసే దుస్థితి దాపురించిందని ఆందోళన వ్యక్తం చేశారు. నీట్ పరీక్షకు ముందే పేపర్ లీక్ అయి దేశవ్యాప్తంగా పరీక్ష వాయిదా వేయాల్సి వచ్చిందని, దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయని, కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని ముక్తకంఠంతో నినదించాల్సి వచ్చిందని గుర్తుచేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు.

పేపర్ లీకేజీల వల్ల దేశవ్యాప్తంగా 1000కి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని, శ్రేయ అనే విద్యార్థిని మళ్లీ నీట్ పరీక్ష రాయడం కోసం కుటుంబానికి భారంగా మారకూడదని ఆత్మహత్య చేసుకున్న సంఘటన దేశ ప్రజలందరికీ తెలిసిందేనని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ విద్యార్థుల తరఫున గళమెత్తి, యువతకు కావలసిన విద్య, ఉపాధి అవకాశాలను కల్పించాలని డిమాండ్ చేశారు. పోటీ పరీక్షలకు సిద్ధమవడానికి కోచింగ్ సెంటర్లు, హాస్టల్లు, ఫీజుల వసూలు వంటి అంశాలలో దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. విద్యార్థులకు న్యాయం చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఈ అంశంలో విద్యార్థులకు తీరని అన్యాయం చేసిన కేంద్ర విద్యా శాఖ మంత్రిపై చర్యలు తీసుకుంటూ, జరిగిన లీకేజీలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఈ సమస్యపై పోరాడటానికి, జూన్ 25 నుండి ఆగస్టు 9 వరకు నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా, యూత్ కాంగ్రెస్, అన్ని విభాగాల కార్యవర్గాలు, మండల కాంగ్రెస్, బ్లాక్ కాంగ్రెస్, జిల్లా కాంగ్రెస్ కార్యవర్గాలు అన్నీ కలిసి కార్యాచరణతో సిద్ధమవుతున్నాయి. ఆగస్టు 9న చలో ఢిల్లీ కార్యక్రమంతో దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు విద్యా వ్యవస్థపై జరుగుతున్న దోపిడీ, అన్యాయాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా కేంద్ర విద్యా శాఖ మంత్రిపై చర్యలు తీసుకుంటూ, అతడిని కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మీడియా సమావేశంలో డీసీసీ ఉపాధ్యక్షులు కూరగాయల కొమరయ్య, దత్తాత్రేయ గౌడ్, పిల్లి కనకయ్య, పులి రాంబాబు, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి చిలుక రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శులు వకులాభరణం శ్రీనివాస్, గొట్టే రుక్మిణి, రాగుల జగన్, మంగకిరణ్, గిరిధర్ రెడ్డి, బాల్ లక్ష్మి, సోమల రోజా, వనిత, నాగుల విష్ణు, మిరియాల కార్ శ్రీనివాస్, ఫిరోజ్ పాషా, అరుణ్ చారి, వెంకట్ రెడ్డి, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు రియాజ్ తదితరులు పాల్గొన్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    5 hrs ago
  • జగిత్యాల జిల్లాలోని ఎండపల్లి మండలం గుడిసెలపేట గ్రామంలో బుధవారం ఉదయం ఒక పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. ఈ ఘటనలో పిచ్చికుక్క ఆరుగురిపై దాడి చేసి గాయపరచగా, వెంటనే బాధితులను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
    1
    జగిత్యాల జిల్లాలోని ఎండపల్లి మండలం గుడిసెలపేట గ్రామంలో బుధవారం ఉదయం ఒక పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. ఈ ఘటనలో పిచ్చికుక్క ఆరుగురిపై దాడి చేసి గాయపరచగా, వెంటనే బాధితులను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
    user_Venu Gopal
    Venu Gopal
    ధర్మపురి, జగిత్యాల, తెలంగాణ•
    7 hrs ago
  • ఉమ్మడి వరంగల్ జిల్లా నియోజకవర్గ కేంద్రమైన నర్సంపేట మండలం లక్నెపల్లి గ్రామంలోని భారత్ పెట్రోల్ బంకు వద్ద గల తాటి వనం బుధవారం రాత్రి ఆకస్మాత్తుగా దగ్ధమైంది. ఈ ఆకస్మిక సంఘటనతో ప్రక్కనే పెట్రోల్ బంకు ఉండడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల నుండి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పుతున్నారు. తాటి వనం దగ్ధం అవుతున్న ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
    1
    ఉమ్మడి వరంగల్ జిల్లా నియోజకవర్గ కేంద్రమైన నర్సంపేట మండలం లక్నెపల్లి గ్రామంలోని భారత్ పెట్రోల్ బంకు వద్ద గల తాటి వనం బుధవారం రాత్రి ఆకస్మాత్తుగా దగ్ధమైంది. ఈ ఆకస్మిక సంఘటనతో ప్రక్కనే పెట్రోల్ బంకు ఉండడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల నుండి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పుతున్నారు.

తాటి వనం దగ్ధం అవుతున్న ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
    user_Devender Pasunoori
    Devender Pasunoori
    Local News Reporter Jangoan, Telangana•
    2 hrs ago
  • కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం బుధవారం చొప్పదండి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు సాయుధ బలగాలు గౌరవ వందనం సమర్పించగా, సీపీ కార్యాలయ ప్రాంగణంలో మొక్కను నాటారు. అనంతరం కార్యాలయాన్ని, పెండింగ్ కేసులను మరియు రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీపీ గౌష్ ఆలం పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పాత, కొత్త కేసుల వివరాలను ఎప్పటికప్పుడు సీసీటీఎన్‌ఎస్-2.0లో అప్‌లోడ్ చేయాలని, కేసుల ఆధారాల సేకరణలో ‘ఈ-సాక్ష్య’ను సమర్థవంతంగా వినియోగించాలని ఆదేశించారు. గత నెలలో జరిగిన పీఎంజే నగల షోరూం దారిదోపిడీ ఘటనను దృష్టిలో ఉంచుకుని కమిషనరేట్ పరిధిలో భద్రతను కట్టుదిట్టం చేశామని ఆయన పేర్కొన్నారు. జిల్లా, మండల స్థాయిల్లోని నగల దుకాణాలు, బ్యాంకులు, లాడ్జీలు, హోటళ్లలో భద్రతా ప్రమాణాలను సమీక్షించి, సీసీ కెమెరాల ఏర్పాటుపై స్పష్టమైన నిబంధనలు జారీ చేసినట్లు తెలిపారు. భద్రతా లోపాలున్న యాజమాన్యాలకు ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చారు. నేరాల నియంత్రణలో భాగంగా బేసిక్ పోలీసింగ్‌పై దృష్టి సారించినట్లు సీపీ వెల్లడించారు. వలస కార్మికులు, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వ్యక్తుల పూర్తి వివరాలను అన్ని పోలీస్ స్టేషన్లలో పటిష్టంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనుమానాస్పద ప్రాంతాలు, రైల్వే స్టేషన్లు, హోటళ్లు, లాడ్జీలలో కార్డన్ అండ్ సెర్చ్, వాహన తనిఖీలను ముమ్మరం చేయడంతో పాటు, పాత నేరస్థులపై నిరంతర నిఘా ఉంచామని తెలిపారు. మాదకద్రవ్యాల నిర్మూలనకై నార్కోటిక్స్‌లో శిక్షణ పొందిన ప్రత్యేక పోలీస్ డాగ్స్ సహాయంతో పాన్ షాపులు, హాస్టళ్లు, పబ్లిక్ ప్రదేశాలను తనిఖీ చేస్తున్నామన్నారు. డ్రగ్ టెస్ట్ కిట్‌లు అందుబాటులో ఉన్నాయని, అనుమానితులకు పరీక్షలు నిర్వహించి పట్టుబడితే ఎన్‌డిపిఎస్ చట్టం ప్రకారం కఠిన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మహిళలు, విద్యార్థినుల రక్షణ కోసం 'షీ లీడ్స్', 'స్నేహిత' కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, నిరుపయోగంగా ఉన్న సీసీ కెమెరాలను తక్షణమే మరమ్మతులు చేయించి పునరుద్ధరిస్తున్నామని సీపీ వివరించారు. తనిఖీల్లో చొప్పదండి సర్కిల్‌లోని చొప్పదండి, గంగాధర, రామడుగు పోలీసుల పనితీరు, రికార్డుల నిర్వహణ పట్ల సీపీ గౌష్ ఆలం సంతోషం వ్యక్తం చేస్తూ ‘భేష్’ అని అభినందించారు. ఈ సమీక్షలో చర్చించిన అంశాలను క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో అమలు చేస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయకుమార్, చొప్పదండి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ప్రదీప్, ఎస్‌ఐలు నరేష్ రెడ్డి, వంశీకృష్ణ, రాజుతో పాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
    2
    కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం బుధవారం చొప్పదండి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు సాయుధ బలగాలు గౌరవ వందనం సమర్పించగా, సీపీ కార్యాలయ ప్రాంగణంలో మొక్కను నాటారు. అనంతరం కార్యాలయాన్ని, పెండింగ్ కేసులను మరియు రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా సీపీ గౌష్ ఆలం పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పాత, కొత్త కేసుల వివరాలను ఎప్పటికప్పుడు సీసీటీఎన్‌ఎస్-2.0లో అప్‌లోడ్ చేయాలని, కేసుల ఆధారాల సేకరణలో ‘ఈ-సాక్ష్య’ను సమర్థవంతంగా వినియోగించాలని ఆదేశించారు. గత నెలలో జరిగిన పీఎంజే నగల షోరూం దారిదోపిడీ ఘటనను దృష్టిలో ఉంచుకుని కమిషనరేట్ పరిధిలో భద్రతను కట్టుదిట్టం చేశామని ఆయన పేర్కొన్నారు. జిల్లా, మండల స్థాయిల్లోని నగల దుకాణాలు, బ్యాంకులు, లాడ్జీలు, హోటళ్లలో భద్రతా ప్రమాణాలను సమీక్షించి, సీసీ కెమెరాల ఏర్పాటుపై స్పష్టమైన నిబంధనలు జారీ చేసినట్లు తెలిపారు. భద్రతా లోపాలున్న యాజమాన్యాలకు ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చారు.

నేరాల నియంత్రణలో భాగంగా బేసిక్ పోలీసింగ్‌పై దృష్టి సారించినట్లు సీపీ వెల్లడించారు. వలస కార్మికులు, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వ్యక్తుల పూర్తి వివరాలను అన్ని పోలీస్ స్టేషన్లలో పటిష్టంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనుమానాస్పద ప్రాంతాలు, రైల్వే స్టేషన్లు, హోటళ్లు, లాడ్జీలలో కార్డన్ అండ్ సెర్చ్, వాహన తనిఖీలను ముమ్మరం చేయడంతో పాటు, పాత నేరస్థులపై నిరంతర నిఘా ఉంచామని తెలిపారు. మాదకద్రవ్యాల నిర్మూలనకై నార్కోటిక్స్‌లో శిక్షణ పొందిన ప్రత్యేక పోలీస్ డాగ్స్ సహాయంతో పాన్ షాపులు, హాస్టళ్లు, పబ్లిక్ ప్రదేశాలను తనిఖీ చేస్తున్నామన్నారు. డ్రగ్ టెస్ట్ కిట్‌లు అందుబాటులో ఉన్నాయని, అనుమానితులకు పరీక్షలు నిర్వహించి పట్టుబడితే ఎన్‌డిపిఎస్ చట్టం ప్రకారం కఠిన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మహిళలు, విద్యార్థినుల రక్షణ కోసం 'షీ లీడ్స్', 'స్నేహిత' కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, నిరుపయోగంగా ఉన్న సీసీ కెమెరాలను తక్షణమే మరమ్మతులు చేయించి పునరుద్ధరిస్తున్నామని సీపీ వివరించారు.

తనిఖీల్లో చొప్పదండి సర్కిల్‌లోని చొప్పదండి, గంగాధర, రామడుగు పోలీసుల పనితీరు, రికార్డుల నిర్వహణ పట్ల సీపీ గౌష్ ఆలం సంతోషం వ్యక్తం చేస్తూ ‘భేష్’ అని అభినందించారు. ఈ సమీక్షలో చర్చించిన అంశాలను క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో అమలు చేస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయకుమార్, చొప్పదండి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ప్రదీప్, ఎస్‌ఐలు నరేష్ రెడ్డి, వంశీకృష్ణ, రాజుతో పాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.