Shuru
Apke Nagar Ki App…
ఆళ్లగడ్డలోని చాంద్ వీధిలో కత్తెరతో భార్యను చంపిన భర్త.. నిందితుడు అరెస్ట్ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని చాంద్ వీధిలో గురువారం భార్య పుష్పలత (35)ను కత్తెరతో గొంతు కోసి కిరాతకంగా హత్య చేసిన ఘటనలో ముద్దాయి భర్త చెన్నయ్య ను అరెస్టు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. టౌన్ పీఎస్లో మీడియాతో ఆయన మాట్లాడారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి హైవేలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద అరెస్టు చేసినట్లు వెల్లడించారు. భార్యా భర్తల మధ్య గొడవలుంటే పోలీసులను సంప్రదించి సమస్యలు పరిష్కరించుకోవాలని కోరారు
Naga kanth
ఆళ్లగడ్డలోని చాంద్ వీధిలో కత్తెరతో భార్యను చంపిన భర్త.. నిందితుడు అరెస్ట్ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని చాంద్ వీధిలో గురువారం భార్య పుష్పలత (35)ను కత్తెరతో గొంతు కోసి కిరాతకంగా హత్య చేసిన ఘటనలో ముద్దాయి భర్త చెన్నయ్య ను అరెస్టు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. టౌన్ పీఎస్లో మీడియాతో ఆయన మాట్లాడారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి హైవేలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద అరెస్టు చేసినట్లు వెల్లడించారు. భార్యా భర్తల మధ్య గొడవలుంటే పోలీసులను సంప్రదించి సమస్యలు పరిష్కరించుకోవాలని కోరారు
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని చాంద్ వీధిలో గురువారం భార్య పుష్పలత (35)ను కత్తెరతో గొంతు కోసి కిరాతకంగా హత్య చేసిన ఘటనలో ముద్దాయి భర్త చెన్నయ్య ను అరెస్టు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. టౌన్ పీఎస్లో మీడియాతో ఆయన మాట్లాడారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి హైవేలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద అరెస్టు చేసినట్లు వెల్లడించారు. భార్యా భర్తల మధ్య గొడవలుంటే పోలీసులను సంప్రదించి సమస్యలు పరిష్కరించుకోవాలని కోరారు1
- మహానంది మండలం అబ్బీపురం గ్రామానికి చెందిన బాలకృష్ణ ఇంట్లో పూజ గదిలోని చిత్రపటాల వెనుక పెద్ద నాగుపాము కనిపించడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. గురువారం పాములు పట్టే వ్యక్తికి సమాచారం అందజేశారు. అతను అక్కడికి చేరుకుని పామును చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం ఆ నాగుపామును సమీపంలోని నల్లమల అడవిలో విడిచిపెట్టారు.పామును పట్టుకోవడంతో బాలకృష్ణ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.1
- జోగులాంబ గద్వాల జిల్లా పట్టణంలోని గాంధీ విగ్రహం దగ్గర రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, స్థానిక శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చెయ్యడం జరిగింది . అనంతరం స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నివాసానికి చేరుకొని ఆయనను సన్మానించి మిఠాయి తినిపించారు.ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఆలూరు బిలకంటి రాము మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు రాష్ట్రంలో ఆర్యవైశ్యులకు మాట ఇచ్చిన ప్రకారం శ్రీ వాసవి మాత జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వ హించేందుకు ఉత్తర్వులు జారీ చేయడం హర్షించదగ్గ విషయం అని అన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ గా కల్వ సుజాతను నియ మించినందుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. రాష్ట్రంలోని ఆర్యవైశ్యులు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలపడం జరుగు తుందన్నారు. ఆదివారం శ్రీ వాసవి మాత జయంతిని ప్రభుత్వము అధికారికంగా నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేసినందున జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు నిర్వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో గద్వాల పట్టణంలోని వివిధ సంఘాలకు చెందిన ఆర్యవైశ్య సంఘ నాయకులు ఆర్యవైశ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.2
- నాగర్ కర్నూలు జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజుకు చేరుకోవడంతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కార్మికులు విధులను బహిష్కరించారు. జిల్లాలోని 90 శాతం బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రంలో జేఏసీ నాయకులు మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. అధికారులు ప్రత్యామ్నాయంగా 15 బస్సులను నడుపుతున్నా పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది1
- బద్వేలు , ఏప్రిల్ 23: పట్టణంలోని సిద్ధవటం రోడ్డు, వైయస్సార్ సర్కిల్ సమీపంలో ప్రముఖ కరెంటు కాంట్రాక్టర్ పెద్దిరెడ్డి నర్సారెడ్డి ఇంటి ముందు చలివేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. నర్సారెడ్డి సతీమణి కీర్తిశేషులు పెద్దిరెడ్డి లక్ష్మమ్మ జ్ఞాపకార్థం గత మూడు సంవత్సరాలుగా ఈ చలివేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన కుమారులు డాక్టర్ జయసింహారెడ్డి, డాక్టర్ విజయ నరసింహారెడ్డి, అల్లుడు సింగమల సుధాకర్ రెడ్డి తెలిపారు. మండుటెండల్లో పాదచారులు, చిరు వ్యాపారస్తులు, ప్రయాణికుల దాహార్తి తీర్చేందుకు ఈ సేవా కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో రామాలయం కమిటీ చైర్మన్ గోనుగుంట వెంకటసుబ్బారెడ్డి, బద్దెన కళా పీఠం అధ్యక్షులు గంగసాని సాంబశివారెడ్డి, ఆదూరి వీర ప్రతాపరెడ్డి, జమ్మన వేణుగోపాల్ రెడ్డి, కత్తెరపల్లె రాజశేఖర్ రెడ్డి, పాపదిప్పు మల్లికార్జున రెడ్డి, మాచుపల్లి రాజారెడ్డి, కనుపర్తి చెన్న కృష్ణారెడ్డి, లేపాకు రామకృష్ణారెడ్డి, ఎస్.ఎన్. సుబ్బరాయుడు, కల్లూరు సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొని మజ్జిగ, చల్లని మంచినీటిని వితరణ చేశారు.1
- భగీరథ మహర్షి జయంతి1
- ఒంటిమిట్ట కోదండ రామాలయ అర్చకులకు టీటీడీ షోకాజ్ నోటీసులు..! టీటీడీ ఉన్నతాధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా అర్చకుల అత్యుత్సాహం. పులివెందులకు వెళ్లి.. మాజీ సీఎం వైఎస్ జగన్‌కు వేద ఆశీర్వచనంతో పాటు, శేష వస్త్రం, రాములోరి తోమాల, ముత్యాల తలంబ్రాలు అందజేసిన ఒంటిమిట్ట ఆలయ అర్చకులు. మాజీ సీఎం వైఎస్ జగన్ సేవలో తరించిన ఒంటిమిట్ట కోదండ రామాలయ అర్చకులు ఎ.శ్రావణ్‌కుమార్, వీణా మనోజ్‌కుమార్, కె.పార్థసారథికి, ఉప కార్యనిర్వహణాధికారి ఎ.ప్రశాంతి షోకాజ్ నోటీసులు జారీ చేసి.. రెండు రోజుల్లో సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు..!1
- ఇటీవల శ్రీరామునిపై నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు, కళారత్న చింతలపల్లె కోటేష్ గురువారం తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు. ప్రకాష్ రాజ్‌ను ఉద్దేశించి ఆయన ఒక చిత్రాన్ని వినూత్నంగా గీసినట్లు తెలిపారు. ఈ చిత్రంలో హిందూ మతం మగ పిల్లలు ప్రకాష్ రాజ్ ముఖం మీద మూత్రం పోస్తూన్నట్లు, మెడలో చెప్పుల దండ వేసినట్లు చిత్రం గీసినట్లు కోటేష్ తెలిపారు.1