logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అశ్వాపురం గ్రామపంచాయతీ పరిధిలో నిర్వహించిన గ్రామసభకు హాజరైన జిల్లా కలెక్టర్ ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లావ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమంలో భాగంగా అశ్వాపురం గ్రామపంచాయతీ పరిధిలో నిర్వహించిన గ్రామసభకు జిల్లా కలెక్టర్ అంకిత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గత రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాల ప్రగతిని ప్రజలకు వివరించడమే కాకుండా గ్రామ, వార్డు స్థాయిలో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించడమే ఈ సభల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. గ్రామసభలను పండగ వాతావరణంలో నిర్వహించేలా ప్రభుత్వం యంత్రాంగానికి మార్గదర్శకాలు జారీ చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయడానికి అవగాహన కల్పించే వేదికగా ఈ గ్రామసభలు ఉపయోగపడతాయని అన్నారు . ముఖ్యంగా రైతుభరోసా, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, రూ.500లకే గ్యాస్ సిలిండర్, సన్నరకం వడ్లకు బోనస్, చేయూత పింఛన్లు, గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కొత్త రేషన్ కార్డుల జారీ వంటి పథకాలను గ్రామ, వార్డు స్థాయిలో విస్తృతంగా వివరిస్తున్నట్లు తెలిపారు. త్వరలో ప్రభుత్వం అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మరియు అల్పాహారం వంటి కొత్త పథకాలపై కూడా ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో పథకాల అమలులో పారదర్శకత కోసం గ్రామస్థాయిలో పెండింగ్ దరఖాస్తులు, అర్హతలు, అవసరమైన ధృవీకరణ పత్రాల వివరాలను తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాభివృద్ధికి విద్య ముఖ్యమని పేర్కొన్న కలెక్టర్, పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందేలా నిరంతర పర్యవేక్షణ అవసరమని తెలిపారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలన్నారు. అలాగే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు గ్రామసభల్లో పాల్గొని సమస్యలను చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. వైద్య సేవల ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ, వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులకు సూచించారు. అశ్వాపురం గ్రామంలో అమలు చేసిన పథకాల వివరాలను వెల్లడిస్తూ,రైతు భరోసా కింద 1,369 మందికి రూ. 2.34 కోట్లు, ఇందిరమ్మ ఇళ్లు కింద 58 మందికి రూ. 2.90 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా రూ. 75.58 కోట్లు వ్యయం చేసినట్లు తెలిపారు . గ్యాస్ సబ్సిడీ కింద 1,000 మందికి రూ. 20.11 లక్షలు, చేయూత పింఛన్ల ద్వారా 803 మందికి రూ. 19.33 లక్షలు అందించినట్లు తెలిపారు. గృహజ్యోతి పథకం ద్వారా 1,156 మంది లబ్ధి పొందినట్లు చెప్పారు. కళ్యాణ లక్ష్మి/షాదీ ముబారక్ కింద 153 మందికి రూ. 82.09 లక్షలు, 1,235 రేషన్ కార్డులు జారీ చేసినట్లు తెలిపారు. అలాగే మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ ద్వారా రూ. 585.69 లక్షలు, వడ్డీ లేని రుణాలుగా రూ. 28.14 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు . ఈ కార్యక్రమంలో భాగంగా సంక్షేమ పథకాల లబ్ధిదారుల పేర్లను సభలో చదివి వినిపించి, వాటి అమలుపై ప్రజల అభిప్రాయాలను స్వీకరించారు. గ్రామసభల్లో స్థానిక సమస్యలపై చర్చించి, ప్రాధాన్యత క్రమంలో వాటి పరిష్కారానికి తీర్మానాలు చేయాలని సూచించారు. ఈ వివరాలను ప్రత్యేక రిజిస్టర్లలో నమోదు చేసి ఉన్నతాధికారులకు నివేదించాలన్నారు. గ్రామస్థాయిలో ప్రజల ఫిర్యాదులను స్వీకరించేందుకు ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో ప్రత్యేక ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

22 hrs ago
user_VANAMA SRINIVAS RAO
VANAMA SRINIVAS RAO
జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
22 hrs ago
af42fbdd-71ba-4bb0-ad00-ae2fa20877ca

అశ్వాపురం గ్రామపంచాయతీ పరిధిలో నిర్వహించిన గ్రామసభకు హాజరైన జిల్లా కలెక్టర్ ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లావ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమంలో భాగంగా అశ్వాపురం గ్రామపంచాయతీ పరిధిలో నిర్వహించిన గ్రామసభకు జిల్లా కలెక్టర్ అంకిత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గత రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాల ప్రగతిని ప్రజలకు వివరించడమే కాకుండా గ్రామ, వార్డు స్థాయిలో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించడమే ఈ సభల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. గ్రామసభలను పండగ వాతావరణంలో నిర్వహించేలా ప్రభుత్వం యంత్రాంగానికి మార్గదర్శకాలు జారీ చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయడానికి అవగాహన కల్పించే వేదికగా ఈ గ్రామసభలు ఉపయోగపడతాయని అన్నారు . ముఖ్యంగా రైతుభరోసా,

d39fd574-d325-4220-b0cd-e2bb1560f233

ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, రూ.500లకే గ్యాస్ సిలిండర్, సన్నరకం వడ్లకు బోనస్, చేయూత పింఛన్లు, గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కొత్త రేషన్ కార్డుల జారీ వంటి పథకాలను గ్రామ, వార్డు స్థాయిలో విస్తృతంగా వివరిస్తున్నట్లు తెలిపారు. త్వరలో ప్రభుత్వం అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మరియు అల్పాహారం వంటి కొత్త పథకాలపై కూడా ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో పథకాల అమలులో పారదర్శకత కోసం గ్రామస్థాయిలో పెండింగ్ దరఖాస్తులు, అర్హతలు, అవసరమైన ధృవీకరణ పత్రాల వివరాలను తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాభివృద్ధికి విద్య ముఖ్యమని పేర్కొన్న కలెక్టర్, పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందేలా నిరంతర పర్యవేక్షణ అవసరమని తెలిపారు. ఉపాధ్యాయులు

675adda3-88f8-4c55-a5d4-b93048d785d9

సమయపాలన పాటిస్తూ విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలన్నారు. అలాగే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు గ్రామసభల్లో పాల్గొని సమస్యలను చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. వైద్య సేవల ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ, వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులకు సూచించారు. అశ్వాపురం గ్రామంలో అమలు చేసిన పథకాల వివరాలను వెల్లడిస్తూ,రైతు భరోసా కింద 1,369 మందికి రూ. 2.34 కోట్లు, ఇందిరమ్మ ఇళ్లు కింద 58 మందికి రూ. 2.90 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా రూ. 75.58 కోట్లు వ్యయం చేసినట్లు తెలిపారు . గ్యాస్ సబ్సిడీ కింద 1,000 మందికి రూ. 20.11 లక్షలు, చేయూత పింఛన్ల ద్వారా 803 మందికి రూ.

d0a16a33-f2bd-4c03-93bc-0bfe037568e5

19.33 లక్షలు అందించినట్లు తెలిపారు. గృహజ్యోతి పథకం ద్వారా 1,156 మంది లబ్ధి పొందినట్లు చెప్పారు. కళ్యాణ లక్ష్మి/షాదీ ముబారక్ కింద 153 మందికి రూ. 82.09 లక్షలు, 1,235 రేషన్ కార్డులు జారీ చేసినట్లు తెలిపారు. అలాగే మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ ద్వారా రూ. 585.69 లక్షలు, వడ్డీ లేని రుణాలుగా రూ. 28.14 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు . ఈ కార్యక్రమంలో భాగంగా సంక్షేమ పథకాల లబ్ధిదారుల పేర్లను సభలో చదివి వినిపించి, వాటి అమలుపై ప్రజల అభిప్రాయాలను స్వీకరించారు. గ్రామసభల్లో స్థానిక సమస్యలపై చర్చించి, ప్రాధాన్యత క్రమంలో వాటి పరిష్కారానికి తీర్మానాలు చేయాలని సూచించారు. ఈ వివరాలను ప్రత్యేక రిజిస్టర్లలో నమోదు చేసి ఉన్నతాధికారులకు నివేదించాలన్నారు. గ్రామస్థాయిలో ప్రజల ఫిర్యాదులను స్వీకరించేందుకు ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో ప్రత్యేక ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

More news from తెలంగాణ and nearby areas
  • Post by Ramprasad islavath
    1
    Post by Ramprasad islavath
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    1 hr ago
  • Post by V Ramarao
    3
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    22 hrs ago
  • అంజన్న మాలధారణ స్వాములకు నిలువ నీడ లేక ఇబ్బందులు ఆలయ కమిటీపై భక్తుల ఆగ్రహం ఏటూర్ నాగారం శ్రీ రామ నవమి అనంతరం మండల దీక్షలో ఉన్న స్వాములకు తగిన సదుపాయాలు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తి స్థానిక రామాలయం గుడి కళ్యాణ మండపం వద్ద శ్రీ రామ నవమి సందర్భంగా దాతల సహకారంతో చల్లటి పందిళ్లు ఏర్పాటు చేయడం జరిగింది. పండుగ సమయంలో భక్తులకు మంచి సౌకర్యాలు కల్పించినప్పటికీ, అనంతరం పరిస్థితులు మారడం గమనార్హం. శ్రీ రామ నవమి ముగిసిన తరువాత హనుమాన్ స్వాములు, అంజన్న స్వాములు 41 రోజుల మండల దీక్షలో భాగంగా మాలధారణ చేపట్టారు. ప్రతి సంవత్సరం ఈ సమయంలో రామాలయం వద్ద స్వాముల కోసం ప్రత్యేకంగా కుటీరాలు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ ఏడాది మాత్రం ఆలయ కమిటీ సభ్యులు ఆ సంప్రదాయాన్ని కొనసాగించకపోవడంతో మాలధారణలో ఉన్న స్వాములు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ వేడి తీవ్రత ఎక్కువగా ఉండటంతో నిలువ నీడ లేక భక్తులు, స్వాములు బాధపడుతున్నారు. ఈ పరిస్థితిపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ, వెంటనే స్థానిక గ్రామ పెద్దలు. స్పందించి స్వాములకు తగిన నీడ, తాగునీరు, విశ్రాంతి సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. భక్తుల విశ్వాసాన్ని దృష్టిలో ఉంచుకుని,
    1
    అంజన్న మాలధారణ స్వాములకు నిలువ నీడ లేక ఇబ్బందులు 
ఆలయ కమిటీపై భక్తుల ఆగ్రహం 
ఏటూర్ నాగారం 
శ్రీ రామ నవమి అనంతరం మండల దీక్షలో ఉన్న స్వాములకు తగిన సదుపాయాలు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తి
స్థానిక రామాలయం గుడి కళ్యాణ మండపం వద్ద శ్రీ రామ నవమి సందర్భంగా దాతల సహకారంతో చల్లటి పందిళ్లు ఏర్పాటు చేయడం జరిగింది. పండుగ సమయంలో భక్తులకు మంచి సౌకర్యాలు కల్పించినప్పటికీ, అనంతరం పరిస్థితులు మారడం గమనార్హం.
శ్రీ రామ నవమి ముగిసిన తరువాత హనుమాన్ స్వాములు, అంజన్న స్వాములు 41 రోజుల మండల దీక్షలో భాగంగా మాలధారణ చేపట్టారు. ప్రతి సంవత్సరం ఈ సమయంలో రామాలయం వద్ద స్వాముల కోసం ప్రత్యేకంగా కుటీరాలు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది.
అయితే ఈ ఏడాది మాత్రం ఆలయ కమిటీ సభ్యులు ఆ సంప్రదాయాన్ని కొనసాగించకపోవడంతో మాలధారణలో ఉన్న స్వాములు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ వేడి తీవ్రత ఎక్కువగా ఉండటంతో నిలువ నీడ లేక భక్తులు, స్వాములు బాధపడుతున్నారు.
ఈ పరిస్థితిపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ, వెంటనే స్థానిక గ్రామ పెద్దలు.
స్పందించి స్వాములకు తగిన నీడ, తాగునీరు, విశ్రాంతి సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
భక్తుల విశ్వాసాన్ని దృష్టిలో ఉంచుకుని,
    user_జై భీమ్ అందుబాటులో ఉన్నాను
    జై భీమ్ అందుబాటులో ఉన్నాను
    ఏటూరునాగారం, ములుగు, తెలంగాణ•
    25 min ago
  • మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ఓటాయి గ్రామంలో సాంప్రదాయ జానపద కళారూపమైన “యాదవ రాజుల కథ” ప్రదర్శన గ్రామ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఎన్నో ఏళ్లుగా టెలివిజన్, సీరియళ్లకే పరిమితమైన వినోదానికి అలవాటు పడిన ప్రజలు, ముఖ్యంగా మహిళలు, ఇలాంటి చారిత్రక, సాంస్కృతిక కథనాలను ఆసక్తిగా వీక్షించడం గ్రామీణ సంస్కృతికి కొత్త ఊపును తీసుకొచ్చింది. గ్రామీణ కళాకారులు తమ సాంస్కృతిక వృత్తి ధర్మంలో భాగంగా మళ్లీ ఈ జానపద కళారూపాన్ని పునరుద్ధరించి ప్రజల ముందుకు తీసుకురావడం విశేషం. గతంలో పల్లెల్లో విస్తృతంగా వినిపించిన యాదవ రాజుల వీరగాథలు, కాలక్రమేణా కనుమరుగవుతున్న వేళ, ఇప్పుడు మళ్లీ గ్రామాల్లో కళాకారుల కంఠాల్లో ప్రతిధ్వనించడం స్థానికులను ఆనందానికి గురి చేసింది. ఈ ప్రదర్శనను చూడడానికి గ్రామ ప్రజలు, యువతి యువకులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో, ఆసక్తితో కథను ఆలకించారు. చారిత్రక నేపథ్యంతో సాగిన ఈ కళారూపం ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా, పాత తరం జ్ఞాపకాలను తడిమింది. గ్రామీణ కళలు, జానపద సంప్రదాయాలు కేవలం వినోదమే కాకుండా, సమాజ చరిత్రను, జీవన విధానాన్ని, సంస్కృతిని తరతరాలకు అందించే గొప్ప వారసత్వమని పలువురు గ్రామ పెద్దలు అభిప్రాయపడ్డారు. ఇలాంటి జానపద కళారూపాలకు ప్రోత్సాహం లభిస్తే గ్రామీణ సంస్కృతి మరింత బలపడటంతో పాటు, కళాకారులకు కూడా గుర్తింపు, ఆదరణ లభిస్తుందని స్థానికులు పేర్కొన్నారు.
    1
    మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ఓటాయి గ్రామంలో సాంప్రదాయ జానపద కళారూపమైన “యాదవ రాజుల కథ” ప్రదర్శన గ్రామ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఎన్నో ఏళ్లుగా టెలివిజన్, సీరియళ్లకే పరిమితమైన వినోదానికి అలవాటు పడిన ప్రజలు, ముఖ్యంగా మహిళలు, ఇలాంటి చారిత్రక, సాంస్కృతిక కథనాలను ఆసక్తిగా వీక్షించడం గ్రామీణ సంస్కృతికి కొత్త ఊపును తీసుకొచ్చింది.
గ్రామీణ కళాకారులు తమ సాంస్కృతిక వృత్తి ధర్మంలో భాగంగా మళ్లీ ఈ జానపద కళారూపాన్ని పునరుద్ధరించి ప్రజల ముందుకు తీసుకురావడం విశేషం. గతంలో పల్లెల్లో విస్తృతంగా వినిపించిన యాదవ రాజుల వీరగాథలు, కాలక్రమేణా కనుమరుగవుతున్న వేళ, ఇప్పుడు మళ్లీ గ్రామాల్లో కళాకారుల కంఠాల్లో ప్రతిధ్వనించడం స్థానికులను ఆనందానికి గురి చేసింది.
ఈ ప్రదర్శనను చూడడానికి గ్రామ ప్రజలు, యువతి యువకులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో, ఆసక్తితో కథను ఆలకించారు. చారిత్రక నేపథ్యంతో సాగిన ఈ కళారూపం ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా, పాత తరం జ్ఞాపకాలను తడిమింది.
గ్రామీణ కళలు, జానపద సంప్రదాయాలు కేవలం వినోదమే కాకుండా, సమాజ చరిత్రను, జీవన విధానాన్ని, సంస్కృతిని తరతరాలకు అందించే గొప్ప వారసత్వమని పలువురు గ్రామ పెద్దలు అభిప్రాయపడ్డారు.
ఇలాంటి జానపద కళారూపాలకు ప్రోత్సాహం లభిస్తే గ్రామీణ సంస్కృతి మరింత బలపడటంతో పాటు, కళాకారులకు కూడా గుర్తింపు, ఆదరణ లభిస్తుందని స్థానికులు పేర్కొన్నారు.
    user_Mediya wgl medical wgl
    Mediya wgl medical wgl
    Doctor నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    22 hrs ago
  • Post by Sode Prasad
    1
    Post by Sode Prasad
    user_Sode Prasad
    Sode Prasad
    Insurance Agent చింతూరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • Post by వేముల నాగరాజు
    1
    Post by వేముల నాగరాజు
    user_వేముల నాగరాజు
    వేముల నాగరాజు
    ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • హన్మకొండ జిల్లా:హనుమకొండ వడ్డేపల్లి సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక సోదాల్లో అవినీతి వ్యవహారాలు బయటపడ్డాయి. కార్యాలయంలో 20 మంది అనధికార ఏజెంట్లు ఉన్నట్లు గుర్తించగా, ఏడాదిలో రూ.42 లక్షల డిజిటల్ లావాదేవీలు జరిగినట్లు తేలింది. ఎస్ఆర్ఆలు రామనర్సింహారావు, ఆనంద్ అక్రమాలకు సంబంధించిన వాట్సాప్ చాటింగ్ సాక్ష్యాలుగా లభించాయి. వారి ఇళ్లలో సోదాల్లో నగదు, బంగారం, వెండి, ఫిక్స్డ్ డిపాజిట్లు బయటపడగా, కార్యాలయంలో పెండింగ్ డాక్యుమెంట్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.
    1
    హన్మకొండ జిల్లా:హనుమకొండ వడ్డేపల్లి సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక సోదాల్లో అవినీతి వ్యవహారాలు బయటపడ్డాయి. కార్యాలయంలో 20 మంది అనధికార ఏజెంట్లు ఉన్నట్లు గుర్తించగా, ఏడాదిలో రూ.42 లక్షల డిజిటల్ లావాదేవీలు జరిగినట్లు తేలింది.
ఎస్ఆర్ఆలు రామనర్సింహారావు, ఆనంద్ అక్రమాలకు సంబంధించిన వాట్సాప్ చాటింగ్ సాక్ష్యాలుగా లభించాయి. వారి ఇళ్లలో సోదాల్లో నగదు, బంగారం, వెండి, ఫిక్స్డ్ డిపాజిట్లు బయటపడగా, కార్యాలయంలో పెండింగ్ డాక్యుమెంట్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • Post by వేముల నాగరాజు
    1
    Post by వేముల నాగరాజు
    user_వేముల నాగరాజు
    వేముల నాగరాజు
    ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.