logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

​ఓటర్ల సవరణలకు ప్రత్యేక క్యాంప్‌లను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపు ​ఓటర్ జాబితా ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో భాగంగా నిర్వహించిన 'స్పెషల్ క్యాంపెయిన్ డే' కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత క్షేత్రస్థాయిలో పరిశీలించారు.​తర్లుపాడు మండలంలోని సీతానాగులవరం గ్రామంలోని 124, 126 పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ సందర్శించి, అక్కడ జరుగుతున్న క్లెయిమ్స్ మరియు ఆక్షేపణల హియరింగ్ (విచారణ) ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె రెవెన్యూ సిబ్బందితో మాట్లాడుతూ, ఓటర్ల నమోదు మరియు మార్పులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను (క్లెయిమ్స్) ఎప్పటికప్పుడు పరిశీలించి వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.​అనంతరం మార్కాపురం పట్టణంలోని ఆజాద్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ​ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ — ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, తప్పుల సవరణలు, అడ్రస్ మార్పులు, అలాగే ఒక నియోజకవర్గం నుండి మరొక నియోజకవర్గానికి ఓటు బదిలీ చేసుకోవడానికి ఈ ప్రత్యేక ప్రచార దినోత్సవాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈనెల 29, 30‌న స్పెషల్ కంపిండే జరుగనుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, అలాగే రాబోయే రోజుల్లోనూ నిర్వహించే ప్రత్యేక క్యాంప్‌లలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు.​ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, బిఎల్ఓ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

22 hrs ago
user_M. ADINARAYANA
M. ADINARAYANA
Local News Reporter మార్కాపురం, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
22 hrs ago

​ఓటర్ల సవరణలకు ప్రత్యేక క్యాంప్‌లను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపు ​ఓటర్ జాబితా ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో భాగంగా నిర్వహించిన 'స్పెషల్ క్యాంపెయిన్ డే' కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత క్షేత్రస్థాయిలో పరిశీలించారు.​తర్లుపాడు మండలంలోని సీతానాగులవరం గ్రామంలోని 124, 126 పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ సందర్శించి, అక్కడ జరుగుతున్న క్లెయిమ్స్ మరియు ఆక్షేపణల హియరింగ్ (విచారణ) ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె రెవెన్యూ సిబ్బందితో మాట్లాడుతూ, ఓటర్ల నమోదు మరియు మార్పులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను (క్లెయిమ్స్) ఎప్పటికప్పుడు పరిశీలించి వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.​అనంతరం మార్కాపురం పట్టణంలోని ఆజాద్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ​ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ — ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, తప్పుల సవరణలు, అడ్రస్ మార్పులు, అలాగే ఒక నియోజకవర్గం నుండి మరొక నియోజకవర్గానికి ఓటు బదిలీ చేసుకోవడానికి ఈ ప్రత్యేక ప్రచార దినోత్సవాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈనెల 29, 30‌న స్పెషల్ కంపిండే జరుగనుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, అలాగే రాబోయే రోజుల్లోనూ నిర్వహించే ప్రత్యేక క్యాంప్‌లలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు.​ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, బిఎల్ఓ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ​ఓటర్ల సవరణలకు ప్రత్యేక క్యాంప్‌లను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపు ​ఓటర్ జాబితా ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో భాగంగా నిర్వహించిన 'స్పెషల్ క్యాంపెయిన్ డే' కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత క్షేత్రస్థాయిలో పరిశీలించారు.​తర్లుపాడు మండలంలోని సీతానాగులవరం గ్రామంలోని 124, 126 పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ సందర్శించి, అక్కడ జరుగుతున్న క్లెయిమ్స్ మరియు ఆక్షేపణల హియరింగ్ (విచారణ) ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె రెవెన్యూ సిబ్బందితో మాట్లాడుతూ, ఓటర్ల నమోదు మరియు మార్పులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను (క్లెయిమ్స్) ఎప్పటికప్పుడు పరిశీలించి వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.​అనంతరం మార్కాపురం పట్టణంలోని ఆజాద్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ​ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ — ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, తప్పుల సవరణలు, అడ్రస్ మార్పులు, అలాగే ఒక నియోజకవర్గం నుండి మరొక నియోజకవర్గానికి ఓటు బదిలీ చేసుకోవడానికి ఈ ప్రత్యేక ప్రచార దినోత్సవాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈనెల 29, 30‌న స్పెషల్ కంపిండే జరుగనుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, అలాగే రాబోయే రోజుల్లోనూ నిర్వహించే ప్రత్యేక క్యాంప్‌లలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు.​ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, బిఎల్ఓ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
    1
    ​ఓటర్ల సవరణలకు ప్రత్యేక క్యాంప్‌లను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపు
​ఓటర్ జాబితా ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత
ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో భాగంగా నిర్వహించిన 'స్పెషల్ క్యాంపెయిన్ డే' కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత క్షేత్రస్థాయిలో పరిశీలించారు.​తర్లుపాడు మండలంలోని సీతానాగులవరం గ్రామంలోని 124, 126 పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ సందర్శించి, అక్కడ జరుగుతున్న క్లెయిమ్స్ మరియు ఆక్షేపణల హియరింగ్ (విచారణ) ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె రెవెన్యూ సిబ్బందితో మాట్లాడుతూ, ఓటర్ల నమోదు మరియు మార్పులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను (క్లెయిమ్స్) ఎప్పటికప్పుడు పరిశీలించి వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.​అనంతరం మార్కాపురం పట్టణంలోని ఆజాద్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ​ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ — ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, తప్పుల సవరణలు, అడ్రస్ మార్పులు, అలాగే ఒక నియోజకవర్గం నుండి మరొక నియోజకవర్గానికి ఓటు బదిలీ చేసుకోవడానికి ఈ ప్రత్యేక ప్రచార దినోత్సవాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈనెల 29, 30‌న స్పెషల్ కంపిండే జరుగనుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, అలాగే రాబోయే రోజుల్లోనూ నిర్వహించే ప్రత్యేక క్యాంప్‌లలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు.​ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, బిఎల్ఓ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
    user_M. ADINARAYANA
    M. ADINARAYANA
    Local News Reporter మార్కాపురం, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • సాగునీటిని వెంటనే విడుదల చేయాలి రైతు వ్యతిరేకిగా కూటమి ప్రభుత్వం. శిల్పా అంటేనే మహానంది మండలం.. క్షేత్రంలో అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశా .. మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి.. తెలుగుగంగ కాలువలకు సాగునీరు విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆదివారం మహానందిలోని కుమ్మరి సత్రంలో రైతులతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా మాట్లాడుతూ.. ఖరీఫ్‌ సమయం ముగిసిపోతుందని రైతులు ఆందోళన చెందుతుంటే పాలకులు మాత్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.రైతు సంక్షేమం అంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రైతు వ్యతిరేకి ప్రభుత్వంగా మారిపోయిందని అన్నారు. ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని కనీసం ఖరీఫ్ సీజన్ లో కూడా నీళ్లు ఇవ్వలేని ప్రభుత్వం దుర్మార్గమైన పాలన కొనసాగిస్తుందని అన్నారు.శ్రీశైలం డ్యాంలో నీళ్లు ఉన్నప్పటికీ, రైతులకు ఎందుకు నీళ్లు ఇవ్వలేకపోతున్నారో నాయకులు సమాధానం చెప్పాలన్నారు. తను అధికారంలో ఉన్నప్పుడు మహానంది పుణ్యక్షేత్రంలో అభివృద్ధి చేసిన ఘనత తనదే అన్నారు.శిల్ప అంటేనే మహానంది మండలం అనిపించుకున్న మండలం ఇది అని నన్ను దూరం చేశారని భావోద్వేగానికి గురయ్యారు. ప్రభుత్వ, తన సొంత నిధులతో మండలాన్ని అభివృద్ధి చేశారన్నారు. రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగికి రూ.3 వేలు ఇస్తానంటూ మోసం చేసింది చంద్రబాబు నాయుడు కదా అని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తెలుగు గంగ కాలువలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ మండల అధ్యక్షుడ కొమ్మా మహేశ్వర్ రెడ్డి,రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శి కొండా మధుసూదన్ రెడ్డి, వైయస్ఆర్ సీపీ నాయకులు వీరారెడ్డి, గజ్జ పెద్ద పకీరయ్య, తదితరులు పాల్గొన్నారు.
    3
    సాగునీటిని వెంటనే విడుదల చేయాలి

 రైతు వ్యతిరేకిగా కూటమి ప్రభుత్వం. 

శిల్పా అంటేనే మహానంది మండలం.. 

క్షేత్రంలో అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశా ..


 మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి..

తెలుగుగంగ కాలువలకు సాగునీరు విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి  డిమాండ్‌ చేశారు. ఆదివారం మహానందిలోని కుమ్మరి సత్రంలో  రైతులతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా మాట్లాడుతూ.. ఖరీఫ్‌ సమయం ముగిసిపోతుందని రైతులు ఆందోళన చెందుతుంటే పాలకులు మాత్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.రైతు సంక్షేమం అంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రైతు వ్యతిరేకి ప్రభుత్వంగా మారిపోయిందని అన్నారు. ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని కనీసం ఖరీఫ్ సీజన్ లో కూడా నీళ్లు ఇవ్వలేని  ప్రభుత్వం దుర్మార్గమైన పాలన కొనసాగిస్తుందని అన్నారు.శ్రీశైలం డ్యాంలో  నీళ్లు ఉన్నప్పటికీ, రైతులకు ఎందుకు నీళ్లు ఇవ్వలేకపోతున్నారో నాయకులు సమాధానం చెప్పాలన్నారు. తను అధికారంలో ఉన్నప్పుడు  మహానంది  పుణ్యక్షేత్రంలో అభివృద్ధి చేసిన ఘనత తనదే అన్నారు.శిల్ప అంటేనే మహానంది మండలం అనిపించుకున్న మండలం ఇది అని నన్ను దూరం చేశారని  భావోద్వేగానికి గురయ్యారు. ప్రభుత్వ, తన సొంత నిధులతో మండలాన్ని అభివృద్ధి చేశారన్నారు. రాష్ట్రంలో  ప్రతి నిరుద్యోగికి  రూ.3 వేలు ఇస్తానంటూ మోసం చేసింది చంద్రబాబు నాయుడు కదా అని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తెలుగు గంగ కాలువలకు సాగునీరు అందించాలని  డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ మండల అధ్యక్షుడ కొమ్మా మహేశ్వర్ రెడ్డి,రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శి కొండా మధుసూదన్ రెడ్డి, వైయస్ఆర్ సీపీ నాయకులు వీరారెడ్డి, గజ్జ పెద్ద పకీరయ్య, తదితరులు పాల్గొన్నారు.
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • డోన్‌లో కీలక భేటీ నిర్వహించిన నంద్యాల డీసీసీ డాక్టర్ గార్లపాటి మద్దిలేటి స్వామి నంద్యాల డీసీసీ అధ్యక్షులు,& డోన్ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గార్లపాటి మద్దిలేటి స్వామి అధ్యక్షతన డోన్‌లో కాంగ్రెస్ పార్టీ స్పోర్ట్స్ సెల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కాంగ్రెస్ స్పోర్ట్స్ సెల్ చైర్మన్ జీవీవీఎస్ కమలాకర్ రావు, ఏఐసీసీ సభ్యులు జంగిటి లక్ష్మి నరసింహ యాదవ్ గారు పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా జీవీవీఎస్ కమలాకర్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో స్పోర్ట్స్ కేటగిరీలో జరుగుతున్న అవకతవకలను అరికట్టాలని అన్నారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులకు పారదర్శకంగా అవకాశాలు కల్పించాలని తెలిపారు. గతంలో స్పోర్ట్స్‌కు ప్రత్యేకంగా ఒక మంత్రి ఉండేవారని రాహుల్ గాంధీ ప్రస్తావించిన విషయాన్ని గుర్తుచేశారు. క్రీడారంగ సమస్యలను రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఏఐసీసీ సభ్యులు జంగిటి లక్ష్మి నరసింహ యాదవ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని గ్రామీణ స్థాయి నుంచి బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని తెలిపారు. గ్రామీణ స్థాయిలో పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేస్తామని చెప్పారు. డీసీసీ అధ్యక్షులు డాక్టర్ గార్లపాటి మద్దిలేటి స్వామి మాట్లాడుతూ యువత కాంగ్రెస్‌లోకి రావాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ‘పీపుల్ బుక్’ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సమావేశంలో బనగానపల్లె ఇన్‌చార్జి బాలు యాదవ్, ఆళ్లగడ్డ ఇన్‌చార్జి భరగోడ్ల హుస్సేన్ బాష, నందికొట్కూరు ఇన్‌చార్జి తేనే నాగరాజు, నంద్యాల టౌన్ అధ్యక్షులు మస్తాన్ వలి, పాణ్యం అర్బన్ ఇన్‌చార్జి రజాక్ వలి, డీసీసీ ఉపాధ్యక్షులు ఉన్నిగొర్ల జనార్దన్, ప్రధాన కార్యదర్శి వడ్డే రాజశేఖర్, కార్యదర్శి ఆర్. గోపినాథ్ రావు, మండల అధ్యక్షులు ధోని రామాంజనేయులు, శనిగాల మహీంద్ర నాయుడు, స్టేట్ మైనారిటీ ఉపాధ్యక్షులు అబ్దుల్ మాజిద్ మౌలానా , పఠాన్ మహమ్మద్ హుస్సేన్, కాంగ్రెస్ మహిళా నేతలు భారతి, లక్ష్మీదేవి, నాయకులు గిడ్డయ్య, నాగన్న వెంకటేశ్వర్లు, బాలు, సురేష్, రాజ్ కుమార్, అప్పన్న, ఇంతియాజ్, మస్తాన్ బాష, రామకృష్ణ, మల్లికార్జున, శివ, రామాంజినేయులు, మద్దిలేటి, మాషుమ్, జలీల్, సెక్షవలి, మధు తదితరులు పాల్గొన్నారు.
    1
    డోన్‌లో కీలక భేటీ నిర్వహించిన నంద్యాల డీసీసీ డాక్టర్ గార్లపాటి మద్దిలేటి స్వామి
నంద్యాల డీసీసీ అధ్యక్షులు,& డోన్ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గార్లపాటి మద్దిలేటి స్వామి అధ్యక్షతన డోన్‌లో కాంగ్రెస్ పార్టీ స్పోర్ట్స్ సెల్ సమావేశం నిర్వహించారు. 
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కాంగ్రెస్ స్పోర్ట్స్ సెల్ చైర్మన్ జీవీవీఎస్ కమలాకర్ రావు, ఏఐసీసీ సభ్యులు జంగిటి లక్ష్మి నరసింహ యాదవ్ గారు పాల్గొని ప్రసంగించారు
ఈ సందర్భంగా జీవీవీఎస్ కమలాకర్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో స్పోర్ట్స్ కేటగిరీలో జరుగుతున్న అవకతవకలను అరికట్టాలని అన్నారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులకు పారదర్శకంగా అవకాశాలు కల్పించాలని తెలిపారు. గతంలో స్పోర్ట్స్‌కు ప్రత్యేకంగా ఒక మంత్రి ఉండేవారని రాహుల్ గాంధీ ప్రస్తావించిన విషయాన్ని గుర్తుచేశారు. క్రీడారంగ సమస్యలను రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఏఐసీసీ సభ్యులు జంగిటి లక్ష్మి నరసింహ యాదవ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని గ్రామీణ స్థాయి నుంచి బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని తెలిపారు.  గ్రామీణ స్థాయిలో పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేస్తామని చెప్పారు. 
డీసీసీ అధ్యక్షులు డాక్టర్ గార్లపాటి మద్దిలేటి స్వామి మాట్లాడుతూ యువత కాంగ్రెస్‌లోకి రావాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ‘పీపుల్ బుక్’ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సమావేశంలో బనగానపల్లె ఇన్‌చార్జి బాలు యాదవ్, ఆళ్లగడ్డ ఇన్‌చార్జి భరగోడ్ల హుస్సేన్ బాష, నందికొట్కూరు ఇన్‌చార్జి తేనే నాగరాజు, నంద్యాల టౌన్ అధ్యక్షులు మస్తాన్ వలి, పాణ్యం అర్బన్ ఇన్‌చార్జి రజాక్ వలి, డీసీసీ ఉపాధ్యక్షులు ఉన్నిగొర్ల జనార్దన్, ప్రధాన కార్యదర్శి వడ్డే రాజశేఖర్, కార్యదర్శి ఆర్. గోపినాథ్ రావు, మండల అధ్యక్షులు ధోని రామాంజనేయులు, శనిగాల మహీంద్ర నాయుడు, స్టేట్ మైనారిటీ ఉపాధ్యక్షులు అబ్దుల్ మాజిద్ మౌలానా , పఠాన్ మహమ్మద్ హుస్సేన్, కాంగ్రెస్ మహిళా నేతలు భారతి, లక్ష్మీదేవి, నాయకులు గిడ్డయ్య, నాగన్న వెంకటేశ్వర్లు, బాలు, సురేష్, రాజ్ కుమార్, అప్పన్న, ఇంతియాజ్, మస్తాన్ బాష, రామకృష్ణ, మల్లికార్జున, శివ, రామాంజినేయులు, మద్దిలేటి, మాషుమ్, జలీల్, సెక్షవలి, మధు తదితరులు పాల్గొన్నారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • వినుకొండ,జాలపాలెం భూములు పేదలకు పంచాలి. పిడిఎం డిమాండ్ వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి రెవెన్యూ పరిధిలోని జాలపాలెం గ్రామంలో 175 ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. అక్రమ పాస్‌పుస్తకాలు, రిజిస్ట్రేషన్లపై న్యాయపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, భూముల్లోని ఎర్రచందనం తదితర కలపను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. వినుకొండ–వెల్లటూరు రహదారిపై జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
    1
    వినుకొండ,జాలపాలెం భూములు పేదలకు పంచాలి. పిడిఎం డిమాండ్
వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి రెవెన్యూ పరిధిలోని జాలపాలెం గ్రామంలో 175 ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. అక్రమ పాస్‌పుస్తకాలు, రిజిస్ట్రేషన్లపై న్యాయపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, భూముల్లోని ఎర్రచందనం తదితర కలపను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. వినుకొండ–వెల్లటూరు రహదారిపై జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
    user_Orsu Krishna
    Orsu Krishna
    Social worker పిడుగురాళ్ల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • బద్వేలు,ఆగస్టు 23: నియోజకవర్గంలోని అట్లూరు మండలం ఎస్. వెంకటాపురం పంచాయతీ పరిధిలోని చండువాయి కాలనీలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో జరిగిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన కుటుంబానికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఇ. రమణయ్య డిమాండ్ చేశారు. చండువాయి కాలనీకి చెందిన బొమ్మిశెట్టి ఈశ్వరమ్మ, ఆమె కుమారుడు హరిబాబు నివాసంలో విద్యుత్ వైర్లు షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో టీవీ, కూలర్, ఫ్యాన్లు, సోఫా సెట్, గృహోపకరణాలు పూర్తిగా కాలిపోయి పేద కుటుంబం తీవ్రంగా నష్టపోయింది. కాలనీలో చాలా కాలంగా విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉన్నా, వోల్టేజ్ సమస్యలు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని విమర్శించారు. ఘటన అనంతరం విద్యుత్ శాఖ ఏఈ కృష్ణ కి ఫోన్ చేసి సంఘటన స్థలానికి రావాలని కోరగా, బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా “మీటర్ ఉందా? డిమాండ్ నంబర్ ఉందా?” అని ప్రశ్నించడం అమానుషమని మండిపడ్డారు. బాధిత కుటుంబానికి తక్షణ సాయం అందించాలని, పాత విద్యుత్ తీగలను మార్చి, ట్రాన్స్ ఫార్మర్ సామర్థ్యం పెంచి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పి. సరస్వతి, ఆదిలక్ష్మి, శివ, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
    2
    బద్వేలు,ఆగస్టు 23: నియోజకవర్గంలోని అట్లూరు మండలం ఎస్. వెంకటాపురం పంచాయతీ పరిధిలోని చండువాయి కాలనీలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో జరిగిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన కుటుంబానికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఇ. రమణయ్య డిమాండ్ చేశారు.
చండువాయి కాలనీకి చెందిన బొమ్మిశెట్టి ఈశ్వరమ్మ, ఆమె కుమారుడు హరిబాబు నివాసంలో విద్యుత్ వైర్లు షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో టీవీ, కూలర్, ఫ్యాన్లు, సోఫా సెట్, గృహోపకరణాలు పూర్తిగా కాలిపోయి పేద కుటుంబం తీవ్రంగా నష్టపోయింది.
కాలనీలో చాలా కాలంగా విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉన్నా, వోల్టేజ్ సమస్యలు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని విమర్శించారు.
ఘటన అనంతరం విద్యుత్ శాఖ ఏఈ కృష్ణ కి ఫోన్ చేసి సంఘటన స్థలానికి రావాలని కోరగా, బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా “మీటర్ ఉందా? డిమాండ్ నంబర్ ఉందా?” అని ప్రశ్నించడం అమానుషమని మండిపడ్డారు.
బాధిత కుటుంబానికి తక్షణ సాయం అందించాలని, పాత విద్యుత్ తీగలను మార్చి, ట్రాన్స్ ఫార్మర్ సామర్థ్యం పెంచి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు పి. సరస్వతి, ఆదిలక్ష్మి, శివ, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • రోడ్డుపై కూలిన చెట్టు: శ్రమదానం చేసి తొలగించిన పానుగల్ మాజీ జెడ్పీటీసీ రవి* 👉 *కేతేపల్లి- వనపర్తి* రహదారిపై అడ్డంగా *పడిన భారీ వృక్షాన్ని* పానుగల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు *మాజీ జెడ్పీటీసీ రవి తన అనుచరులతో* కలిసి శ్రమదానం చేసి ఆదివారం తొలగించారు. ప్రయాణికులు ఇబ్బందులు పడకూడదని, సమస్యను గమనించిన రవి వెంటనే స్పందించారు. అధికారుల కోసం వేచి చూడకుండా, స్వయంగా రంగంలోకి దిగారు. *స్థానికులు, తన అనుచరులతో కలిసి శ్రమదానం చేశారు. కొడవలి తో చెట్టు కొమ్మలను నరికి, అటుగా వెళ్తున్న ట్రాక్టర్ సహాయం తో రహదారిపై నుంచి పక్కకు తొలగించారు* . సేవాభావాన్ని చూసి ప్రయాణికులు, మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా పదవిలో లేకపోయినా, సమాజం పట్ల ఆయన చూపిన బాధ్యతను పలువురు అభినందించారు.
    1
    రోడ్డుపై కూలిన చెట్టు: శ్రమదానం చేసి తొలగించిన పానుగల్ మాజీ జెడ్పీటీసీ రవి*
👉 *కేతేపల్లి- వనపర్తి* రహదారిపై అడ్డంగా *పడిన భారీ వృక్షాన్ని* పానుగల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు *మాజీ జెడ్పీటీసీ రవి తన అనుచరులతో* కలిసి శ్రమదానం చేసి ఆదివారం తొలగించారు. ప్రయాణికులు ఇబ్బందులు పడకూడదని, సమస్యను గమనించిన రవి వెంటనే స్పందించారు. అధికారుల కోసం వేచి చూడకుండా, స్వయంగా రంగంలోకి దిగారు. *స్థానికులు, తన అనుచరులతో కలిసి శ్రమదానం చేశారు. కొడవలి తో చెట్టు కొమ్మలను నరికి, అటుగా వెళ్తున్న ట్రాక్టర్ సహాయం తో రహదారిపై నుంచి పక్కకు తొలగించారు* . సేవాభావాన్ని చూసి ప్రయాణికులు, మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా పదవిలో లేకపోయినా, సమాజం పట్ల ఆయన చూపిన బాధ్యతను పలువురు అభినందించారు.
    user_KAVITHA GALIGALA
    KAVITHA GALIGALA
    వీపనగండ్ల, వనపర్తి, తెలంగాణ•
    15 hrs ago
  • పదవ వార్డ్ టిడిపి ఇంచార్జ్ వల్లెరి కిరణ్ కుమార్ ను సన్మానించిన గణేష్ కమిటీ 10వ వార్డ్ వార్డు గణేష్ ఉత్సవ కమిటీ అంబేద్కర్ యువసేన కమిటీ సభ్యులు పదో వ వార్డ్ టిడిపి ఇంచార్జ్ వల్లేరి కిరణ్ కుమార్ ను తన నివాసంలో కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా వినాయక చవితిని పురస్కరించుకుని తమకు విగ్రహాన్ని అందజేస్తూ ఉంటారని అలాగే ఈ ఏట కూడా తమకు విగ్రహాన్ని ఇవ్వటం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు.
    1
    పదవ వార్డ్ టిడిపి ఇంచార్జ్ వల్లెరి కిరణ్ కుమార్ ను సన్మానించిన గణేష్ కమిటీ
10వ వార్డ్ వార్డు గణేష్ ఉత్సవ కమిటీ అంబేద్కర్ యువసేన కమిటీ సభ్యులు పదో వ వార్డ్ టిడిపి ఇంచార్జ్ వల్లేరి కిరణ్ కుమార్ ను తన నివాసంలో కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా వినాయక చవితిని పురస్కరించుకుని తమకు విగ్రహాన్ని అందజేస్తూ ఉంటారని అలాగే ఈ ఏట కూడా తమకు విగ్రహాన్ని ఇవ్వటం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు.
    user_Bala
    Bala
    కావలి, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు పాల్గొన్న ఎమ్మెల్యే మెగాస్టార్ చిరంజీవి 72 జన్మదినాన్ని పురస్కరించుకుని కావలిలోని ముసునూరు తెలుగు తల్లి పార్క్ వద్ద దేవరకొండ శీను,ఆలా శీను కావలి మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అభిమానులు ఆధ్వర్యంలో శనివారం వేడుకలు ఘనంగా జరిగాయి.​ఈ కార్యక్రమానికి కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మెగాస్టార్ అభిమానులు, చిన్నారులతో కలిసి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కేక్ కట్ చేసి అభిమానులకు, పిల్లలకు తినిపించారు.ఈ కార్యక్రమంలో అభిమానులు, స్థానిక నాయకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ శీను,ఆలా శీను,విక్రమ్ రెడ్డి పాల్గొన్నారు.
    1
    ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు పాల్గొన్న ఎమ్మెల్యే
మెగాస్టార్ చిరంజీవి 72 జన్మదినాన్ని పురస్కరించుకుని కావలిలోని ముసునూరు తెలుగు తల్లి పార్క్ వద్ద దేవరకొండ శీను,ఆలా శీను కావలి మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అభిమానులు ఆధ్వర్యంలో శనివారం వేడుకలు ఘనంగా జరిగాయి.​ఈ కార్యక్రమానికి కావలి శాసనసభ్యులు  కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మెగాస్టార్ అభిమానులు, చిన్నారులతో కలిసి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కేక్ కట్ చేసి అభిమానులకు, పిల్లలకు తినిపించారు.ఈ  కార్యక్రమంలో అభిమానులు, స్థానిక నాయకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ శీను,ఆలా శీను,విక్రమ్ రెడ్డి పాల్గొన్నారు.
    user_Bala
    Bala
    కావలి, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.