సాగునీటిని వెంటనే విడుదల చేయాలి రైతు వ్యతిరేకిగా కూటమి ప్రభుత్వం. శిల్పా అంటేనే మహానంది మండలం.. క్షేత్రంలో అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశా .. మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి.. తెలుగుగంగ కాలువలకు సాగునీరు విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం మహానందిలోని కుమ్మరి సత్రంలో రైతులతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా మాట్లాడుతూ.. ఖరీఫ్ సమయం ముగిసిపోతుందని రైతులు ఆందోళన చెందుతుంటే పాలకులు మాత్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.రైతు సంక్షేమం అంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రైతు వ్యతిరేకి ప్రభుత్వంగా మారిపోయిందని అన్నారు. ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని కనీసం ఖరీఫ్ సీజన్ లో కూడా నీళ్లు ఇవ్వలేని ప్రభుత్వం దుర్మార్గమైన పాలన కొనసాగిస్తుందని అన్నారు.శ్రీశైలం డ్యాంలో నీళ్లు ఉన్నప్పటికీ, రైతులకు ఎందుకు నీళ్లు ఇవ్వలేకపోతున్నారో నాయకులు సమాధానం చెప్పాలన్నారు. తను అధికారంలో ఉన్నప్పుడు మహానంది పుణ్యక్షేత్రంలో అభివృద్ధి చేసిన ఘనత తనదే అన్నారు.శిల్ప అంటేనే మహానంది మండలం అనిపించుకున్న మండలం ఇది అని నన్ను దూరం చేశారని భావోద్వేగానికి గురయ్యారు. ప్రభుత్వ, తన సొంత నిధులతో మండలాన్ని అభివృద్ధి చేశారన్నారు. రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగికి రూ.3 వేలు ఇస్తానంటూ మోసం చేసింది చంద్రబాబు నాయుడు కదా అని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తెలుగు గంగ కాలువలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ మండల అధ్యక్షుడ కొమ్మా మహేశ్వర్ రెడ్డి,రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శి కొండా మధుసూదన్ రెడ్డి, వైయస్ఆర్ సీపీ నాయకులు వీరారెడ్డి, గజ్జ పెద్ద పకీరయ్య, తదితరులు పాల్గొన్నారు.
సాగునీటిని వెంటనే విడుదల చేయాలి రైతు వ్యతిరేకిగా కూటమి ప్రభుత్వం. శిల్పా అంటేనే మహానంది మండలం.. క్షేత్రంలో అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశా .. మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి.. తెలుగుగంగ కాలువలకు సాగునీరు విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం మహానందిలోని కుమ్మరి సత్రంలో రైతులతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా మాట్లాడుతూ.. ఖరీఫ్ సమయం ముగిసిపోతుందని రైతులు ఆందోళన చెందుతుంటే పాలకులు మాత్రం పట్టించుకోకపోవడం
దారుణమన్నారు.రైతు సంక్షేమం అంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రైతు వ్యతిరేకి ప్రభుత్వంగా మారిపోయిందని అన్నారు. ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని కనీసం ఖరీఫ్ సీజన్ లో కూడా నీళ్లు ఇవ్వలేని ప్రభుత్వం దుర్మార్గమైన పాలన కొనసాగిస్తుందని అన్నారు.శ్రీశైలం డ్యాంలో నీళ్లు ఉన్నప్పటికీ, రైతులకు ఎందుకు నీళ్లు ఇవ్వలేకపోతున్నారో నాయకులు సమాధానం చెప్పాలన్నారు. తను అధికారంలో ఉన్నప్పుడు మహానంది పుణ్యక్షేత్రంలో అభివృద్ధి చేసిన ఘనత తనదే అన్నారు.శిల్ప అంటేనే మహానంది మండలం అనిపించుకున్న మండలం ఇది అని నన్ను
దూరం చేశారని భావోద్వేగానికి గురయ్యారు. ప్రభుత్వ, తన సొంత నిధులతో మండలాన్ని అభివృద్ధి చేశారన్నారు. రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగికి రూ.3 వేలు ఇస్తానంటూ మోసం చేసింది చంద్రబాబు నాయుడు కదా అని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తెలుగు గంగ కాలువలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ మండల అధ్యక్షుడ కొమ్మా మహేశ్వర్ రెడ్డి,రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శి కొండా మధుసూదన్ రెడ్డి, వైయస్ఆర్ సీపీ నాయకులు వీరారెడ్డి, గజ్జ పెద్ద పకీరయ్య, తదితరులు పాల్గొన్నారు.
- పేదల కుంకుమ షాపులు, తోపుడు బండ్ల తొలగింపుపై మహిళా వ్యాపారుల ధర్నా కర్నూలు జిల్లా ఉరుకుంద శ్రీ లక్ష్మీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానం వద్ద పేద మహిళా వ్యాపారుల కుంకుమ, విభూతి షాపులను తొలగించడంపై ఆదివారం వారు రోడ్డుపై ధర్నాకు దిగారు. సుమారు 50 ఏళ్లుగా తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్న తమ షాపులను రాత్రికి రాత్రే తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరి షాపులకు మాత్రమే అవకాశం ఇచ్చి, తమ షాపులను తొలగించడం ఏమిటని ఆలయ ఈవో వాణిని, గ్రామ పెద్దలను మహిళలు నిలదీశారు. అప్పులు చేసి వ్యాపారాలు నిర్వహిస్తున్నామని, వెంటనే తమ షాపులను పునరుద్ధరించి శ్రావణమాసం ముగిసే వరకు వ్యాపారానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాయకులు స్పందించి ఈవోతో మాట్లాడి షాపులను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. సమస్య పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని మహిళా వ్యాపారులు హెచ్చరించారు.1
- ఏసీబీ వలకు చిక్కిన ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయం ఉన్నతాధికారి ఏ ఓ శ్రీనివాసరెడ్డి హైదరాబాద్:ఆగస్టు 20 ఏసీబీ వలలో మరో ఉన్నతాధికారి చిక్కా రు. భారీ అవినీతి, అక్రమాస్తుల ఆరోప ణల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయం లో అడ్మిన్ అధికారి గా విధులు నిర్వహి స్తున్న శ్రీనివాస్ రెడ్డి, నివాసంలో గురువా రం ఉదయం నుండి ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని అతడి బంధువులు, స్నేహితులకు చెందిన 15 చోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి, ఆస్తులు, నగదు, బంగారంపై శ్రీనివాస్ రెడ్డిని ఏసీబీ అధికా రులు ఆరా తీస్తున్న ట్లు తెలుస్తోంది. శ్రీనివాస్ రెడ్డి గతంలో మహేశ్వరం, బాలా పూర్, శంషాబాద్ ఎమ్మార్వోగా విధులు నిర్వహించారు *తహసీల్దార్ అక్రమ ఆస్తులపై ఏసీబీ సోదాలు!* * *రూ.7 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు.. బహిరంగ మార్కెట్ విలువ రూ.100 కోట్లకు పైనే!* * *ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో తహసీల్దార్ దాసరి శ్రీనివాస్‌రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు*. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురంలోని ఆయన నివాసంలో ఏసీబీ సోదాలు. - నివాసం, కార్యాలయంతో పాటు ఏకకాలంలో 7 ప్రాంతాల్లో మెరుపు సోదాలు. - ఇబ్రహీంపట్నం ఆర్‌డీవో కార్యాలయంలో గతంలో డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా శ్రీనివాస్‌రెడ్డి పనిచేశారు. - డీజీ అనుమతితో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు. *సోదాల్లో భారీగా ఆస్తుల గుర్తింపు* - ఇప్పటివరకు 8 ఓపెన్ ప్లాట్లు గుర్తింపు. - తుర్కయంజాల్‌లో – 3 ప్లాట్లు. - యాదగిరిగుట్టలో – 3 ప్లాట్లు. - హస్తినాపురంలో – 1 ప్లాట్. - విశ్వేశ్వర నగర్ కాలనీలో – 1 ప్లాట్. - రంగారెడ్డి జిల్లాలోని ఓ మండలంలో 10 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి. - హస్తినాపురంలో మూడంతస్తుల ఇల్లు. - హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో మరో రెండు ఫ్లాట్లు.2
- #rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty1
- పదవ వార్డ్ టిడిపి ఇంచార్జ్ వల్లెరి కిరణ్ కుమార్ ను సన్మానించిన గణేష్ కమిటీ 10వ వార్డ్ వార్డు గణేష్ ఉత్సవ కమిటీ అంబేద్కర్ యువసేన కమిటీ సభ్యులు పదో వ వార్డ్ టిడిపి ఇంచార్జ్ వల్లేరి కిరణ్ కుమార్ ను తన నివాసంలో కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా వినాయక చవితిని పురస్కరించుకుని తమకు విగ్రహాన్ని అందజేస్తూ ఉంటారని అలాగే ఈ ఏట కూడా తమకు విగ్రహాన్ని ఇవ్వటం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు.1
- వినుకొండ,జాలపాలెం భూములు పేదలకు పంచాలి. పిడిఎం డిమాండ్ వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి రెవెన్యూ పరిధిలోని జాలపాలెం గ్రామంలో 175 ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. అక్రమ పాస్‌పుస్తకాలు, రిజిస్ట్రేషన్లపై న్యాయపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, భూముల్లోని ఎర్రచందనం తదితర కలపను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. వినుకొండ–వెల్లటూరు రహదారిపై జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.1
- నల్గొండ వెంకటరమణ హీరో షోరూం లో అగ్నిప్రమాదం.. ఆహుతైన బైక్లు నల్గొండ పట్టణంలోని అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం... వెంకటరమణ బైక్ షోరూంలో చెలరేగిన మంటలు.. కాలిన బూడిదైన బైక్‌లు, స్పేర్ పార్ట్స్... స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది... రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను పూర్తిగా అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది... సంఘటన స్థలాన్ని పరిశీలించిన టూ టౌన్ సీఐ ఆదిరెడ్డి, ఎస్సై సైదా బాబు... ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం... కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు...1
- ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు పాల్గొన్న ఎమ్మెల్యే మెగాస్టార్ చిరంజీవి 72 జన్మదినాన్ని పురస్కరించుకుని కావలిలోని ముసునూరు తెలుగు తల్లి పార్క్ వద్ద దేవరకొండ శీను,ఆలా శీను కావలి మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అభిమానులు ఆధ్వర్యంలో శనివారం వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మెగాస్టార్ అభిమానులు, చిన్నారులతో కలిసి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కేక్ కట్ చేసి అభిమానులకు, పిల్లలకు తినిపించారు.ఈ కార్యక్రమంలో అభిమానులు, స్థానిక నాయకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ శీను,ఆలా శీను,విక్రమ్ రెడ్డి పాల్గొన్నారు.1
- పదవి దక్కిందని కాదు రైతుకు అండగా నిలిచినప్పుడే అసలైన గౌరవం కోవూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలో పదవులు పొందడం గొప్ప విషయం కాదని, ఆ బాధ్యతలకు వంద శాతం న్యాయం చేసి రైతుల నోట, ప్రజల నోట మంచి పేరు తెచ్చుకోవడమే అసలైన గొప్ప విషయమని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. నార్త్‌రాజుపాళెం మార్కెట్ యార్డు వద్ద నిర్వహించిన కోవూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ అభినందన సభలో ఎంపీ, ఎమ్మెల్యే పాల్గొని నూతన ఛైర్మన్, వైస్ ఛైర్మన్, సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కోవూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ఛైర్మన్ బెజవాడ వంశీకృష్ణారెడ్డి తో పాటు వైస్ ఛైర్మన్, సభ్యులందరూ కలిసికట్టుగా పనిచేసి రైతాంగానికి సేవలు అందించాలని పిలుపునిచ్చారు.4
- రాయదుర్గం నియోజకవర్గం లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటనను జయప్రదం చేయండి రాయదుర్గంలో నిర్వహించనున్న మంత్రి లోకేశ్ పర్యటనను విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, టీడీపీ కోఆర్డినేటర్ రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే ధ్యేయమన్నారు. పర్యటనకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు. 10 వేల 15 వేల మంది స్వచ్ఛందంగా తరలివస్తారని తెలిపారు.1