Shuru
Apke Nagar Ki App…
ఫిబ్రవరి 12 జరిగే దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాలి. ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని రాఘవపురం, రుద్రవరం ఆటో స్టాండ్ల వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు కె. గోపాల్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్, ఎంవీ యాక్ట్ సవరణలు, జీవో నెం.21 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో ఉపాధిని దెబ్బతీసే విదేశీ ప్రైవేట్ కంపెనీలకు అనుమతులు రద్దు చేసి, తక్కువ వడ్డీ రుణాలు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ఆటో కార్మికులు పాల్గొన్నారు.
V. sureh
ఫిబ్రవరి 12 జరిగే దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాలి. ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని రాఘవపురం, రుద్రవరం ఆటో స్టాండ్ల వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు కె. గోపాల్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్, ఎంవీ యాక్ట్ సవరణలు, జీవో నెం.21 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో ఉపాధిని దెబ్బతీసే విదేశీ ప్రైవేట్ కంపెనీలకు అనుమతులు రద్దు చేసి, తక్కువ వడ్డీ రుణాలు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ఆటో కార్మికులు పాల్గొన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- గుంటూరు జిల్లా: మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరుకు బయలుదేరారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి సుమారు 20 వాహనాల భారీ కాన్వాయ్‌తో ఆయన ప్రయాణమయ్యారు. జగన్ రాకను పురస్కరించుకుని గుంటూరులో పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.1
- shot News:గుంటూరులో జరిగిన గొడవపై అంబటి కుమార్తె ప్రెస్ మీట్1
- జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వచ్చి 20 సంవత్సరాలు పూర్తయిన నిధులు కేటాయించడంలో జాప్యం జరుగుతుందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. వెంకటేశ్వర్లు విమర్శించారు. బుధవారం నాడు జంగారెడ్డిగూడెం ప్రజా సంఘాల కార్యాలయం నుండీ ఉపాధి హామీ పరిరక్షణ యాత్రను ప్రారంభించారు.గ్రామీణ ప్రాంతంలో వంద రోజులు పనులు కల్పించి పేదలకు పని హక్కు ఇవ్వాలన్నారు.1
- మారుతున్న జీవనశైలి మానసిక ఒత్తిడి ఆహార కల్తి వంటి కారణాలవల్ల విస్తరిస్తున్న క్యాన్సర్ మహమ్మారిని అరికట్టడానికి సామాజిక అవగాహనే కీలకమని మహబూబాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు మంగళవారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాన్సర్ అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు మనం తీసుకునే ఆహారం పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు.1
- నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం చర్లపల్లి డివిజన్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు సందర్శించారు. ఈ సందర్భంగా స్థానికులు సబ్ స్టేషన్ కొరత కారణంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై తక్షణమే స్పందించిన మంత్రి గారు సంబంధిత విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి, చర్లపల్లిలో నూతన సబ్ స్టేషన్ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు స్పష్టం చేశారు.1
- ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మచిలీపట్నంలో మెడికల్ విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కలెక్టర్ డీకే బాలాజీ పాల్గొని క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చన్నారు. ప్రత్యేక బస్సుల ద్వారా 2,000 మందికి పరీక్షలు చేసి 110 మందిలో లక్షణాలు గుర్తించామని తెలిపారు. ప్రజలు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.1
- వీరులపాడు మండలం జుజ్జూరులో ప్రతిరోజూ సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ సమస్య జటిలమవుతోంది. ప్రధాన రహదారి గుండా భారీ వాహనాలు, ప్రైవేటు వాహనాల రాకపోకలు పెరగడంతో గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా పాఠశాలలు, కార్యాలయాలు ముగిసే సమయం కావడంతో విద్యార్థులు, ఉద్యోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు సైతం కదలలేని పరిస్థితి నెలకొంది.1
- గుంటూరు నగరం: గుంటూరు వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన భారీ మెడికల్ ఎగ్జిబిషన్‌ను మంత్రి సత్య కుమార్ బుధవారం ప్రారంభించారు. మానవ అవయవాల పనితీరు మరియు అత్యాధునిక చికిత్సా పద్ధతులపై విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ ప్రదర్శన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మంత్రి కోరారు.1
- shot News:అంబటి దాడి విషయంలో రేపు గుంటూరుకు వచ్చి అంబటి ఇంటి వారిని పరామర్శించనున్న మాజీ ముఖ్యమంత్రి జగన్1