Shuru
Apke Nagar Ki App…
అమరావతి శాశ్వత రాజధాని అందరికీ ఆమోదం: రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ ఏపీ పునర్విభజన చట్టం సవరణలపై జరుగుతున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మాట్లాడారు. రాష్ట్ర విభజన నేపథ్యాన్ని ఆయన వివరించారు.విభజన తర్వాత అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా సీఎం చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించారని గుర్తు చేశారు. అమరావతి అత్యంత పవిత్రమైన నేల అని ఆయన కొనియాడారు. సీఎం ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు తెలుపుతున్నట్లు ఆయన ప్రకటించారు.
PHANI JOURNALIST
అమరావతి శాశ్వత రాజధాని అందరికీ ఆమోదం: రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ ఏపీ పునర్విభజన చట్టం సవరణలపై జరుగుతున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మాట్లాడారు. రాష్ట్ర విభజన నేపథ్యాన్ని ఆయన వివరించారు.విభజన తర్వాత అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా సీఎం చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించారని గుర్తు చేశారు. అమరావతి అత్యంత పవిత్రమైన నేల అని ఆయన కొనియాడారు. సీఎం ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు తెలుపుతున్నట్లు ఆయన ప్రకటించారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- లక్ష రూపాయలకు రోజుకు రెండు వేల రూపాయల వడ్డీ ఇస్తామని నమ్మబలికి పలువురిని మోసం చేసిన ఇద్దరు నిందితులను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు మనోహర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి నేమకల్లుకు చెందిన వ్యక్తి నుంచి రూ.1.50 లక్షలు దోపిడీ చేసినట్లు రూరల్ సీఐ వెంకటరమణ తెలిపారు. బాధితుడి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఆదివారం ఎర్రగుంట సమీపంలో వీరిని అదుపులోకి తీసుకున్నారు.1
- ప్రజల భద్రత దృష్టిలో ఉంచుకొని ఆపరేషన్ నైట్ సేఫ్టీ అమలు.రాత్రంతా SP వీధిలోనే. అనంవసరంగా రాత్రి వేళ బయట తిరిగితే చర్యలు తప్పవు, ట్రీట్మెంట్ తప్పదు1
- కర్నూలు జిల్లా ఆలూరులో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జ్ఞాపకాలను స్మరించుకుంటూ నాయకులు నివాళులర్పించారు. టిడిపి ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో తేరు బజారు వీధిలో తెలుగుదేశం జెండాను ఎగరవేశారు.ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే పోలీస్ స్టేషన్ దగ్గరలో చలివేంద్రాన్ని వైకుంఠ జ్యోతి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి మాట్లాడుతూ “సమాజమే దేవాలయం… ప్రజలే దేవుళ్లు” అనే మహోన్నత భావజాలంతో స్థాపించబడిన టిడిపి పార్టీ, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాలు విజయవంతంగా పార్టీ నడుస్తుందంటే కార్యకర్తలు అంత బలంగా ఉన్నారని, నడిపించే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ, ప్రజల కోసం టిడిపి పార్టీ ఎప్పటికీ పనిచేస్తుందన్నారు. అనంతరం టిడిపి ఇన్చార్జి వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో నాయకులు,కార్యకర్తలతో తెలుగుదేశం పార్టీ ప్రతిజ్ఞ చేశారు .2
- *షార్ట్ సర్క్యూట్‌తో ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులో మంటలు* వరంగల్ 1 ఆర్టీసీ బస్సు డీపోలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డిపోలు ఉన్న ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి.వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసే చేశారు. కాగా బస్సు మంటల్లో పాక్షికంగా దగ్ధమైంది.1
- ఎమ్మిగనూరు చేనేతల కో-ఆపరేటివ్ సొసైటీ సర్వసభ్య సమావేశం ఈనెల 31వ తేదీన జరగనుంది. ఈ సమావేశంలో సొసైటీని ఆప్కోలో విలీనం చేయాలనే ఉద్దేశపూర్వక ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాచారం నేపథ్యంలో సభ్యులు, చేనేత కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పద్మశ్రీ మాచాని సోమప్ప గారు స్థాపించిన ఈ చేనేత కో-ఆపరేటివ్ సొసైటీ ఎమ్మిగనూరుకు ప్రత్యేక గుర్తింపుగా నిలిచిందని, దీన్ని విలీనం చేయకుండా కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. సొసైటీని ఆప్కోలో విలీనం చేయకుండా నిలబెట్టేందుకు ప్రజాసంఘాలు, చేనేత కార్మికులు, స్థానిక ప్రజలు పార్టీలకతీతంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు మార్చి 31న జరిగే సర్వసభ్య సమావేశంలో విలీనానికి వ్యతిరేకంగా గళమెత్తాలని కోరుతున్నారు. అలాగే అదే రోజు వివర్స్ కాలనీ మైదానం వద్ద, సొసైటీ కార్యాలయం ఎదురుగా నిర్వహించబడనున్న కార్యక్రమంలో పాల్గొని, చేనేత సొసైటీ పరిరక్షణకు సంఘీభావం తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. మాచాని సోమప్ప గారి సేవలను స్మరించుకుంటూ, ఆయన స్థాపించిన ఈ సొసైటీని భవిష్యత్తు తరాలకు అందించే బాధ్యత మన అందరిదని సభ్యులు పేర్కొన్నారు.1
- గాండ్లపెంట మండల పరిధిలోని కటారిపల్లి గ్రామంలో యోగివేమన ఉత్సవాలు అంబరాన్ని అంటాయి. కటారుపల్లి గ్రామంలో కళాకారులు చేసిన అమ్మవారి నృత్యాలను భక్తులను ఆకట్టుకున్నాయి. రాక్షసుణ్ణి అమ్మవారు వేటాడి చంపినట్లు చేసిన కళారూపాలను వేమన భక్తులు ప్రశంసిస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి శక్తి పూజ అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకర్షించాయి.1
- _ఈనెల 31వ తేదీన ఎమ్మిగనూరు చేనేతల కో-ఆపరేటివ్ సొసైటీ సర్వసభ్య సమావేశం జరుగనున్నది. ఆ సమావేశంలో మన సొసైటీని ఆప్కోలో విలీనం చేయాలని ఉద్దేశపూర్వక ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనందరికీ, ముఖ్యంగా ఎమ్మిగనూరుకు, ఎమ్మిగనూరు చేనేతలకు, పితామహుడైన పద్మశ్రీ మాచాని సోమప్ప స్థాపించిన ఈ కో-ఆపరేటివ్ సొసైటీని కాపాడుకోవడం అనే బాధ్యత ఉంది.ఆయనకు గుర్తుగా ఉన్న ఈ సొసైటీని ఆప్కోలో విలీనం కాకుండా ఉంచేందుకు, ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటున్నాను. ప్రజాసంఘాలు, ప్రజలు, అందరూ పార్టీలకతీతంగా ముందుకు వచ్చి, సొసైటీని కాపాడడానికి ప్రయత్నించాలి._31వ తేదీ సర్వసభ్య సమావేశంలో, ఆప్కోలో విలీనానికి సంబంధించి ఉద్దేశపూర్వక కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ, ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అవ్వాలని, మద్దతు తెలియజేయాలని కోరుకుంటున్నాను.ఎప్పటికీ మాచాని సోమప్ప ని మర్చిపోకుండా, ఆయన స్థాపించిన సొసైటీని ఆయనకు గుర్తుగా ఉండే విధంగా నిర్వహించడం మనందరి బాధ్యత. అందరూ 31వ తేదీన సర్వసభ్య సమావేశంలో ఆప్కోలో విలీనాన్ని వ్యతిరేకిస్తూ వివర్స్ కాలనీ మైదానం సొసైటీ ఎదురుగా జరగబోయే కార్యకంలో పాల్గొని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.1
- రాయదుర్గం పట్టణంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆదివారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని బళ్లారి రోడ్డు నుంచి వినాయక కూడలి, లక్ష్మీబజార్ మీదుగా మద్దానేశ్వర స్వామి ఫంక్షన్ హాల్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. రాయదుర్గం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.1