logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జీ.విట్టల్ రెడ్డి* లక్ష్మీబాయి మారుతి ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేసుకుని ఈరోజు గృహప్రవేశం చేయటం జరిగింది దానికి ముఖ్యఅతిథిగా హాజరైన ముధోల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ జి.విఠల్ రెడ్డి* . మన తెలంగాణ రాష్ట్ర ప్రజ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడుతుందని దశలవారీగా లబ్ధిదారుని ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయని అన్నారు. పేదోడి సొంతింటి కలను నిజం చేయడమే ప్రజా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు. *ముధోల్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినందుకు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు గృహ నిర్మాణ శాఖ మాత్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి గౌరవనీయులు శ్రీ జూపల్లి కృష్ణారావు ముధోల్ నియోజకవర్గ ప్రజల తరఫున మాజీ శాసనసభ్యులు శ్రీ జీ. విఠల్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.* జిపి దాగంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో గల గుండెగళ్ళ లక్ష్మీబాయి మారుతి ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేసుకొని గృహప్రవేశం చేసుకోవడం జరిగింది ఈ శుభకార్యానికి అతిథులుగా ముధోల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు తో పాటు బాశెట్టి రాజన్న , మాజీ ఆత్మ చైర్మన్ పోతారెడ్డి ,తానూర్ సర్పంచ్ మాధవరావు పటేల్ , గ్రామ సర్పంచ్ జి సాయినాథ్ , ఉప సర్పంచ్ గణేష్ ,లక్ష్మణ్ గారు నాయకులు ఎస్కే షాదుల్ , గోవింద్ గారు, మధు రావు మరియు గ్రామస్తులు యువకులు పాల్గొనడం జరిగింది.

10 hrs ago
user_Solanke Ravi
Solanke Ravi
Local News Reporter భైంసా, నిర్మల్, తెలంగాణ•
10 hrs ago

*నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జీ.విట్టల్ రెడ్డి* లక్ష్మీబాయి మారుతి ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేసుకుని ఈరోజు గృహప్రవేశం చేయటం జరిగింది దానికి ముఖ్యఅతిథిగా హాజరైన ముధోల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ జి.విఠల్ రెడ్డి* . మన తెలంగాణ రాష్ట్ర ప్రజ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడుతుందని దశలవారీగా లబ్ధిదారుని ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయని అన్నారు. పేదోడి సొంతింటి కలను నిజం చేయడమే ప్రజా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు. *ముధోల్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినందుకు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు గృహ నిర్మాణ శాఖ మాత్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి గౌరవనీయులు శ్రీ జూపల్లి కృష్ణారావు ముధోల్ నియోజకవర్గ ప్రజల తరఫున మాజీ శాసనసభ్యులు శ్రీ జీ. విఠల్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.* జిపి దాగంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో గల గుండెగళ్ళ లక్ష్మీబాయి మారుతి ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేసుకొని గృహప్రవేశం చేసుకోవడం జరిగింది ఈ శుభకార్యానికి అతిథులుగా ముధోల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు తో పాటు బాశెట్టి రాజన్న , మాజీ ఆత్మ చైర్మన్ పోతారెడ్డి ,తానూర్ సర్పంచ్ మాధవరావు పటేల్ , గ్రామ సర్పంచ్ జి సాయినాథ్ , ఉప సర్పంచ్ గణేష్ ,లక్ష్మణ్ గారు నాయకులు ఎస్కే షాదుల్ , గోవింద్ గారు, మధు రావు మరియు గ్రామస్తులు యువకులు పాల్గొనడం జరిగింది.

More news from తెలంగాణ and nearby areas
  • Post by Solanke Ravi
    1
    Post by Solanke Ravi
    user_Solanke Ravi
    Solanke Ravi
    Local News Reporter భైంసా, నిర్మల్, తెలంగాణ•
    10 hrs ago
  • Post by KR NEWS 369
    1
    Post by KR NEWS 369
    user_KR NEWS 369
    KR NEWS 369
    Reporter మామడ, నిర్మల్, తెలంగాణ•
    5 hrs ago
  • కామారెడ్డి జిల్లా : హైదరాబాద్లో మంగళవారం నిర్వహించే గీత కార్మికుల మహాధర్నాను జయప్రదం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్ గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రాబోయే బడ్జెట్లో గీత కార్మికుల సంక్షేమానికి రూ. 5 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. వృత్తి రక్షణ ' కోసం కార్మికులంతా ఐక్యంగా పోరాడాలని కోరారు.
    1
    కామారెడ్డి జిల్లా : హైదరాబాద్లో మంగళవారం నిర్వహించే గీత కార్మికుల మహాధర్నాను జయప్రదం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్ గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రాబోయే బడ్జెట్లో గీత కార్మికుల సంక్షేమానికి రూ. 5 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. వృత్తి రక్షణ ' కోసం కార్మికులంతా ఐక్యంగా పోరాడాలని కోరారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    8 hrs ago
  • ప్రభుత్వాలు 'స్వచ్ఛ భారత్' అంటూ కోట్లు ఖర్చు చేస్తున్నాయి.. కానీ మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండల కేంద్రంలో మాత్రం పరిస్థితి చూస్తే 'అధ్వాన్నం' అనే మాట కూడా చిన్నబోతుంది. 29 గ్రామాల ప్రజలకు కూడలిగా ఉన్న ఈ ప్రాంతంలో ఒక్క పబ్లిక్ టాయిలెట్ లేకపోవడం సిగ్గుచేటు. ఇక్కడ అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు మాత్రమేనా? ప్రజల కనీస అవసరాలు అధికారుల కంటికి ఆనడం లేదా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ​అధికారుల 'భూమి' నాటకం.. బయటపెట్టిన జితేందర్! ​ఇటీవల జిల్లా స్థాయి ప్రజావాణిలో సామాజిక కార్యకర్త తుడుం జితేందర్ ఈ సమస్యను కలెక్టర్ కుమార్ దీపక్ ముందు ఉంచినప్పుడు అధికారుల నిర్లక్ష్యం బట్టబయలైంది. ​సాకు: "సార్.. జన్నారంలో మరుగుదొడ్లు కట్టడానికి ప్రభుత్వ భూమి లేదు" అని అధికారులు కలెక్టర్ ముందు బుకాయించే ప్రయత్నం చేశారు. ​వాస్తవం: బస్టాండ్ దగ్గర ఇరిగేషన్ భూమి ఉండగా, కవ్వాల్ పాయింట్ వద్ద బావి సమీపంలో ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. ​ప్రశ్న: ప్రభుత్వ భూములను అక్రమార్కులు ఆక్రమించుకుని పట్టాలు చేసుకుంటుంటే చూస్తూ ఊరుకున్న అధికారులు, ప్రజల అవసరాల కోసం ఒక్క గుంట భూమిని కూడా చూపలేకపోవడం వెనుక మతలబు ఏమిటి? అని జితేందర్ నిలదీయడంతో అధికారులు నీళ్లు నమలాల్సి వచ్చింది. ​మంగళవారం 'మంట'.. మహిళల 'గోస' ​ప్రతి మంగళవారం జరిగే వారపు సంత రోజున జన్నారం ఒక నరకప్రాయమైన ప్రాంతంగా మారుతోంది. ​వ్యాపారుల ఆవేదన: ఉదయాన్నే అడవి నుంచి, తండాల నుంచి కూరగాయలు తెచ్చే మహిళా వ్యాపారులు సాయంత్రం వరకు మలమూత్ర విసర్జన ఆపుకోలేక పడుతున్న బాధలు వర్ణనాతీతం. ​విద్యార్థినుల ఇబ్బందులు: కళాశాలలు, పాఠశాలలకు వచ్చే విద్యార్థినులు అత్యవసర సమయంలో ఎక్కడికి వెళ్లాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ​ఆరోగ్య ముప్పు: గత్యంతరం లేక రోడ్ల పక్కనే వెళ్లాల్సి రావడంతో అటు పారిశుద్ధ్యం క్షీణించి, రోగాలకు నిలయంగా మారుతోంది. ​కలెక్టర్ ‘డెడ్ లైన్’.. అమలు జరిగేనా? ​ప్రజల గోసను అర్థం చేసుకున్న కలెక్టర్ కుమార్ దీపక్, వెంటనే ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి స్థలం కేటాయించాలని, తక్షణమే మూడు పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల తర్వాత కూడా అధికారులు 'ఫైళ్ల' మీద కాలక్షేపం చేస్తారా? లేక యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెడతారా? అని జన్నారం ప్రజలు ఎదురుచూస్తున్నారు. ​"ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల నుంచి కాపాడలేని అధికారులు, కనీసం ప్రజల ప్రాథమిక అవసరాల కోసం కేటాయించలేకపోవడం శోచనీయం. ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరవాలి."
    1
    ప్రభుత్వాలు 'స్వచ్ఛ భారత్' అంటూ కోట్లు ఖర్చు చేస్తున్నాయి.. కానీ మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండల కేంద్రంలో మాత్రం పరిస్థితి చూస్తే 'అధ్వాన్నం' అనే మాట కూడా చిన్నబోతుంది. 29 గ్రామాల ప్రజలకు కూడలిగా ఉన్న ఈ ప్రాంతంలో ఒక్క పబ్లిక్ టాయిలెట్ లేకపోవడం సిగ్గుచేటు. ఇక్కడ అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు మాత్రమేనా? ప్రజల కనీస అవసరాలు అధికారుల కంటికి ఆనడం లేదా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
​అధికారుల 'భూమి' నాటకం.. బయటపెట్టిన జితేందర్!
​ఇటీవల జిల్లా స్థాయి ప్రజావాణిలో సామాజిక కార్యకర్త తుడుం జితేందర్ ఈ సమస్యను కలెక్టర్ కుమార్ దీపక్ ముందు ఉంచినప్పుడు అధికారుల నిర్లక్ష్యం బట్టబయలైంది.
​సాకు: "సార్.. జన్నారంలో మరుగుదొడ్లు కట్టడానికి ప్రభుత్వ భూమి లేదు" అని అధికారులు కలెక్టర్ ముందు బుకాయించే ప్రయత్నం చేశారు.
​వాస్తవం: బస్టాండ్ దగ్గర ఇరిగేషన్ భూమి ఉండగా, కవ్వాల్ పాయింట్ వద్ద బావి సమీపంలో ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి.
​ప్రశ్న: ప్రభుత్వ భూములను అక్రమార్కులు ఆక్రమించుకుని పట్టాలు చేసుకుంటుంటే చూస్తూ ఊరుకున్న అధికారులు, ప్రజల అవసరాల కోసం ఒక్క గుంట భూమిని కూడా చూపలేకపోవడం వెనుక మతలబు ఏమిటి? అని జితేందర్ నిలదీయడంతో అధికారులు నీళ్లు నమలాల్సి వచ్చింది.
​మంగళవారం 'మంట'.. మహిళల 'గోస'
​ప్రతి మంగళవారం జరిగే వారపు సంత రోజున జన్నారం ఒక నరకప్రాయమైన ప్రాంతంగా మారుతోంది.
​వ్యాపారుల ఆవేదన: ఉదయాన్నే అడవి నుంచి, తండాల నుంచి కూరగాయలు తెచ్చే మహిళా వ్యాపారులు సాయంత్రం వరకు మలమూత్ర విసర్జన ఆపుకోలేక పడుతున్న బాధలు వర్ణనాతీతం.
​విద్యార్థినుల ఇబ్బందులు: కళాశాలలు, పాఠశాలలకు వచ్చే విద్యార్థినులు అత్యవసర సమయంలో ఎక్కడికి వెళ్లాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
​ఆరోగ్య ముప్పు: గత్యంతరం లేక రోడ్ల పక్కనే వెళ్లాల్సి రావడంతో అటు పారిశుద్ధ్యం క్షీణించి, రోగాలకు నిలయంగా మారుతోంది.
​కలెక్టర్ ‘డెడ్ లైన్’.. అమలు జరిగేనా?
​ప్రజల గోసను అర్థం చేసుకున్న కలెక్టర్ కుమార్ దీపక్, వెంటనే ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి స్థలం కేటాయించాలని, తక్షణమే మూడు పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల తర్వాత కూడా అధికారులు 'ఫైళ్ల' మీద కాలక్షేపం చేస్తారా? లేక యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెడతారా? అని జన్నారం ప్రజలు ఎదురుచూస్తున్నారు.
​"ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల నుంచి కాపాడలేని అధికారులు, కనీసం ప్రజల ప్రాథమిక అవసరాల కోసం కేటాయించలేకపోవడం శోచనీయం. ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరవాలి."
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    5 hrs ago
  • జగిత్యాల పట్టణంలోని మున్సిపల్ 8వ వార్డు గోత్రాల కాలనీలో డ్రైనేజ్ నిర్మాణంలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. సాధారణంగా కల్వర్టు కిందుగా వెళ్లాల్సిన డ్రైనేజ్ లైన్‌ను పైభాగంలో ఏర్పాటు చేయడంతో మురుగు నీరు కల్వర్టుపై నుంచి ప్రవహించే పరిస్థితి ఏర్పడింది. దీంతో వర్షాలు పడినప్పుడు లేదా చెత్త అడ్డం పడినప్పుడు మురుగు నీరు నిలిచిపోతూ కాలనీలో దుర్వాసన వ్యాపిస్తోంది. మురుగు నీరు సరిగా వెళ్లకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు తెలిపారు. చెత్త, మట్టి అడ్డం పడినప్పుడు నీరు నిలిచి చుట్టుపక్కల ప్రాంతాల్లో మురికి పేరుకుపోతుందని, దీని వల్ల దోమలు పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఆరోగ్య సమస్యలతో బాధపడే పరిస్థితి ఉందని కాలనీవాసులు చెబుతున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సమీపంలోనే ఉన్న ఈ కాలనీలో ఇలాంటి నిర్లక్ష్య పనులు జరగడం ఆశ్చర్యకరమని ప్రజలు విమర్శిస్తున్నారు. పనులు చేపట్టే సమయంలో సరైన ప్రణాళిక లేకుండా డ్రైనేజ్ వ్యవస్థను నిర్మించడంతో ఈ సమస్య తలెత్తిందని వారు అంటున్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ సమస్యపై వెంటనే స్పందించి డ్రైనేజ్ వ్యవస్థను సరిచేసి కాలనీవాసులకు ఉపశమనం కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
    1
    జగిత్యాల పట్టణంలోని మున్సిపల్ 8వ వార్డు గోత్రాల కాలనీలో డ్రైనేజ్ నిర్మాణంలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. సాధారణంగా కల్వర్టు కిందుగా వెళ్లాల్సిన డ్రైనేజ్ లైన్‌ను పైభాగంలో ఏర్పాటు చేయడంతో మురుగు నీరు కల్వర్టుపై నుంచి ప్రవహించే పరిస్థితి ఏర్పడింది. దీంతో వర్షాలు పడినప్పుడు లేదా చెత్త అడ్డం పడినప్పుడు మురుగు నీరు నిలిచిపోతూ కాలనీలో దుర్వాసన వ్యాపిస్తోంది.
మురుగు నీరు సరిగా వెళ్లకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు తెలిపారు. చెత్త, మట్టి అడ్డం పడినప్పుడు నీరు నిలిచి చుట్టుపక్కల ప్రాంతాల్లో మురికి పేరుకుపోతుందని, దీని వల్ల దోమలు పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఆరోగ్య సమస్యలతో బాధపడే పరిస్థితి ఉందని కాలనీవాసులు చెబుతున్నారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సమీపంలోనే ఉన్న ఈ కాలనీలో ఇలాంటి నిర్లక్ష్య పనులు జరగడం ఆశ్చర్యకరమని ప్రజలు విమర్శిస్తున్నారు. పనులు చేపట్టే సమయంలో సరైన ప్రణాళిక లేకుండా డ్రైనేజ్ వ్యవస్థను నిర్మించడంతో ఈ సమస్య తలెత్తిందని వారు అంటున్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ సమస్యపై వెంటనే స్పందించి డ్రైనేజ్ వ్యవస్థను సరిచేసి కాలనీవాసులకు ఉపశమనం కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
    user_Boga naga bhushanam
    Boga naga bhushanam
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    12 hrs ago
  • సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పదవ వార్డులో కోతుల బెడదను నివారించడానికి వినూత్న ఆలోచనతో కార్యక్రమాన్ని నిర్వహించారు. పదవ వార్డులోని ముష్టిపల్లి, భూపతి నగర్, చిన్న బోనాల లో కోతుల బెడద వల్ల స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారని తమ దృష్టికి తీసుకు వచ్చినట్లు వాటిని నివారించేందుకు స్థానిక యువకుడు మరియు మున్సిపల్ జవాన్ ఇద్దరి తో గొరిల్లా వేషధారణ వేయించడం జరిగిందని గొరిల్లా వేషధారణతో కోతులను పారద్రోలడానికి ప్రయత్నించడం జరుగుతుందని పదవ వార్డు కౌన్సిలర్ బోలగం వైష్ణవి నాగరాజు తెలిపారు.
    1
    సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పదవ వార్డులో కోతుల బెడదను నివారించడానికి వినూత్న ఆలోచనతో కార్యక్రమాన్ని నిర్వహించారు. పదవ వార్డులోని ముష్టిపల్లి, భూపతి నగర్, చిన్న బోనాల లో కోతుల బెడద వల్ల స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారని తమ దృష్టికి తీసుకు వచ్చినట్లు వాటిని నివారించేందుకు స్థానిక యువకుడు మరియు మున్సిపల్ జవాన్ ఇద్దరి తో గొరిల్లా వేషధారణ వేయించడం జరిగిందని గొరిల్లా వేషధారణతో కోతులను పారద్రోలడానికి ప్రయత్నించడం జరుగుతుందని పదవ వార్డు కౌన్సిలర్ బోలగం వైష్ణవి నాగరాజు తెలిపారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    6 hrs ago
  • సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట గ్రామంలో ఏర్పాటు చేసిన టీజి ఆయిల్ ఫెడ్ ఆయిల్ ఫామ్ పరిశ్రమను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మార్చి 22 ఆదివారం నాడు ప్రారంభించనున్న నేపథ్యంలో సోమవారం ఆయిల్ ఫామ్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి, సిపి సాధన రష్మీ పెరుమాళ్ లు సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పర్యటన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి హెలికాప్టర్ (చాపర్) ద్వారా పరిశ్రమ వద్దకు చేరుకుంటారని, అదే రోజు జిల్లా జైలు భవనాన్ని కూడా ప్రారంభించనున్నారని పేర్కొన్నారు. వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక తదితర శాఖలచే 120 స్టాళ్లను ఏర్పాటు చేసి మార్చి 20. 21, 22 తేదీలలో ఫ్యాక్టరీ ఆవరణలో రైతు మహోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖతో పాటు సంబంధిత శాఖల అధికారులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రైతు మేళా కు ప్రతీ రోజు 3 వేల నుండి 5 వేల మంది రైతులు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి తాగునీరు, భోజన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. శానిటేషన్ సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రాంగణాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని డీపీఓకు సూచించారు. వైద్య శాఖ ద్వారా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడంతో పాటు తాత్కాలిక టాయిలెట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. హెలిప్యాడ్ ఏర్పాట్లు ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో నిబంధనలకు అనుగుణంగా చేయాలని సూచించారు. ఫ్యాక్టరీ ప్రారంభం సందర్బంగా భారీ బహిరంగ సభకు దాదాపు 6 వందల బస్సుల ద్వారా సుమారు 30 వేల మంది కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి తగిన తాగునీరు సరఫరా చేయడంతో పాటు, తాత్కాలిక మరుగుదొడ్లు, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందుగానే సమగ్రంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా సీపీ సాధన రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ, కార్యక్రమానికి హాజరయ్యే వారందరికీ ముందుగానే తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో కళాజాత ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సూచించారు. భద్రతా దృష్ట్యా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, కార్యక్రమానికి విధులు నిర్వహించే సిబ్బంది అందరూ పోలీస్ శాఖ ద్వారా జారీ చేసే ఐడీ కార్డులు తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. మీడియా ప్రతినిధుల కోసం కూడా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. పార్కింగ్ స్థలాల్లో మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని, అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని లైవ్ సపోర్ట్‌తో పాటు అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలని సూచించారు. అగ్ని ప్రమాదాలు తలెత్తకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం హెలిప్యాడ్, హెలిప్యాడ్ నుండి సభాస్థలికి ఇతర ఏర్పాట్లను, ఆర్టీసీ బస్సులు, అధికారులు, విఐపీ ల పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించి, కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు డిసిపిలు కుశాల్కర్, సుభాష్ చంద్రబోస్, సిద్దిపేట ఆర్డీవో సదానందం, వ్యవసాయ, ఉత్యానవాన, పశుసంవర్ధక, పంచాయతీ, మిషన్ భగీరథ, ఆర్ అండ్ బి, సమాచార పౌర సంబంధాలశాఖ, ఆయిల్ ఫెడ్, ఫైర్ సేఫ్టీ, విధ్యుత్, ఆర్టీసీ తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    1
    సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట గ్రామంలో ఏర్పాటు చేసిన టీజి ఆయిల్ ఫెడ్ ఆయిల్ ఫామ్ పరిశ్రమను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మార్చి 22 ఆదివారం నాడు ప్రారంభించనున్న నేపథ్యంలో సోమవారం ఆయిల్ ఫామ్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి, సిపి సాధన రష్మీ పెరుమాళ్ లు సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పర్యటన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి హెలికాప్టర్ (చాపర్) ద్వారా పరిశ్రమ వద్దకు చేరుకుంటారని, అదే రోజు జిల్లా జైలు భవనాన్ని కూడా ప్రారంభించనున్నారని పేర్కొన్నారు. వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక తదితర శాఖలచే  120 స్టాళ్లను ఏర్పాటు చేసి మార్చి 20. 21, 22 తేదీలలో ఫ్యాక్టరీ ఆవరణలో రైతు మహోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖతో పాటు సంబంధిత శాఖల అధికారులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
రైతు మేళా కు ప్రతీ రోజు 3 వేల నుండి 5 వేల మంది రైతులు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి తాగునీరు, భోజన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. శానిటేషన్ సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రాంగణాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని డీపీఓకు సూచించారు.  వైద్య శాఖ ద్వారా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడంతో పాటు తాత్కాలిక టాయిలెట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. హెలిప్యాడ్ ఏర్పాట్లు ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో నిబంధనలకు అనుగుణంగా చేయాలని సూచించారు.
ఫ్యాక్టరీ ప్రారంభం సందర్బంగా భారీ బహిరంగ సభకు దాదాపు 6 వందల బస్సుల ద్వారా సుమారు 30 వేల మంది కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి తగిన  తాగునీరు సరఫరా చేయడంతో పాటు, తాత్కాలిక మరుగుదొడ్లు, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.  ఎక్కడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందుగానే సమగ్రంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.
ఈ సందర్భంగా సీపీ సాధన రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ, కార్యక్రమానికి హాజరయ్యే వారందరికీ ముందుగానే తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో కళాజాత ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సూచించారు. భద్రతా దృష్ట్యా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, కార్యక్రమానికి విధులు నిర్వహించే సిబ్బంది అందరూ పోలీస్ శాఖ ద్వారా జారీ చేసే ఐడీ కార్డులు తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. మీడియా ప్రతినిధుల కోసం కూడా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.
పార్కింగ్ స్థలాల్లో మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని, అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని లైవ్ సపోర్ట్‌తో పాటు అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలని సూచించారు. అగ్ని ప్రమాదాలు తలెత్తకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం హెలిప్యాడ్, హెలిప్యాడ్ నుండి  సభాస్థలికి ఇతర ఏర్పాట్లను, ఆర్టీసీ బస్సులు, అధికారులు, విఐపీ ల పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించి, కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు డిసిపిలు కుశాల్కర్, సుభాష్ చంద్రబోస్, సిద్దిపేట ఆర్డీవో సదానందం, వ్యవసాయ, ఉత్యానవాన, పశుసంవర్ధక,  పంచాయతీ, మిషన్ భగీరథ, ఆర్ అండ్ బి, సమాచార పౌర సంబంధాలశాఖ, ఆయిల్ ఫెడ్, ఫైర్ సేఫ్టీ, విధ్యుత్, ఆర్టీసీ తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    user_RAMESH P
    RAMESH P
    కుశాల్ నగర్, సిద్దిపేట•
    6 hrs ago
  • Post by KR NEWS 369
    1
    Post by KR NEWS 369
    user_KR NEWS 369
    KR NEWS 369
    Reporter మామడ, నిర్మల్, తెలంగాణ•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.