Shuru
Apke Nagar Ki App…
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 10వ వార్డులో కోతులను తరిమేందుకు ప్రభుత్వ ప్రయోగం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పదవ వార్డులో కోతుల బెడదను నివారించడానికి వినూత్న ఆలోచనతో కార్యక్రమాన్ని నిర్వహించారు. పదవ వార్డులోని ముష్టిపల్లి, భూపతి నగర్, చిన్న బోనాల లో కోతుల బెడద వల్ల స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారని తమ దృష్టికి తీసుకు వచ్చినట్లు వాటిని నివారించేందుకు స్థానిక యువకుడు మరియు మున్సిపల్ జవాన్ ఇద్దరి తో గొరిల్లా వేషధారణ వేయించడం జరిగిందని గొరిల్లా వేషధారణతో కోతులను పారద్రోలడానికి ప్రయత్నించడం జరుగుతుందని పదవ వార్డు కౌన్సిలర్ బోలగం వైష్ణవి నాగరాజు తెలిపారు.
Satheesh gangu
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 10వ వార్డులో కోతులను తరిమేందుకు ప్రభుత్వ ప్రయోగం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పదవ వార్డులో కోతుల బెడదను నివారించడానికి వినూత్న ఆలోచనతో కార్యక్రమాన్ని నిర్వహించారు. పదవ వార్డులోని ముష్టిపల్లి, భూపతి నగర్, చిన్న బోనాల లో కోతుల బెడద వల్ల స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారని తమ దృష్టికి తీసుకు వచ్చినట్లు వాటిని నివారించేందుకు స్థానిక యువకుడు మరియు మున్సిపల్ జవాన్ ఇద్దరి తో గొరిల్లా వేషధారణ వేయించడం జరిగిందని గొరిల్లా వేషధారణతో కోతులను పారద్రోలడానికి ప్రయత్నించడం జరుగుతుందని పదవ వార్డు కౌన్సిలర్ బోలగం వైష్ణవి నాగరాజు తెలిపారు.
More news from తెలంగాణ and nearby areas
- కరీంనగర్ లో ఆశా వర్కర్స్ 48 గంటల ధర్నా చేపట్టారు. రాత్రి కలెక్టరేట్ ముందు ధర్నా శిబిరంలోనే నిద్రించారు. ప్రస్తుత రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఫిక్స్డ్ వేతనం రూ.18000 పై నిర్ణయం తీసుకోవాలని, ఇతర సమస్యలు సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. CITU ఆద్వర్యంలో చేపట్టిన ధర్నాలో జిల్లా కార్యదర్శి గీట్ల ముకుంద రెడ్డి, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారెళ్ళ శ్రీలత, CITU జిల్లా అధ్యక్షులు యు శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు ఎడ్ల రమేష్, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కాల్వ సారిక పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి తమ మేనిఫెస్టో లో ఆశా వర్కర్స్ లకు ఫిక్స్డ్ వేతనం రూ.18000 చెల్లిస్తామని ఓట్లు వేయించుకొని మోసం చేసిందని ఆరోపించారు. ఆశాలకు రూ.50 లక్షల ఇన్సూరెన్స్, రూ.50వేలు మట్టి ఖర్చులు, ప్రమోషన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ప్రసూతి సెలవులు, ఆదివారం, పండగ సెలవులు నిర్ణయిస్తూ వెంటనే జి.ఓ లను జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఎ.ఎన్.సి., పి.ఎన్.సి టార్గెట్స్ ను రద్దు చేస్తూ వెంటనే జి.ఓ. లను జారీ చేయాలన్నారు. ఆశాలకు పెండింగ్ పారితోషికాలు, పి.ఆర్.సి ఏరియర్స్, లేప్రసి సర్వే, పల్స్ పోలియో, ఎలక్షన్ డ్యూటీ తదితర పెండింగ్ డబ్బులు తక్షణమే చెల్లించాలని కోరారు. ఆశాలతో ఎన్.సి.డి ఆన్లైన్ పని చేయించకూడదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే ఆందోళన ఉదృతం చేసి అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.2
- కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో పవిత్ర రంజాన్ సందర్భంగా సోమవారం ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. కాంగ్రెస్ మైనార్టీ మండల అధ్యక్షుడు యూసుఫ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందజేయడంతో కృతజ్ఞతలు తెలిపారు. పేద ముస్లిం కుటుంబాలకు ఎంతో *ఉపయోగంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్ఐ వెంకటేశ్, డీటీ బాబన్న తదితరులు పాల్గొన్నారు.1
- ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో ఆదివారం సుడిగాలి విధ్వంసం సృష్టించింది, ఈ సుడిగాలి భీభత్సానికి 70 ఇళ్ళు దెబ్బతిన్నాయి. ఒకరు మృత్యువాత పడగా పలువురు గాయాలపాలయ్యారు. అత్యంత ప్రభావితమైన ప్రాంతం కరంజియాలోని కియా గ్రామంలో బలమైన గాలులు నివాసితులలో భయాందోళనలను సృష్టించినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 16 ఐ 3న్యూస్ అక్కారం పంప్ హౌజ్ నుంచి నీటి విడుదల *ఎవడ్రా కాలేశ్వరం కూలిపోయింది అన్న వెధవలు కాలేశ్వరంలో అంతర్భాగమైన ఆకారం పంప్ హౌస్ నుండి గోదావరి నీళ్లు పరుగులు తీస్తున్నాయి ఇది కేసీఆర్ అంటే* గజ్వేల్: గజ్వేల్ మండలం అక్కారం పంప్ హౌజ్ నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. ఇటీవల బీఅర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జీ వంటేరు ప్రతాప్ రెడ్డి గారు బీఆర్ఎస్ శ్రేణులతో కలసి అక్కారం పంప్ హౌజ్ వద్ద నీటిని విడుదల చేయాలని నిరసన తెలుపగా, స్పందించిన అధికారులు ఆదివారం నీటిని విడుదల చేశారు. ఈ మేరకు ఆ ప్రాంత రైతులు ప్రతాప్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.1
- ప్రభుత్వాలు 'స్వచ్ఛ భారత్' అంటూ కోట్లు ఖర్చు చేస్తున్నాయి.. కానీ మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండల కేంద్రంలో మాత్రం పరిస్థితి చూస్తే 'అధ్వాన్నం' అనే మాట కూడా చిన్నబోతుంది. 29 గ్రామాల ప్రజలకు కూడలిగా ఉన్న ఈ ప్రాంతంలో ఒక్క పబ్లిక్ టాయిలెట్ లేకపోవడం సిగ్గుచేటు. ఇక్కడ అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు మాత్రమేనా? ప్రజల కనీస అవసరాలు అధికారుల కంటికి ఆనడం లేదా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల 'భూమి' నాటకం.. బయటపెట్టిన జితేందర్! ఇటీవల జిల్లా స్థాయి ప్రజావాణిలో సామాజిక కార్యకర్త తుడుం జితేందర్ ఈ సమస్యను కలెక్టర్ కుమార్ దీపక్ ముందు ఉంచినప్పుడు అధికారుల నిర్లక్ష్యం బట్టబయలైంది. సాకు: "సార్.. జన్నారంలో మరుగుదొడ్లు కట్టడానికి ప్రభుత్వ భూమి లేదు" అని అధికారులు కలెక్టర్ ముందు బుకాయించే ప్రయత్నం చేశారు. వాస్తవం: బస్టాండ్ దగ్గర ఇరిగేషన్ భూమి ఉండగా, కవ్వాల్ పాయింట్ వద్ద బావి సమీపంలో ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. ప్రశ్న: ప్రభుత్వ భూములను అక్రమార్కులు ఆక్రమించుకుని పట్టాలు చేసుకుంటుంటే చూస్తూ ఊరుకున్న అధికారులు, ప్రజల అవసరాల కోసం ఒక్క గుంట భూమిని కూడా చూపలేకపోవడం వెనుక మతలబు ఏమిటి? అని జితేందర్ నిలదీయడంతో అధికారులు నీళ్లు నమలాల్సి వచ్చింది. మంగళవారం 'మంట'.. మహిళల 'గోస' ప్రతి మంగళవారం జరిగే వారపు సంత రోజున జన్నారం ఒక నరకప్రాయమైన ప్రాంతంగా మారుతోంది. వ్యాపారుల ఆవేదన: ఉదయాన్నే అడవి నుంచి, తండాల నుంచి కూరగాయలు తెచ్చే మహిళా వ్యాపారులు సాయంత్రం వరకు మలమూత్ర విసర్జన ఆపుకోలేక పడుతున్న బాధలు వర్ణనాతీతం. విద్యార్థినుల ఇబ్బందులు: కళాశాలలు, పాఠశాలలకు వచ్చే విద్యార్థినులు అత్యవసర సమయంలో ఎక్కడికి వెళ్లాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్య ముప్పు: గత్యంతరం లేక రోడ్ల పక్కనే వెళ్లాల్సి రావడంతో అటు పారిశుద్ధ్యం క్షీణించి, రోగాలకు నిలయంగా మారుతోంది. కలెక్టర్ ‘డెడ్ లైన్’.. అమలు జరిగేనా? ప్రజల గోసను అర్థం చేసుకున్న కలెక్టర్ కుమార్ దీపక్, వెంటనే ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి స్థలం కేటాయించాలని, తక్షణమే మూడు పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల తర్వాత కూడా అధికారులు 'ఫైళ్ల' మీద కాలక్షేపం చేస్తారా? లేక యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెడతారా? అని జన్నారం ప్రజలు ఎదురుచూస్తున్నారు. "ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల నుంచి కాపాడలేని అధికారులు, కనీసం ప్రజల ప్రాథమిక అవసరాల కోసం కేటాయించలేకపోవడం శోచనీయం. ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరవాలి."1
- శివంపేట్ మండలంలో Bharatgas గ్యాస్ సిలిండర్ కోసం ముందస్తుగా బుకింగ్ చేసుకోవాలని సూచించడంతో ఏజెన్సీ వద్ద ప్రజలు భారీగా చేరుకున్నారు. ఉదయం నుంచే మహిళలు, వినియోగదారులు పెద్ద సంఖ్యలో క్యూ లైన్లలో నిలబడి బుకింగ్ చేసుకుంటున్నారు. ఒక్కసారిగా ఎక్కువ మంది రావడంతో అక్కడ రద్దీ నెలకొంది. గంటల తరబడి లైన్‌లో వేచి చూడాల్సి వస్తోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా బుకింగ్ ప్రక్రియ పూర్తి చేసి గ్యాస్ సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు.1
- వేములవాడలో శ్రీరామ నవమి వేడుకలకు శ్రీకారం – భీమేశ్వర స్వామి మండపంలో పోస్టర్ ఆవిష్కరణ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ మరియు ఆహ్వాన పత్రికను సోమవారం భీమేశ్వర స్వామి మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ఈవో ఎల్. రమాదేవి భక్తుల సమక్షంలో విడుదల చేశారు.ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు, ఆలయ ఉద్యోగులు మరియు భక్తులు పాల్గొన్నారు.1
- కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం తాండూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వైద్య సిబ్బంది సోమవారం బాలికలకు HPV | వ్యాక్సినేషన్పై అవగాహన కల్పించారు. హెచ్సీవీ వ్యాక్సిన్ పనితీరు, భవిష్యత్తులో రాబోయే గర్భాశయ క్యాన్సర్ను నిరోధించే అంశాలపై 14 నుంచి 15సం. వయసున్న బాలికలకు వివరించారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులలో ఉచితంగా HPV వ్యాక్సిన్ అందిస్తున్నారని తెలిపారు. MLHP, సూపర్వైజర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.1
- జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసం వద్ద కాంగ్రెస్ ఫ్లెక్సీల తొలగించారు. ఇంటి ముందు, ఇంట్లో ఉన్న ఫ్లెక్సీలను తొలగించారు. ఫ్లెక్సీలపై ఉన్న రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫోటోలను తొలగించిన కార్యకర్తలు, జీవన్ రెడ్డి ఫోటోతో కొత్త ఫ్లెక్సీల ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీల తొలగింపుతో జీవన్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చేప్పడం ఖాయంగా కనిపిస్తోంది. ఈనెల 24 లేదా 25న కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేందుకు జీవన్ రెడ్డి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జీవన్ రెడ్డి తదుపరి రాజకీయ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.1