Shuru
Apke Nagar Ki App…
16अप्रैल से बंद हो जाएँगे ,ये दो बैंक अकाउंट ,कहीं आपका पैसा फँस ना जाए
रागिनी शर्मा
16अप्रैल से बंद हो जाएँगे ,ये दो बैंक अकाउंट ,कहीं आपका पैसा फँस ना जाए
More news from Anakapalli and nearby areas
- 16अप्रैल से बंद हो जाएँगे ,ये दो बैंक अकाउंट ,कहीं आपका पैसा फँस ना जाए1
- లేబర్ కోడ్లను రద్దు చేయాలని కొమరాడలో 'బ్లాక్ డే' నిరసన కొమరాడ: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కొమరాడ మండల కేంద్రంలో కార్మికులు మరియు ఉపాధి హామీ కూలీలు కలిసి ఈరోజు 'బ్లాక్ డే' నిర్వహించారు. సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 36 కోట్ల మంది కార్మిక వర్గం ఫిబ్రవరి 12న సమ్మె చేపట్టి వ్యతిరేకించినప్పటికీ, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మొండిగా ఏప్రిల్ 1 నుండి లేబర్ కోడ్లను అమలు చేయాలని చూడటం దుర్మార్గమన్నారు. బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి, కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చే విధంగా ఈ నాలుగు కోడ్లను తీసుకువచ్చారని ఆయన విమర్శించారు. ఈ కొత్త చట్టాల వల్ల కార్మికులతో పాటు దళితులు, గిరిజనులు మరియు అన్ని వర్గాల పేద ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "పోరాడితే పోయేది ఏమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప" అన్న కార్ల్ మార్క్స్ సిద్ధాంతాన్ని స్ఫూర్తిగా తీసుకుని, కార్మిక వర్గం మరో భారీ ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు, సిఐటియు కార్యకర్తలు మరియు వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. భవిష్యత్తులో జరగబోయే పోరాటాల్లో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని నాయకులు కోరారు.1
- రాజవొమ్మంగి, శుక్రవారం: మండల కేంద్రంలో పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గౌరీ శంకర్ సిబ్బందితో కలిసి ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ జంక్షన్ వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రికార్డులు సక్రమంగా లేని వాహనదారులకు జరిమానాలు విధించారు. ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సీఐ సూచించారు.1
- శ్రీకాకుళం, ఏప్రిల్ 3 : పాతపట్నం ప్రజలకు, శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి భక్తులకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శుభవార్తను తెలియజేశారు. నరసన్నపేట నుండి పాతపట్నం మీదుగా ఒరిస్సాను కలిపే జాతీయ రహదారి 326Aలో పాతపట్నం వద్ద నిర్మాణంలో ఉన్న రెండు లైన్ల రోడ్ ఓవర్ బ్రిడ్జ్ కోసం అదనంగా జాతీయ రహదారుల సంస్థ నుండి 15 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు గురువారం నాడు జాతీయ రహదారుల సంస్థ నుండి విడుదల కావడంతో ఇకపై ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురాగలుగుతామని స్పష్టం చేశారు. నాలుగు శతాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి ఆలయం ఎదురుగా నిర్మాణం అవుతున్న ROB ప్రాజెక్టు విషయంలో ముందుగా ప్రతిపాదించిన దశలో కొన్ని ఇబ్బందులు ఉన్నట్టు స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చినట్టు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆలయ ప్రాంతంలో రాకపోకలు, భక్తులకు దూరం నుండే ఆలయ దర్శనం, అయిదేళ్ళకు ఒకసారి జరిగే మహా జాతర ఉత్సవాల్లో కొన్ని అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉందని గతంలోనే కేంద్ర మంత్రి చెంతకు సమస్య చేరింది ఈ నేపథ్యంలో స్థానిక ప్రజల అభిప్రాయాలను గౌరవించి, ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా రాష్ట్రాల భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని, ముందుగా ప్రతిపాదించిన రిటైనింగ్ వాల్ స్థానంలో వయాడక్ట్ నిర్మాణం చేపట్టాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్టు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ విషయాన్ని జాతీయ రహదారుల సంస్థకు, కేంద్ర రవాణా శాఖామంత్రి నితిన్ గడ్కారి దృష్టిలో ఉంచి నేడు పరిష్కార దిశగా మళ్ళించామని అన్నారు. డిజైన్ మార్పునకు అంగీకారం తెలపడంతో పాటు, అదనపు నిధులు మంజూరుకు సంబంధించి కూడా ఉత్తర్వులు గురువారం నాడు విడుదల అయ్యాయని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ మార్పు కేవలం ప్రాజెక్టు నిర్మాణశైలిలో జరిగిన మార్పు మాత్రమే కాదని, మన సంస్కృతి, సంప్రదాయాలు, భక్తుల విశ్వాసానికి కూటమి సర్కారు ఇస్తున్న గౌరవం అని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ప్రజల భావోద్వేగాలను గౌరవిస్తూ అభివృద్ధి చేయడం మా సంకల్పమని అన్నారు. అన్ని అనుమానాలు తొలగి అదనపు నిధులు మంజూరు అయిన నేపధ్యంలో అతి త్వరలోనే ఆర్వోబిని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.1
- ఎచ్చెర్ల ఎస్ ఎస్ కాలనీ లో ఉన్న జై భీమ్ యువజన సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక గ్రౌండ్ లో గ్రామపెద్దలు మరియు యువకులు కలిసి వాలీబాల్ మ్యాచ్ ను ప్రారంభించారు. ఈ నెల 14 న జరగనున్న అంబేడ్కర్ జయంతి వేడుకలు సందర్భంగా ఈరోజు నుంచి 10 రోజులు పాటు వివిధరకాల పోటీలు నిర్వహించనున్నట్లు సంఘప్రతినిధులు తెలిపారు. మహిళలకు ప్రత్యేకంగా ఆదివారం ముగ్గులు, సంప్రదాయ క్రీడల పోటీలు జరుపుతామని వారు అన్నారు.4
- Post by Sode Prasad1
- Post by SS NEWS1
- పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ శశికుమార్ తెలిపారు. 11,463 మందికి గాను 11,377మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. 99.25 శాతం హాజరు నమోదు అయ్యిందన్నారు. అల్లూరి జిల్లాలో 44,పోలవరం జిల్లాలో 28 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయన్నారు. అడ్డతీగల, రాజవొమ్మంగి మండలాల్లో పలు కేంద్రాలను ఏజెన్సీ DEO. మల్లేశ్వరావు తనిఖీ చేశారు.1