logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గృహప్రవేశ వేడుకలో తీరని విషాదం: ఫోటో దిగుతూ కుప్పకూలి మహిళ మృతి! గృహప్రవేశ వేడుకలో తీరని విషాదం: ఫోటో దిగుతూ కుప్పకూలి మహిళ మృతి! ​ఖమ్మం: సంతోషంగా గడవాల్సిన గృహప్రవేశ వేడుకలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. బంధువుల ఇంట్లో వేడుకకు హాజరై, అందరితో కలిసి ఫోటో దిగుతుండగా ఓ మహిళ గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఖమ్మం నగరంలో చోటుచేసుకుంది. ​ఖమ్మం (త్రీటౌన్ ప్రాంతం) కు చెందిన బొమ్మ సుస్మిత (40) అనే మహిళ తన బంధువుల ఇంటి గృహప్రవేశ వేడుకకు హాజరయ్యారు. వేడుకలో భాగంగా బంధువులతో కలిసి గ్రూప్ ఫోటో దిగుతున్న సమయంలో ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. పక్కనే ఉన్న వారు వెంటనే స్పందించి ఆమెను ఆసుపత్రికి తరలించేలోపే సుస్మిత తుదిశ్వాస విడిచారు.ప్రాథమిక సమాచారం ప్రకారం సుస్మిత గత కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.మృతురాలికి బీటెక్ చదువుతున్న ఒక కుమారుడు ఉన్నాడు. ఫోటో దిగుతున్న సమయంలో ఆమె కుప్పకూలిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ​ఇటీవల కాలంలో చిన్న వయసులోనే గుండెపోటుతో మరణిస్తున్న ఘటనలు పెరిగిపోతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఘటనతో సుస్మిత కుటుంబంలో మరియు బంధువులలో తీవ్ర విషాదం నెలకొంది.

6 hrs ago
user_Jtv9 News Network
Jtv9 News Network
బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
6 hrs ago

గృహప్రవేశ వేడుకలో తీరని విషాదం: ఫోటో దిగుతూ కుప్పకూలి మహిళ మృతి! గృహప్రవేశ వేడుకలో తీరని విషాదం: ఫోటో దిగుతూ కుప్పకూలి మహిళ మృతి! ​ఖమ్మం: సంతోషంగా గడవాల్సిన గృహప్రవేశ వేడుకలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. బంధువుల ఇంట్లో వేడుకకు హాజరై, అందరితో కలిసి ఫోటో దిగుతుండగా ఓ మహిళ గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఖమ్మం నగరంలో చోటుచేసుకుంది. ​ఖమ్మం (త్రీటౌన్ ప్రాంతం) కు చెందిన బొమ్మ సుస్మిత (40) అనే మహిళ తన బంధువుల ఇంటి గృహప్రవేశ వేడుకకు హాజరయ్యారు. వేడుకలో భాగంగా బంధువులతో కలిసి గ్రూప్ ఫోటో దిగుతున్న సమయంలో ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. పక్కనే ఉన్న వారు వెంటనే స్పందించి ఆమెను ఆసుపత్రికి తరలించేలోపే సుస్మిత తుదిశ్వాస విడిచారు.ప్రాథమిక సమాచారం ప్రకారం సుస్మిత గత కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.మృతురాలికి బీటెక్ చదువుతున్న ఒక కుమారుడు ఉన్నాడు. ఫోటో దిగుతున్న సమయంలో ఆమె కుప్పకూలిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ​ఇటీవల కాలంలో చిన్న వయసులోనే గుండెపోటుతో మరణిస్తున్న ఘటనలు పెరిగిపోతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఘటనతో సుస్మిత కుటుంబంలో మరియు బంధువులలో తీవ్ర విషాదం నెలకొంది.

More news from Hyderabad and nearby areas
  • Post by Anji Raju
    1
    Post by Anji Raju
    user_Anji Raju
    Anji Raju
    Amberpet, Hyderabad•
    20 hrs ago
  • Post by Ali ammu
    1
    Post by Ali ammu
    user_Ali ammu
    Ali ammu
    చార్మినార్, హైదరాబాద్, తెలంగాణ•
    19 hrs ago
  • గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 16 ఐ 3న్యూస్ అక్కారం పంప్ హౌజ్ నుంచి నీటి విడుదల *ఎవడ్రా కాలేశ్వరం కూలిపోయింది అన్న వెధవలు కాలేశ్వరంలో అంతర్భాగమైన ఆకారం పంప్ హౌస్ నుండి గోదావరి నీళ్లు పరుగులు తీస్తున్నాయి ఇది కేసీఆర్ అంటే* గజ్వేల్: గజ్వేల్ మండలం అక్కారం పంప్ హౌజ్ నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. ఇటీవల బీఅర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జీ వంటేరు ప్రతాప్ రెడ్డి గారు బీఆర్ఎస్ శ్రేణులతో కలసి అక్కారం పంప్ హౌజ్ వద్ద నీటిని విడుదల చేయాలని నిరసన తెలుపగా, స్పందించిన అధికారులు ఆదివారం నీటిని విడుదల చేశారు. ఈ మేరకు ఆ ప్రాంత రైతులు ప్రతాప్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
    1
    గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 16 ఐ 3న్యూస్ 
అక్కారం పంప్ హౌజ్ నుంచి నీటి విడుదల 
*ఎవడ్రా కాలేశ్వరం కూలిపోయింది అన్న వెధవలు కాలేశ్వరంలో అంతర్భాగమైన ఆకారం పంప్ హౌస్ నుండి గోదావరి నీళ్లు పరుగులు తీస్తున్నాయి ఇది కేసీఆర్ అంటే*
గజ్వేల్: గజ్వేల్ మండలం అక్కారం పంప్ హౌజ్ నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. ఇటీవల బీఅర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జీ వంటేరు ప్రతాప్ రెడ్డి గారు బీఆర్ఎస్ శ్రేణులతో కలసి అక్కారం పంప్ హౌజ్ వద్ద నీటిని విడుదల చేయాలని నిరసన తెలుపగా, స్పందించిన అధికారులు ఆదివారం నీటిని విడుదల చేశారు. ఈ మేరకు ఆ ప్రాంత రైతులు ప్రతాప్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
    user_KHADEER REPORTER
    KHADEER REPORTER
    Journalist జగదేవ్‌పూర్, సిద్దిపేట, తెలంగాణ•
    13 hrs ago
  • శివంపేట్ మండలంలో Bharatgas గ్యాస్ సిలిండర్ కోసం ముందస్తుగా బుకింగ్ చేసుకోవాలని సూచించడంతో ఏజెన్సీ వద్ద ప్రజలు భారీగా చేరుకున్నారు. ఉదయం నుంచే మహిళలు, వినియోగదారులు పెద్ద సంఖ్యలో క్యూ లైన్లలో నిలబడి బుకింగ్ చేసుకుంటున్నారు. ఒక్కసారిగా ఎక్కువ మంది రావడంతో అక్కడ రద్దీ నెలకొంది. గంటల తరబడి లైన్‌లో వేచి చూడాల్సి వస్తోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా బుకింగ్ ప్రక్రియ పూర్తి చేసి గ్యాస్ సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు.
    1
    శివంపేట్ మండలంలో Bharatgas గ్యాస్ సిలిండర్ కోసం ముందస్తుగా బుకింగ్ చేసుకోవాలని సూచించడంతో ఏజెన్సీ వద్ద ప్రజలు భారీగా చేరుకున్నారు. ఉదయం నుంచే మహిళలు, వినియోగదారులు పెద్ద సంఖ్యలో క్యూ లైన్లలో నిలబడి బుకింగ్ చేసుకుంటున్నారు. ఒక్కసారిగా ఎక్కువ మంది రావడంతో అక్కడ రద్దీ నెలకొంది. గంటల తరబడి లైన్‌లో వేచి చూడాల్సి వస్తోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా బుకింగ్ ప్రక్రియ పూర్తి చేసి గ్యాస్ సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు.
    user_ASHOK VENGANI
    ASHOK VENGANI
    Court reporter శివంపేట, మెదక్, తెలంగాణ•
    14 hrs ago
  • సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం సిద్ధాపూర్లో సందీప్ కుమార్ (24) అనే యువకుడు ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కాపురానికి రాకపోవడంతో మనస్థాపం చెందిన సందీప్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఎంత పిలిచినా తలుపు తీయకపోవడంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా విగతజీవిగా కనిపించాడు. ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    3
    సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం సిద్ధాపూర్లో సందీప్ కుమార్ (24) అనే యువకుడు ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కాపురానికి రాకపోవడంతో మనస్థాపం చెందిన సందీప్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఎంత పిలిచినా తలుపు తీయకపోవడంతో  తలుపులు బద్దలు కొట్టి చూడగా విగతజీవిగా కనిపించాడు. ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    user_SRIRAMULA KIRANKUMAR
    SRIRAMULA KIRANKUMAR
    Public Health Department Kandi, Sangareddy•
    18 hrs ago
  • సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట గ్రామంలో ఏర్పాటు చేసిన టీజి ఆయిల్ ఫెడ్ ఆయిల్ ఫామ్ పరిశ్రమను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మార్చి 22 ఆదివారం నాడు ప్రారంభించనున్న నేపథ్యంలో సోమవారం ఆయిల్ ఫామ్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి, సిపి సాధన రష్మీ పెరుమాళ్ లు సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పర్యటన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి హెలికాప్టర్ (చాపర్) ద్వారా పరిశ్రమ వద్దకు చేరుకుంటారని, అదే రోజు జిల్లా జైలు భవనాన్ని కూడా ప్రారంభించనున్నారని పేర్కొన్నారు. వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక తదితర శాఖలచే 120 స్టాళ్లను ఏర్పాటు చేసి మార్చి 20. 21, 22 తేదీలలో ఫ్యాక్టరీ ఆవరణలో రైతు మహోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖతో పాటు సంబంధిత శాఖల అధికారులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రైతు మేళా కు ప్రతీ రోజు 3 వేల నుండి 5 వేల మంది రైతులు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి తాగునీరు, భోజన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. శానిటేషన్ సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రాంగణాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని డీపీఓకు సూచించారు. వైద్య శాఖ ద్వారా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడంతో పాటు తాత్కాలిక టాయిలెట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. హెలిప్యాడ్ ఏర్పాట్లు ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో నిబంధనలకు అనుగుణంగా చేయాలని సూచించారు. ఫ్యాక్టరీ ప్రారంభం సందర్బంగా భారీ బహిరంగ సభకు దాదాపు 6 వందల బస్సుల ద్వారా సుమారు 30 వేల మంది కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి తగిన తాగునీరు సరఫరా చేయడంతో పాటు, తాత్కాలిక మరుగుదొడ్లు, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందుగానే సమగ్రంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా సీపీ సాధన రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ, కార్యక్రమానికి హాజరయ్యే వారందరికీ ముందుగానే తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో కళాజాత ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సూచించారు. భద్రతా దృష్ట్యా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, కార్యక్రమానికి విధులు నిర్వహించే సిబ్బంది అందరూ పోలీస్ శాఖ ద్వారా జారీ చేసే ఐడీ కార్డులు తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. మీడియా ప్రతినిధుల కోసం కూడా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. పార్కింగ్ స్థలాల్లో మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని, అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని లైవ్ సపోర్ట్‌తో పాటు అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలని సూచించారు. అగ్ని ప్రమాదాలు తలెత్తకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం హెలిప్యాడ్, హెలిప్యాడ్ నుండి సభాస్థలికి ఇతర ఏర్పాట్లను, ఆర్టీసీ బస్సులు, అధికారులు, విఐపీ ల పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించి, కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు డిసిపిలు కుశాల్కర్, సుభాష్ చంద్రబోస్, సిద్దిపేట ఆర్డీవో సదానందం, వ్యవసాయ, ఉత్యానవాన, పశుసంవర్ధక, పంచాయతీ, మిషన్ భగీరథ, ఆర్ అండ్ బి, సమాచార పౌర సంబంధాలశాఖ, ఆయిల్ ఫెడ్, ఫైర్ సేఫ్టీ, విధ్యుత్, ఆర్టీసీ తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    1
    సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట గ్రామంలో ఏర్పాటు చేసిన టీజి ఆయిల్ ఫెడ్ ఆయిల్ ఫామ్ పరిశ్రమను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మార్చి 22 ఆదివారం నాడు ప్రారంభించనున్న నేపథ్యంలో సోమవారం ఆయిల్ ఫామ్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి, సిపి సాధన రష్మీ పెరుమాళ్ లు సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పర్యటన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి హెలికాప్టర్ (చాపర్) ద్వారా పరిశ్రమ వద్దకు చేరుకుంటారని, అదే రోజు జిల్లా జైలు భవనాన్ని కూడా ప్రారంభించనున్నారని పేర్కొన్నారు. వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక తదితర శాఖలచే  120 స్టాళ్లను ఏర్పాటు చేసి మార్చి 20. 21, 22 తేదీలలో ఫ్యాక్టరీ ఆవరణలో రైతు మహోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖతో పాటు సంబంధిత శాఖల అధికారులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
రైతు మేళా కు ప్రతీ రోజు 3 వేల నుండి 5 వేల మంది రైతులు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి తాగునీరు, భోజన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. శానిటేషన్ సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రాంగణాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని డీపీఓకు సూచించారు.  వైద్య శాఖ ద్వారా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడంతో పాటు తాత్కాలిక టాయిలెట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. హెలిప్యాడ్ ఏర్పాట్లు ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో నిబంధనలకు అనుగుణంగా చేయాలని సూచించారు.
ఫ్యాక్టరీ ప్రారంభం సందర్బంగా భారీ బహిరంగ సభకు దాదాపు 6 వందల బస్సుల ద్వారా సుమారు 30 వేల మంది కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి తగిన  తాగునీరు సరఫరా చేయడంతో పాటు, తాత్కాలిక మరుగుదొడ్లు, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.  ఎక్కడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందుగానే సమగ్రంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.
ఈ సందర్భంగా సీపీ సాధన రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ, కార్యక్రమానికి హాజరయ్యే వారందరికీ ముందుగానే తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో కళాజాత ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సూచించారు. భద్రతా దృష్ట్యా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, కార్యక్రమానికి విధులు నిర్వహించే సిబ్బంది అందరూ పోలీస్ శాఖ ద్వారా జారీ చేసే ఐడీ కార్డులు తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. మీడియా ప్రతినిధుల కోసం కూడా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.
పార్కింగ్ స్థలాల్లో మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని, అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని లైవ్ సపోర్ట్‌తో పాటు అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలని సూచించారు. అగ్ని ప్రమాదాలు తలెత్తకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం హెలిప్యాడ్, హెలిప్యాడ్ నుండి  సభాస్థలికి ఇతర ఏర్పాట్లను, ఆర్టీసీ బస్సులు, అధికారులు, విఐపీ ల పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించి, కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు డిసిపిలు కుశాల్కర్, సుభాష్ చంద్రబోస్, సిద్దిపేట ఆర్డీవో సదానందం, వ్యవసాయ, ఉత్యానవాన, పశుసంవర్ధక,  పంచాయతీ, మిషన్ భగీరథ, ఆర్ అండ్ బి, సమాచార పౌర సంబంధాలశాఖ, ఆయిల్ ఫెడ్, ఫైర్ సేఫ్టీ, విధ్యుత్, ఆర్టీసీ తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    user_RAMESH P
    RAMESH P
    కుశాల్ నగర్, సిద్దిపేట•
    5 hrs ago
  • గృహప్రవేశ వేడుకలో తీరని విషాదం: ఫోటో దిగుతూ కుప్పకూలి మహిళ మృతి! ​ఖమ్మం: సంతోషంగా గడవాల్సిన గృహప్రవేశ వేడుకలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. బంధువుల ఇంట్లో వేడుకకు హాజరై, అందరితో కలిసి ఫోటో దిగుతుండగా ఓ మహిళ గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఖమ్మం నగరంలో చోటుచేసుకుంది. ​ఖమ్మం (త్రీటౌన్ ప్రాంతం) కు చెందిన బొమ్మ సుస్మిత (40) అనే మహిళ తన బంధువుల ఇంటి గృహప్రవేశ వేడుకకు హాజరయ్యారు. వేడుకలో భాగంగా బంధువులతో కలిసి గ్రూప్ ఫోటో దిగుతున్న సమయంలో ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. పక్కనే ఉన్న వారు వెంటనే స్పందించి ఆమెను ఆసుపత్రికి తరలించేలోపే సుస్మిత తుదిశ్వాస విడిచారు.ప్రాథమిక సమాచారం ప్రకారం సుస్మిత గత కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.మృతురాలికి బీటెక్ చదువుతున్న ఒక కుమారుడు ఉన్నాడు. ఫోటో దిగుతున్న సమయంలో ఆమె కుప్పకూలిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ​ఇటీవల కాలంలో చిన్న వయసులోనే గుండెపోటుతో మరణిస్తున్న ఘటనలు పెరిగిపోతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఘటనతో సుస్మిత కుటుంబంలో మరియు బంధువులలో తీవ్ర విషాదం నెలకొంది.
    1
    గృహప్రవేశ వేడుకలో తీరని విషాదం: ఫోటో దిగుతూ కుప్పకూలి మహిళ మృతి!
​ఖమ్మం: సంతోషంగా గడవాల్సిన గృహప్రవేశ వేడుకలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. బంధువుల ఇంట్లో వేడుకకు హాజరై, అందరితో కలిసి ఫోటో దిగుతుండగా ఓ మహిళ గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఖమ్మం నగరంలో చోటుచేసుకుంది.
​ఖమ్మం  (త్రీటౌన్ ప్రాంతం) కు చెందిన బొమ్మ సుస్మిత (40) అనే మహిళ తన బంధువుల ఇంటి గృహప్రవేశ వేడుకకు హాజరయ్యారు. వేడుకలో భాగంగా బంధువులతో కలిసి గ్రూప్ ఫోటో దిగుతున్న సమయంలో ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. పక్కనే ఉన్న వారు వెంటనే స్పందించి ఆమెను ఆసుపత్రికి తరలించేలోపే సుస్మిత తుదిశ్వాస విడిచారు.ప్రాథమిక సమాచారం ప్రకారం సుస్మిత గత కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.మృతురాలికి బీటెక్ చదువుతున్న ఒక కుమారుడు ఉన్నాడు. ఫోటో దిగుతున్న సమయంలో ఆమె కుప్పకూలిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
​ఇటీవల కాలంలో చిన్న వయసులోనే గుండెపోటుతో మరణిస్తున్న ఘటనలు పెరిగిపోతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఘటనతో సుస్మిత కుటుంబంలో మరియు బంధువులలో తీవ్ర విషాదం నెలకొంది.
    user_Jtv9 News Network
    Jtv9 News Network
    బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
    6 hrs ago
  • కామారెడ్డి జిల్లా : హైదరాబాద్లో మంగళవారం నిర్వహించే గీత కార్మికుల మహాధర్నాను జయప్రదం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్ గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రాబోయే బడ్జెట్లో గీత కార్మికుల సంక్షేమానికి రూ. 5 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. వృత్తి రక్షణ ' కోసం కార్మికులంతా ఐక్యంగా పోరాడాలని కోరారు.
    1
    కామారెడ్డి జిల్లా : హైదరాబాద్లో మంగళవారం నిర్వహించే గీత కార్మికుల మహాధర్నాను జయప్రదం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్ గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రాబోయే బడ్జెట్లో గీత కార్మికుల సంక్షేమానికి రూ. 5 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. వృత్తి రక్షణ ' కోసం కార్మికులంతా ఐక్యంగా పోరాడాలని కోరారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    7 hrs ago
  • ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో జనకన 2027 నిర్మాణపై జిల్లా మండల మున్సిపల్ సాయి అధికారులకు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో సోమవారం జిల్లా కలెక్టర్ దీపక్ తివారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనగణన 2027 సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన విధానాలు మారదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని, మొదటి దశలో రాష్ట్రంలో మే 11 2026న ప్రారంభమై జూన్ 9న 2026 వరకు కొనసాగుతుందని రెండవ దశలో జనాభా గలన ఫిబ్రవరి 20 ఏళ్ల నిర్వహించబడుతుందని మార్చి 27న రిఫరెన్స్ తేదిగా పరిగనిస్తారని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలోని వివిధ శాఖల అధికారులు బాధ్యతలు వివరించారు.అన్ని శాఖల సమన్వయంతో జనాభా ఘనన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు.
    1
    ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో జనకన 2027 నిర్మాణపై జిల్లా మండల మున్సిపల్ సాయి అధికారులకు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో సోమవారం జిల్లా కలెక్టర్ దీపక్ తివారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనగణన 2027 సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన విధానాలు మారదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని, మొదటి దశలో రాష్ట్రంలో మే 11 2026న ప్రారంభమై జూన్ 9న 2026 వరకు కొనసాగుతుందని రెండవ దశలో జనాభా గలన ఫిబ్రవరి 20 ఏళ్ల నిర్వహించబడుతుందని మార్చి  27న రిఫరెన్స్ తేదిగా పరిగనిస్తారని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలోని వివిధ శాఖల అధికారులు బాధ్యతలు వివరించారు.అన్ని శాఖల సమన్వయంతో జనాభా ఘనన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు.
    user_Thanmai Sri
    Thanmai Sri
    తాండూర్, వికారాబాద్, తెలంగాణ•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.