logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

లాల్ దర్వాజ శ్రీ సింహవాహిని మహాకాళి ఆలయం వద్ద జోగిని శ్యామలను అడ్డుకున్న పోలీసులు బ్రేకింగ్ న్యూస్ : సికింద్రాబాద్ : లాల్ దర్వాజ శ్రీ సింహవాహిని మహాకాళి ఆలయం వద్ద జోగిని శ్యామలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు తన పట్ల దురుసుగా ప్రవర్తించారని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత ని కలిసి జోగిన శ్యామల వాపోయారు. ఈ సందర్బంగా కల్వకుంట్ల కవిత ప్రభుత్వం తీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

2 days ago
user_P Jithender, Sr Reportar
P Jithender, Sr Reportar
Local News Reporter జనగాం, తెలంగాణ•
2 days ago

లాల్ దర్వాజ శ్రీ సింహవాహిని మహాకాళి ఆలయం వద్ద జోగిని శ్యామలను అడ్డుకున్న పోలీసులు బ్రేకింగ్ న్యూస్ : సికింద్రాబాద్ : లాల్ దర్వాజ శ్రీ సింహవాహిని మహాకాళి ఆలయం వద్ద జోగిని శ్యామలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు తన పట్ల దురుసుగా ప్రవర్తించారని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత ని కలిసి జోగిన శ్యామల వాపోయారు. ఈ సందర్బంగా కల్వకుంట్ల కవిత ప్రభుత్వం తీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనీ జిల్లా ప్రైస్ సిటీ క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టరేట్ ఎదుట నిరసన దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనే ప్రధాన డిమాండ్‌తో వరంగల్ ప్రైస్ సిటీ క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో.. హనుమకొండ కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు. ఈ నిరసనలో భాగంగా సెంటనరీ బాప్టిస్ట్ చర్చి నుంచి హనుమకొండ ప్రభుత్వ వరకు శాంతియుతంగా భారీ ర్యాలీ నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
    1
    దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనీ జిల్లా ప్రైస్ సిటీ క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టరేట్ ఎదుట నిరసన
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనే ప్రధాన డిమాండ్‌తో వరంగల్ ప్రైస్ సిటీ క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో.. హనుమకొండ కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు. ఈ నిరసనలో భాగంగా సెంటనరీ బాప్టిస్ట్ చర్చి నుంచి హనుమకొండ ప్రభుత్వ వరకు శాంతియుతంగా భారీ ర్యాలీ నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    21 hrs ago
  • మావోయిస్టు ప్రభావం నుంచి పర్యాటక ప్రాంతంగా కరిగుట్ట.. డీజీపీ కీలక ప్రకటన ములుగు జిల్లా కరిగుట్టలో శాంతి వాతావరణం నెలకొంటోంది. తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ కరిగుట్టలో పర్యటించి రోడ్డు పనులను పరిశీలించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి, శాంతికి ప్రతీకగా తెల్ల పావురాలను విడుదల చేశారు. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లలో తెలంగాణ పోలీస్, గ్రేహౌండ్స్, సీఆర్‌పీఎఫ్, కోబ్రా, ఛత్తీస్‌గఢ్ పోలీసుల సమన్వయాన్ని డీజీపీ ప్రశంసించారు. లొంగిపోయిన మావోయిస్టుల పునరావాసానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. కరిగుట్టను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు రోడ్లు, విద్యుత్, మొబైల్ కనెక్టివిటీ వంటి మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. పామూరు–చలమాదవ రహదారి పనులు పూర్తయ్యాయని వెల్లడించారు.
    1
    మావోయిస్టు ప్రభావం నుంచి పర్యాటక ప్రాంతంగా కరిగుట్ట.. డీజీపీ కీలక ప్రకటన
ములుగు జిల్లా కరిగుట్టలో శాంతి వాతావరణం నెలకొంటోంది. తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ కరిగుట్టలో పర్యటించి రోడ్డు పనులను పరిశీలించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి, శాంతికి ప్రతీకగా తెల్ల పావురాలను విడుదల చేశారు.
మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లలో తెలంగాణ పోలీస్, గ్రేహౌండ్స్, సీఆర్‌పీఎఫ్, కోబ్రా, ఛత్తీస్‌గఢ్ పోలీసుల సమన్వయాన్ని డీజీపీ ప్రశంసించారు. లొంగిపోయిన మావోయిస్టుల పునరావాసానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
కరిగుట్టను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు రోడ్లు, విద్యుత్, మొబైల్ కనెక్టివిటీ వంటి మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. పామూరు–చలమాదవ రహదారి పనులు పూర్తయ్యాయని వెల్లడించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    8 hrs ago
  • కోతిరాంపూర్‌లో ఘనంగా మైసమ్మతల్లి బోనాలు...బోనమెత్తిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ లోని కోతిరాంపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పక్కన వెలిసిన మైసమ్మ తల్లి బోనాల వేడుకలు కన్నుల పండువలా నిర్వహించారు. సరస్వతి నగర్, గిద్దె పెరుమాండ్ల కాలనీవాసులు, స్థానిక మాజీ కార్పొరేటర్ జంగిలి ఐలందర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు కరీంనగర్ శాసనసభ్యులు, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ​బోనాల వేడుకకు విచ్చేసిన ఎమ్మెల్యే గంగులకు స్థానిక కాలనీవాసులు ఘనంగా స్వాగతం పలికారు. భక్తులు ఆయనకు నుదుటిన తిలకం దిద్ది, మంగళహారతి ఇచ్చి, శాలువాతో సత్కరించారు. అనంతరం అమ్మవారి బోనం ఎత్తుకున్న గంగుల.. ఆలయం వరకు నడుచుకుంటూ వెళ్లి కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించారు. శివశక్తుల పూనకాల మధ్య సాగిన ఈ వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో కోలాహలంగా సాగాయి. ​అమ్మవారి పూనకం వచ్చిన మహిళా భక్తురాలు అక్కడ శాశ్వత ప్రాతిపదికన ఆలయం నిర్మించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్.. వచ్చే దసరా పండుగ నాటికి ప్రజల సహకారంతో నూతన ఆలయాన్ని నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. ​ఎల్లమ్మ తల్లి కలలో వచ్చి స్థానిక పెంట కుప్పలో వెలిశానని తెలపడంతో. కాలనీవాసులందరూ కలిసి అమ్మవారిని ప్రతిష్టించుకున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా భక్తులు అమ్మవారికి బోనం సమర్పించి, యాట పిల్లలతో తమ మొక్కులను చెల్లించుకున్నారు ​ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, స్థానిక డివిజన్ మాజీ కార్పొరేటర్ జంగిలి ఐలందర్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు ఎడ్ల అశోక్, దురిశెట్టి అనూప్ కుమార్ పాల్గొన్నారు. ​
    1
    కోతిరాంపూర్‌లో ఘనంగా మైసమ్మతల్లి బోనాలు...బోనమెత్తిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్ లోని కోతిరాంపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పక్కన వెలిసిన మైసమ్మ తల్లి బోనాల వేడుకలు కన్నుల పండువలా నిర్వహించారు. సరస్వతి నగర్, గిద్దె పెరుమాండ్ల కాలనీవాసులు, స్థానిక మాజీ కార్పొరేటర్ జంగిలి ఐలందర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు కరీంనగర్ శాసనసభ్యులు, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ​బోనాల వేడుకకు విచ్చేసిన ఎమ్మెల్యే గంగులకు స్థానిక కాలనీవాసులు ఘనంగా స్వాగతం పలికారు. భక్తులు ఆయనకు నుదుటిన తిలకం దిద్ది, మంగళహారతి ఇచ్చి, శాలువాతో సత్కరించారు. అనంతరం అమ్మవారి బోనం ఎత్తుకున్న గంగుల.. ఆలయం వరకు నడుచుకుంటూ వెళ్లి కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించారు. శివశక్తుల పూనకాల మధ్య సాగిన ఈ వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో కోలాహలంగా సాగాయి.
​అమ్మవారి పూనకం వచ్చిన మహిళా భక్తురాలు అక్కడ శాశ్వత ప్రాతిపదికన ఆలయం నిర్మించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్.. వచ్చే దసరా పండుగ నాటికి ప్రజల సహకారంతో నూతన ఆలయాన్ని నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. ​ఎల్లమ్మ తల్లి కలలో వచ్చి స్థానిక పెంట కుప్పలో వెలిశానని తెలపడంతో. కాలనీవాసులందరూ కలిసి అమ్మవారిని ప్రతిష్టించుకున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా భక్తులు అమ్మవారికి బోనం సమర్పించి, యాట పిల్లలతో తమ మొక్కులను చెల్లించుకున్నారు 
​ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, స్థానిక డివిజన్ మాజీ కార్పొరేటర్ జంగిలి ఐలందర్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు ఎడ్ల అశోక్, దురిశెట్టి అనూప్ కుమార్ పాల్గొన్నారు.
​
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    42 min ago
  • బహుళ త్రయోదశి సందర్భంగా ప్రదోష కాలంలో దమ్మాయిగూడ శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో శ్రీ నందీశ్వర స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. 🪷 బహుళ త్రయోదశి సందర్భంగా నందీశ్వరుడికి విశేష పూజలు 🙏 ప్రదోష కాలంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక అభిషేకాలు, పూజలు ఈ సందర్భంగా నందీశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు మరియు పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రదోష కాలంలో శివారాధనకు విశిష్టత ఉండటంతో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఓం నమః శివాయ 🙏 హర హర మహాదేవ 🕉️ 📍 శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం, దమ్మాయిగూడ
    1
    బహుళ త్రయోదశి సందర్భంగా ప్రదోష కాలంలో దమ్మాయిగూడ శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో శ్రీ నందీశ్వర స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

🪷 బహుళ త్రయోదశి సందర్భంగా నందీశ్వరుడికి విశేష పూజలు
🙏 ప్రదోష కాలంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక అభిషేకాలు, పూజలు
ఈ సందర్భంగా నందీశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు మరియు పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రదోష కాలంలో శివారాధనకు విశిష్టత ఉండటంతో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
ఓం నమః శివాయ 🙏
హర హర మహాదేవ 🕉️
📍 శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం, దమ్మాయిగూడ
    user_SAI KIRAN TRP
    SAI KIRAN TRP
    కీసర, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    18 hrs ago
  • తల్లిపాలపై అవగాహన కల్పించిన అంగన్వాడీ సిబ్బంది .... వడ్లూరులో తల్లిపాల వారోత్సవాలు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. శిశువు పుట్టిన వెంటనే తల్లిపాలు పట్టించడం, తొలి ఆరు నెలలు తల్లిపాలను మాత్రమే అందించడం ద్వారా బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతాడని వివరించారు. తల్లిపాలు శిశువుకు అవసరమైన పోషకాలను అందించడంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని తెలిపారు. తల్లులు పోషకాహారం తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ పులి రమేష్, గ్రామ కార్యదర్శి పద్మ, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.
    2
    తల్లిపాలపై అవగాహన కల్పించిన అంగన్వాడీ సిబ్బంది .... వడ్లూరులో తల్లిపాల వారోత్సవాలు
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరు 
గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. శిశువు పుట్టిన వెంటనే తల్లిపాలు పట్టించడం, తొలి ఆరు నెలలు తల్లిపాలను మాత్రమే అందించడం ద్వారా బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతాడని వివరించారు. తల్లిపాలు శిశువుకు అవసరమైన పోషకాలను అందించడంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని తెలిపారు. తల్లులు పోషకాహారం తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ పులి రమేష్, గ్రామ కార్యదర్శి పద్మ, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    31 min ago
  • నా జనం కోసం జనంలోనే మీ తీన్మార్ మల్లన్న రాజేంద్రనగర్ బాధితులారా మీరు ధైర్యంగా ఉండండి *నా జనం కోసం.. జనంలోనే.. మీ మల్లన్న..!* రాజేంద్రనగర్ బాధితులారా..మీరు ధైర్యంగా ఉండండి..! మీ ముఖంలో చిరు నవ్వు చూడటమే ఈ మల్లన్న ఆశయం.. ఏ సమస్య వచ్చినా అర్ధరాత్రి ఒంటిగంటైనా, రెండైనా సరే. క్షణాల్లో మీ చెంతకు చేరతా..! మీ కష్టాన్ని నా కష్టంగా భావించి పోరాడతా...నా చివరి శ్వాస వరకు తోడుంటా.! మీ ప్రాణాలకు ఎలాంటి ఆపద రానివ్వను... మీకు మల్లన్న ఉన్నడు...
    1
    నా జనం కోసం జనంలోనే మీ తీన్మార్ మల్లన్న రాజేంద్రనగర్ బాధితులారా మీరు ధైర్యంగా ఉండండి
*నా జనం కోసం.. జనంలోనే.. మీ మల్లన్న..!*
రాజేంద్రనగర్ బాధితులారా..మీరు ధైర్యంగా ఉండండి..!
మీ ముఖంలో చిరు నవ్వు చూడటమే ఈ మల్లన్న ఆశయం..
ఏ సమస్య వచ్చినా అర్ధరాత్రి ఒంటిగంటైనా, రెండైనా సరే. క్షణాల్లో మీ చెంతకు చేరతా..!
మీ కష్టాన్ని నా కష్టంగా భావించి పోరాడతా...నా చివరి శ్వాస వరకు తోడుంటా.!
మీ ప్రాణాలకు ఎలాంటి ఆపద రానివ్వను... మీకు మల్లన్న ఉన్నడు...
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Auditor బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    2 hrs ago
  • రాత్రివేళ గ్రామాల్లో పర్యటిస్తూ కార్యకర్తలకు భరోసా.. అనారోగ్యంతో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తకు ఎమ్మెల్యే పరామర్శ ఆపదలో ఉన్న కార్యకర్తలు ఏ సమయంలోనైనా తనకు ఫోన్ చేయాలని, వారికి అండగా నిలిచే విషయంలో వెనక్కి తగ్గేది లేదని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ భరోసా ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం రాజోలు గ్రామంలో అనారోగ్యంతో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తను రామచంద్ర నాయక్ పరామర్శించారు. రాత్రివేళ గ్రామాల్లో పర్యటిస్తూ పార్టీ కార్యకర్తలను కలుసుకున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఆపద సమయంలో వారికి అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే తమకు భరోసా కల్పించడంతో కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
    1
    రాత్రివేళ గ్రామాల్లో పర్యటిస్తూ కార్యకర్తలకు భరోసా.. అనారోగ్యంతో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తకు ఎమ్మెల్యే పరామర్శ
ఆపదలో ఉన్న కార్యకర్తలు ఏ సమయంలోనైనా తనకు ఫోన్ చేయాలని, వారికి అండగా నిలిచే విషయంలో వెనక్కి తగ్గేది లేదని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ భరోసా ఇచ్చారు.
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం రాజోలు గ్రామంలో అనారోగ్యంతో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తను రామచంద్ర నాయక్ పరామర్శించారు. రాత్రివేళ గ్రామాల్లో పర్యటిస్తూ పార్టీ కార్యకర్తలను కలుసుకున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఆపద సమయంలో వారికి అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే తమకు భరోసా కల్పించడంతో కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    8 hrs ago
  • మెట్ పల్లిలో ఘనంగా తిరంగా ర్యాలీ...500 మీటర్ల భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శించిన బిజేపి కార్యకర్తలు జగిత్యాల జిల్లా మెట్‌ పల్లిలో బిజేపీ ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు జెండాను పట్టుకొని ర్యాలీలో 500 మీటర్ల జాతీయ జెండాను ప్రదర్శించారు. జాతీయ రహదారితో పాటు, పట్టణ ప్రధాన వీధుల మీదుగా తిరంగా ర్యాలీ సాగింది. వందేమాతరం అంటూ దేశభక్తి నినాదాలతో మెట్ పల్లి పట్టణంలో మార్మోగింది. అధిక సంఖ్యలో విద్యార్థులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    మెట్ పల్లిలో ఘనంగా తిరంగా ర్యాలీ...500 మీటర్ల భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శించిన బిజేపి కార్యకర్తలు
జగిత్యాల జిల్లా మెట్‌ పల్లిలో బిజేపీ ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు జెండాను పట్టుకొని  ర్యాలీలో 500 మీటర్ల జాతీయ జెండాను ప్రదర్శించారు. జాతీయ రహదారితో పాటు, పట్టణ ప్రధాన వీధుల మీదుగా తిరంగా ర్యాలీ సాగింది.
వందేమాతరం అంటూ దేశభక్తి నినాదాలతో మెట్ పల్లి పట్టణంలో మార్మోగింది. అధిక సంఖ్యలో విద్యార్థులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    59 min ago
  • కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో కత్తితో యువకుడి హల్‌చల్.. కాలనీవాసుల్లో భయాందోళన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాప్రా శ్రీ శ్రీనివాస ఆఫీసర్స్ కాలనీలో సోమవారం రాత్రి ఓ యువకుడు కత్తితో హల్‌చల్ సృష్టించాడు. కొబ్బరి బొండాలు కోసే కత్తిని చేతిలో పట్టుకుని కాలనీలో తిరుగుతూ హంగామా చేయడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. పరిస్థితిని గమనించిన కాలనీవాసులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కుషాయిగూడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేపట్టారు. యువకుడు కత్తితో ఎందుకు హల్‌చల్ చేశాడనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
    1
    కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో కత్తితో యువకుడి హల్‌చల్.. కాలనీవాసుల్లో భయాందోళన
కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాప్రా శ్రీ శ్రీనివాస ఆఫీసర్స్ కాలనీలో సోమవారం రాత్రి ఓ యువకుడు కత్తితో హల్‌చల్ సృష్టించాడు. కొబ్బరి బొండాలు కోసే కత్తిని చేతిలో పట్టుకుని కాలనీలో తిరుగుతూ హంగామా చేయడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.
పరిస్థితిని గమనించిన కాలనీవాసులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కుషాయిగూడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేపట్టారు. యువకుడు కత్తితో ఎందుకు హల్‌చల్ చేశాడనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
    user_Bhaskar Reddy
    Bhaskar Reddy
    Detective కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.