logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మతసామరస్యానికి వేదికైన కవ్వాల్: ఘనంగా ఇఫ్తార్ విందు... ​"రంజాన్ పండుగ ముస్లింలకు అత్యంత పవిత్రమైనది. క్రమశిక్షణ, దానగుణం, సహనం కలిగిన ఈ మాసంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మనమందరం కలిసి మెలిసి ఉండటమే సమాజానికి బలమని, ఇలాంటి వేడుకలు మనుషుల మధ్య దూరాన్ని తగ్గించి ప్రేమానురాగాలను పెంచుతాయని" ఆయన కొనియాడారు.

3 hrs ago
user_తుడుం జితేందర్
తుడుం జితేందర్
Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
3 hrs ago

మతసామరస్యానికి వేదికైన కవ్వాల్: ఘనంగా ఇఫ్తార్ విందు... ​"రంజాన్ పండుగ ముస్లింలకు అత్యంత పవిత్రమైనది. క్రమశిక్షణ, దానగుణం, సహనం కలిగిన ఈ మాసంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మనమందరం కలిసి మెలిసి ఉండటమే సమాజానికి బలమని, ఇలాంటి వేడుకలు మనుషుల మధ్య దూరాన్ని తగ్గించి ప్రేమానురాగాలను పెంచుతాయని" ఆయన కొనియాడారు.

More news from తెలంగాణ and nearby areas
  • లక్షెట్టిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చరర్లు, విద్యార్థులు ముందస్తు ఉగాది సంబరాలు నిర్వహించారు. ఉగాది పండుగను పురస్కరించుకొని మంగళవారం డిగ్రీ కళాశాలలో వారు ఉగాది పండుగ విశిష్టతను వివరిస్తూ పండుగను నిర్వహించారు. అనంతరం ఉగాది పచ్చడి తయారు చేశారు. అలాగే పంచాంగ శ్రవణం వినిపించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహాత్మా సంతోష్ మాట్లాడుతూ తెలుగు ప్రజలకు మొదటి పండుగ ఉగాది అని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు ఉన్నారు.
    1
    లక్షెట్టిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చరర్లు, విద్యార్థులు ముందస్తు ఉగాది సంబరాలు నిర్వహించారు. ఉగాది పండుగను పురస్కరించుకొని మంగళవారం డిగ్రీ కళాశాలలో వారు ఉగాది పండుగ విశిష్టతను వివరిస్తూ పండుగను నిర్వహించారు. అనంతరం ఉగాది పచ్చడి తయారు చేశారు. అలాగే పంచాంగ శ్రవణం వినిపించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహాత్మా సంతోష్ మాట్లాడుతూ తెలుగు ప్రజలకు మొదటి పండుగ ఉగాది అని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు ఉన్నారు.
    user_Gourinatha p.g
    Gourinatha p.g
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    4 hrs ago
  • Post by KR NEWS 369
    1
    Post by KR NEWS 369
    user_KR NEWS 369
    KR NEWS 369
    Reporter మామడ, నిర్మల్, తెలంగాణ•
    11 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆశా వర్కర్లు ఆందోళన బాట పట్టారు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే తమకు నెలకు 26 వేల గౌరవ వేతనం అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జి.ఓ. విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట భారీగా చేరుకున్న ఆశా వర్కర్లు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ నిరసనకు కార్మిక సంఘాల నాయకులు మద్దతు తెలపడం గమనార్హం. ఆశా వర్కర్లు ఆరోగ్య రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ తగిన పారితోషికం అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆశా వర్కర్లు ఆందోళన బాట పట్టారు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే తమకు నెలకు 26 వేల గౌరవ వేతనం అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జి.ఓ. విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట భారీగా చేరుకున్న ఆశా వర్కర్లు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
ఈ నిరసనకు కార్మిక సంఘాల నాయకులు మద్దతు తెలపడం గమనార్హం. ఆశా వర్కర్లు ఆరోగ్య రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ తగిన పారితోషికం అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    10 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఉదయం శ్రీ స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం పరివార దేవతల అర్చనలు నిర్వహించబడ్డాయి. సాయంత్రం మహా లింగార్చన కార్యక్రమంలో భాగంగా 365 జ్యోతులను వెలిగించారు. ఈ కార్యక్రమాన్ని రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా ఆలయ మండపంలో అర్చకులు, వేద పండితులు ఏకాంతంగా నిర్వహించారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి.
ఈ సందర్భంగా ఉదయం శ్రీ స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం పరివార దేవతల అర్చనలు నిర్వహించబడ్డాయి.
సాయంత్రం మహా లింగార్చన కార్యక్రమంలో భాగంగా 365 జ్యోతులను వెలిగించారు. 
ఈ కార్యక్రమాన్ని రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా ఆలయ మండపంలో అర్చకులు, వేద పండితులు ఏకాంతంగా నిర్వహించారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    5 hrs ago
  • జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ కు యూట్యూబర్ వైష్ణవి హత్యకు గురైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే హత్యకు పాల్పడడం కలకలం సృష్టిస్తుంది. మాదాపూర్ గ్రామానికి చెందిన యూట్యూబర్ గంధం వైష్ణవి సంవత్సరం క్రితం కోరుట్ల పట్టణానికి చెందిన చిత్తారి హరిబాబు ను ప్రేమించి పెళ్ళి చేసుకుంది. అబ్బాయి పేరెంట్స్ ప్రేమ పెళ్లిని ఒప్పుకోకపోయినప్పటికీ ఇద్దరు పెళ్లి చేసుకుని అమ్మాయి వాళ్ళ ఇంటి వద్దే ఉంటున్నారు. ఏమైందో ఏమో తెల్లవారుజామున కత్తితో దాడి చేశాడు. భర్త చేతిలో కత్తిపోట్లకు గురైన వైష్ణవి ప్రాణాలు కోల్పోయారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మృతి చెందడంతో భర్త హరిబాబు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. హత్యకు గల కారణాలు స్పష్టంగా తెలియక పోయినప్పటికీ మృతురాలు వైష్ణవి ప్రస్తుతం ఐదు నెలల గర్భవతి అని కుటుంబ సభ్యులు బోరున విలపిస్తూ తెలిపారు. గత కొద్ది రోజుల నుంచి అబ్బాయి తల్లిదండ్రుల నుండి ప్రోద్బలంతోనే భార్యపై కత్తితో దాడి చేసినట్లు మృతురాలి తల్లి కుటుంబ సభ్యులు ఆరోపించారు. అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుని హత్య చేసిన హరిబాబు కు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. సంఘటన స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టిన పోలీసులు భర్త హరిబాబు తో పాటు ఆయన పేరెంట్స్ పై కేసు నమోదు చేశామని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డిఎస్పీ రాములు తెలిపారు.
    4
    జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ కు యూట్యూబర్ వైష్ణవి హత్యకు గురైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే హత్యకు పాల్పడడం  కలకలం సృష్టిస్తుంది. మాదాపూర్ గ్రామానికి చెందిన  యూట్యూబర్ గంధం వైష్ణవి సంవత్సరం క్రితం కోరుట్ల పట్టణానికి చెందిన చిత్తారి హరిబాబు ను ప్రేమించి పెళ్ళి చేసుకుంది. అబ్బాయి పేరెంట్స్ ప్రేమ పెళ్లిని ఒప్పుకోకపోయినప్పటికీ ఇద్దరు పెళ్లి చేసుకుని అమ్మాయి వాళ్ళ ఇంటి వద్దే ఉంటున్నారు. ఏమైందో ఏమో తెల్లవారుజామున కత్తితో దాడి చేశాడు. భర్త చేతిలో కత్తిపోట్లకు గురైన  వైష్ణవి ప్రాణాలు కోల్పోయారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మృతి చెందడంతో భర్త హరిబాబు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. హత్యకు గల కారణాలు స్పష్టంగా తెలియక పోయినప్పటికీ మృతురాలు వైష్ణవి ప్రస్తుతం ఐదు నెలల గర్భవతి అని కుటుంబ సభ్యులు బోరున విలపిస్తూ తెలిపారు. గత కొద్ది రోజుల నుంచి అబ్బాయి తల్లిదండ్రుల నుండి ప్రోద్బలంతోనే భార్యపై కత్తితో దాడి చేసినట్లు మృతురాలి తల్లి కుటుంబ సభ్యులు ఆరోపించారు. అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుని హత్య చేసిన హరిబాబు కు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. సంఘటన స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టిన పోలీసులు భర్త హరిబాబు తో పాటు ఆయన పేరెంట్స్ పై కేసు నమోదు చేశామని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డిఎస్పీ రాములు తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    8 hrs ago
  • కామారెడ్డి జిల్లా బీర్కుర్: ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి: బీజేపీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీర్కూర్ బీజేపీ నాయకులు ఉప తహశీల్దార్ రవికుమార్కు వినతిపత్రం. అందజేశారు. అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, నిరుద్యోగ భృతి, మహిళలకు రూ. 2,500 పథకాలను తక్షణమే అమలు చేయాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని. మండిపడ్డారు.
    1
    కామారెడ్డి జిల్లా బీర్కుర్: ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి: బీజేపీ
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీర్కూర్ బీజేపీ నాయకులు ఉప తహశీల్దార్ రవికుమార్కు వినతిపత్రం. అందజేశారు. అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, నిరుద్యోగ భృతి, మహిళలకు రూ. 2,500 పథకాలను తక్షణమే అమలు చేయాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని. మండిపడ్డారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    3 hrs ago
  • జన్నారం మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లక్షెట్టిపేట సిఐ రమణమూర్తి సూచించారు. మంగళవారం వివిధ గ్రామాలలో సర్పంచుల ఆధ్వర్యంలో డప్పు చాటింపు వేయించారు. మండలంలోని వివిధ గ్రామాలలో దొంగతనాలు పెరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనాలకు పాల్పడే ప్రమాదం ఉందన్నారు. ఊరికి వెళ్లేవాళ్లు ఇళ్లల్లో బంగారం, నగదును ఉంచవద్దన్నారు.
    1
    జన్నారం మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లక్షెట్టిపేట సిఐ రమణమూర్తి సూచించారు. మంగళవారం వివిధ గ్రామాలలో సర్పంచుల ఆధ్వర్యంలో డప్పు చాటింపు వేయించారు. మండలంలోని వివిధ గ్రామాలలో దొంగతనాలు పెరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనాలకు పాల్పడే ప్రమాదం ఉందన్నారు. ఊరికి వెళ్లేవాళ్లు ఇళ్లల్లో బంగారం, నగదును ఉంచవద్దన్నారు.
    user_Gourinatha p.g
    Gourinatha p.g
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    6 hrs ago
  • Post by KR NEWS 369
    1
    Post by KR NEWS 369
    user_KR NEWS 369
    KR NEWS 369
    Reporter మామడ, నిర్మల్, తెలంగాణ•
    11 hrs ago
  • మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్స్ సంక్షేమ శాఖ ఆద్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం వేడుకలు నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి.. కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన మహిళలు, ఉద్యోగులను సన్మానించారు.ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. మహిళలు ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు. పోషకాహారం తీసుకోవాలని, వ్యాయామం, యోగా చేయాలని తెలిపారు. ప్రతి మహిళా కనీసం 20 మంది మహిళలకు మద్దతుగా నిలవాలని ఆకాంక్షించారు. తాము విధులు నిర్వర్తించే చోట, తమ పరిసర ప్రాంతాల వారికి ఆపద సమయములో భరోసా ఇవ్వాలని సూచించారు. మహిళలు డబ్బును పొదుపు చేయాలని వివరించారు. మహిళల ఆర్థిక అభివృద్ధితో తన కుటుంబం, దేశ వృద్ధి సాధ్యమని తెలిపారు. కార్యక్రమంలో సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, డీఆర్డీఓ గీత, వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, మత్స్య శాఖ అధికారి సౌజన్య, వైద్యాధికారి రజిత, మైనార్టీ సంక్షేమ అధికారి భారతి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి స్వప్న తదితరులు పాల్గొన్నారు.
    1
    మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా  మహిళలు, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్స్ సంక్షేమ శాఖ ఆద్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం వేడుకలు నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి.. కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన మహిళలు, ఉద్యోగులను సన్మానించారు.ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. మహిళలు ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు. పోషకాహారం తీసుకోవాలని, వ్యాయామం, యోగా చేయాలని తెలిపారు. ప్రతి మహిళా కనీసం 20 మంది మహిళలకు మద్దతుగా నిలవాలని ఆకాంక్షించారు. తాము విధులు నిర్వర్తించే చోట, తమ పరిసర ప్రాంతాల వారికి ఆపద సమయములో భరోసా ఇవ్వాలని సూచించారు. మహిళలు డబ్బును పొదుపు చేయాలని వివరించారు. మహిళల ఆర్థిక అభివృద్ధితో తన కుటుంబం, దేశ వృద్ధి సాధ్యమని తెలిపారు.
కార్యక్రమంలో సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, డీఆర్డీఓ గీత, వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, మత్స్య శాఖ అధికారి సౌజన్య, వైద్యాధికారి రజిత, మైనార్టీ సంక్షేమ అధికారి భారతి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి స్వప్న తదితరులు పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.