పొంగులేటి గారి పై బీఆర్ఎస్ నాయకులు అక్కసు వెళ్లగక్కుతున్నారని సత్తుపల్లి మున్సిపల్ మాజీ వైస్ చైర్‌పర్సన్ మరియు 6వ వార్డు కౌన్సిలర్ తోట సుజల రాణి తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం ఆమె విలేఖర్లతో మాట్లాడుతూ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా భవితవ్యానికి పొంగులేటి గారు అడ్డు వస్తారనే భయంతోనే నిందారోపణలు చేస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష పార్టీ అగ్ర నాయకత్వం అంతా కలిసి మూకుమ్మడిగా మంత్రి పొంగులేటి గారి పై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని, రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తెలిపారు. ప్రజా నాయకుడైన శీనన్న కోసం ఆయన వాగ్దానం మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ ఒక్క ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టకుండా ప్రజలు తీర్పు ఇచ్చారని, ఈ విషయాన్ని మరిచిపోకూడదని ఆమె అన్నారు. జిల్లా ప్రజల గుండెల్లో శీనన్న సేవలు చిరస్మరణీయమని తెలిపారు. అలాగే, ఖమ్మం జిల్లా ప్రజల గుండెల నిండా శీనన్న ఉన్నారు, శీనన్నను ఎవ్వరూ అక్కడి నుంచి కదిలించలేరు అని స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వంలో కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కీలక భూమిక పోషిస్తూ ప్రజల్లో సుస్థిరంగా పదిలమవుతున్నారని, దీనిని ప్రతిపక్ష నాయకులు జీర్ణించుకోలేక అవాకులు చెవాకులు పలుకుతున్నారని అన్నారు. ఇప్పటికే అసెంబ్లీ తరువాత పంచాయితీలు, మున్సిపల్ ఎన్నికలలో ప్రజల తీర్పుకు భయపడి భవిష్యత్తులో పొంగులేటి గారిని ఢీకొనలేమని భావించి ఇప్పుడు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పొంగులేటి ని విమర్శించడం అంటే ఆకాశం వైపు చూస్తూ ఉమ్మి వేయడమేనని, అన్నింటికీ ప్రజలు, కాలమే సరైన సమాధానం చెబుతాయని తోట సుజల రాణి అన్నారు.

- Post by V Ramarao3
- Post by Ramprasad islavath1
- Post by వేముల నాగరాజు1
- Post by Sode Prasad1
- మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ఓటాయి గ్రామంలో సాంప్రదాయ జానపద కళారూపమైన “యాదవ రాజుల కథ” ప్రదర్శన గ్రామ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఎన్నో ఏళ్లుగా టెలివిజన్, సీరియళ్లకే పరిమితమైన వినోదానికి అలవాటు పడిన ప్రజలు, ముఖ్యంగా మహిళలు, ఇలాంటి చారిత్రక, సాంస్కృతిక కథనాలను ఆసక్తిగా వీక్షించడం గ్రామీణ సంస్కృతికి కొత్త ఊపును తీసుకొచ్చింది. గ్రామీణ కళాకారులు తమ సాంస్కృతిక వృత్తి ధర్మంలో భాగంగా మళ్లీ ఈ జానపద కళారూపాన్ని పునరుద్ధరించి ప్రజల ముందుకు తీసుకురావడం విశేషం. గతంలో పల్లెల్లో విస్తృతంగా వినిపించిన యాదవ రాజుల వీరగాథలు, కాలక్రమేణా కనుమరుగవుతున్న వేళ, ఇప్పుడు మళ్లీ గ్రామాల్లో కళాకారుల కంఠాల్లో ప్రతిధ్వనించడం స్థానికులను ఆనందానికి గురి చేసింది. ఈ ప్రదర్శనను చూడడానికి గ్రామ ప్రజలు, యువతి యువకులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో, ఆసక్తితో కథను ఆలకించారు. చారిత్రక నేపథ్యంతో సాగిన ఈ కళారూపం ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా, పాత తరం జ్ఞాపకాలను తడిమింది. గ్రామీణ కళలు, జానపద సంప్రదాయాలు కేవలం వినోదమే కాకుండా, సమాజ చరిత్రను, జీవన విధానాన్ని, సంస్కృతిని తరతరాలకు అందించే గొప్ప వారసత్వమని పలువురు గ్రామ పెద్దలు అభిప్రాయపడ్డారు. ఇలాంటి జానపద కళారూపాలకు ప్రోత్సాహం లభిస్తే గ్రామీణ సంస్కృతి మరింత బలపడటంతో పాటు, కళాకారులకు కూడా గుర్తింపు, ఆదరణ లభిస్తుందని స్థానికులు పేర్కొన్నారు.1
- అంజన్న మాలధారణ స్వాములకు నిలువ నీడ లేక ఇబ్బందులు ఆలయ కమిటీపై భక్తుల ఆగ్రహం ఏటూర్ నాగారం శ్రీ రామ నవమి అనంతరం మండల దీక్షలో ఉన్న స్వాములకు తగిన సదుపాయాలు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తి స్థానిక రామాలయం గుడి కళ్యాణ మండపం వద్ద శ్రీ రామ నవమి సందర్భంగా దాతల సహకారంతో చల్లటి పందిళ్లు ఏర్పాటు చేయడం జరిగింది. పండుగ సమయంలో భక్తులకు మంచి సౌకర్యాలు కల్పించినప్పటికీ, అనంతరం పరిస్థితులు మారడం గమనార్హం. శ్రీ రామ నవమి ముగిసిన తరువాత హనుమాన్ స్వాములు, అంజన్న స్వాములు 41 రోజుల మండల దీక్షలో భాగంగా మాలధారణ చేపట్టారు. ప్రతి సంవత్సరం ఈ సమయంలో రామాలయం వద్ద స్వాముల కోసం ప్రత్యేకంగా కుటీరాలు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ ఏడాది మాత్రం ఆలయ కమిటీ సభ్యులు ఆ సంప్రదాయాన్ని కొనసాగించకపోవడంతో మాలధారణలో ఉన్న స్వాములు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ వేడి తీవ్రత ఎక్కువగా ఉండటంతో నిలువ నీడ లేక భక్తులు, స్వాములు బాధపడుతున్నారు. ఈ పరిస్థితిపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ, వెంటనే స్థానిక గ్రామ పెద్దలు. స్పందించి స్వాములకు తగిన నీడ, తాగునీరు, విశ్రాంతి సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. భక్తుల విశ్వాసాన్ని దృష్టిలో ఉంచుకుని,1
- Post by SS NEWS1
- Post by వేముల నాగరాజు1